Parliament sesisons
-
ప్రజలు తిరస్కరించినా పార్లమెంట్‌పై పెత్తనమా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఇప్పటిదాకా దాదాపు 80–90 సార్లు ఓటమిని చవిచూసినా విపక్షాలు తమ తీరును మార్చకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియలో పదేపదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనాసరే కొన్ని పార్టీలు పార్లమెంట్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభాకార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంట్ భవనం ఎదుట మీడియాతో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌పై పట్టుకు యత్నం‘పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 80–90 సార్లు ఎన్నికల్లో ఓడినా విపక్షాల తీరు మారలేదు. విపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలు జరగ నివ్వట్లేదు. ప్రజాస్వామ్య సూత్రా లను, ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు’’ అని మోదీ విమర్శల దాడి చేశారు. కొన్ని ప్రతిపక్షపార్టీలు సహకరిస్తున్నా‘‘కొందరు విపక్ష నేతలు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. వీళ్ల వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణచివేస్తుంది. వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ పార్టీల మనసుల్ని వాటి మిత్రపక్షాలు మార్చేస్తు న్నాయి. సభలో ఆందోళనలు, నిరసనలకే మొగ్గుచూపుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయి. సభా సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్షపార్టీల గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తు న్నాయి. వీళ్ల గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైనవారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.భారత్‌లో వచ్చిన అవకాశం అరుదైంది‘‘ప్రపంచదేశాల పార్లమెంట్లతో పోలిస్తే భారత పార్లమెంట్లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకా శం రావడం నిజంగా అరుదు. పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజా స్వామ్యంపై ప్రజలకున్న అంకితభావా నికి అద్దంపట్టాలి. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని, ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకో వాలి. ప్రస్తుత సమావే శాలు అత్యంత ఫలవంతమవ్వాలి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తిచేసు కుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనందరం పెంచుదాం. కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం’ అని మోదీ అన్నారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
Updates: పార్లమెంట్ సమావేశాలు
Updatesఇంటర్ మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజూ తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆయిల్ ఫీల్డ్స్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టనున్నారు.కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో ‘సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Rf51S7KYug— ANI (@ANI) August 5, 2024ఓబీసీలను క్రిమిలేయర్ నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.#ParliamentMonsoonSession | Congress MP Manickam Tagore gives adjournment motion notice in Lok Sabha to "Revise the income criteria of OBC-creamy layer to reflect current socio-economic conditions. Implement transparent policies to address disparities and ensure effective… pic.twitter.com/rJIR48VZXB— ANI (@ANI) August 5, 2024 పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో విభజన బిల్లు, ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రాతినిధ్యాన్ని పునర్వ్యవస్థీకరించే చట్టాన్ని సమర్పించనున్నారు. -
Rahul Gandhi: ధనికులైతే చాలు పరీక్ష విధానాన్నే కొనేయొచ్చు
న్యూఢిల్లీ: ధనికులైతే చాలు పరీక్షా విధానాన్నే కొనేయొచ్చంటూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం తీవ్ర విమర్శలుచేశారు. గత ఏడేళ్లలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లేవంటూ లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వీయతప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరిపై నిందలేస్తూ తప్పుబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు లేనట్లుంది. వరస లీకేజీలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో పరీక్షల నిర్వహణ అనేది ఒక మోసపూరిత వ్యవహారమని అభ్యర్థులు ఒక నిర్ణయానికొచ్చారు. ధనికులైతే చాలు పరీక్షావిధానాన్నే కొనేయొచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఈ తప్పు వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు మీ వంతుగా ఎలాంటి కృషిచేస్తున్నారు?’ అని మంత్రిని రాహుల్ నిలదీశారు. దీంతో మంత్రి ప్రధాన్ మాట్లాడారు. ‘‘ మొత్తం పరీక్ష విధానమే నిష్పలం అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరం. ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ చెబుతున్నదంతా అబద్ధం. నిజానికి ఎన్టీఏను స్థాపించాక 240కిపైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం. ఐదు కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకున్నారు. 4.5 కోట్ల మంది వివిధ పరీక్షలు రాశారు’’ అని మంత్రి చెప్పారు. దీంతో ఠాకూర్ కలగజేసుకుని ‘‘ పేపర్ లీకేజీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఎలాంటి నిర్ణయాలు ఆచరణలో పెడుతున్నారో మంత్రి చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. దీంతో మంత్రి స్పందించారు. ‘‘ ఇక్కడ మాలో ఏ ఒక్కరో జవాబుదారీ కాదు. ఏం జరిగినా ప్రభుత్వం మొత్తం జవాబుదారీగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘పేపర్ లీకేజీల విషయంలో మోదీ సర్కార్ రికార్డ్ సృష్టించనుంది. ఒకే చోట రాసిన వారిలో ఎక్కువ మందికి అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షకేంద్రాల జాబితాను విడుదలచేయాలి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. అనంతరం టీఎంసీ, డీఎంకే సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. -
లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్
ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్‌పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై చర్చ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.లోక్‌సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్‌పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్‌పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్‌పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు. -
నేటి నుంచి పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి వారితో మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లా! ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్‌కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్‌సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్‌సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు. -
ప్రతిపక్ష నేతగా రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పుంజుకోవడంలో.. అటు కూటమి పక్షాల విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన పనితీరుపై అన్ని పక్షాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టి, పార్లమెంటులో ముందుండి పార్టీని నడిపించాలనే డిమాండ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇండియా కూటమిలోని చిన్నాచితకా పార్టీల నేతలు ఆయన ఎంపికను సమరి్ధస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీని కొనసాగించాలనే డిమాండ్లు వచి్చనా ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుతం పారీ్టకి సొంతంగా 99 సీట్లు వచ్చాయి. లోక్‌సభలో 10 శాతం సీట్లు అంటే కనీసంగా 55 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం ఆ స్థానాలు గెలిచినందున ఆ హోదాలో రాహుల్‌గాంధీ ఉండాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి భారీ మెజారీ్టలతో గెలవడంతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో కూటమి పక్షాలకు మెజార్టీ స్థానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఈ దృష్ట్యానే పార్టీ నేతలు ఆయన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘నేను మా నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగాను. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలని భావిస్తున్నాను. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా అలాగే ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ సైతం రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు. ఒకవేళ రాహుల్ కాదన్న పక్షంలో సీనియర్ నేతలైన శశిథరూర్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీనిపై 8న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం చేస్తారని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్యూసీ భేటీ జరగనుంది. ఇక రాహుల్ గెలిచిన రెండు స్థానాల్లో దేనిలో కొనసాగుతారు, దేనిని వదులుకుంటారన్న దానిపై ఇదే భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి.. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని.. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభ చర్చలో వైఎస్సార్సీపీ తరఫున ఆమె మాట్లాడారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలో జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డుల కవరేజ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. తుపాన్లతో ఏపీ తరచూ తీవ్రంగా నష్టపోతోందని, తుపానుల నుంచి ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. విద్యారంగంలో, సులభతర వాణిజ్యం, మత్స్య రంగంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. -
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
Interim Budget 2024: నేడే బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈరోజే పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మెరుపులు ఉంటాయా ? అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్నెస్ అలవెన్స్‌ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయుశ్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. -
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్‌ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి.. -
రేపటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా ఆదివారం అన్ని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ సెషన్ ఉద్దేశం వారికి వివరించి, అభిప్రాయాలు తెలుసుకోనుంది. అయిదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఈసారి చర్చకు పెట్టనుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రత్యేక సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ మే 28వ తేదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోకి మారాక వివిధ విభాగాల సిబ్బందికి కొత్త యూనిఫాం అందజేసేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ అంశంపైనా ప్రత్యేక సెషన్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నూతన భవనంపై నేడు పతాకావిష్కరణ పార్లమెంట్ నూతన భవనంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా జగదీప్ ధన్‌ఖడ్ గజద్వారంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
పాత భవనంలో ప్రారంభమై... కొత్త భవనంలోకి
న్యూఢిల్లీ: ఈ నెల 18న మొదలై ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. మరుసటి రోజు 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతాయని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. 19న వినాయక చవితి శుభదినం కాబట్టి ఆ రోజునుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ–20 సదస్సు తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని, అజెండా ఏమిటో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం. -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
మోదీ సర్కార్ అనూహ్య ప్రకటన.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ గురువారం అనూహ్య ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో పార్లమెంట్ అమృత్కాల్ స్పెషల్ సెషన్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వివరాల ప్రకారం.. మోదీ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో ఐదు రోజులు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అనే కోణం కూడా వినిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. "A special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings," tweets Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/7nyRfZUAHF — ANI (@ANI) August 31, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవలే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై మోదీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు. Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament. ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2 — Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023 ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్ -
‘మణిపూర్’పై పార్లమెంట్లో అలజడి
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని మణిపూర్ అంశంపై నినాదాలు ప్రారంభించారు. ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేశారు. ఇంతలో స్పీకర్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమకారులకు సభలో నివాళులరి్పంచారు. 1942 ఆగస్టు 9న జరిగిన ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ త్యాగమూర్తులను ప్రజలంతా స్మరించుకోవాలని అన్నారు. అనంతరం విపక్ష ఎంపీలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా వారు లెక్కచేయలేదు. విపక్ష ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్ 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. సభలో గందరగోళం ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. రాజ్యసభలో రెండు బిల్లులకు ఆమోదం మణిపూర్ హింసాకాండ వ్యవహారం రాజ్యసభలోనూ అలజడి సృష్టించింది. 267 నిబంధన కింద వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల కారణంగా సభను తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత 2.45 గంటల దాకా, అనంతరం 3.15 గంటల దాకా వాయిదా వేయాల్సి వచి్చంది. బుధవారం సభలో రాజ్యాంగం(òÙడ్యూల్డ్ కులాలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023పై చర్చ జరిగింది. బిల్లును సభలో ఆమోదించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల కోసం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023’ని సైతం రాజ్యసభలో ఆమోదించారు. ఈ బిల్లు వర్సిటీల్లో సానుకూల మార్పు తీసుకొస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసినవారికి రాజ్యసభలో నివాళులరి్పంచారు. వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. -
పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. -
మణిపూర్‌పై ఆరని మంటలు .. ప్రతిపక్షాలకు అమిత్ షా కీలక లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ అల్లర్ల అంశం కుదిపేస్తోంది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల కూటమి పట్టుబడుతుండటంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ ఘటనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరపున మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. విపక్షాలు శాంతించడం లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తూ.. సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డుతున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ సమస్యపై విపక్షాలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తూ.. పార్లమెంట్ ఉభయసభలకు చెందిన పత్రిపక్ష నేతలకు మంగళవారం ఆయన లేఖ రాశారు. (పార్లమెంట్లో మణిపూర్ రగడ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు) ఈ మేరకు లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి సహకరించాలనే ఆసక్తి లేదు. దళితులపైనా, మహిళల సంక్షేమంపైనా వారికి ధ్యాస లేదు. వారి చర్యలతో విపక్షాల నినాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మణిపూర్‌పై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలకు లేఖ రాశాను.ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదు. చర్చించాలనుకునే వారెవరికైనా స్వాగతం. ఇందులో దాచాల్సింది ఏది లేదు. ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై చర్చకు అనువైన వాతావరణం కల్పించండి’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు.. #WATCH | I have written to the Leaders of Opposition in both Houses that the government is ready for a discussion on Manipur and urged them to create a conducive atmosphere for a discussion on this sensitive matter: Union Home Minister Amit Shah in Lok Sabha pic.twitter.com/5HsWj6K8MU — ANI (@ANI) July 25, 2023 అదే విధంగా ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే(రాజ్యసభ ప్రతిపక్షనేత), కాంగ్రెస్‌నేత అధిర్ రంజన్ చౌదరికి(లోక్‌సభ ప్రతిపక్ష నేత) రాసిన లేఖను ట్విటర్లో షేర్ చేశారు అమిత్ షా.. ‘మణిపూర్ అల్లర్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి సహకారం కోరుతున్నాం. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను’ సదరు లేఖలో పేర్కొన్నారు. Today, I wrote to the opposition leaders of both houses, Shri @adhirrcinc Ji of Lok Sabha, and Shri @kharge Ji of Rajya Sabha, appealing to them for their invaluable cooperation in the discussion of the Manipur issue. The government is ready to discuss the issue of Manipur and… pic.twitter.com/IpGGtYSNwT — Amit Shah (@AmitShah) July 25, 2023 కాగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని వార్తలు వెలుడిన కొన్ని గంటలకే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మణిపూర్‌లో మే 3న రెండు జాతుల మధ్య చెలరేగిన హింసా నానాటికీ తీవ్రతరం అవుతూ వినాశకరమైన పరిస్థితికి దారితీసింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
రెండో విడత పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి. అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. సహకరించండి: ఉపరాష్ట్రపతి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్‌ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు. -
రక్షణ బడ్జెట్ పెంపు దిశగా చైనా
బీజింగ్: అమెరికాకు దీటుగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చైనా మరో అడుగు ముందుకేసింది. ‘దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచుతున్నాం. ఆ మొత్తం ఎంత అనేది ఆదివారం జరగబోయే చైనా పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడిస్తాం’ అని ఆ దేశ పార్లమెంట్ అధికార ప్రతినిధి వాంగ్ చావో శనివారం చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.1 శాతం అధికంగా గత ఏడాది చైనా రక్షణ బడ్జెట్ కోసం 230 బిలియన్ డాలర్లను కేటాయించింది. 777.1 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌తో ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. మరోవైపు భారత రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడు రెట్లు మించి ఉండటం గమనార్హం. ‘ చైనా అంతర్జాతీయంగా చవిచూస్తున్న సంక్షిష్ట భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బడ్జెట్ పెంచడం అనివార్యం’ అని వాంగ్ చావో వ్యాఖ్యానించారు. మరోవైపు శనివారం చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వారంపాటు జరగబోయే ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ నాయకత్వంలో కొనసాగే నూతన మంత్రివర్గాన్ని, ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ స్థానంలో నూతన ప్రధానిని ప్రకటిస్తారు. నాయకత్వ మార్పులో భాగంగా ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ ‘రబ్బర్‌స్టాంప్’ తంతులో కొలువుతీరే కొత్త వారంతా దాదాపు జిన్‌పింగ్ ఆజ్ఞలను శిరసావహించేవారే. రెండు సెషన్లుగా జరిగే పార్లమెంట్ భేటీలో దశలవారీగా మొత్తంగా 5,000 మంది పాల్గొంటారు. ప్రధానిగా లీ కెక్వియాంగ్ స్థానంలో లీ క్వియాంగ్ను ఎంపికచేసినట్లు వార్తలొచ్చాయి. -
నూతన భవనంలోనే బడ్జెట్ సమావేశాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. నూతన భవన నిర్మాణ పనులు దాదాపు ముగింపుకు వచ్చాయని, ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023–24 ఆర్ధిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భవనంలోనే ప్రవేశపెడతారని, ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు, ఆధునిక లైబ్రరీ, అత్యాధునిక రాజ్యాంగ హాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. కొత్త భవనంలోని లోక్‌సభలో 888 సీట్ల అమరిక నెమలి ఆకారాన్ని స్ఫూరించేలా, రాజ్యసభ హాలులో కమలం పువ్వును గుర్తుకు తెచ్చేలా 384 సీట్ల అమరిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ పాత భవనంలోనే రాబోయే బడ్జెట్ సెషన్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 31న ప్రసంగిస్తారని స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం వెల్లడించారు. మరోవైపు లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంటు కొత్త భవనాన్ని యాక్సెస్ చేయడానికి ఎంపీల కోసం కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనంలో వినియోగించే ఆడియో విజువల్ పరికరాలపై ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ కొత్త భవనంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే తొలి విడత సమావేశాలను పాత భవనంలో, మార్చి 13 నుంచి జరిగే రెండో విడత సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
లోక్ సభలో ‘మోదీ.. మోదీ..’
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలోకి అడుగుపెట్టగానే బీజేపీ ఎంపీలంతా పెద్దఎత్తున మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టగానే సభ్యులంతా ఒక్కసారిగా నిలబడి ‘మోదీ’ నినాదాలతో సభను మారుమోగించారు. సభ్యులకు నమస్కరించిన మోదీ తన స్థానంలో కూర్చున్నారు. సోమవారం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను వీక్షించడానికి వచ్చిన ఆస్ట్రియా పార్లమెంటరీ ప్రతినిధి బృందం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు చెబుతున్న సమయంలో ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రవేశించారు. అనంతరం ఆస్ట్రియా పార్లమెంట్ ప్రతినిధి బృందానిక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ విక్లీ సమావేశం మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉభయ సభలకు చెందిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. తిరిగి అధికారం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. Prime Minister Narendra Modi welcomed by the BJP MPs in Lok Sabha, amid chants of "Modi, Modi", following the party's victory in assembly elections in Goa, Manipur, Uttarakhand, and Uttar Pradesh. pic.twitter.com/IZuF36mDNB — ANI (@ANI) March 14, 2022 -
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫైనాన్స్ బిల్లుతో పాటు పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(సవరణ) బిల్లు, విద్యుత్(సవరణ) బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు.. తదితర కీలక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. కీలకమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇదే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు సభ్యుల హాజరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతీయ పార్టీల సీనియర్ నాయకులతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ భేటీలకు గైర్హాజరయ్యే అవకాశముంది. తొలివిడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్‌సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్‌సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్‌లాక్‌తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : జనవరి 29 నుంచి(శుక్రవారం) పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు గురువారమే ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం పార్లమెంటు సచివాలయం మూడు చోట్ల ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేసింది. చదవండి: 16 పార్టీల ప్రకటన.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ 33 పనిదినాలపాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనుండగా.. ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో యథావిధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్రం ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు రైతు ఉద్యమం, కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
ముగిసిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ఈ సమావేశాలు ముగిశాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభను బుధవారం సాయంత్రం స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. చివరిరోజైన బుధవారం కార్మిక సంస్కరణలకు సంబంధించిన మూడు బిల్లులు సహా పలు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 14న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మరోవైపు, ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో 8 రోజుల ముందే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల మౌన నిరసన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ‘సేవ్ ఫార్మర్స్’, ‘సేవ్ వర్కర్స్’, ‘సేవ్ డెమొక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో విపక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ.. తదితర పార్టీల సభ్యులు పాల్గొన్నారు. కార్మిక బిల్లుల ఆమోదంపై ప్రధాని హర్షం కార్మిక రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బుధవారం పార్లమెంటు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు కార్మికుల సంక్షేమానికి, ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాయన్నారు. కనీస వేతనాలు, సరైన సమయానికి వేతనాలు ఇవ్వడం, కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం.. తదితర అంశాలకు ఈ బిల్లులు హామీ ఇస్తున్నాయన్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనకు ఈ బిల్లులు ఉదాహరణ అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. ‘ఇవి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లులు. వీటితో అనవసర జాప్యం, అధిక ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతాయి’ అన్నారు. కంపెనీల మూసివేతలో అడ్డంకులను తొలగించడం, 300 మంది వరకు కార్మికులున్న కంపెనీలు తమ ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే తొలగించే వెసులుబాటు.. తదితర ప్రతిపాదనలు ఆ బిల్లుల్లో ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా, పార్లమెంటు ఆమోదం పొందిన 3 బిల్లులతో పాటు, 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి 4 సమగ్ర చట్టాలుగా రూపొందించారు. -
పెద్దల సభలో పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. (రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు) దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు వ్యయసాయ బిల్లులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రతి ఎంపీకి డీఆర్డీవో స్పెషల్ కిట్
సాక్షి, న్యూఢిల్లీ : గత పార్లమెంట్ సమావేశాలు గత మార్చి 23వ తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఓ పక్క విజృంభిస్తుంటే మరోపక్క దేశ ఆర్థిక పరిస్థితి మున్నెన్నడు లేని విధంగా దిగజారుతూ వచ్చింది. ఇంకో పక్క చైనా యుద్ధానికి కాలు దువ్వుతూ సరిహద్దులో అలజడి సృష్టిస్తోంది. ఈ మూడు ప్రధాన అంశాల గురించి చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల గురించి ప్రతిపక్ష పార్టీలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటి బీజేపీ పాలక పక్షం పెడ చెవిన పెడుతూ వచ్చింది. చివరకు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధంగా ఇరు పార్లమెంట్ సమావేశాల మధ్య గరిష్టంగా ఆరు నెలలకు మించి వ్యవధి ఉండరాదనే నిబంధనను కూడా పాటించినట్లయింది. ఆలస్యంగా ప్రారంభమైన ఈ వర్షాకాల సమావేశాలను అసాధారణ సమావేశాలుగానే పేర్కొనవచ్చు. లోక్‌సభ, రాజ్యసభ షిప్టుల పద్ధతిలో సమావేశమవుతాయి. ఇరు సభల గదులను, సందర్శకుల గ్యాలరీలను పార్లమెంట్ ఎంపీలు, సిబ్బంది భౌతిక దూరం పాటించేందుకు ఉపయోగిస్తున్నారు. ఎంపీలు, సిబ్బందితోపాటు జర్నలిస్టులు సుమారు నాలుగు వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపీలు, మంత్రులను మాత్రమే ప్రధాన భవనంలోకి అనుమతిస్తున్నారు. వారి సిబ్బంది ప్రత్యేకంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీలు తమతమ స్థానాల్లో కూర్చునే మాస్కులు ధరించే సభాధ్యక్షులతో మాట్లాడేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఎంపీకి డీఆర్డీవో బహుళ ప్రయోజనకర ప్రత్యేక కోవిడ్–19 కిట్స్‌ను అందజేసింది. ప్రతి కిట్‌లో 40 డిస్పోజబుల్ మాస్కులు, ఐదు ఎన్ 95 మాస్క్‌లు, బాటిల్ 50 ఎంఎల్ శానిటైజర్లు కలిగిన 20 బాటిళ్లు, 40 జతల చేతి గ్లౌజులు, కొన్ని ఫేస్ మాస్క్‌లు, ఔషధ మొక్కలతో తయారు చేసిన తుడుచుకునే పేపర్లు, శక్తిని పెంచే టీ పొట్లాలు ఉన్నాయి. కోవిడ్ నుంచి ఎంపీలకు రక్షణ కల్పించేందుకు చివరికి పార్లమంట్ సమావేశాలకు అతిముఖ్యమైన ‘ప్రశ్నోత్తరాల’ కార్యక్రమంలో మార్పులు చేశారు. (17 మంది ఎంపీలకు కరోనా) -
రావాల్సిన నిధులపై చర్చకు పట్టుపడతాం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గట్టిగా అడుగుతామని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పార్లమెంట్లో స్పీకర్ నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ లేవనెత్తదలుచుకున్న అంశాలన్నింటిపై స్పీకర్‌తో చర్చించాం. ► కరోనా నియంత్రణ, లద్దాఖ్‌లో చైనా దూకుడు, కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ, పన్నుల వాటా పంపిణీ, రాష్ట్రానికి సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. వీటన్నింటిపై స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వాలని కోరాను. ► ప్రత్యేక హోదా మా హక్కు. దీన్ని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో లేవనెత్తుతాం. ప్రతి హామీని నెరవేర్చుతున్నందునే ఏ అంశాలు లేక ప్రతిపక్షాలు మాపై నిందలు వేస్తున్నాయి. ► కరెంట్ మీటర్ల విషయంలో ఎవరూ ఆందోళనలో లేరు. ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. -
క్షేత్రస్థాయి స్థితిని బట్టి పార్లమెంట్
న్యూఢిల్లీ:తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను జూన్ 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వమించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే. -
నేడు ముగియనున్న పార్లమెంటు!
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా భయంతో చాలారాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు చాలా పార్టీలు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత సమావేశాలను ముగించే అవకాశముందన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, సోమవారమే నిరవధిక వాయిదా పడే అవకాశముంది. దీంతో 12 రోజులు ముందుగానే సమావేశాలు ముగిసినట్లవుతుంది.(కరోనాకు మరో ముగ్గురి బలి) -
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు
-
ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 3,222.75 కోట్లు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు.. సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్రం పరిశీలిస్తోందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ ఆడిట్ నిర్వహిస్తోందని మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. -
‘చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలింది’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా అమరావతి అంశంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీపై నిప్పులు చెరిగారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యమేలిందని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ‘నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్’ ప్రకటించిందని స్పష్టం చేశారు. అలాగే రాజధానిలో అనేక కుంభకోణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోదీ సైతం చెప్పారని గుర్తు చేశారు. గల్లా జయదేవ్, చంద్రబాబు సహా అనేక మంది కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. రాజధాని అమరావతి కుంభకోణం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
-
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
లోక్‌సభలో నవ్వులు పూయించిన అఠవాలే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అఠవాలే బుధవారం లోక్‌సభలో తన మాటలతో ప్రధాని మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ముఖాల్లో నవ్వులు పూయించారు. ‘రాహుల్ గారు, ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం మీకు వచ్చినందుకు అభినందనలు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు నేను మీ కూటమిలోనే ఉన్నాను. తాజా ఎన్నికలకు ముందు కూడా మళ్లీ యూపీఏలో చేరాల్సిందిగా కాంగ్రెస్ నేతలు నన్ను కోరారు. అయితే గాలి ఎటువైపు వీస్తోందో నేను గమనించి, ఎన్డీయేతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని అఠవాలే అన్నారు. ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న రాహుల్, సోనియాలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అఠవాలే మాట్లాడుతుండగా మోదీ కూడా పలుసార్లు నవ్వారు. మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండి మంచిపనులు చేస్తారన్నారు. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు
పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి. ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్‌థన్ ఖాతాలకు, బేసిక్ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు. -
పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీల గళం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో వైస్సార్ సీపీ ఎంపీలు ప్రజాసమస్యలపై గళమెత్తారు. ఏపీకి కేంద్రం తరపున నిధులు, కేటాయింపులు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఖర్చు రూ. 6,598 కోట్లు... ఇచ్చింది రూ. 4,343 కోట్లు పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2017 జూలై వరకూ రూ.6,598 కోట్లు వ్యయం చేయగా కేంద్రం రూ.4,343 కోట్లను విడుదల చేసిందని కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 మార్చి 31వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5135.87 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం వాటాగా రూ.562.47 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరగటంపై విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మేఘవాల్ సమాధానమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించిన సమాచారం మేరకు అలాంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కుటుంబాలు మైనర్ పిల్లలను మేజర్లుగా చూపి పరిహారం పొందేందుకు ప్రయత్నించాయన్నారు. ఈ కేసులను విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. విశాఖ జిల్లాలో ఉపాధి వేతనాలు ఆగలేదు విశాఖ జిల్లాలోని 13 మండలాల్లో ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన వేతనాలు 3 నెలలుగా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోవటం కేంద్రం దృష్టికి వచ్చిందా? అని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ సమాధానమిస్తూ వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారు పోస్టాఫీసుకు వచ్చిన వెంటనే బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయన సోమవారం లోక్‌సభలో నిబంధన–377 కింద ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ వంటి భారీ ప్లాంట్లను గమనిస్తే ముడి ఇనుప ఖనిజాన్ని దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. అయినప్పటికీ అవి లాభాల బాటలో నడుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాతోపాటు చుట్టుపక్కల ముడి ఇనుప ఖనిజం నిల్వలు విస్తారంగా ఉండగా, లాభదాయకతపై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?’’ అని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనగ పంటకు బీమా గడువు పొడిగించండి రబీలో సాగు చేసిన శనగ పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ అశిష్‌కుమార్ బుటానీని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన బుటానీని కలిసి కోరారు. రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు వద్దు లోక్‌సభలో ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్రం సమాధానం చిన్నారులు రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు మోయకుండా చూడాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గతేడాది సెప్టెంబరులో సర్క్యులర్ జారీ చేసినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సభలో సమాధానం ఇచ్చారు. ఒకటి, రెండు తరగతులకు కేవలం రెండు పుస్తకాలను(భాష, గణితం) మాత్రమే ఎన్సీఈఆర్టీ సిఫార్సు చేసిందని, అలాగే మూడు, నాలుగు, ఐదో తరగతులకు భాష, పర్యావరణ అధ్యయనం, గణితం వంటి మూడు పుస్తకాలనే సిఫార్సు చేసిందన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్టు రాతపూర్వకంగా తెలిపారు. సోమవారం ఆయన లోక్‌సభలో సభ్యుడు జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సమీకృత స్టీల్ ప్లాంట్‌పై అధ్యయనం చేస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఎం.మురళీమోహన్ సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే జాతీయ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఏపీలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థలన్నీ ప్రారంభమయ్యాయని, అయితే ఇవన్నీ ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా జాతీయ సంస్థల ఏర్పాటులో పురోగతి, ఇంకా శాశ్వత ప్రాంగణాల్లోకి రాకపోవడానికి గల కారణాలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. సెంట్రల్ వర్సిటీ, ట్రైబల్ వర్సిటీలు ఇంకా ప్రారంభం కాలేదని, పార్లమెంటులో సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన మీదట ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రెండు వర్సిటీలకు 2017–18 బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ‘పోలవరం’ అంచనాలపై సీడబ్ల్యూసీ స్పష్టత కోరింది పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013–14 ధరల సూచీ ప్రకారం రూ.58,319.06 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించి స్పష్టత కోరిందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీడబ్ల్యూసీ చేసిన పరిశీలన మేరకు తగిన మార్పులు చేసిన పక్షంలో ఆమోదం లభిస్తుందని తెలిపారు. భూములు ఇస్తే సీబీ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టును కేంద్రం 2016 డిసెంబర్లో ఆమోదించిందని, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధి పనులు రాష్ట్రప్రభుత్వం భూములు అప్పగిస్తే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. -
పార్లమెంట్లో ముఖ్యమంత్రిపై తీవ్రవ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సభలో లేనివారి గురించి మాట్లాడటం సభ్యత కాదని తెలిసినా, స్పీకర్ స్థానం వారిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి. 'ఆ ముఖ్యమంత్రి అరచకవాది.. నాటకాలాడుతున్నారు.. ఈ సీఎంను ఏదోఒకటి చెయ్యాలి..' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం లోక్ సభలో జీరోఅవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో అమలవుతున్న 'సరి-బేసి' విధానంపై జీరో అవర్ లో చర్చను లేవనెత్తిన ఎంపీ రమేశ్.. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలను దాటవేస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డారు. 'కేజ్రీవాల్ ఒక అచారకవాది. ముఖ్యమైన సమస్యలేవీ ఆయనకు పట్టవు. అన్నీ వదిలేసి 'సరి బేసి' విధానమంటూ నాటకాలాడుతున్నారు. ఢిల్లీలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దానిపై సీఎం మాట్లాడరు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకోసం మెట్రోరైల్ పొడగించాలంటే ఆయన ముందుకు కదలరు' అని ఎంపీ రమేశ్ సభలో ఆవేశపూరితంగా మాట్లాడారు. జనవరి నాటికి ఢిల్లీ మెట్రో నాలుగో ఫేస్ పనులు మొదలుకావాల్సి ఉండగా, సీఎం నిర్లక్ష్యం వల్లే నేటికి పనులు ప్రారంభంకాలేదని, ఆ పనిని త్వరగా పూర్తిచేయగలిగితే దక్షిణ ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కీలక ఫైళ్లు సీఎం కార్యాలయంలో మగ్గుతున్నాయన్నారు. కేజ్రీవాల్ తీరు చూస్తే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నట్లుందని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రిని ఏదో ఒకటి చెయ్యాలని సభద్వారా కోరుకుంటున్నట్లు రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు సహచర బీజేపీలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.