ఢిల్లీ : గత వారం రాజ్య సభలో కరెన్సీ నోట్ల కలకలంతో వాయిదా పడ్డ ఉభయ సభలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, సభ ప్రారంభమైన కొద్ది సేపటికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు అంశాలను లేవనెత్తడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు రాజ్య సభలో సైతం ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగుతుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సభాసంప్రదాయాలను పక్కన పెట్టి జగదీప్ ధనఖడ్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. జైరాం రమేష్ వ్యాఖ్యలపై జగదీప్ ధనఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మద్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఉభసభ సమావేశాల్లో ఇవాళ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 2024 రైల్వే బిల్లు (సవరణ) , 2024 విపత్తు నిర్వహణ బిల్లు (సవరణ), 2024 బ్యాంకింగ్ చట్టాల బిల్లు (సవరణ)లు ఉన్నాయి.
సభ చివరి రోజు చర్చలో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి కేటాయించిన సీటు వద్ద రూ.50వేల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు లభ్యమవ్వడం కలకలం రేపింది. సభలో భద్రతా అధికారుల తనిఖీల్లో ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి అంటూ భారత ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. విచారణకు ఆదేశించింది.
ఈ ప్రకటనపై ఉభసభల్లో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కరెన్సీ నోట్లు ఎవరివో తేల్చకుండా సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని ఎలా చెప్తారంటూ ప్రశ్నించాయి. దీనిపై ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment