ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.
కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024
"Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024
ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment