Om Birla
-
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
ప్రతిష్టంభనకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్ హింస, మణిపూర్ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ పేర్కొంది.అదానీ, సంభాల్ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్‌కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియాన్ దుయ్యబట్టారు.అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదాఅదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈనెల 12న జరగ్గా సోమవారం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
అమిత్ షా Vs అఖిలేష్.. స్పీకర్ చైర్‌పై కామెంట్స్
ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024 "Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్‌సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్‌గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
స్పీకర్‌కు లేఖ.. ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపు వ్యాఖ్యలు: గౌరవ్ గోగొయ్
ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్‌సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్‌పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు. -
ఢిల్లీ హైకోర్టుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. అంజలి బిర్లా
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ అంశంపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అంజలి బిర్లా తన తండ్రి ఓం బిర్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యూపీఎస్సీ పరీక్షల్ని తొలి ప్రయత్నంలో పాసయ్యారంటూ పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజలి బిర్లా.. తన పరువు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. Anjali Birla, who is an IRPS officer and the daughter of Lok Sabha Speaker Om Birla, has filed a defamation suit in the Delhi High Court. She seeks the removal of social media posts that falsely allege she passed UPSC exams on her first attempt due to her father's influence.…— ANI (@ANI) July 23, 2024అయితే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల్ని అంజలి బిర్లా ఖండించారు. సోషల్ మీడియాలో తమపై ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. తనపై, తండ్రి ఓం బిర్లా పరువుకు భంగం కలిగించేలా పలువురు సోషల్ మీడియా పోస్టులు షేర్లు చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించే రీతిలో తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడం తమకు హాని కలిగించే స్పష్టమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు.సోషల్ మీడియాలో పోస్టుల్లో అంజలి బిర్లా తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. ఆమె తండ్రి ఓం బిర్లా ద్వారా అంజలి బిర్లా ప్రయోజనం పొందారు అని అర్ధం వచ్చేలా పలు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంజలి బిర్లా ఆధారాల్ని జత చేశారు.యూపీఎస్సీ 2019 మెరిట్‌లిస్ట్‌లో అంజలి బిర్లాఆరోపణల నేపథ్యంలో పలు జాతీయ మీడియా సంస్థలకు అంజలి బిర్లా తన అడ్మిట్ కార్డ్ కాపీని ఇచ్చారు. సదరు మీడియా సంస్థలు సైతం యూపీఎస్సీ 2019 ఫలితాల మెరిట్ లిస్ట్‌లలో ఆమె రోల్ నంబర్ కూడా ఉంది. ఆమె నిజంగానే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు హాజరైనట్లు తేలింది. -
7 రోజులు 34 గంటలు.. ముందుగానే వాయిదా!
ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నిరవధిక వాయిదాతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన రెండు రోజుల చర్చకు మంగళవారం ప్రధాని మోదీ బదులిచ్చాక సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.The First Session of the 18th Lok Sabha, which commenced on 24 June, 2024, concluded on July 2. Speaker Om Birla informed that the First Session comprised 7 sittings and lasted for about 34 hours. He informed that Lok Sabha recorded 103% productivity during the Session: Lok Sabha…— ANI (@ANI) July 3, 2024 ఈ సమావేశాలు మొత్తం 7 రోజుల్లో 34 గంటల పాటు చర్చలు జరిగాయి. 103 శాతం ఉత్పాదకత(productivity) నమోదైనట్లు స్పీకర్ ఓ బిర్లా తెలిపారు. జూన్ 24న మొదలైన పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం బుధవారం దాకా జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.Speaker Om Birla informed the House that the discussion on the Motion of Thanks to the President's Address on 27 June lasted for more than 18 hours and 68 Members participated in the discussion. In addition, 50 Members laid their speeches. The discussion concluded with the reply…— ANI (@ANI) July 3, 2024‘రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జూన్ 27న 18 గంటలపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో 68 మంది పాల్గొన్నారు. 50 మంది సభ్యులు మాట్లాడారు. మంగళవారం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పటంతో చర్చ ముగిసింది’ అని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. -
స్పీకర్‌కు రాహుల్ లేఖ.. ‘వ్యాఖ్యలు తొలగించటంపై షాక్‌కు గురయ్యా’
ఢిల్లీ: లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించటంలో తనను షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో నీట్, హిందుత్వ, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాహుల్ స్పీచ్‌లో మాటలను రికార్డుల నుంచి తొలగించినట్ల స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తాను మాట్లాడిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్‌కు లేఖ రాశారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 ‘నేను నిన్న లోక్‌సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్‌ను తొలగించటంపై షాక్‌కు గురయ్యా. నా మాటాలను పునురుద్ధరించండి. నా ప్రసంగంలోని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం’అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సవాల్లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. గత ఎన్డీయే పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కట్టిన నిర్మాణాలన్నీ కూలిపోతున్నాయన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. బీజేపీ పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్‌పోర్టుల రూఫ్‌లు కూలిపోయాయని అన్నారు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 .. రామ మందిరంలో నీరు లీక్ అయింది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్‌లో మూడు బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
స్పీకర్ అలా మాట్లాడాల్సింది కాదు: శరద్‌పవార్
ముంబై: ఎమర్జెన్సీ అంశానికి సంబంధించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. స్పీకర్ స్థాయికి తగినట్లు సభలో మాట్లాడలేదని విమర్శించారు. శనివారం(జూన్29) మీడియా సమావేశంలో పవార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. లోక్‌సభ స్పీకర్ పదవిలో ఉన్న ఓం బిర్లా సందర్భం లేకుండా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారన్నారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదని విమర్శించారు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోందని, ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారని పవార్ ప్రశ్నించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికను పవార్ స్వాగతించారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. -
ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి సెషన్ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.రాహుల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ విడిగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్‌గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి.నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. -
ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్‌లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్‌సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.పరీక్షల విధానంలో సంస్కరణలున్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.‘‘లోక్‌సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి. ⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్‌గా మారనుంది. ⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి. ⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి. ⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది. ⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది. ⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి. ⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు. ⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది. ⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు. ⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక చర్యలుంటాయి. -
ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు.. స్పీకర్‌ను కలిసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ోక్సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తాజాగా పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ సమా బీజేపీ నేతలంతా ఆ కాలం ప్రజలకు చీకటి రోజులుగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,, లోక్‌సభ స్పీకర్ సైతం ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు.అయితే దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ సభ్యులు గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎమర్జెన్సీని చీకటి రోజులుగా స్పీకర్ పార్లమెంటులో ప్రస్తావించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓం బిర్లా చర్యలు పార్లమెంట్ విశ్వసనీయతను ప్రభావితం చేసే తీవ్రమైన విషయంగా కాంగ్రెస్పేర్కొంది పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఓ ప్రటకటన విడుదల చేసింది కాంగ్రెస్. "26 జూన్ 2024న మీరు లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సమయంలో సభలో సాధారణ స్నేహభావం ఏర్పడింది. అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. కానీ తీరువాత సభా వతి నుంచి ఎమర్జెన్సీ ప్రకటన రావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో అసహజమైనది. కొత్తగా ఎన్నుకైన స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. పార్లమెంట్ పనితీరు గురించి చాలా విషయాలు చర్చించారు. దీనిని స్పీకర్ మమాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఓం బిర్లాను సూచించారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రస్తావన అని, తప్పకుండా ఖండిచాల్సిందని కేసీ వేణుగోపాల్ పేరుతో ప్రకటన విడుదలైంది.ఇందిరా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని దూషిస్తూ తీర్మానాన్ని చదివిన ఓం బిర్లా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. -
Parliament Special Session: స్పీకర్‌గా బిర్లా.. మోదీ, రాహుల్ అభినందన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. మోదీ తొలి ప్రసంగం బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విపక్షాల అభినందనలురాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు. నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు. మోదీ రాహుల్ కరచాలనంస్పీకర్గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది. రాహుల్ నయా లుక్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు. ‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’ ‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’ – రాహుల్ గాంధీ‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’ – అఖిలేశ్ యాదవ్ ‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’ – అసదుద్దీన్ అడ్డంకులు లేకుండా సాగాలి... ‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’ – స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా -
లోక్‌సభలో రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సన్నివేశం..
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే.కాగా ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.కొత్త స్పీకర్ ఓం బిర్లాకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు.రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. బిర్లా స్నేహపూర్వక ప్రవర్తనను మెచ్చుకున్నారు. ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.మరోవైపు మొత్తం ప్రతిపక్షం, భారత కూటమి తరపున అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రజల అంతిమ గొంతుకగా బిర్లా పాత్రను అభివర్ణించారు. -
స్పీకర్ కు అభినందనలు తెలిపిన మోడీ, రాహుల్ గాంధీ
-
ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: స్పీకర్‌తో అఖిలేష్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌కు చురకలంటించారు.గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్‌సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్‌సభలో దుమారం
ఢిల్లీ: స్పీకర్ ఎన్నిక జరిగిన కాసేపటికే లోక్‌సభలో ఇవాళ గందరగోళం నెలకొంది. స్పీకర్‌గా తిరిగి ఎన్నికైన ఓం బిర్లా సభలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో దుమారం రేగింది.బుధవారం ఉదయం మూజువాణీ ఓటింగ్ ద్వారా ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గెలిచి.. స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు అధికార, విపక్ష కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా తొలి ప్రసంగం చేస్తూ.. ఎమర్జెన్సీ పాలనను ప్రస్తావించారు. ఎమర్జెన్సీ పాలన చీకటీ రోజలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికార పక్ష సభ్యులు సైతం పోటీగా నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. తిరిగి రేపు( జూన్ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రేపు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. -
అఖిలేష్‌పై డింపుల్ కళ్లు.. ‘సభ’లో సూపర్ సీన్
18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది. అఖిలేష్ నూతన స్పీకర్ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి, ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్‌సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్ అన్నారు. అఖిలేష్ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు.