నేడు, రేపు లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం
బుధవారం స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గురువారం రాష్ట్రపతి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి వారితో మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు.
ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లా!
ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్‌కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్‌సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్‌సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment