మోదీ సర్కార్‌ అనూహ్య ప్రకటన.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు | Parliament Special Session 18th To 22nd September - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మోదీ కీలక ప్రకటన!.. ముందస్తు ఎన్నికలు!

Published Thu, Aug 31 2023 3:24 PM | Last Updated on Thu, Aug 31 2023 6:32 PM

Parliament Special Session 18th To 22nd September - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మరో​ కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్‌ గురువారం అనూహ్య ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ అమృత్‌కాల్‌ స్పెషల్‌ సెషన్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 

వివరాల ప్రకారం.. మోదీ సర్కార్‌ మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో ఐదు రోజులు పాటు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం తెలిపారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అనే కోణం కూడా వినిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవైపు.. పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీ​ర్మానం వీగిపో​యింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై మోదీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement