ఆ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి | centre should declare , which has so far claimed 113 lives, as national calamity: kerala CM oommen chandy. | Sakshi
Sakshi News home page

ఆ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

Published Wed, Apr 13 2016 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

centre should declare , which has so far claimed 113 lives, as national calamity: kerala CM oommen chandy.

తిరువనంతపురం: కొల్లాం పుట్టింగళ్ ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేళర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కోరారు. బుధవారం సమావేశం అయిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తోందని ఊమెన్ చాందీ అన్నారు.

వైద్యశాఖ మంత్రి శివకుమార్ నేతృత్వంలోని ఉపసంఘం గురువారం ఘటనా స్థలంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనను పలువురు రాజకీయం చేస్తున్నారని చాందీ మండిపడ్డారు. దుర్ఘటనకు సంబంధించి ఫైర్ వర్క్స్ కాంట్రాక్టర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. కాళికాదేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణాసంచా పేలి  113మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాద ఘటనలో గాయపడ్డ వందలాదిమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement