Parliament session
-
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. నవంబర్ 26(రాజ్యంగా దినోత్సవం)న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగం ఆమోదంపొంది 75 ఏళ్ల సందర్భంగా వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగనున్న మొదటి పార్లమెంటు సమావేశాలు కావటం గమనార్హం. వక్ఫ్ బిల్లుకు వివాదాస్పద సవరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు సంబంధించిన నిబంధనల బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లు సవరణలను ప్రస్తుతం అధికార బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోంది. నవంబర్ 29లోగా కమిటీ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే.. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో జేపీసీ పనితీరు వివాదాస్పదమైంది.Hon’ble President, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Winter Session, 2024 from 25th November to 20th December, 2024 (subject to exigencies of parliamentary business). On 26th November,… pic.twitter.com/dV69uyvle6— Kiren Rijiju (@KirenRijiju) November 5, 2024 -
అమిత్ షా Vs అఖిలేష్.. స్పీకర్ చైర్‌పై కామెంట్స్
ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.కాగా, పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.#WATCH | Samajwadi Party MP Akhilesh Yadav speaks in Lok Sabha on Waqf (Amendment) Bill, 2024 "Yeh bill jo introduce ho raha hai woh bahut sochi samjhi rajneeti ke tehat ho raha hai...Speaker sir, I heard in the lobby that some of your rights are also going to be taken away and… pic.twitter.com/sy7PRW6I04— ANI (@ANI) August 8, 2024ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాపై కూడా అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. ఇక, అఖిలేష్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. -
Vinesh Phogat Row: రాజకీయ రగడ
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.వినేశ్ ఫోగట్ అనర్హతపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM— ANI (@ANI) August 7, 2024మరోవైపు.. రాజ్యసభలో కూడా వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు. ఇదీ చదవండి: వినేష్ ఫోగట్ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?ఫోగట్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT— ANI (@ANI) August 7, 2024కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్ సీఎంవినేశ్ ఫోగట్ అనర్హతపై పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 వినేశ్‌పై అనర్హత విచారకరం: రాహుల్ గాంధీ ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హావినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, TMC MP Shatrughan Sinha says, "She is a very deserving and committed athlete. She became the first Indian woman to reach the wrestling finals in the Olympics. She defeated a world champion and… pic.twitter.com/3dFMnLKOAT— ANI (@ANI) August 7, 2024అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ ఫోగట్ అనర్హత విషయంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత వార్త: వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
లోక్‌సభలో గందరగోళం
updatesవయనాడ్ జల విలయంపై లోక్ సభలో కాంగ్రెస్ సావధాన తీర్మానంమధ్యాహ్నం లోక్ సభలో చర్చ లోక్‌సభలో గందరగోళంఅనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం.కులగణనపై వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్అనురాగ్కు వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం అధికార భాషా కమిటీకి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి అమిత్ షా తీర్మానం చేయనున్నారు.Parliament Session Live: Amit Shah to move motion for election to Committee on Official LanguageRead @ANI Story | https://t.co/7FRazcYhbP#ParliamentSession #AmitShah pic.twitter.com/FLKeCljX2S— ANI Digital (@ani_digital) July 31, 2024 మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్వయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తువయనాడ్లో పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పర్యటిస్తారు.పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్‌లోని సంవిధావ్ సధన్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంపార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం ప్రారంభంసమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలువాయనాడ్ మృతులకు, రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీMoment of silence for the lives lost in the Wayanad landslide and the three UPSC aspirants in Delhi who lost their lives due to flooding, held at the Central Hall, Parliament House, New Delhi.(General Body meeting of CPP in Central Hall, Samvidhan Sadan, Parliament House, New… https://t.co/4c3XFlvFXv— ANI (@ANI) July 31, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారుసరిహద్దు పరిస్థితులు, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అస్సాం వరదలపై కాంగ్రెస్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిందిలోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అసోంలో వరద నిర్వహణ సమస్యను లేవనెత్తుతూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు Congress Deputy Leader in Lok Sabha Gaurav Gogoi moved an Adjournment Motion notice to raise ‘flood management issue in Assam’ pic.twitter.com/MosFDood6m— ANI (@ANI) July 31, 2024 -
భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్ అసహనం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ, ప్లీజ్’ అని కోరుతారు. అయితే స్పీకర్ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్‌కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. మీపేరు పార్లమెంట్ రికార్డుల్లో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు. పార్లమెంట్ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది. మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి, సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.Watch: "It's a very painful incident and we should not bring politics into the matter," says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS— IANS (@ians_india) July 29, 2024అనంతరం ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్ అన్నారు. -
పార్లమెంట్లో వయనాడ్ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
updates:ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.వయనాడ్ విలయంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటనప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్ మాట్లాడారు. కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయిఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.#WATCH | Wayanad landslide: In Rajya Sabha, Union Minister JP Nadda says, "Discussions began here and all the Members expressed their concern over the massive tragedy that has occurred there. I would like to say this is a tragedy of not just Kerala alone, but the entire nation is… pic.twitter.com/xgDNA73S9R— ANI (@ANI) July 30, 2024 Live: Parliament Session: Congress gives Adjournment Motion notice in Lok Sabha on Wayanad landslidesLIVE @ANI | https://t.co/n7jkluCMdz#ParliamentSession #WayanadLandslide #Congress pic.twitter.com/H5m6K2ly28— ANI Digital (@ani_digital) July 30, 2024 వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్‌భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Hh08uiwp8Y— ANI (@ANI) July 30, 2024 ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. -
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంపు... కొత్త పన్నుల విధానం శ్లాబుల్లో స్వల్ప మార్పులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
PM Narendra Modi: ప్రధాని గొంతే నొక్కజూస్తారా!
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అందుకు పార్లమెంటును కూడా దురి్వనియోగం చేసే ప్రయత్నంలో పడ్డాయని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రధానమంత్రి గొంతునే నొక్కే పోకడలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలను పక్కన పెట్టి వచ్చే ఐదేళ్లలో దేశాభివృద్ధి కోసం పారీ్టలన్నీ ఒక్కతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటు ఉన్నది ఏదో ఒక్క పార్టీ కోసం కాదు. మొత్తం దేశం కోసం’’ అంటూ విపక్షాలను ఉద్దేశించి హితవు పలికారు. ‘‘మళ్లీ 2029 జనవరిలో మరోసారి లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలోకి దిగండి. కావలిస్తే అందుకు పార్లమెంటును కూడా వాడుకోండి. అప్పటిదాకా ప్రజా సంక్షేమం కోసం పాటుపడదాం’’ అని పిలుపునిచ్చారు. విపక్షాల తీరు మారాలి సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని విపక్షాల తీరుతో ఆయా పార్టీల ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశమే రాలేదని మోదీ అన్నారు. ‘‘ఇది విచారకరం. అన్ని పారీ్టలు సభ్యులందరికీ, ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశమివ్వాలి. తొలి సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయి. దాంతో 140 కోట్ల భారతీయుల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వ స్వరం పదేపదే మూగబోయింది. ఇవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. నిజానికి ప్రతికూల రాజకీయాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడూ స్థానం లేదు’’ అన్నారు.ఇది అమృతకాల బడ్జెట్ మేం ప్రవేశపెట్టబోతోంది అమృతకాల బడ్జెట్. వచ్చే ఐదేళ్లకే గాక 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాకారం చేసుకునే కలకు పునాది. -
Big Question: పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు కేసులపై మోదీకి ప్రశ్న
-
లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మంగళవారం లోక్‌సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్.. యూపీ ఫలితాలతో పాటు పేపర్ లీక్, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు.‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. -
ఇది డిమాండ్ కాదు ఏపీ ప్రజల హక్కు
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలి👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలిఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ -
నీట్ అంశంపై దద్దరిల్లిన లోక్‌సభ.. సోమవారానికి వాయిదా
Live Updates..👉లోక్‌సభలో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. 👉నీట్‌పై చర్చకు విపక్ష నేతలు పట్టు. నీట్‌పై చర్చకు ప్రధాని మోదీ రావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. .👉సభలో నినాదాలు దద్దరిల్లడంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా👉రాజ్యసభలో నీట్‌పై గందరగోళం నెలకొంది. 👉సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభం.👉నీట్‌పై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు.. లోక్‌సభలో గందరగోళం👉 ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా #WATCH | Lok Sabha adjourned til 12 noon. LoP Rahul Gandhi raised NEET issue and demanded, along wth Opposition MPs, that the matter be discussed. Speaker Om Birla insisted that discussion on Motion of Thanks to President's Address be taken up first.LoP says, "...We wanted to… pic.twitter.com/p63AOqGOuN— ANI (@ANI) June 28, 2024 Rajya Sabha adjourned till 12 noon. Rajya Sabha LoP Mallikarjun Kharge raised the NEET issue along with Opposition MPs, that the matter be discussed. pic.twitter.com/6qyxbR4SJY— ANI (@ANI) June 28, 2024 👉పార్లమెంట్ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. 👉రెండు సభల్లో నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో, గందరగోళం నెలకొంది. 👉అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 👉నీట్‌పై రాజకీయాలొద్దు..👉నీట్పేపర్పై సమగ్ర చర్చ జరగాలి👉ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలి.👉నీట్ పేపర్ లీకులపై లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్👉పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విఫలంపై చర్చకు డిమాండ్ చేసింది👉పార్లమెంట్ సమావేశాలు నేడు(ఐదో రోజు) కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు సభలో ప్రతిపక్షాలు ‘నీట్’ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడే ఛాన్స్ ఉంది.👉సమాచారం మేరకు.. ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని ప్రస్తావిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇవ్వనున్నారు. 👉ఇక, నిన్న ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం స్పందించాల్సిన సమయం. మేము నీట్ అంశంపై చర్చ కోసం కట్టుబడి ఉన్నాము అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా లోక్‌సభ సభ్యులు ప్రమాణం సందర్భంగా సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఎన్డీయే కూటమి సభ్యులు ప్రమాణానికి వెళ్తున్న సమయంలో నీట్.. నీట్.. అంటూ నినాదాలు చేశారు. ఇదిలాఉండగా.. నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. -
నీట్ పేపర్ లీక్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 18వ లోక్‌సభ కొలువుదీరడంతో.. ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం ఆమె పార్లమెంట్‌కు విచ్చేసి ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి తన ప్రసంగం వినిపించారు. అదే సమయంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలపు లక్ష్యాలను.. పలు కీలకాంశాలను ఆమె తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్‌సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించింది. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది. ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద సేవలు కల్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోంది. పౌర విమానయాన రంగంలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలి. పేపర్ లీకేజీ అంశంపైనా.. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.అంతకు ముందు.. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. ప్రధాని మోదీ ఎంపీలను రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. -
ఇది చాలా పవిత్రమైన రోజు: మోదీ
-
Parliament Session: లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్‌ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్‌సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్‌సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్‌సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్‌తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్‌సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్‌సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఆయనేనా?
సాక్షి, ఢిల్లీ: రేపు(సోమవారం) నుంచి 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్తృహరి మెహతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఇక, జూన్ 26వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నికల జరుగనుంది.కాగా, ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన మెహతాజ్.. రేపు, ఎల్లుండి కొత్త ఎన్నికైన లోక్‌సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించనున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు సహా 280 మంది ఎంపీలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.ఇక, జూన్ 26న లోకసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరోవైపు.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్టు తెలుస్తోంది.సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి ఇస్తారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్‌సభలో తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక, 17వ లోక్‌సభ(2019)లో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. -
పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. అదే విధంగా రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి జూలై 3 వరకు జరుగుతాయి.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి జూన్ 27న ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో చేసే పాలన గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎన్నికైన కేంద్ర మంత్రులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు. -
24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకూ జరుగనున్నాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్‌ను ఎంపిక చేయడంతోపాటు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో తొలి రెండు రోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సభ్యుడు కొడికొన్నిల్ సురేశ్ వ్యవహరించనున్నట్లు సమాచారం.లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో కొడికున్నిల్ సురేశ్, గత సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన వీరేంద్రకుమార్ ఖతిక్(బీజేపీ) ఎనిమిదేసి పర్యాయాలు ఎంపీలుగా నెగ్గారు. వీరేంద్రకుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా కొడికున్నిల్ సురేశ్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎంపిక జరుగనుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీ(యూల) లోక్‌సభ సభాపతి పదవి కోసం పట్టుపడుతున్నప్పటికీ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. స్పీకర్ పోస్టును వదులుకోబోమని చెబుతోంది. గత సమావేశాలకు సభాపతిగా పనిచేసిన ఓం బిర్లాతోపాటు పలువురి పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి
సాక్షి,ఢిల్లీ : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, కేబినెట్ సభ్యులు, సహాయ మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. వారికి శాఖల కేటాయింపు సైతం పూర్తయింది. ఇక, లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఎనిమిది రోజులపాటు కొనసాగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జూన్ 24 నుంచి 25 ఈ రెండు రోజుల పాటు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుంది.స్పీకర్ రేసులో ఎవరున్నారంటే? రాజస్థాన్ కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత ఓం బిర్లా 2019 నుంచి 2024 వరకు లోక్‌సభకు 17వ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో లోక్‌సభకు 18వ స్పీకర్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం టీడీపీ,ఏపీ బీజేపీ, జేడీయూ పోటీపడుతున్నాయి. -
ఇంతకన్నా మంచి మార్గాలు లేవా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్యసభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. ఈ అంతరాయాలు మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే దీన్ని చూస్తున్నారు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం, వివాదాస్పద అంశాలపై చర్చించడానికి విధానపరమైన యంత్రాంగాలు లేకపోవడమే. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుత ప్రతిష్టంభన ఫలితంగా ఇది కనివిని ఎరుగని పరిస్థితికి దారితీసింది. పార్లమెంటు శీతాకాల సమా వేశాలకు అంతరాయం కలిగించినందుకు గాను లోక్‌సభ, రాజ్య సభల్లో 141 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో భద్రతా లోపంపై హోంమంత్రి ప్రకటన చేయా లని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంటు భద్రత అనేది సున్ని తమైన అంశమనేది ప్రభుత్వ వైఖరి. ఇది లోక్‌సభ సెక్రటేరియట్ పరిధిలోకి వస్తుంది. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోందని సభకు స్పీకర్ తెలియజేశారు. అఖిలపక్ష సమావేశంలో వచ్చిన కొన్ని సూచనలను అమలు చేశారు. పార్లమెంటులో ప్రతిష్టంభన కొత్తేమీ కాదు. మన పార్లమెంటులో రాజకీయ పార్టీ/కూటమి పాత్రతో సంబంధం లేకుండా, చాలా సంవ త్సరాలుగా ఒక సుపరిచిత కథనం వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఒక ముఖ్యమైన అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం తప్పించుకుంటోంది. నిజానికి ఈ రోజు మనం చూస్తున్న అంత రాయాలు, క్రమశిక్షణా ప్రతిస్పందనలు... మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా ఉన్న విధానపరమైన స్తబ్ధత కారణంగా ఏర్పడుతున్నాయి. ఎంపీలు మన పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం 1960వ దశకంలో మొదలైంది. తాము ముఖ్యమైనవిగా భావించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడానికి సభాపతి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని భావించిన కొందరు ఎంపీలు ఈ పనిలోకి దిగారు. మూడవ లోక్‌సభ (1962–67) సభ్యులు రామ్ సేవక్ యాదవ్, మనీరామ్ బాగ్రీ వంటి ఎంపీలు పార్లమెంటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పీకర్ పదేపదే హెచ్చరించేవారు. వివిధ సందర్భాల్లో పదేపదే అంతరాయం కలిగించడంతో సభ నుండి వారిని ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభ తన కార్య కలాపాల నుండి మినహాయించిన మొదటి పార్లమెంటేరియన్లు వారే కావచ్చు. మూడవ లోక్‌సభ తన పదవీకాలం ముగిసే సమయానికి, ఏకంగా ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. మన పార్లమెంటరీ చర్చలలో అంతరాయాలు ఆనవాయితీగా మారబోతున్నాయని ఇది సూచించింది. అప్పటి నుండి, ఎంపీలు పార్లమెంటు కార్యకలా పాలకు అంతరాయం కలిగించిన ఘటనలు, దాని కోసం క్రమశిక్షణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కాలక్రమేణా, పార్లమెంటరీ అంతరాయాలు నెమ్మదిగా రాజకీయ సాధనంగా మారాయి. ఈ మారుతున్న ధోరణి గురించి పలువురు సభాపతులు నొక్కి చెప్పారు. ‘చాలా సందర్భాలలో, సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అవి యాదృచ్ఛికంగా జరగలేదు. ఉద్దేశపూర్వకంగా అరుస్తూ, సభ వెల్‌లోకి ప్రవేశించడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయడం, పార్లమెంటు పనిచేయడా నికి అనుమతించకూడదనే ఉద్దేశమే ఇక్కడ కనబడుతోంది’ అన్నారు 14వ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ. కానీ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటులో తగిన స్థానం లేదు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని వారు సూచించవచ్చు, డిమాండ్ చేయవచ్చు. అయితే వాటిని అంగీకరించాలా వద్దా అన్నది ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. పైగా సమస్యంతా అందులోనే ఉంది. ప్రతిపక్ష ఎంపీలు సభలో మాట్లాడలేకపోతే, అది నిరంతరం అంతరాయాలకు దారి తీస్తుంది. ఇప్పటివరకు, సంస్థాగత ప్రతిస్పందన ఏమిటంటే, అంతరాయం కలిగించే ఎంపీలను శిక్షించ డమే. కానీ ఇటీవలి సంఘటనలు చూపించినట్లుగా, ఈ విధానం పనిచేయనిదిగా మారింది. పైగా, అంతరాయానికి చెందిన స్వభావం క్రమంగా పరిణామం చెందినప్పటికీ, పార్లమెంట్ సంస్థాగత ప్రతిస్పందన సరళంగానే ఉంటూ వచ్చింది. ఏమాత్రం మారలేదు. ఎంపీలను శిక్షించడం ద్వారా పరిష్కరించగల క్రమశిక్షణా సమస్యగానే ఇది ఇప్పటికీ అంతరా యాలను చూస్తుంది. సమస్యలో కొంత భాగం పార్లమెంటును మనం చూసే విధానంలో కూడా ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు మన జాతీయ శాసన సభను ప్రభుత్వ వ్యవహారాల కోసం ఉద్దేశించిన ఒక సంస్థగా రూపొందించారు. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటును సమావేశపరిచే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. పార్లమెంటరీ ప్రక్రియ నియమాలు ఈ ఆలోచనా విధానాన్ని బలపరిచాయి. ఈ నియమాలు స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ మూసపై ఆధారపడి ఉన్నాయి. వలస ప్రభుత్వ వ్యవహారాలకు ప్రాధాన్యత ఉండేలా చూడటం వారి ఉద్దేశం. ఈ భావనకు అదనంగా, వెస్ట్‌మినిస్టర్ పార్ల మెంటరీ సూత్రం ప్రకారం, పార్లమెంటును సజావుగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. దేశంలో అత్యున్నతమైన శాసన నిర్మాణం, జవాబుదారీతనం ఉన్న ప్రాతినిధ్య సంస్థను చూసే లోపభూయిష్ట మార్గం ఇది. ఇది పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే అధికారాన్ని, దానిలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో నియంత్రించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. నిజానికి చట్టసభలు అనేవి సహకార స్థలాలు. ఇక్కడ ఖజానా(ప్రభుత్వం), ప్రతిపక్షాలు రెండూ కలిసి దేశానికి మంచి ఫలితం కోసం పని చేయాలి. ఎన్నికైన ప్రభుత్వ పాత్ర ఏమిటంటే శాసన, ఆర్థికపరమైన ప్రాధాన్యతలను నిర్ణయించడం. ప్రతిపక్షాల బాధ్యత ఆ ఆలోచనలను వ్యతిరేకించడం లేదా ప్రత్యామ్నాయాలను సూచించడం, అంతరాలను ఎత్తి చూపడం ద్వారా వాటిని బలోపేతం చేయడం. ఈ విధానం ఇప్పుడు ఆచరణ సాధ్యం కానిదిగా మారింది. సభను నడపటం సభాపతికి సాధ్యం కాదని 2005లో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. ‘సభ్యుల సమూహం సభలను నడపనివ్వకుండా మొండిగా వ్యవహరిస్తే, దానిని నియంత్రించడం చాలా కష్టం.’ పార్లమెంటు సమర్థవంతంగా పనిచేయాలంటే ఎంపీలను శిక్షించడం సరిపోదు. ప్రతిపక్షం కూడా ఉభయ సభల్లో చర్చకు ఎజెండాను సిద్ధం చేసేలా విధానాల్లో మార్పు రావటం అవసరం. ప్రస్తుతం, ముఖ్యమైన శాసనపరమైన, విధానపరమైన అంశాలను చర్చించడానికి ప్రైవేట్ సభ్యులకు మాత్రమే ప్రతి శుక్రవారం రెండున్నర గంటల సమయం లభిస్తుంది. అయితే, పార్లమెంటులో నిర్దిష్ట చర్చ జరగాలని ఎంపీల బృందం కోరే యంత్రాంగం లేదు. చర్చను బలవంతం చేయడానికి వారికి అందుబాటులో ఉన్న ఏకైక మార్గం, అవిశ్వాస తీర్మానమే. బహుశా, పార్లమెంటు సమావేశాల క్యాలెండర్లో ప్రతి పక్షాల కోసం నిర్దిష్ట రోజులను చేర్చడం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. హౌస్ ఆఫ్ కామన్్స లాగా, ప్రతిపక్షాలు ముఖ్య మైనవిగా భావించే సమస్యలపై చర్చించడానికి ఈ రోజులను కేటాయించవచ్చు. పార్లమెంటులో ఇటీవలి అంతరాయాలు, చాలామంది ఎంపీల సామూహిక సస్పెన్షన్ మన జాతీయ శాసనసభకు మేల్కొలుపు పిలుపు అనే చెప్పాలి. అత్యున్నత చర్చా వేదికగా పార్లమెంటు ఖ్యాతి ప్రమాదంలో ఉందని ఈ సంఘటనలు నొక్కి చెబుతాయి. చర్చను పెంపొందించడానికి పార్లమెంటు మెరుగైన పరిష్కారాలను కను గొనవలసి ఉంటుంది. లేదంటే దానిపై ప్రజల విశ్వాసం నెమ్మదిగా క్షీణించే ప్రమాదం ఉంది. చక్షు రాయ్ వ్యాసకర్త పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌లో పనిచేస్తున్నారు. -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్‌సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్‌పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్‌పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
లోక్‌సభ ఘటన నిందితులకు కస్టడీ
Live Updates.. లోక్‌సభ ఘటన నిందితులకు కస్టడీ నలుగురు నిందితులకు కస్టడీ విధింపు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన కోర్టు పార్లమెంట్ సమావేశాల్లో.. బుధవారం మధ్యాహ్నాం అలజడి సృష్టించిన ఇద్దరు బయట నినాదాలతో మరో ఇద్దరి నిరసన లోక్‌సభ రేపటికి వాయిదా సభ్యుల నిరసనలతో లోక్‌సభ రేపటికి వాయిదా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్ ఓం బిర్లా సభా నియమాలను ఉల్లంఘన, సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారనే ఈ నిర్ణయం తిరిగి శుక్రవారం ఉదయం 11గం. ప్రారంభం కానున్న లోక్‌సభ రాజ్యసభ మళ్లీ వాయిదా సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ 3గం. ప్రారంభమైన రాజ్యసభ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ సస్పెన్షన్ ప్రకటన తర్వాత వాయిదా పడ్డ సభ ఓ'బ్రియన్ చేష్టలు సిగ్గుచేటుగా అభివర్ణించిన చైర్మన్ ధన్కడ్ చైర్మన్ ఆదేశాల్ని ధిక్కరించారని మండిపాటు గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ.. 4గం. ప్రారంభం అయ్యే ఛాన్స్ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు సస్పెండ్ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెండ్ అయిన ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, ఎస్ జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్ ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు మొదటి నుండి జరుగుతున్నాయి: ప్రహ్లాద్ జోషి నినాదాలు చేయడం, కాగితాలు విసిరివేయడం గ్యాలరీ నుంచి దూకడం కొందరు చేస్తున్నారు: ప్రహ్లాద్ జోషి లోక్ సభా నియమాలను ఉల్లంఘించినందుకు, సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్లో ఫుల్ ఆంక్షలు పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు లోక్‌సభలో నిన్నటి భద్రత వైఫల్యంతో ప్రతిబంధకాలు విధించిన సిబ్బంది పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ , పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని సస్పెండ్ చేసిన పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ రాజ్యసభలో టీఎంసీ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్ రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేసినందుకు సస్పెన్షన్ వేటు ఒబ్రెయిన్ సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన సభా కార్యక్రమాలు మధ్యాహ్నానికి వాయిదా Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" As per the Rajya Sabha Chairman, Derek O' Brien had entered the well of the House, shouted slogans and disrupted the proceedings of the House… pic.twitter.com/bXmFL8W5Vv — ANI (@ANI) December 14, 2023 ►విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over yesterday's security breach incident. The opposition MPs also demanded the resignation of Union Home Minister Amit Shah over the incident Lok Sabha Speaker Om Birla said "all of us are concerned" about what… pic.twitter.com/P20jMqEfO9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్‌సభలో గందరగోళం ►దాడి ఘటనపై లోక్‌సభలో అమిత్ షా మాట్లాడాలని విపక్షాల డిమాండ్. దాడి బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు. ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. పార్లమెంట్ భద్రతా సిబ్బంది సస్పెండ్ పార్లమెంట్లో దాడి నేపథ్యంలో కేంద్రం సీరియస్ పార్లమెంట్ సిబ్బందిపై చర్యలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ Lok Sabha Secretariat has suspended total eight security personnel in yesterday's security breach incident. — ANI (@ANI) December 14, 2023 ►కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్‌తో మోదీ భేటీ. Prime Minister Modi holds meeting with senior ministers. Union Home Minister Amit Shah, BJP National President JP Nadda, Union Ministers Prahlad Joshi and Anurag Thakur present. — ANI (@ANI) December 14, 2023 ►ఖర్గే చాంబర్లో సమావేశమైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు. లోక్‌సభలో దాడి నేపథ్యంలో సభలో వ్యహరించాల్సిన వ్యూహంపై చర్చ. #WATCH | Opposition leaders meet in the chamber of Leader of Opposition in Rajya Sabha Mallikarjun Kharge, in Parliament pic.twitter.com/dPU8tdeAn9 — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు. భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీస్ ఇచ్చిన ఎంపీ రాజీవ్ శుక్లా. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి. Congress MP Rajeev Shukla gives Suspension of Business Notice in Rajya Sabha under rule 267 and demands a discussion on Dec 13 security breach incident in Parliament — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ►కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ఎటువంటి ప్రకటనలు లేవు, ఈ ఘటనపై సభలో చర్చ జరగాలన్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023 ►ఈ ఘటనపై ఇండియా కూటమి పార్లమెంటరీ పక్షనేతల సమావేశం ►పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతల చర్చ ►లోక్‌సభలో దాడి ఘటనను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన కూటమి నేతలు ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు Congress MP Manickam Tagore gives Adjournment Motion notice in Lok Sabha demanding a discussion on the Parliament security breach incident and a reply from the Union Home Minister on the issue — ANI (@ANI) December 14, 2023 ►పార్లమెంట్లో దాడి ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. ►నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు ఉండగా.. పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. ►పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury on December 13 Parliament security breach incident "Such a big incident has happened and till now there have been no statements from the PM and the Union Home Minister. There should be a discussion on this incident..." pic.twitter.com/H8T6Qm9wc4 — ANI (@ANI) December 14, 2023