పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు | Parliament Winter Session to commence on November 24 | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

Published Mon, Oct 27 2014 1:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

న్యూఢిల్లీ: పార్లమెంట్  శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరుగుతాయి. 22 పని దినాలలో సమావేశాలు నిర్వహిస్తారు. హొం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఉభయ సభలలో 67 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.  రాజ్యసభలో 59, లోక్సభలో 8 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో  అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, అనంత కుమార్, ఎం.వెంకయ్య నాయుడు సభ్యులుగా ఉన్నారు. ప్రకాష్ జవదేకర్, సంతోష్ గ్యాంగ్వార్, స్మృతి ఇరానీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement