k suresh
-
Parliament Special Session: స్పీకర్‌గా బిర్లా.. మోదీ, రాహుల్ అభినందన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. మోదీ తొలి ప్రసంగం బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విపక్షాల అభినందనలురాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు. నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు. మోదీ రాహుల్ కరచాలనంస్పీకర్గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది. రాహుల్ నయా లుక్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు. ‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’ ‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’ – రాహుల్ గాంధీ‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’ – అఖిలేశ్ యాదవ్ ‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’ – అసదుద్దీన్ అడ్డంకులు లేకుండా సాగాలి... ‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’ – స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
తొలిసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. అభ్యర్థుల నేపథ్యం ఇదే..
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఎన్డీయే తరఫున గతంలో స్పీకర్‌గా సేవలు అందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కే. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ బరిలో ఉన్న అభ్యర్థులు రాజకీయ నేపథ్యాలు ఇవే..ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్‌లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేష్ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి కేరళలోని అదూర్ లోక్‌సభ స్థానంలో ఎంపీ గెలిచారు. 1991, 1996, 1999 వరుస సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో విజయం సాధించారు. అనంతరం మావేలికర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో సైతం మావేలికర నుంచి ఆయన విజయం సాధించారు. ఎంపీ సురేష్.. కేరళ పీసీసీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనేక పదవులు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. ఇ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కేరళ పీసీసీ చీఫ్ ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి తరఫున స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేశారు.ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆజ్మీర్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొని ఆయన యూపీలో జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి మొదటిసారి 2003లో కోటా దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఎన్నిక కాకముందు 2013లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014, 2019లో కోటా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొదారు. 16 లోక్‌భలో ఓం బిర్లా సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీలో సభ్యుని పనిచేశారు.2019లో ఎంపీగా గెలిచిన ఆయన 17 లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. 2014లో కోటా నుంచి ఎంపీగా గెలుపొందిన ఓం బిర్లా.. లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రొటెం స్పీకర్‌పై రగడ
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక తాజా వివాదానికి కారణమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఆరోపించింది. తమ పార్టీ ఎంపీ కె.సురేశ్ అందరికంటే సీనియర్ అని, ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని.. సంప్రదాయం ప్రకారం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్‌గా సురేశ్ ను నియమించాల్సిందని వాదిస్తోంది. దళితుడు కాబట్టే సురేశ్ ను బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది. వాస్తవానికి 18వ లోక్‌సభలో కె.సురేశ్. వీరేంద్ర కుమార్‌లు ఇద్దరు ఎనిమిదేసి సార్లు ఎంపికైన, అందరికంటే సీనియర్ సభ్యులు. అయితే వీరేంద్ర కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో.. సురేశ్ ప్రొటెం స్పీకర్ కావాలి. కానీ బీజేపీ ఏడుసార్లు ఎంపీ అయిన మహతాబ్‌ను ఎంచుకుంది. ఆయనకు సహాయకారిగా ఉండేందుకు కె.సురేశ్, టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), రాధామోహన్ సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే (బీజేపీ)లతో ఛైర్ పర్సన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీ వైఖరికి నిరసనగా ఛైర్ పర్సన్ ప్యానెల్‌కు దూరంగా ఉండే అంశాన్ని విపక్షాలకు చెందిన కె.సురేశ్, టి.ఆర్.బాలు, సుదీప్ బందోపాధ్యాయ్‌లు పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దళితుడు కాబట్టే సురేశ్ ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయలేదనే వాదనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. సురేష్ ఎనిమిదిసార్లు ఎంపిక అయినప్పటికీ.. ఆయన వరుసగా ఎన్నికైన ఎంపీ కాదని, 1998, 2004 లోక్‌సభల్లో ఆయన సభ్యుడు కాదని పేర్కొన్నారు. మరోవైపు మహతాబ్ ఏడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారని, అందుకే ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా ఎంచుకున్నామని వాదించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే గిరిజన మంత్రి కిరణ్ రిజిజును అవమానిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎదురుదాడికి దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూస్తున్న తొలి గిరిజన మంత్రిని అయినప్పటికీ కాంగ్రెస్ అబద్ధాలు, బెదిరింపులకు లొంగబోనని రిజిజు అన్నారు. ‘నిబంధనలను పాటిస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదాన్ని అనుసరిస్తారని రిజిజు పేర్కొన్నారు. సురేష్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీని 240 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కాషాయపార్టీ ప్రజాస్వామ్యం, సంప్రదింపులు, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రతిపక్షాలు అంటే ఏమిటనే దానిని అర్ధం చేసుకోవడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. నిరంకుశ బీజేపీ విపక్ష అభ్యరి్థని ప్రొటెం స్పీకర్‌గా కూడా చూడాలనుకోవడం లేదన్నారు. అందుకే ఫిరాయింపుదారు భర్తృహరి మహతాబ్‌ను ఎంచుకుందన్నారు. మహతాబ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేడీ నుంచి బీజేపీలోకి మారి.. ఆ పార్టీ టికెట్‌పై కటక్ నుంచి గెలుపొందారు.అందరి దృష్టీ స్పీకర్ ఎన్నికపైనే...18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలసిందే. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం 26న జరిగే స్పీకర్ ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది. -
అన్ని కమిషన్లలో ఖాళీలు త్వరలో భర్తీ: కేంద్రం
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. కమిషన్లలోని ఖాళీల భర్తీ ఆలస్యమవడంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులందరూ మద్దతునిచ్చారు. నియామకాలు ఆలస్యమవడాన్ని విమర్శిస్తూ వారందరూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీనికి లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తేవర్‌చంద్ గెహ్లాట్ సమాధానమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కమిషన్లలో కొత్త సభ్యుల నియామకం చేపట్టలేకపోయామని, ప్రస్తుతం వాటిని వీలైనంత త్వరగా చేపడుతామని హామీనిచ్చారు. అంతేకాకుండా ఓబీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పించేందుకు త్వరలో బిల్ కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ అంశం గురువారం రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.