లోక్‌సభ సమావేశం ప్రారంభం | Parliament Session 2024: Lok Sabha First Meeting For MPs To Take Oath Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు: 18వ లోక్‌సభ తొలి సమావేశం.. అప్‌డేట్స్‌

Published Mon, Jun 24 2024 10:30 AM | Last Updated on Mon, Jun 24 2024 2:31 PM

Parliament Session 2024: Lok Sabha First Meeting For MPs Oath Ceremony Updates

పార్లమెంట్‌ సమావేశాలు.. అప్‌డేట్స్‌

 

  • ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

      

 

  • పార్లమెంట్‌ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌.. అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, కె.సురేష్‌ను  ఆప్యాయంగా పలికరించారు.

     

 

తెలుగులో బండి సంజయ్‌ ప్రమాణం

  • తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

  • కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్‌ పాశ్వాన్‌ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

     

  • కేంద్ర మంత్రులు భూపేందర్‌ యాదవ్‌, గజేంద్ర షెకావత్‌ ఎంపీలుగా ప్రమాణ  స్వీకారం చేశారు.

     

  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

      

  • ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

      

  • లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

      

     

 

  • కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

     

  • కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

      

అమిత్‌ షా ఎంపీగా ప్రమాణం

  • హోంమంత్రి అమిత్‌ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.

      

     

 

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

     

ఎంపీగా మోదీ ప్రమాణం

  • మొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత  లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ ఎంపీ  ప్రమాణం చేయించారు.

     

  • రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ఆమోదించారు.

     

 

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్‌సభ

  • ప్రమాణం చేయనున్న ఎంపీలు

  • లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

  • మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీ

  • ఇది చాలా పవిత్రమైన రోజు

  • ఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నా

  • ఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలి

  • మాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు

  • 10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశా

  • మూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కింది

  • కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి

  • వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి


 

ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

  • వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యా
  • హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉంది
  • మా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలు
  • రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తా
  • జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాం
  • రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం  
  • బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదు
  • కూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు
  • గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారు
  • వైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతా
  • రాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదే

సాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి

 

మరికాసేపట్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

  • ఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులు

  • ప్రధాని  మోదీ సహా 280 మంది ప్రమాణం

  • మోదీ తర్వాత కేంద్ర మంత్రులు

  • ఆ తర్వాత ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణం

  • నేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణం


ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణం

  • లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్‌

  • భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


ఎన్డీయే అలా ముందుకు..

  • పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయే

  • సభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశం

  • స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేత

  • అమిత్‌ షా లేదంటే రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్‌ 

ఐక్యంగా ఇండియా కూటమి

  • పార్లమెంట్‌ సమావేశాల  తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయం

  • గతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్‌-2 వద్ద భేటీ

  • ఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీ

  • ప్రొటెం స్పీకర్‌ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశం

  • నీట్‌పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్‌


సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!

 

కాసేపట్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం
 

  • ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణం

  • 18వ లోక్‌సభ తొలి సమావేశం

  • నేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారం

  • సభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్‌

  • ఎల్లుండి స్పీకర్‌ ఎన్నిక

  • డిప్యూటీ స్పీకర్‌ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ

  • 27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement