న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.
విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు.
ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్‌లో కూర్చోబెట్టారు.
#WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.
Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024
ప్రధాని మోదీ మాట్లాడుతూ..
సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..
సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం.
ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ అభినందనలు
లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన.
స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు..
లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు.
లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment