ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఎన్డీయే తరఫున గతంలో స్పీకర్‌గా సేవలు అందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కే. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ బరిలో ఉన్న అభ్యర్థులు రాజకీయ నేపథ్యాలు ఇవే..
ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్
తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్‌లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేష్ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి కేరళలోని అదూర్ లోక్‌సభ స్థానంలో ఎంపీ గెలిచారు. 1991, 1996, 1999 వరుస సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో విజయం సాధించారు. అనంతరం మావేలికర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో సైతం మావేలికర నుంచి ఆయన విజయం సాధించారు.
ఎంపీ సురేష్.. కేరళ పీసీసీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనేక పదవులు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. ఇ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కేరళ పీసీసీ చీఫ్ ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి తరఫున స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేశారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా
ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆజ్మీర్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొని ఆయన యూపీలో జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి మొదటిసారి 2003లో కోటా దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఎన్నిక కాకముందు 2013లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం 2014, 2019లో కోటా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొదారు. 16 లోక్‌భలో ఓం బిర్లా సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీలో సభ్యుని పనిచేశారు.2019లో ఎంపీగా గెలిచిన ఆయన 17 లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. 2014లో కోటా నుంచి ఎంపీగా గెలుపొందిన ఓం బిర్లా.. లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment