పార్లమెంట్‌ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన | Parliament Session On Feb 3rd Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన

Published Mon, Feb 3 2025 12:09 PM | Last Updated on Mon, Feb 3 2025 1:05 PM

Parliament Session On Feb 3rd Live Updates

ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్‌ చేశారు. 

మరోవైపు.. లోక్‌సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్‌ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement