Parliament winter session
-
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం.. వక్ఫ్ బిల్లు ఆమోదానికి పెట్టే అవకాశం ఉంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఇక, డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదానికి పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ప్రజాస్వామ్యం గొంతు నులిమారు: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్ వేటుపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్నారామె. బుధవారం ఉదయం సెంట్రల్ హాల్లో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్టమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఘటన పరిణామాలు, తదనంతరం రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సందర్భంగా ఆమె సభ్యులతో చర్చించారు. ‘‘సహేతుకమైన, న్యాయబద్ధమైన డిమాండ్ కోసం విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ఖూనీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అని అన్నారామె. డిసెంబర్ 13వ తేదీన జరిగిన అసాధారణ పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షా నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిలో కేంద్రానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్నది అర్థం కావడం లేదని అన్నారామె. తెలంగాణలో విజయంపై శుభాకాంక్షలు: సోనియా ‘‘అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్నందుకు తెలంగాణలోని మనపార్టీ సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలి. ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పొందుపరచింది. దాని గురించి గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడానికి తొమ్మిది సంవత్సరాల పాటు తీసుకుంది. -
లోక్‌సభ అలజడి ఘటన.. మరో అరెస్ట్
ఢిల్లీ: లోక్‌సభ అలజడి ఘటన కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంట సేపు ప్రశ్నించిన అనంతరం.. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ప్రకటన చేశారు. ఈ కుట్రలో మహేష్ కూడా భాగం అయ్యాడని పేర్కొంటూ.. కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్.. ఘటన జరిగిన తేదీన ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు సహకరించడం, వాళ్ల ఫోన్లను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల మీద లలిత్ ఝా అనే వ్యక్తిని ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర కేసులో లలిత్‌నే కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ లొంగుబాటు గురువారం లలిత్‌తో పాటు మహేష్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. లలిత్ అరెస్ట్‌ను శుక్రవారం పోలీసులు నిర్ధారించగా.. మహేష్‌ను, అతని బంధువు కైలాష్‌ను సైతం ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే శనివారం మరోసారి మహేష్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాతే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పార్లమెంటులో ఘటనల అనంతరం లలిత్ ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ మహేష్ అతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నలుగురు నిందితుల ఫోన్లను ధ్వంసం చేసేందుకు లలిత్‌కు మహేష్ సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. లలిత్‌తో పాటు మహేష్‌ను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లో వాళ్లు తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. అలాగే.. పార్లమెంట్‌లోనూ ‘సీన్ రీక్రియేషన్’ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ప్లాన్‌తో.. పార్లమెంట్ శీతాకాల సమాశాల్లో భాగంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జీరో అవర్ కొనసాగుతుండగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి వెల్ వైపుగా దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే నిలువరించిన ఎంపీలు.. వాళ్లను చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈలోపు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలర్ స్మోక్ షెల్స్‌ను ప్రయోగించారు. అదే సమయంలో బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. వాళ్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
పార్లమెంట్ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్‌సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. మొత్తం దానిదే! తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్‌పీఎఫ్‌గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. పీఎస్ఎస్ చరిత్ర పెద్దదే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్‌ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్‌భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్‌లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్ అండ్ వార్డ్ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు.. అన్నింటా కీలకంగా.. .. 2009 ఏప్రిల్ 19వ తేదీన వాచ్ అండ్ వార్డ్‌ను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్ఎస్. పార్లమెంట్ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్ఎస్ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద.. అలాగే ఎట్ హోమ్ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్ఎస్సే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్ఎస్దే కీలక పాత్ర. అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్ఎస్ చూసుకుంటుంది. స్వతంత్రంగా పని చేయదు.. పీఎస్ఎస్ అనేది పార్లమెంట్ భవనం పూర్తి కాంప్లెక్స్ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్/సీఆర్పీఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ, ఎన్ఎస్జీలు పార్లమెంట్ పరిధిలో పీఎస్ఎస్ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు. పార్లమెంట్ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్ఎస్కు హెడ్‌గా ఉంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్ఎస్ పనితీరును పర్యేవేక్షిస్తారు. పీఎస్‌ఎస్‌లో సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్ పరిధిలోనే. పార్లమెంట్ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది. పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్‌తో పాటు సభ లోపలి మార్షల్స్ కూడా పీఎస్ఎస్ పరిధిలోకే వస్తారు. మూడంచెల తనిఖీలు.. పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి చెకింగ్స్ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీలు చేస్తారు. ఇక, పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్‌తో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. అలా ఎలా..? సాధారణ విజిటర్ పాస్‌ల మీదే సందర్శకులు పార్లమెంట్‌కు వస్తుంటారు. ఈ పాస్‌లు జారీ చేసేముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్‌లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్లు, స్కానర్లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే పార్లమెంట్ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్ షెల్స్‌తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. నాడు జరిగింది ఇదే.. 2001 డిసెంబర్ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. అదీ హైటెక్ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
Parliment Attack: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు ఆగంతుకులు (ఫొటోలు)
-
లోక్‌సభ ఘటన.. పక్కా స్కెచ్‌తోనే ఎంట్రీ!
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఇద్దరు యువకులు.. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. 👉పాస్‌లు ఎలా పొందారసలు? 🔺సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్‌సభలోకి దూసుకొచ్చిన దుండుగులు 🔺సందర్శకులుగా వచ్చి దాడికి పాల్పడ్డ దుండగులు 🔺ప్రస్తుతానికి విజిటర్స్ పాస్‌ల జారీపై స్పీకర్ నిషేధం 🔺ఎవరైనా పార్లమెంట్‌ను సందర్శించాలనుకుంటే.. 🔺నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడి పేరు మీద అభ్యర్థన చేసుకోవాలి 🔺మొదట ఎంపీలు ఈ అభ్యర్థన చేసుకున్న వ్యక్తులు సమర్పించిన గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు 🔺భద్రతాపరమైన పరిశీలన కూడా ఉంటుంది 🔺పార్లమెంట్ కార్యకలాపాలు వీక్షించేందుకు మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి 🔺పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద మోహరించిన సిబ్బంది, ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కఠినమైన భద్రతా తనిఖీ తర్వాతే వారు లోపలికి వెళ్తారు 🔺ప్రస్తుతం విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు దుండగులది కర్ణాటక 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ పేరు మీద జారీ అయిన పాస్‌లు 🔺దీంతో రాజకీయ విమర్శలు 🔺పాస్‌లు జారీ బాధ్యతారాహిత్యమని.. క్షమార్హమైంది కాదంటున్న విపక్షాలు 🔺పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వాదన వినిపించనున్న బీజేపీ ఎంపీ 🔺కొత్త పార్లమెంట్ వీక్షిస్తామనే వంకతో వారు పాస్‌లు పొందినట్లు సమాచారం 🔺మూడు నెలలపాటు ప్రయత్నించి ఈ పాస్ పొందినట్లు గుర్తింపు 👉రాజకీయం తగదు: కేంద్ర మంత్రి గోయల్ 🔺లోక్‌సభ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటున్న విపక్షాలు 🔺రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ 🔺దాడి జరిగింది లోక్‌సభనా? రాజ్యసభనా? అని చూడొద్దంటున్న విపక్షాలు 🔺ఘటనపై ఎప్పటికప్పటి సమాచారం.. దర్యాప్తు వివరాలను తెలియజేస్తానని సభ్యులకు రాజ్యసభ చైర్మన్ హామీ 🔺అయినా తగ్గని సభ్యులు 🔺హోం మంత్రి ప్రకటనకై పట్టు 🔺విపక్ష సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చిన పీయూష్ గోయల్ 🔺పెద్దల సభ.. హుందాగా ఉండాలని పిలుపు 🔺ఇలాంటి సమయాల్లో మనమంతా ఐక్యమనే సందేశాన్ని ఇవ్వాలన్న గోయల్ 🔺కాంగ్రెస్, విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపాటు 🔺ఇది మంచి సందేశం కాదని విమర్శ 👉 దర్యాప్తులో కీలక విషయాలు 🔺పార్లమెంట్ దాడి ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి 🔺నిందితులు మొత్తం ఆరుగురిగా తేల్చిన అధికారులు 🔺పరారీలో మరో ఇద్దరు 🔺ఇప్పటికే పోలీసుల అదుపులో నలుగురు 🔺పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు 🔺నాలుగు నెలల కిందటే దాడికి ప్లాన్ గీసినట్లు సమాచారం 🔺పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం 👉 ఫుల్‌బాడీ స్కానర్లు పెట్టండి: లోక్‌సభ స్పీకర్ 🔺హోంశాఖకార్యదర్శికి స్పీకర్ ఓం బిర్లా లేఖ 🔺పార్లమెంట్ సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి 🔺ఎంట్రీ గేట్ల వద్ద ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలి 🔺పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను పెంచాలని లేఖలో కోరిన స్పీకర్ 🔺పార్లమెంట్ లోక్‌సభ దాడి ఘటనపై సన్‌సద్‌మార్గ్‌లోని పీఎస్‌లో కేసు నమోదు 👉 ముగిసిన అఖిలపక్ష సమావేశం 🔺పార్లమెంట్ సెక్యూరిటీపై సభ్యుల ఆందోళన 🔺హైపవర్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం 👉 లోపలా బయట ఆధారాల సేకరణ 🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం 🔺పార్లమెంట్ లోపలా, బయట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం 🔺నలుగురు నిందితుల్ని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు 🔺రాత్రికల్లా దాడి గురించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం 👉 పార్లమెంట్లో మొదలైన అఖిలపక్ష సమావేశం 🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం 🔺వివిధ పార్టీల నుంచి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ నేతలు 🔺భద్రతా వైఫల్యం, ఘటన కారణాలపై సమీక్ష 🔺రాజ్యసభలోనూ దాడి ఘటనను ప్రముఖంగా చర్చించిన కాంగ్రెస్ 👉ఎత్తు తగ్గించడం వల్లే..: ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺స్పీకర్ చైర్ వైపు అగంతకుడు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు 🔺దాడి చేసే ప్రయత్నం చేశాడు 🔺అతను బెంచీలు దాటుకొని వచ్చే ప్రయత్నం చేశారు 🔺ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నా 🔺పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారు 🔺సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడు 🔺సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలి 🔺ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే 🔺లోక్‌సభలో అలజడి సృష్టించిన అగంతకుడిని పట్టుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺ఎదురుగా వెళ్లి అగంతకుడిని పట్టుకున్న మాధవ్ 🔺మాధవ్‌తో పాటు ఎంపీ గుర్జిత్, ఇతర ఎంపీలు కూడా ఆగంతకుల్ని నిలువరించే యత్నం 🔺పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP — Press Trust of India (@PTI_News) December 13, 2023 👉బీజేపీ ఎంపీ పేరు మీదే పాస్! 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మీద పాస్ తీసుకున్న సాగర్ శర్మ! 🔺వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సాగర్ శర్మ, మనోరంజన్‌లు 🔺బెంగళూరు వెళ్తున్నామని చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయల్దేరిన ఈ ఇద్దరూ 🔺బీజేపీ మైసూర్ ఎంపీ పేరు మీద విజిటర్స్ పాస్ తీసుకున్న వైనం 🔺విజిటర్స్ పాస్‌లు రద్దు చేసిన స్పీకర్ 👉లోక్‌సభ ఘటన నిందితుల గుర్తింపు 🔺పార్లమెంట్ లోపల దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకుల్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు 🔺సాగర్ శర్మ, మనోరంజన్‌గా గుర్తింపు 🔺బయట రంగుల టియర్‌గ్యాస్‌తో నినాదాలు చేసింది నీలమ్‌కౌర్(హిస్సార్-హర్యానా), ఆమోల్ షిండే(లాతూర్-మహారాష్ట్ర)గా గుర్తింపు 🔺పోలీసుల అదుపులో ఈ నలుగురు 🔺ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు 🔺దాడికి గల కారణాలపై ఆరా ఇదీ చదవండి: లోక్‌సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు 👉 కాసేపట్లో అఖిలపక్ష భేటీ 🔺పార్లమెంట్లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం 🔺భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్ష 🔺ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకున్న ఢిల్లీ సీపీ, హోం సెక్రటరీ అజయ్‌భల్లా 🔺 దాడి ఘటనతో విజిటర్ పాస్స్ రద్దు చేసిన స్పీకర్ Lok Sabha Speaker Om Birla to meet with Floor leaders of different political parties at 4pm today, over the security breach incident. (file photo) pic.twitter.com/gdp5R6v3wL — ANI (@ANI) December 13, 2023 జీరో అవర్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే యత్నం చేశారు. బూట్లలో రంగుల టియర్‌గ్యాస్ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించారు. లోక్‌సభలో ‘జైభీమ్, భారత్ మాతాకీ జై’ తానా షాహీ బంద్ కరో.. నినాదాలు చేస్తూ వెల్ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఆగంతకుల చర్యతో బిత్తరపోయారు ఎంపీలంతా. అయితే అప్పటికే ఎంపీలు, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యి వాళ్లను పట్టుకున్నారు. ఎంపీల ఆందోళనతో కాసేపు సభను వాయిదా వేశారు స్పీకర్. #WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4 — ANI (@ANI) December 13, 2023 లోక్‌సభలో లోపల దాడికి పాల్పడిన వాళ్ల గురించి తెలియాల్సి ఉంది. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ కనిపించిన ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసుపు రంగు టియర్‌గ్యాస్‌తో వీళ్లు ‘‘రాజ్యాంగాన్ని కాపాడాలి..’’, ‘‘నియంతృత్వం చెల్లదు’’ అంటూ నినాదాలు చేశారు. నిందితులను హర్యానాకు చెందిన నీలం కౌర్(42), మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే(25)గా గుర్తించారు. ఈ నలుగురు ఒకే గ్రూప్‌కు చెందిన వారై ఉంటారని.. ఇద్దరు లోపల, ఇద్దరు బయట నిరసనలు తెలియజేసే యత్నం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz — ANI (@ANI) December 13, 2023 మరోవైపు.. ఘటన తర్వాత కాసేపటికే సభ ప్రారంభమైంది. లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆగంతకులు వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలతో స్పీకర్ అన్నారు. #WinterSession2023#LokSabha Speaker @ombirlakota's Remarks on Security Breach In Lok Sabha.@LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/xhfMS1pQoo — SansadTV (@sansad_tv) December 13, 2023 సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవన్లో తాజా ఘటనతో భద్రతా వైఫ్యలం బయటపడింది. భద్రతా తనిఖీని తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్‌గ్యాస్‌తో ఎలా వెళ్లారనే? ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పలువురు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట పాస్‌లు తీసుకుని ఆగంతకులు లోపలికి ప్రవేశించినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. పోలీసులు దీనిని ధృవీకరించాల్సి ఉంది. Lok Sabha chamber of Parliament was attacked right now by 2 individuals who jumped from the visitors’ gallery into the House. Which MP approved their passes? Is he from the BJP? This is shocking especially on the day of the Parliament attack anniversary. BJP constantly has… pic.twitter.com/oPTaMfz1kx — Saket Gokhale (@SaketGokhale) December 13, 2023 ఈ ఘటనపై విపక్ష ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారు. ఎంపీలు వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగానే.. విపక్షాలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi police commissioner Sanjay Arora reaches Parliament following the security breach incident pic.twitter.com/Hj4rWYzncC — ANI (@ANI) December 13, 2023 ఖలిస్థానీల పనేనా? పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఇదే రోజున ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు త్వరలో భారత్‌లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలీస్థానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి దాడికి, ఖలీస్థానీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది. అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి. #Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF — Suneel Veer (@sunilveer08) December 12, 2023 -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి..
సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. Winter Session, 2023 of Parliament will commence from 4th December and continue till 22nd December having 15 sittings spread over 19 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business and other items during the session.#WinterSession2023 pic.twitter.com/KiboOyFxk0 — Pralhad Joshi (@JoshiPralhad) November 9, 2023 -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగు బిల్లులపై చర్చ?
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ.. వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల బిల్లులతో పాటు పెండింగ్‌లో ఉన్న మరో వివాదాస్పద బిల్లును సైతం పరిశీలించే యోచనలో ఉంది కేంద్రం. మొత్తం 12 రోజులపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ముగిశాకనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. క్రిస్మస్‌లోపు.. అదీ డిసెంబర్ 22 లోపే సమావేశాలు ముగించేయలని భావిస్తోంది కేంద్రం. దీంతో రెండు వారం నుంచి సెషన్ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలనుకుంటోంది కేంద్రం. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది. -
సరిహద్దు ఘర్షణ పార్లమెంట్‌ను కుదిపేయనుందా?
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ.. దేశ చట్ట సభను కుదిపేయనుందా?. అవుననే సంకేతాలు అందిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022లో భాగంగా.. ఇవాళ(మంగళవారం) చైనా-భారత్ సరిహద్దు ఘర్షణ అంశాన్ని లేవనెత్తి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. డిసెంబర్ 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్-చైనా బలగాలు గొడవ పడ్డాయని, ఈ ఘనటలో ఇరు వర్గాలకు స్వల్ఫ గాయాలు అయ్యాయనేది సమాచారం. ఈ సమాచారం తెలియగానే.. కాంగ్రెస్ కేంద్రాన్ని ఏకిపారేయడం ప్రారంభించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్లు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించడం ద్వారా ప్రభుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఇరు సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం వాయిదా తీర్మానం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని.. ఎందుకు బహిర్గత పర్చలేదని ఆయన అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చర్చలకు వెనుకాడలేదని, వాస్తవాలతో సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద 20 మంది భారతీయ సైనికులు మరణించిన భీకర ఘర్షణ తర్వాత.. భారత్-చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనికులు మరణించారని చైనా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న కథనాలు వినిపించాయి. Congress MP Randeep Singh Surjewala gives Suspension of Business Notice under Rule 267 in Rajya Sabha to discuss the India-China face-off in Tawang sector, Arunachal Pradesh on 9th December; urges the PM & Defence Minister to make a statement & have a discussion in the House. — ANI (@ANI) December 13, 2022 ఇదీ చదవండి: మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు! -
రాజ్యసభలో 2 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
‘భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సువర్ణావకాశం’
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. ‘శీతాకాల సమావేశాల తొలి రోజు ఇది. మనం ఆగస్టు 15కు ముందు సమావేశమైనందున చాలా ముఖ్యమైనది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నాం. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం. గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు(మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ అని అన్నారు. -
Parliament : ముగిసిన శీతాకాల సమావేశాలు.. ఎన్నిగంటలు వృథా చేశారంటే..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటుగా ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు పూర్తయిన నేపథ్యంలో వింటర్ సెషెన్‌ను ఒకరోజు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ముగించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 29 న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 వరకు జరగాల్సి ఉండగా.. ఒక రోజు ముందుగానే డిసెంబరు 22)న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శీతాకాల సమావేశంలో భాగంగా లోక్‌సభ ముందుకు 13 బిల్లులు రాగా, 11 బిల్లులు ఆమోదం పొందాయి. దీనిలో కీలకమైన సాగుచట్టాల రద్దు బిల్లు, ఎన్నికల చట్టాల సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి. అదే విధంగా యువత వివాహా వయసు పెంపుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం స్టాండింగ్ కమిటీకి పంపించింది. In the #WinterSession, 11 bills have been passed by both the Houses and 6 bills have been sent to Standing Committee. Opposition's conduct throughout the session was unfortunate and they repeatedly resorted to creating ruckus and disturbing the proceedings. — Pralhad Joshi (@JoshiPralhad) December 22, 2021 ఎంపీల నిరసనల కారణంగా శీతాకాల సమావేశాల్లో 18 గంటలు వృథా అయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభను కూడా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, లఖీంపూర్ ఖేరీ ఘటన, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పార్లమెంట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండుగ స్పెషల్‌గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్‌క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్‌తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్‌తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్‌సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
3 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి
Live Updates: ► దేశంలో పెట్టుబడుల ఉపసంహరణపై లోక్‌సభలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను అమ్మేయడం వలన వందల మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేసిన పర్వాలేదు.. కానీ లాభాల్లో ఉన్న వాటిని పీపీపీ మోడ్‌లోకి తీసుకురావాలంటూ నుస్రత్ కేంద్రాన్ని కోరారు. ► రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కుచట్ట సవరణ బిల్లు, గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. వీటితో పాటు ప్రార్థనా మందిరాలపై దాడులు చేసేవారికి విధించే గరిష్ట జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచేలా ఐపీసీ చట్ట సవరణ - 2021 బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ► దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సీఎస్యూలను అమ్మేయడం సరికాదని.. దీనివల్ల వందలమంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్టేక్ అమ్మేయడం కాకుండా, వాటిని పీపీపీ మోడ్‌లోకి తీసుకురావాలని ఆమె కేంద్రానికి సూచించారు. కేంద్ర మంత్రి ఆక్షేపణ ► తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, సురేష్‌రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి గింజనూ కొంటామన్న మాటను మోదీసర్కార్ నిలబెట్టుకోవాలన్నారు. గతేడాది తరహాలోనే 94 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని డిమాండ్ చేశారు. దీనికి బదులిచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. గతంలో ఇచ్చిన టార్గెట్‌నే తెలంగాణ ఇంకా పూర్తిచేయలేదన్నారు. ఇచ్చిన టార్గెట్‌లో 29 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ► తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకే ధాన్యం సేకరణ జరుగుతోందని రాజ్యసభలో స్పష్టంచేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఆయా రాష్ట్రాలు తినే బియ్యాన్నే తాము కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి లేవెనత్తిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి. భవిష్యత్‌లో పారా బాయిల్డ్ రైస్ పంపిణీ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందన్నారు. మళ్లీ ఇప్పుడీ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు. Time 12:00 PM డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయనకు నివాళులు అర్పించారు. ► తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ వరుసగా నాలుగోరోజూ లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు. వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ► పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలపై లోక్‌సభలో దుమారం రేగింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ సభ్యులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి. స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్రెజరీ బెంచ్ దీటుగా స్పందించింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టే హక్కు అధికారపక్షం ఎంపీలకు కూడా ఉందన్నారు కేంద్రమంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్. Time 11:00 AM పార్లమెంట్ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ► 12 సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద మరోసారి నిరసన చేపట్టారు. అయితే, వారికి కౌంటర్‌గా బీజేపీ సభ్యులు కూడా అదే ప్రాంతంలో నిరసనకు దిగారు. #WATCH | Delhi: BJP Rajya Sabha MPs protest against the protesting Opposition over the suspension of 12 Rajya Sabha MPs for the winter Parliament, near the Gandhi statue pic.twitter.com/zngQpt1guj — ANI (@ANI) December 3, 2021 ► లఖింపూర్ ఖేరీ ఘటనపై, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్‌కుమార్ మిశ్రా తొలగింపు అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. Congress MP Manickam Tagore has moved an adjournment motion in Lok Sabha "to discuss the killing of innocent farmers through rash driving by the son of MoS Home in Lakhimpur Kheri district, to direct the govt to ensure the culprit punished, & ask the PM to dismiss the MoS Home." pic.twitter.com/AkxYKo1HiR — ANI (@ANI) December 3, 2021 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు 2021, ఢిల్లీలో ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు (సవరణ) బిల్లు 2021, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్య మరియు పరిశోధన (సవరణ) బిల్లు 2021 నేడు లోక్‌సభ ముందుకు రానున్నాయి. ఇక 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే డ్యామ్ సేఫ్టి బిల్లు 2019ను రాజ్యసభ గురువారం ఆమోదించింది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: డ్యామ్ సేఫ్టి బిల్‌ను సెలక్ట్ కమిటీకి పంపాలి
Live Updates Time 18:17 ► డ్యామ్ సేఫ్టీ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి. Time 16:00 ► దేశంలో వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. Time 12:20 ►తెలంగాణలో వరి కొనగోలుకు సంబంధించిన అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్‌సభలో లేవనెత్తారు. నామా మాట్లాడుతూ.. కేంద్రం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. Time 11:40 ►లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన ►ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నిరసన Time 11:20 ► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి సస్పెండ్ చేసిన 12 మంది రాజ్యసభ ఎంపీల అంశం సభను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం నాలుగో రోజు ప్రారంభమైంది. లోక్‌సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేయడం మొదలుపెట్టారు. పోడియం వద్ద ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్నారు. #WATCH | Congress MP Rahul Gandhi joins the Opposition leaders' protest against the suspension of 12 Opposition members of Rajya Sabha, in Delhi pic.twitter.com/w7Y1gSLTym — ANI (@ANI) December 2, 2021 చదవండి: డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి ! -
పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయి. అధికారులు తక్షణమే స్పందించడంతో కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, ఈ ఘటననై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. చదవండి: 5 లక్షల కంపెనీలు వ్యాపారం వదిలి వెళ్లిపోయాయ్ -
Bitcoin: బిట్‌కాయిన్‌పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
క్రిప్టోకరెన్సీపై రకరకాల ఊహాగానాల నడుమ బిట్‌కాయిన్ భవితవ్యంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. Parliament Winter Session 2021 సోమవారం మొదలైన విషయం తెలిసిందే. లోక్‌సభ కాసేపు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన తరుణంలో బిట్‌కాయిన్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేస్తోందా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘అలాంటిదేం లేదు సర్’ అని సమాధానం ఇచ్చారు. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది తమ ప్రభుత్వం చేయట్లేదని, అలాగే బిట్‌కాయిన్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించి వివరాలు సేకరించామన్న రిపోర్టులు నిజం కాదని ఆమె స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న బిట్‌కాయిన్ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైంది. ఇక ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుందన్న కథనాలు నిజమేనని(వచ్చే ఏడాది నుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలు).. ఇందుకోసం 1934 చట్టానికి సవరణలు (డిజిటల్ కరెన్సీని ఫిజికల్ నోట్లతో సమానంగా గుర్తించాలనే!) ప్రతిపాదన ఆర్బీఐ, కేంద్రం ముందు ఉంచిదనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపింది. ఇక 2008 నుంచి చెలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్.. డిజిటల్ కరెన్సీగా చెలామణి అవుతోంది. బిట్‌కాయిన్‌తో వస్తువుల కొనుగోలు, సేవలు, బ్యాంకులతో సంబంధం లేకుండా మనీ ఎక్స్ఛేంజ్ ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటోంది. నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. చదవండి: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్ -
Cyptocurrency : క్రిప్టోకరెన్సీ చట్టం.. అనూహ్య పరిణామం!
Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్ బిట్‌కాయిన్‌స్టోర్ భారత్‌లో అడుగుపెట్టింది. సింగపూర్‌కి చెందిన వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్(సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్‌లతో కాయిన్‌స్టోర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్‌డాలర్ల బడ్జెట్‌తో భారత మార్కెట్లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్ మార్కెటింగ్ హెడ్ చార్లెస్ టాన్ వెల్లడించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్‌స్టోర్ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్ టాన్ తెలిపారు. భారత్‌తో పాటు జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: ఉభయ సభలు వాయిదా.. కుదిపేసిన రైతుల అంశం
Live Updates: Time 2:20 PM ►కుదిపేసిన రైతుల అంశం.. ఉభయ సభలు వాయిదా Time 2:17 PM ►సాగుచట్టాల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం Time 2:15 PM ► వాయిదా తర్వాత ప్రారంభమైన రాజ్యసభ ►సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం. Time 2:01 PM ►వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. సాగు చట్టాల బిల్లు పై చర్చ తప్పనిసరేనని కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ►విపక్షాల ఆందోళన నడుమ కొనసాగని పార్లమెంట్ సమావేశాలు, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాడుతాం: రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ ►సాగుచట్టాల రద్దు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రన ఆందోళనలపై వెనక్కు తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తేల్చి చెప్పారు. డిసెంబర్ 4 జరిగే సమావేశం తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాటం సాగుతుందన్నారు. Time 12:28 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు రాజ్యసభ వాయిదా రాజ్యసభలోనూ రద్దు బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి కొనుగోళ్లపై స్పష్టత సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేశాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగాయి. క్వశ్చన్ అవర్‌లో గందరగోళం సృష్టిస్తున్న విపక్ష ఎంపీల తీరుపై ఛైర్మన్ వెంకయ్య సీరియస్ అయ్యారు. సభను 2 గంటలవరకూ వాయిదా వేశారు. Time 12:24 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ Time 12:18 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా ► వాయిదా అనంతరం కూడా విపక్షాల ఆందోళన కొనసాగడంతో రెండో సారి ప్రారంభమైన 5 నిమిషాల్లోనే లోక్‌సభ మళ్లీ వాయిదా. ► సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం. Time 12:05 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభ ► లోక్‌సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన ఉభయ సభలు గంట పాటు వాయిదా Time 11:20 AM ►ఇటీవల మృతి చెందిన పలువురు సభ్యులకు రాజ్యసభలో నివాళులు. అనంతరం సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మన్ వెంకయ్య నాయుడు గంట వాయిదా వేశారు. Time 11:10 AM..విపక్షాల ఆందోళణ.. లోక్‌సభ గంట వాయిదా ►ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. Time 11:03 AM.. ► లోక్‌సభలో.. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల మరణించిన ప్రస్తుత, మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా ప్రయత్నించగా.. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సాగుచట్టాల రద్దుపై చర్చించాలంటూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. Time 11.00 AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. Time 10.55 AM ►శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని... సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. Time 10.50 AM ►సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రైతు సమస్యలపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భంగం వాటిల్లకుండా చూసుకోవాలని ఎంపీలకు సూచించారు. ►పెగసస్ వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లుతో పాటు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021, దివాలా రెండో సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లు, 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021, మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లులపై చర్చ జరుగనుంది. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు ఆందోళనకరం పార్లమెంట్‌తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్యlనాయుడు తెలిపారు. ‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్‌సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి. పార్లమెంట్లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి – మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టాలి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు