
శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు: షిండే
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. మీడియాతో మంత్రి షిండే మాట్లాడుతూ ఈ నెల 21 కేంద్ర మంత్రి మండలి సమావేశమవుతుందని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి.
శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలంటే ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది.