National Disaster
-
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్
ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:1. Support a comprehensive rehabilitation package for the affected communities2. Enhance the compensation for bereaved families3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024 వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. -
కోవిడ్.. జాతీయ విపత్తు
న్యూఢిల్లీ: కోవిడ్‌ను భారత్ జాతీయ విపత్తుగా ప్రకటించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం రాసిన ఒక లేఖలో పేర్కొంది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన కారణంగా కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలిపింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించింది. కోవిడ్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం ఈ నిధులు రాష్ట్రాలకు అందిస్తామని, ఇందుకు తగిన రేట్లను ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. క్వారంటైన్ క్యాంపుల సంఖ్య, ఎంత కాలం కొనసాగాలి? ఎంత మందిని ఈ క్యాంపుల్లో ఉంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. ఎస్డీఆర్ఎఫ్ నిధులను ధర్మల్ స్కానర్లు, వెంటిలేషన్ తదితర పరికరాల కొనుగోలుకూ వాడవచ్చునని హోం శాఖ తెలిపింది. మార్గదర్శకాలను ట్వీట్ చేసిన ప్రధాని కోవిడ్ వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే గడిపే సందర్భంలో తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు మిమ్మల్నీ, మీ వాళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి’ అని ట్వీట్ చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్ బాత్రూమ్ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించారు. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే 3అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొన్నారు. పద్మ ప్రదానోత్సవాలు వాయిదా మార్చి 26, ఏప్రిల్ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను గతంలో ప్రకటించారు. అంత్యక్రియలపై మార్గదర్శకాలు ఢిల్లీలో వైరస్ కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదంచేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎబోలా, నీపా వంటి వైరస్లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. -
కేరళ వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇంకా బాధ్యతగా వ్యవహరించాలని.. వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. రూ.600 కోట్లిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారని, కానీ రూ.650 కోట్లే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రాల్లో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు 14వ ఆర్థిక సంఘంలో కేటాయించిన రూ.62 వేల కోట్లు చాలా తక్కువన్నారు. దీన్ని 15వ ఆర్థిక సంఘంలోనైనా పెంచాలని కోరారు. కేరళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు రూ.6 కోట్ల విలువైన మరో 2 వేల టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్జీవో జేఏసీ, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ కలిసి రూ.24 కోట్లు.. పోలీసు అధికారులు, ఉద్యోగులు రూ.7 కోట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.2.5 కోట్లు ప్రకటించారని చెప్పారు. త్వరలో ఆ రాష్ట్రానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నాం.. మన రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న 15 గ్రామాల్లో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,336 మందిని తరలించినట్లు తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు పంపించేందుకు నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు. పంటలు దెబ్బతిన్న చోట ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇంకా రూ.33 వేల కోట్లు కావాలి.. నాలుగేళ్లలో సాగునీటి రంగంపై రూ.56 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జూన్ నాటికి 29 ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తికావాలంటే ఇంకా రూ.33,760 కోట్లు అవసరమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,620 కోట్లు ఇవ్వాల్సి ఉందని, డీపీఆర్ పంపించినా దాన్ని క్లియర్ చేయలేదని చెప్పారు. చిత్రావతి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చినట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టుల కోసం బాగా కష్టపడుతున్నారని, అందుకే ఆయన పేరును పద్మశ్రీకి సిఫారసు చేశామని సీఎం చెప్పారు. కానీ అధికారులకు ఇవ్వబోమంటూ కేంద్రం తిరస్కరించిందని తెలిపారు. వచ్చే ఏడాది కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీని పూర్తి చేసి.. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద మరో చిన్న బ్యారేజీ కడతామని తెలిపారు. సీఎంను సన్మానించిన కుల సంఘాల నేతలు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ, అఖిల భారత కాపు ఫెడరేషన్ ప్రతినిధులు సోమవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య చంద్రబాబును గజమాలతో సత్కరించారు. బలిజలను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు అఖిల భారత కాపు ఫెడరేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. -
ఇంతకు ‘జాతీయ విపత్తు’ అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడు ఎరగనంతగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం నాడు ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళ వరదలను ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని అదే రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇంతకు జాతీయ విపత్తు అంటే ఏమిటీ? అలా ప్రకటించడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కన్నా ఎక్కువ సహాయం లభిస్తుందా? ప్రకృతి వైపరీత్యాల వల్లగానీ, మానవ తప్పిదాల వల్లగానీ, ప్రమాదాల వల్లగానీ అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ను తీసుకొచ్చింది. అయితే అందులో ఫలానాది జాతీయ విపత్తు, రాష్ట్ర స్థాయి లేదా జిల్లాస్థాయి విపత్తు లేదా స్థానిక విపత్తు అని వివరించి చెప్పేందుకు ఎలాంటి నిబంధనలుగానీ, ఎలాంటి మార్గదర్శకాలుగానీ లేవు. ‘ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ తప్పిదాల వల్ల, ప్రమాదాల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు లేదా మానవులకు కష్టాలు, పర్యావరణకు నష్టాలు ఏర్పడి, వాటిని నివారించడం ఆ ప్రాంతం అధికార యంత్రాంగానికి సాధ్యమయ్యే పరిస్థితి లేకుంటే వాటిని ప్రళయంగా, బీభత్సంగా, ఘోర ప్రమాదంగా భావిస్తాం’ అని మాత్రమే చట్టంలో నిర్వచనం ఉంది. ఈ చట్టం పరిధిలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ అనే ప్రభుత్వ విభాగం ఒకటి పనిచేస్తోంది. అది కూడా కార్యనిర్వహణా విభాగంలా కాకుండా సలహా సంఘంగానే పనిచేస్తోంది. రాష్ట్ర సంక్షోభ నిరోధక సలహా సంఘాలతో సలహా సంప్రదింపులకే పరిమితం అవుతోంది. ‘జాతీయ విపత్తు’ను నిర్వహించడానికి లేదా పిలవడానికి చట్టపరంగా,కార్యనిర్వాహకపరంగా ఎలాంటి నియమ నిబంధనలు, కనీసం సూచనలు కూడా లేవని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ ప్రకృతి వైపరీత్యాల విభాగం అధిపతి అనిల్ గుప్తా తెలిపారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రం కేవలం సలహాలకే పరిమితం అవుతుందని ఆయన చెప్పారు. సంక్షోభ పిరిస్థితుల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. 2016లో ప్రణాళిక విడుదల ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ విభాగం 2016లో ఓ ప్రణాళికను విడుదల చేసింది. అందులో ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ఘోర ప్రమాదాలతో ఏర్పడే విపత్తు పరిస్థితులను మూడు రకాలుగా విభజించారు. ఓ ప్రాంతంలో విపత్తు పరిస్థితులు ఏర్పడి, వాటిని ఎదుర్కోవడం అక్కడి పాలనా యంత్రంగంకు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే దాన్ని ఒకటవ నెంబర్ విపత్తుగా, ఆ ప్రాంతం పాలనా యంత్రాంగానికి సాధ్యమయ్యేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితులను రెండో విపత్తుగా, ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే దాన్ని మూడవ విపత్తుగా ఆ ప్రణాళిక నిర్వచించింది. దీన్ని మనం కావాలనుకుంటే జాతీయ విపత్తుగా పిలచుకోవచ్చు. ఎలాంటి సహాయం అందుతుంది? మూడవ విపత్తు కింద కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో ఎక్కడా ఓ నిర్వచనంగానీ నిబంధనగానీ లేదు. దేశవ్యాప్తంగా ఇంతవరకు ఎన్నో విపత్తులు సంభవించినా తాము అది ఏ స్థాయి విపత్తో ఇంతవరకు ఎన్నడూ పేర్కొన లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డివిజన్’ అధిపతి సూర్య ప్రకాష్ తెలిపారు. విపత్తు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రం విజ్ఞప్తి మేరకే కేంద్రం స్పందిస్తుందని, ఎంత ఆర్థిక సహాయం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలో స్పష్టం చేసే మార్గదర్శకాలేవీ లేవని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్నే పరిగణలోకి తీసుకొని కేంద్రం స్పందన ఉండటం సహజమని ఆయన వివరించారు. అందుకేనా ఈ వ్యత్యాసం? 2013లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు సంభవించి 5,700 మంది మరణిస్తే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2015లో తమిళనాడులో వరదలు సంభవించి ప్రాణహాని అంతగా లేకపోయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 939.6 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కేరళలో శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తి ఇప్పటికే 400 మందికిపైగా మరణిస్తే మోదీ ప్రభుత్వం ముందుగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాత్రమే ప్రకటించింది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందన్న కారణంగానే మోదీ ప్రభుత్వం అంత తక్కువ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో మోదీ స్వయంగా కేరళ వరద ప్రాంతాలను గగన మార్గంలో సందర్శించి అదనంగా 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడంలోనే కాకుండా వరదలను జాతీయ విపత్తుగా పేర్కొనడంలోనూ రాజకీయాలు ఉన్నాయి. 2017లో గుజరాత్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సంభవించిన వర్షాలను ప్రభుత్వంగానీ, ప్రతిపక్షంగానీ జాతీయ విపత్తుగా వర్ణించలేదు. అంతకుముందు మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో జమ్మూ కశ్మీర్లో సంభవించిన వరదలను ‘జాతీయ స్థాయి విపత్తు’గా మోదీనే వర్ణించారు. బిహార్‌లో సంభవించిన వరదలకన్నా ప్రాణ నష్టం అతి తక్కువగా ఉన్నప్పటికీ ఆయన అలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేరళ వరదలను కూడా ‘జాతీయ విపత్తు’గా పేర్కొని 500 కోట్ల రూపాయల సహాయాన్ని మరింతగా పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హతవిధి! ‘జాతీయ విపత్తు’కే విపత్తు వచ్చింది. -
ఆ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
తిరువనంతపురం: కొల్లాం పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేళర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కోరారు. బుధవారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఊమెన్ చాందీ అన్నారు. వైద్యశాఖ మంత్రి శివకుమార్ నేతృత్వంలోని ఉపసంఘం గురువారం ఘటనా స్థలంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనను పలువురు రాజకీయం చేస్తున్నారని చాందీ మండిపడ్డారు. దుర్ఘటనకు సంబంధించి ఫైర్ వర్క్స్ కాంట్రాక్టర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. కాళికాదేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా పేలి 113మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాద ఘటనలో గాయపడ్డ వందలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
శైశవ దశలో విపత్తు నిర్వహణ
వరద హెచ్చరికలు చేయగల సాధనాలు సైతం మన జాతీయ విపత్తు నిర్వహణా సంస్థకు లేవు. కేదార్నాథ్ విషాదం జరిగి రెండేళ్లయినా... ముందుగా కుంభవృష్టి, భారీ వర్షాలను సూచించగల రాడార్లను ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీ మూడు భౌగోళిక భ్రంశరేఖలపై (ఫాల్ట్ లైన్స్) ఉన్న నగరం. దాదాపు గత మూడు శతాబ్దాల కాలం లో రిక్టర్ స్కేలుపై 5కు మిం చిన తీవ్రతగల ఐదు భూకం పాల తాకిడికి గురైన చరిత్ర కూడా ఉంది. దాన్ని నాలుగవ స్థాయి భూకంప ప్రాంతంగా గుర్తించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన స్థాయి భూకంపానికి ఆ నగరంలోని 80% భవనాలు నేలమట్ట మవుతాయని అంచనా. అక్కడి విపత్తు నిర్వహణ కేం ద్రాలు సైతం బీటలువారిన, చిన్న భవనాల్లోనే ఉన్నా యి. పైగా సుత్తులు, టార్చిలైట్ల వంటి కనీస ప్రాథమిక సాధనాలు సైతం దానికి లేవు. విపత్కర పరిస్థితుల్లో ఆ నగరానికి సహాయం అందించడమూ కష్టమే. ఆసుప త్రులు సైతం ఆకాశహర్మ్యాల్లోనే ఉన్నాయి. కాబట్టి సహా యక శిబిరాల్లో ప్రాథమిక వైద్య సేవలకూ కరువు తప్ప దు. దేశంలో 70% సునామీలు, తుపాన్ల నుంచి, 60% భూకంపాల నుంచి, 12% వరదల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. మన విపత్తు నిర్వహణ మాత్రం శైశవ దశలోనే ఉంది. భూకంప తాకిడికి తట్టుకునే భవ నాలను నిర్మించేలా చేయడానికి ఉన్న వాటిని దృఢతరం చేయడానికి ఉద్దేశించిన ‘ది నేషనల్ ఎర్త్‌క్వేక్ రిస్క్మిటి గేషన్ ప్రాజెక్ట్’ (2013) ఉనికి కనిపించడమే గగనం. నేపాల్ భూకంపాన్ని ముందుగా కనిపెట్టలేని దుస్థితి మన సెస్మాలజీ కేంద్రాలది. భౌగోళిక కారణాల వల్ల భూకంపాల ముప్పు ఉండ టమే కాదు... మన భౌతిక, సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు సైతం అందుకు కారణమవుతున్నాయి. పట్టణీకరణ విస్తరించి బహుళ అంతస్తుల నిర్మాణం విప రీతంగా పెరిగింది. బీమ్స్, పిల్లర్లపై నిర్మించే ఆ భవనాల స్థిరత్వానికి భంగం కలిగేలా కార్ పార్కింగ్‌లను ఏర్పా టు చేస్తున్నారు. మన నివాసాల్లో 84% భూకంపాలను తట్టుకోలేనివే. పైగా మనకు భూకంప ఇంజనీరింగ్ కోర్సున్న విశ్వవిద్యాలయాలూ స్వల్పమే. భూకంపాల సంభావ్య తను లెక్కగట్టగలమేగానీ ముందుగా చెప్ప లేం. కాబట్టి నష్ట నివారణ కోసం భూకంపాలను తట్టు కునే నిర్మాణం, భూసాంకేతిక ఇంజనీరింగ్‌లకు ప్రాధా న్యం ఇవ్వాలి. ఎక్కువ విపత్కర, హానికర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ, భూకంప సమయాల్లో కుంగిపోయే, కరిగిపోయే నేలల్లో భవన నిర్మాణాన్ని నివారించాలి. ఇది మానవతావాద సహాయపరమైన విపత్తులు నానా టికీ పెరుగుతున్న యుగం. ప్రణాళికాబద్ధమైన పట్టణీ కరణ మాత్రమే విపత్తులను తట్టుకోగలుగుతుంది. జపాన్ రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతగల భూకంపాలను (మే 13న వచ్చింది) సైతం తట్టుకోగలుగుతోంది. భూకంపాలను తట్టుకునే సురక్షిత ఆవాసాలకు హామీని కల్పించడంలో మన ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు విఫలమ య్యారు. అందుకు తగిన విధంగా వారిని మలచాల్సి ఉంది. ‘ది ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్’ను వ్యవస్థీకరించి సంఘటిత సమాచారం, సాధన సంప త్తులను సేకరించే కేంద్రంగా అభివృద్ధి పరచాల్సి ఉంది. వరదలను ముందుగా సూచించగల సాధనాలు సైతం మన జాతీయ విపత్తు నిర్వహణా సంస్థకు (ఎన్ఎండీఏ) లేవు. కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చే అర కొర అంచనాలే దిక్కు. కేదార్నాథ్ విషాదం జరిగి రెండే ళ్లయినా... 3 నుంచి 6 గంటల ముందు కుంభవృష్టి, భారీ వర్షాలను సూచించగల డ్రాప్లర్ రాడార్లను ఉత్తరా ఖండ్‌లో ఏర్పాటు చేయలేదు. వరద ముప్పున్న ప్రాం తాల్లో నిర్మాణాలకు మార్గదర్శకాలుగానీ, సురక్షిత ప్రాంతాల మ్యాప్లుగానీ లేవు. పైగా హిమాలయ పర్వ త ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారీ డ్యామ్‌ల నిర్మా ణానికి అనుమతులిస్తున్నా ఎన్ఎండీఏ నోరు మెదపడం లేదు. దేశంలో 5,000కు పైగా డ్యామ్‌లున్నా కేవలం 200కు మాత్రమే అత్యవసర పరిస్థితి కార్యాచరణ ప్రణా ళికలున్నాయి. 4,800 రిజర్వాయర్లుండగా 30కి మా త్రమే నీటి ప్రవాహం వచ్చి చేరడంపై ముందస్తు హెచ్చ రికలు చేయగల వ్యవస్థ ఉంది. అసలు ఎన్డీఎంఏనే ఒక తలకాయ లేని సంస్థగా ఉంది. దానిలోని 11 లేదా 12 మంది సభ్యులకుగానూ ముగ్గురిని మాత్రమే నియమిం చారు. మార్గదర్శకాలను సూచించాల్సిన సంస్థ అయిన దానికి వాటిని అమలు చేసే యంత్రాంగమే లేదు. దాని మార్గదర్శకాలకు రాష్ట్రాలు కట్టుబడాల్సిన అవసరం లేకపోవడంతో ప్రాంతాలవారీ ప్రణాళికలు కొన్ని చోట్లే అమలవుతున్నాయి. పైగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేంద్ర హోం శాఖ అధీనంలో ఉండటంతో దాని సహాయక చర్యలు తాత్కాలిక ప్రాతి పదికపైనే సాగుతున్నాయి. పైగా దానికి తగు సిబ్బంది, శిక్షణ, మౌలిక సదుపాయాలు, సాధనసంపత్తి లేవు. ప్రధాన నగరాల్లో విపత్తు నష్ట నివారణలో దాని పాత్ర కాగ్ పేర్కొన్నట్టు ‘‘నామమాత్రం’’ ప్రకృతి విపత్తులు సంక్లిష్టమైన పలు అంశాల వల్ల సంభవిస్తాయి. వాటితో వ్యవహరించాల్సిన విపత్తు నిర్వ హణ యంత్రాంగం బహుముఖమైనదిగా ఉండాలి. వర దలు, తుపానులు, సునామీలు, దుర్భిక్షాలు, భూకం పాలు వంటి విభిన్నమైన సవాళ్లను ఎదుర్కొనేది కావా లి. స్థానిక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, జీవావరణ సంబంధ అంశాలను సైతం అది పరిగణనలోకి తీసు కుని తాత్కాలిక, దీర్ఘకాలిక సహాయ పునరావాస ప్రణాళి కలను రూపొందించగలిగి ఉండాలి. ఈ సమగ్ర దృష్టితో ఎన్డీఎంఏను తిరిగి పునర్నిర్మించి, దానికి మార్గదర్శకా లను అమలు చేయించగల యంత్రాంగాన్ని సమకూ ర్చాలి. అంతవరకు విపత్తుల్లో తక్షణం స్పందించేది సైన్యం, పారా మిలిటరీ బలగాలే కాక తప్పదు. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు) - వరుణ్ గాంధీ ఈమెయిల్: fvg001@gmail.com -
నిర్లక్ష్యమే అసలు విపత్తు!
సంపాదకీయం ప్రకృతిని వికృతపరిస్తే పర్యవసానాలెలా ఉంటాయో మరోసారి జమ్మూ-కాశ్మీర్ విలయం కళ్లకు కట్టింది. వరసబెట్టి ఆరురోజులపాటు ఆ రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలకు నదులు, సరస్సులు పొంగి ప్రవహించడంతో రాజధాని నగరం శ్రీనగర్‌తో సహా అనేక పట్టణాలు, గ్రామాలు మునిగిపోగా ఇంతవరకూ 200 మంది మృత్యువాతబడ్డారు. సైన్యం రంగంలోకి దిగి సహాయచర్యల్లో తలమునకలైనా ఇంకా ఆపన్నహస్తం అందని గ్రామాలెన్నో ఉన్నాయి. ఆరులక్షలమంది ప్రజలు ఇప్పుడు జలగండంలో చిక్కుకున్నారని సమాచారం. కొండచరియలు విరిగిపడి రోడ్లన్నీ దెబ్బతినడంతోపాటు కమ్యూనికేషన్ సదుపాయాలు కూడా ధ్వంసంకావడంతో గల్లంతైన ఆప్తుల జాడ తెలియక ఎన్నో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆదివారం ఆ రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది జాతీయ విపత్తని ప్రకటించారు. సాధారణంగా వానలు పెద్దగా కురవని సెప్టెంబర్ మాసం ఆ రాష్ట్ర ప్రజలకు ఈసారి నరకం చూపింది. జీలం, చీనాబ్, రావి నదులు ఉగ్రరూపం దాల్చి అనంతనాగ్, కుల్గామ్, షోపియాన్, పుల్వా మా, గందర్బాల్, శ్రీనగర్, బడ్గామ్ జిల్లాల్లోని వందల గ్రామాలను నీట ముంచాయి. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఇదే స్థితి. సెప్టెంబర్ నెలంతా శ్రీనగర్‌లో సగటు వర్షపాతం 26.6 మిల్లీమీటర్లు కాగా, కేవలం 24 గంటల వ్యవధిలో అక్కడ కురిసిన వర్షం 51.8 మిల్లీ మీటర్లు. ఈ నగరవాసులు ఇంకా అదృష్టవంతులనే చెప్పాలి. పొరుగు నున్న కాజీగండ్లో 24 గంటల వ్యవధిలో పడిన వర్షపాతం 156.7 మిల్లీమీటర్లు. మనిషి సాగిస్తున్న విధ్వంసమే ప్రకృతి విపత్తులకు కారణమవు తున్నదని పర్యావరణవేత్తలు చాన్నాళ్లనుంచి చెబుతున్నారు. ఏళ్లతరబడి చినుకు రాలకపోవడం, ఒక్కోసారి ఉన్నట్టుండి పగబట్టినట్టు గంటల తరబడి కుంభవృష్టి కురియడం ఇలాంటి విధ్వంస పర్యవసానమేనని వారంటారు. ప్రపంచం మొత్తం ఇలాంటి ధోరణి కనిపిస్తున్నా కనీసం మన వంతు జాగ్రత్తలు తీసుకుందామని, ప్రజలను చైతన్యవంతం చేద్దామని ప్రభుత్వాలు అనుకోవడం లేదు. సరిగదా అవాంఛిత నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులిస్తూ ఆ విధ్వంసంలో తమ చేయీ వేస్తున్నాయి. హిమవన్నగాలు కొలువుదీరిన జమ్మూ- కాశ్మీర్లో ఉన్నట్టుండి వర్షాలు విరుచుకుపడి, వరదలొస్తే కొండవాలున ఉండే జనావాసాలు ఏమవుతాయో అధికార యంత్రాంగానికి అంచనా ఉండాలి. ఆపత్సమయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించు కోవాలి. ఆ పని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ)వంటివి దాన్ని అప్రమత్తం చేయాలి. కానీ, విషాదమేమంటే వీరంతా ఒకరిని మించి ఒకరు మొద్దునిద్రపోయారు. సీడబ్ల్యూసీ వెబ్సైట్లో వరద అంచనాలను తెలిపే విభాగంలో అసలు జమ్మూ- కాశ్మీర్ ప్రాంత వివరాలే లేవు. ఈ అంచనాలను తెలుసుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీడబ్ల్యూసీ 175 వరద హెచ్చరిక కేంద్రాలను ఏర్పాటుచేస్తే అందులో జమ్మూ-కాశ్మీర్‌కు చోటులేదు. అలాగని ఆ రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు కొత్తగాదు. 1959, 1992, 2010 సంవత్సరాల్లో అక్కడ జలప్రళయాలు సంభవించాయి. రెండేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల విపత్తు నివారణ విధానాన్ని ప్రకటించింది. అయితే, దానికి కొనసాగింపుగా ప్రభుత్వంలో ఏర్పాటు కావలసిన ప్రత్యేక విభాగం ఆచూకీ లేదు. విపత్తులు వచ్చిపడినప్పుడు ఈ ప్రత్యేక విభాగం ప్రభుత్వంలోని అన్ని విభాగాలనూ ఉరికించి, సహాయచర్యలు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనుక ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్‌ను చుట్టుముట్టింది ప్రకృతి విపత్తు మాత్రమే కాదు...అంతకుమించిన ప్రభుత్వ అచేతనస్థితి, నిర్లిప్తత. భౌగోళికంగా చూస్తే మన దేశం ప్రకృతి విపత్తులకు ఆలవాలమైన ప్రాంతం. దేశంలో 76 శాతం భూభాగం తీర ప్రాంతం. అక్కడ తుపానులు, సునామీల ముప్పు ఉంటుంది. 10 శాతం భూమి వరదలు, నీటి కోతలతో నిత్యం ఇబ్బందులు పడుతుంది. ఇవిగాక భూకంపాలు, కరువు వంటి విపత్తుల ప్రభావమూ ఉంటుంది. పైగా భూతాపోన్నతి కారణంగా ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఇంతక్రితంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. కనుక మనం నిత్యమూ అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఒకచోట విపత్తు సంభవించినప్పుడు అలాంటివి తమ ప్రాంతంలో ఏర్పడితే ఏమి చేయాల్సివుంటుందో, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని ప్రభుత్వాలూ అధ్యయనం చేసే సంస్కృతి ఉంటే కాశ్మీర్లో ఇప్పుడు జరిగినలాంటి విపత్తుకు ఆస్కారం ఉండేది కాదు. ఎక్కడివరకో అవసరం లేదు...నిరుడు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో సంభవించిన విషాదంపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతస్థాయి కమిటీ సవివరమైన నివేదిక సమర్పించింది. హిమలయ పర్వత ప్రాంత రాష్ట్రాలన్నిటా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి విపత్తులు కలిగించే నష్టాన్ని కనిష్టం చేయవచ్చునో ఆ కమిటీ తెలిపింది. ఆ కమిటీ నివేదికను ఉత్తరాది రాష్ట్రాలన్నీ అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా అసలు ఉత్తరాఖండ్ రాష్ట్రమే దాన్ని పట్టించుకోలేదు. ఇక జమ్మూ-కాశ్మీర్‌నుంచి అలాంటిది ఆశించడమే సాధ్యంకాదు. ఇప్పటికైనా ప్రకృతి వైపరీత్యాలపై జాతీయ స్థాయి విధానమూ, దృక్పథమూ అవసరమని కేంద్రం గుర్తించాలి. దాంతోపాటు విదేశాల్లో ఇలాంటి సమయాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయించి ఒక సమగ్ర విధానానికి రూపకల్పనచేస్తే ఈ తరహా విపత్తులను నివారించడానికీ, వాటివల్ల సంభవించే నష్టాలను గణనీయంగా తగ్గించడానికీ వీలవుతుంది. -
కాశ్మీర్లో జలప్రళయం
ఇప్పటివరకు 150 మంది మృతి; వేలాదిగా నిరాశ్రయులు జాతీయ విపత్తుగా ప్రకటించిన ప్రధాని {పభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే వెయ్యి కోట్ల అదనపు ఆర్థిక సాయం జల దిగ్బంధంలో శ్రీనగర్ జమ్మూ/శ్రీనగర్: జల విలయానికి జమ్మూకాశ్మీర్ విలవిల్లాడుతోంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వందలాదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోగా, వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశ్రయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీలం సహా ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో రాష్ట్రం జల దిగ్భంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్తు, రవాణా, ఫోన్ సౌకర్యాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలు, సచివాలయం సహా శ్రీనగర్‌లోని అత్యధిక ప్రాంతాలను జీలం నది వరద జలాలు ముంచెత్తాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ జల ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రకటించారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ఉపశమన నిధి ద్వారా రాష్ట్రానికి అందించిన రూ. 1,100 కోట్లు ఏమాత్రం సరిపోవని భావించిన ప్రధాని.. సహాయ, పునరావాస చర్యల కోసం అదనంగా రూ. 1000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రత్యేక సాయంగా ప్రకటించారు. వరద నష్టం వివరాలు పూర్తిగా అందిన తరువాత అవసరమైతే మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలను ప్రధానమంత్రి(పీఎంఆర్ఎఫ్) సహాయనిధినుంచి అందిస్తామని ప్రధాని గురువారమే ప్రకటించడం తెలిసిందే. ఆదివారం జమ్మూలో వరద ప్రభావిత ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని .. అనంతరం వరద పరిస్థితిని, సహాయ కార్యక్రమాలను జమ్మూ, శ్రీనగర్‌లలో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ అధికారులు ఆయనకు వివరాలందించారు. ఈ విపత్కర స్థితిలో జమ్మూకాశ్మీర్‌కు సాయమందించేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు. నిరాశ్రయుల కోసం కేంద్రం తరఫున 5 వేల టెంట్లను రాష్ట్రానికి పంపిస్తామన్నారు. లక్ష దుప్పట్ల కొనుగోలు కోసం పీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 5 కోట్లను, పిల్లల ఆహార అవసరాల కోసం 50 టన్నుల పాల పొడిని, విద్యుత్ అవసరాల కోసం 2 వేల సౌర విద్యుత్ దీపాలను సమకూరుస్తామన్నారు. పాక్ కోరితే.. వరదల్లో చిక్కుకుపోయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈమేరకు ఆయన పాక్ ప్రధానికి లేఖ కూడా రాశారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఐఏఎఫ్ మరోవైపు, సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సహాయ సామగ్రిని తెప్పిస్తోంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి అదనపు బలగాలు కాశ్మీర్‌కు చేరుకుంటున్నాయి. ‘ఇది ఇంతకుముందెన్నడూ చూడని విపత్తు. భయపడొద్దు. సాధ్యమైనంత త్వరలో మిమ్మల్ని రక్షిస్తాం’ అని ఒమర్ ప్రజలకు హామీ ఇచ్చారు. 29 విమానాలు, హెలికాప్టర్లతో వాయుసేన సహాయ చర్యల్లో పాలుపంచుకుంటోంది. విపత్తు పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తమ దళాలను సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పటివరకు 12,500 మందిని సైన్యం, ఐఏఎఫ్ దళాలు రక్షించాయి. నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుండటంలో వీలైన చోట్ల టెంట్లు వేసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. బాధితులకు ఆహార, ఔషధాలందించేందుకూ చర్యలు చేపట్టామని సైన్యాధికారులు తెలిపారు. బోటు తిరగబడటంతో వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు సైనికుల కోసం గాలింపును కొనసాగిస్తున్నామన్నారు. పాక్ సరిహద్దుకు దగ్గర్లోని ఆర్మీ శిబిరాల్లో చిక్కుకుపోయిన 108 మంది సైనికులను వైమానిక దళ హెలికాప్టర్ల ద్వారా సైన్యం రక్షించింది. సహాయ చర్యల కోసం అవసరమైనన్ని పడవలు అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ నుంచి 100 బోట్లను తెప్పిస్తున్నారు. జమ్మూలో తగ్గింది.. కాశ్మీర్లో పెరిగింది జమ్మూ ప్రాంతంలో వరద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నందువల్ల సహాయ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం రాత్రి నుంచి జీలం నది ప్రవాహం పెరగడంతో కాశ్మీర్ లోయ ప్రాంతంలో వరద తీవ్రత పెరిగింది. ముఖ్యంగా శ్రీనగర్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీలం నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తుండటంతో వాణిజ్యకేంద్రమైన లాల్ చౌక్ ప్రాంతం నీట మునిగింది. ఇళ్లు కూలిపోయిన పలు ఘటనల్లో శనివారం 22 మంది చనిపోయారు. -
భివండీ బీజే కపిల్ పాటిల్పీ అభ్యర్థిగా ..?
సాక్షి, ముంబై: భివండీ బీజేపీ అభ్యర్థిగా కపిల్ పాటిల్ దాదాపు ఖరారైంది. అయితే అధికారికంగా మాత్రం ఆ పార్టీ నుంచి ఇంకా ఏ ప్రకటనా రాలేదు. కపిల్ పాటిల్ బీజేపీలో చేరడంతోనే దాదాపు ఆయన భివండీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖడ్సే సమక్షంలో నారీమన్ పాయింట్‌లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఎన్సీపీ ఠాణే గ్రామీణ అధ్యక్షుడు కపిల్ పాటిల్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో 200 మంది ఎన్సీపీ కార్యకర్తలు కూడా కాషాయ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరిలో భివండీ పంచాయతీ సమితి అధ్యక్షులు మనీషా భోయిర్, మోహన్ అంధారే, శాంతారామ్ భోయిర్లు కూడా ఉన్నారు. కపిల్‌తో బీజేపీకి ప్లస్సే... గ్రామీణ ప్రాంతంలో కపిల్ పాటిల్‌కు మంచి పట్టుఉంది. ఠాణే జిల్లా పరిషత్, జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా ఆయన విధులు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ ఎవరిని బరిలోకి దింపనుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఎమ్మెన్నెస్ నాయకుడైన సురేష్ అలియాస్ బాల్యామామా మాత్రే పేరు కూడా వినిపించింది. అయితే ఎమ్మెన్నెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మంగళ్‌ప్రభాత్ లోధా పేరు ముందుకు వచ్చింది. అయితే స్థానికులకే టికెట్ ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కపిల్ పాటిల్ బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ మంగళవారం ఆయన బీజేపీ పార్టీలో తన మద్దతుదారులతోపాటు చేరారు. దీంతో దాదాపు ఆయననే భివండీ లోకసభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే టికెట్ దాదాపు ఖరారైంది. అయితే బీజేపీ నుంచి అధికార ప్రకటన రావల్సి ఉంది. పాటిల్ పార్టీ.... బీజేపీ ఇప్పుడు ముండే, ఫడ్నవీస్‌ల పార్టీ కాదని, పాటిల్ పార్టీగా మారిందని అభివర్ణిస్తూ ఎన్సీపీ, కాంగ్రెస్‌పై తనదైన శైలిలో గోపీనాథ్ ముండే చురకలంటించారు. తమ మిత్రపక్షమైన శివసేనలోని కొందరు పార్టీ వీడిన మాటవాస్తవమే. వారు వెళ్లడంతో ఇబ్బందేమీలేదు. ఇది మహాకూటమికి మైనస్ కాదు. ఒకవేళ అలా భావిస్తే కపిల్ పాటిల్ రాకతో మేము మళ్లీ ప్లస్ అయ్యామ’ని వివరించారు. ఎలాంటి విభేదాలు లేవు... మహాకూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. మాలో ఎలాంటి విభేదాలులేవన్నారు. ఉద్దవ్ ఠాక్రేతో చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పారు. రాజ్‌ఠాక్రేతో నితిన్ గడ్కారీ భేటీపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే, బీజేపీలో నిర్ణయం తీసుకునేది ఎవరని ప్రశ్నించడంపై తెలివిగా సమాధానమిచ్చారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర బీజేపీకి తాను అధ్యక్షుడిగా విధులు నిర్వహించానని. తద్వారా అధ్యక్షుడికి ఎన్ని అధికారాలు ఉంటాయనేది తెలుసని చెప్పారు. తమ పార్టీ తుది నిర్ణయాలు ప్రకటించేది మాత్రం పార్టీ అధ్యక్షుడేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముండే ఆరోపించారు. ‘వడగళ్ల వర్షంతో రైతులు నష్టపోయారు. ఇళ్లు, పంట, పశువులు కోల్పోయినవారిని ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ’ని మరోమారు ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వం కొంతమేర నిద్ర నుంచి మేల్కొందన్నారు. రైతులకు పూర్తి నష్టపరిహారం అందేవరకు తాము పోరాడుతామన్నారు. మూడు రోజులలో మద్దతు ప్రకటించికపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. ఒకవైపు ఇప్పటి వరకు 37 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని, రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి... రాష్ట్రంలో వడగళ్లు, వర్షం కారణంగా నెలకొన్న పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని గోపీనాథ్ ముండే డిమాండ్ చే శారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీ అయిందని, దీంతో జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కేంద్రం మద్దతు నిధులు అందిస్తుందన్నారు. అయితే జాతీయ విపత్తు ప్రకటనతో ఎలాంటి లాభం లేదని పవార్ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాందాస్ తడస వార్ధా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సాగర్ మేఘేపై బీజేపీ తరఫున రాందాస్ తడస్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ తండ్రి దత్తా మేఘేతో కలసి రాందాస్ తడస్ ఎన్సీపీలో పనిచేశారు. వార్ధా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దత్తా మేఘే తన కుమారుడి కోసం ఈ స్థానం నుంచి తప్పుకున్నారు. కాగా, యావత్మల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ శివసేన ఎంపీ భవన గవాళి పోటీచేస్తున్నారు. భివండీని అభివృద్ధి చేద్దామనే.. సాక్షి, ముంబై: భివండీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే బీజేపీలో చేరానని కపిల్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన ఎన్సీపీను వీడి బీజేపీలో చేరిన అనంతరం సాక్షితో మాట్లాడుతూ తనకు ఎన్సీపీపై, ఎన్సీపీ నాయకులపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అదే విధంగా ఇప్పటికీ శరద్‌పవార్‌తోపాటు ఆ పార్టీలోని ఇతర నాయకులందరిపై గౌరవం ఉందన్నారు. భివండీలో ఇప్పటివరకు పెద్దగా అభివృద్ధి ఏమీ జరగలేదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ నేత నరేంద్ర మోడీ హవా నడుస్తోంది. ఆయన నేతృత్వంలో బీజేపీతో భివండీలో అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నా.. అందుకే బీజేపీలో చేరా..నని పేర్కొన్నారు. బీజేపీ నుంచి భివండీ లోక్‌సభకు తనను అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదన్నారు. అవకాశం ఇస్తే భివండీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘స్థానికుడినైన నాకు భివండీలోని సమస్యలపై అవగాహన ఉంది. సమస్యల పరిష్కారంతోపాటు భివండీలో ఎటువంటి అభివృద్ధి అవసరమో తెలుసు కాబట్టి ప్రజలు నాకు పట్టం కడతారనే నమ్మకముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇది జాతీయ విపత్తే: బాబు
సీఎం అసమర్థత వల్ల రైతాంగానికి నష్టం టీడీపీకి భయపడే విభజన నిర్ణయం సాక్షి, విజయవాడ: తుపాన్ల నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పర్యటన అనంతరం బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నీలం తుపాను నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం దారుణమన్నారు. తుపాన్లతో రైతాంగం రూ.10 వేల కోట్లు నష్టపోయిందన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తాయని తెలిసి కూడా సకాలంలో ఖరీఫ్‌కు నీరు ఇవ్వకపోవడం వల్లే రైతాంగానికి ఈ కష్టాలు వచ్చాయన్నారు. కేంద్ర బృందం వస్తే రాష్ట్రప్రభుత్వం తుపాను నష్టాలపై నివేదిక కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అసమర్థత వల్ల రైతాంగం నష్టపోవాల్సి వస్తోందన్నారు. హెలెన్ తుపాను నష్టంపై ఇంతవరకూ క్షేత్రస్థాయి పరిశీలనకు రాలేదని సీఎంను విమర్శించారు. పంట రుణాలను, అవసరమైతే అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తుపాన్లు వెంటాడుతుంటే కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల్లో బిజీగా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించడానికి సోనియాకు ఉన్న అర్హత ఏమిటని, ఎక్కడో పుట్టి పెరిగిన వ్యక్తికి దేశ రాజకీయాలు ఏం తెలుస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై చర్చ జరగాల్సింది ‘టెన్ జనపథ్’లో కాదని, ఆంధ్రప్రదేశ్‌లో జరగాలన్నారు. తాను జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయమంటే రాష్ట్రంలోని పార్టీలను పిలవడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి లభించిన ఆదరణకు భయపడే రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. ‘టీఆర్ఎస్ని విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్‌ను బయటకు తెచ్చి విభజన ప్రక్రియను ముందుకు తెచ్చార’ని ఆరోపించారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం వచ్చే వరకూ రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
తిరుమలాయపాలెం/ముదిగొండ, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు, ముదిగొండ మండలం రాఘవాపురంలో దెబ్బతిన్న పంటలను సోమవారం ఆయన పరకాల ఎమ్మెల్యే బిక్షపతితో కలిసి పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాలలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ వివరాలను పరిశీలించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, తమ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసి, పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. గతంలో నీలం, జల్ తుపాన్లు, వడగండ్ల వానలు కురవడంతో నష్టపోయిన పంటలకు నేటికీ పైసా కూడా అందజేయలేదని విమర్శించారు. 2011 నుంచి 2013 వరకు రావల్సిన నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని కోరారు. ఆంధ్రాతో సమానంగా ఈ ప్రాంత రైతులకు కూడా పరిహారం చెల్లించాలని, వరదల్లో కొట్టుకుపోయి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. తడిసిన ధాన్యం, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు గోపగాని శంకర్రావు, రామారావు, బత్తుల సోమయ్య, బొమ్మెర రామ్మూర్తి, కంచర్ల చంద్రశేఖర్‌రావు, కాసాని నాగేశ్వరరావు గౌడ్, తదితరులు ఉన్నారు.