సాక్షి,న్యూఢిల్లీ : రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందర గోళం నెలకొంది. మణిపూర్ అల్లరు,నీట్ లీకేజీపై స్పందించాలని డిమాండ్ చేస్తూ మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..
👉రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ లక్ష్యాలను వివరించారు.
👉దేశానికి మార్గదర్శకం చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు.
👉ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి.
👉ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అధికారం కట్టబెట్టారు.
👉మా పదేళ్ల ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.
👉మాకు నేషన్ ఫస్ట్. మేం ఏ పనిచేసినా ఇదే అంశంపై కట్టుబడి ఉంటాం.
👉కొంత మంది బాధని నేను అర్ధం చేసుకోగలను అసత్య ప్రచారం చేసినా ఓడిపోయారు.
👉పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు.
👉పదేళ్లలో భారత్ ఖ్యాతిని మరింత పెంచాం.
👉ఈ దేశంలో ఏదీ మారదని 2014ముందు ప్రజలు అనుకునే వారు.
👉కాంగ్రెస్ హయాంలో ఎక్కడా చూసినా అంతా అవినీతి మయమే.. పత్రికల్లో ఎక్కడ చూసినా ఆ వార్తలే.
👉స్కామ్‌లకు చెల్లింది.
👉కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే 15పైసలు మాత్రమే సామాన్యులకు అందేవి.
👉2014కు ముందు ఉగ్రవాదులు భారత్‌లో ఎక్కడ పడితే అక్కడే దాడులు జరిగేవి. ప్రభుత్వాలు నోరుమెదిపేవి కావు.
👉కానీ 2014 తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాం.
👉దేశ భద్రతకోసం మేం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.
👉కాంగ్రెస్ హయాంలో బొగ్గు స్కాం జరిగితే.. మా హయాంలో రికార్డ్ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.
👉కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల్లో స్కాంలు జరిగితే 2014 తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తెచ్చాం.
👉ఆర్టికల్ 370తో అక్కడి ప్రజలు హక్కుల్ని లాక్కున్నారు. జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలు చేయనిచ్చేవారు కాదు.
👉ఆర్టికల్ 370 రద్దుతో రాళ్ల దాడులు ఆగిపోయాయి.
👉స్మార్ట్ ఫోన్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
👉మా పాలనలో మహిళలలను లక్షాదికారులుగా మార్చాం.
👉భారత్ ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి ఎదిగేందుకే మా కృషి.
👉మూడో టర్మ్‌లో ట్రిపుల్ స్పీడుతో అత్యత్తమ ఫలితాలు సాధిస్తాం.
👉చిల్లర రాజకీయాలతో దేశం నడవదు.
అదే సమయంలో విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపించడంతో సరైన పద్దతి కాదని మండిపడ్డారు. అయినప్పటికీ నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై స్పందించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నినాదాల మధ్య కొనసాగుతున్న మోదీ ప్రసంగం
Comments
Please login to add a commentAdd a comment