ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు మంగళవారం లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. తన స్పీచ్‌లోని వ్యాఖ్యలు తొలగించటంపై రాహుల్ గాంధీ స్పందించారు.
‘మోదీ ప్రపంచంలో మాత్రమే నిజాన్ని తొలగిస్తారు. కానీ, వాస్తవ ప్రపంచంలో నిజం ఎప్పుడూ తొలగించబడదు. నిన్న లోక్‌సభలో నేను చేసిన వ్యాఖ్యలు అన్నీ నిజాలు, అసత్యాలు. వాళ్లు తొలగించుకోవాలనుకుంటే.. తొలగించుకోవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
పార్లమెంట్ సమావేశాలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నీట్, అగ్నిపథ్ పథకాలు, బీజేపీ వ్యవహరిస్తున్న హిందుత్వ విధానాల తీరుపై సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అధికర ఎన్డీయే అభ్యంతరం తెలిపింది. రాహుల్ గాంధీ హిందు సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment