ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్‌పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై చర్చ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
లోక్‌సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్‌టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్‌పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం.
రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్‌పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్‌పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.
దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment