Cabinet Committee
-
Jaya Verma Sinha: క్యాట్ సభ్యురాలిగా రైల్వే బోర్డు చైర్పర్సన్
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కేంద్ర అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడతారు. జయతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. -
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్ రణదీప్ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్ సర్జన్ (కార్డియో వ్యాస్కులర్ స్పెషలిస్ట్) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు. -
పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి శ్వేతా సింగ్ నియమితులయ్యారు. 2008 బ్యాచ్ అధికారి అయిన శ్వేతా సింగ్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం పేర్కొంది. శ్వేతా సింగ్ జాయిన్ అయిన నాటి నుంచి మూడేళ్లపాటు నూతన బాధ్యతల్లో కొనసాగుతారు. అదేవిధంగా, పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా అనికేత్ గోవింద్ మాండవ్గానె నియామకాన్ని ఏసీసీ రద్దు చేసింది. 2009 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన అనికేత్ జూలై 18వ తేదీన ఆ పదవిలో నియమితులయ్యారు. -
రక్షణ రంగంలో సాంకేతికత పెరగాలి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంతకంతకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌లో భద్రతా సన్నద్ధతపై ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతపై ఆదివారం ఢిల్లీలో కేబినెట్ కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. త్రివిధ బలగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను ప్రవేశపెట్టాలని, రక్షణ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా చర్చలు సాగాయని ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సాధిస్తే మన బలం పెరగడంతో పాటు ఆర్థిక రంగం కూడా పుంజుకుంటుందని సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రధాని మోదీ వివిధ దేశాలు రక్షణ రంగంలో వాడుతున్న టెక్నాలజీ, భారత్ పకడ్బందీగా ఎలా ముందుకెళుతోందో వివరించారు. ఖర్కీవ్‌లో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్‌కు తిరిగి తేవడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రకటించారు. ‘‘డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, ఇందులో బ్యాంకు(ల) ఎంపిక అంశాలను క్యాబినెట్ కమిటీ పరిశీలిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో (ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తాజాగా లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ద్వారా రూ.175 లక్షల కోట్ల సమీకరించాలని కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
విశాఖ ఉక్కుపై టాటా స్టీల్ కన్ను
న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్) కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రోడక్ట్‌ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని నరేంద్రన్ వివరించారు. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కులో 100 శాతం వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం లావాదేవీ సలహాదారుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా కేంద్రంగా ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్) కొనుగోలు కోసం కూడా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) దాఖలు చేసినట్లు నరేంద్రన్ చెప్పారు. -
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్) కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతిని తెలియజేసింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతి పాదించిన విషయం విదితమే. 2019లో..: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ 2019 జనవరిలో ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ప్రభుత్వంతోపాటు బ్యాంకులో వాటాను విక్రయించేందుకు ఎల్ఐసీ బోర్డు సైతం అనుమతించింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం వదులుకునేందుకు అంగీకరించింది. వీటితోపాటు నియంత్రణ సంబంధ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో వాటాను తగ్గించుకునేందుకు నిర్ణయించింది. బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న వ్యూహాత్మక కొనుగోలుదారుడు బిజినెస్‌ను పెంపొందించేందుకు వీలుగా పెట్టుబడులతోపాటు.. కొత్త టెక్నాలజీ, ఉత్తమ నిర్వహణ తదితరాలకు తెరతీసే వీలుంది. తద్వారా ఐడీబీఐ బ్యాంక్ భవిష్యత్‌లో పెట్టుబడులు లేదా ఇతర సహాయాల కోసం ప్రభుత్వం, ఎల్ఐసీలపై ఆధారపడవలసిన అవసరముండదని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా.. బ్యాంక్ ఐదేళ్ల తదుపరి గతేడాది(2020–21) నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం 2021 మార్చిలో బయటపడడం గమనార్హం! ఈ వార్తలతో ఐడీబీఐ బ్యాంకు షేరు ఎన్ఎస్ఈలో 4.5% జంప్‌చేసి రూ. 38 వద్ద ముగిసింది. చదవండి: (ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా) -
రూ.1,200 కోట్లతో కృష్ణపట్నం నోడ్ పనులు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్ (కృష్ణపట్నం పారిశ్రామికవాడ)కు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించడానికి ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,134 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కింద రూ.2,139.44 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నోడ్‌లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడానికి ఏపీఐఐసీ రంగం సిద్ధం చేసింది. రహదారుల నిర్మాణం, నీటి వసతి, మురుగు నీటి శుద్ధి, విద్యుత్ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,200 కోట్ల విలువైన పనులకు ఈ నెలాఖరులో ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.432 కోట్లు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.420 కోట్లు, నీటి వసతి కల్పన, మురుగునీటి శుద్ధి వంటి పనులకు రూ.348 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూలై మొదటి వారంలో కృష్ణపట్నం నోడ్ పనులు ప్రారంభించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నివాసయోగ్యంగానూ అభివృద్ధి: కేవలం పారిశ్రామిక యూనిట్లే కాకుండా నివాస యోగ్యంగా కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా నగరాల మాదిరిగానే పరిశ్రమలతో పాటు నివాస యోగ్యంగా కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఉద్యోగులు అక్కడే నివసించే విధంగా గృహ సముదాయాలు నిరి్మంచడానికి 13.9 శాతం వినియోగించనున్నారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయించి, పర్యావరణ పరిరక్షణ కోసం 10.9 శాతం ఖాళీగా ఉంచుతారు. తొలి దశలో అభివృద్ధి చేసే ఈ నోడ్ ద్వారా సుమారు 18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రధానంగా టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్, ఆప్టికల్ వంటి తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. -
రాజ్‌నాథ్ రాజీనామాకు సిద్ధపడ్డారా?
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ తర్వాత ప్రమాణం చేసిన రాజ్‌నాథ్‌కే ఆ స్థానం దక్కాలి. కానీ మొత్తం ఎనిమిది కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కమిటీల్లోనూ అమిత్ షాకి సభ్యత్వం కల్పించారు. రాజ్‌నాథ్‌కు తొలుత కేవలం రెండింటిలో మాత్రమే ప్రాతినిధ్యం కల్పించడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మోదీ ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించలేదని, తన కుడిభుజం అమిత్ షాని నంబర్ టూ అని చాటి చెప్పడానికే రాజ్‌నాథ్ ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మోదీ రాత్రికి రాత్రి కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు మొత్తం ఆరు కమిటీల్లో రాజ్‌నాథ్‌కు స్థానం కల్పించారు. తెరవెనుక ఏం జరిగింది ? బుధవారం పలు కమిటీలు ఏర్పాటు చేసిన ప్రధాని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు రెండు కమిటీల్లోనే చోటు కల్పించారు. అమిత్ షాను అన్ని కమిటీల్లోనూ పెట్టి, రాజ్‌నాథ్‌ను రెండింటికే పరిమితం చేయడం సహజంగానే కలకలం రేపింది. ‘‘రాజ్‌నాథ్ సింగ్‌కు ఇది తీవ్ర అవమానం. అలాగని ఆయన అవమానాలు దిగమింగుతూ ఉండే నాయకుడైతే కాదు‘‘ అని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టుగానే రాజ్‌నాథ్ చేతులు ముడుచుకొని కూర్చోలేదని, తన హోదాకు భంగం కలగడంతో రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఆరెస్సెస్ పెద్దల వద్ద కూడా రాజ్‌నాథ్ ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారని, రాజ్‌నాథ్‌కు ఫోన్ చేసి బుజ్జగించారని, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నచ్చజెప్పారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఆ క్రమంలోనే గురువారం రాత్రి రాజ్‌నాథ్‌కు మరిన్ని కమిటీల్లో చోటు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించడం వల్ల.. అన్ని అంశాలను పర్యవేక్షించే అధికారం రాజ్‌నాథ్‌కు ఉంటుందని, ఆయన ప్రొటోకాల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని మోదీ మద్దతుదారులు చెబుతున్నారు. -
ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు ఇవే... ►రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా ►టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్) ►నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్సీ) ►తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్,) ►వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) ►ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్) అయితే ఈ ఐపీఓ, ఎఫ్పీఓలు ఈ ఆర్థిక సంవత్సరంలోనా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనా అనే విషయాన్ని రవి శంకర్ ప్రసాద్ వెల్లడించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్‌యూలు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టింగ్‌కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది. -
ఇంక్రిమెంట్ కోసం 60 ఏళ్లుగా పోరాటం!
జైపూర్: కేంద్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు పొంది న ఓ అధ్యాపకుడు గత 60 ఏళ్లుగా తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం పోరాడుతున్నారు. రాజస్తాన్‌కు చెందిన రామావతార్ శర్మ(80) బర్మర్ జిల్లాలోని పద్రు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1958లో టీచర్‌గా చేరారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసి ఏడాదిపాటు కొనసాగేలా చేసే అధ్యాపకులకు రెట్టింపు ఇంక్రిమెంట్ ఇస్తామని 1960లో రాజస్తాన్ పంచాయితీ సమితి ప్రకటించింది. దీంతో ఆ స్కూల్లో 38గా ఉన్న విద్యార్థుల సంఖ్య 138కి చేరుకునేలా శర్మ చర్యలు తీసుకున్నారు. తాను 1962 నుంచి ఇప్పటివరకూ 170 సార్లు సెక్రటేరియట్‌కు వెళ్లినా రావాల్సిన ఇంక్రిమెంట్ దక్కలేదని శర్మ వాపోయారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేబినెట్ కమిటీ శర్మను సోమవారం ఆహ్వానించింది. -
స్మృతి ఇరానీ, అమిత్ షాకు ఎందుకు పడదు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా స్మృతి ఇరానీకి కీలకమైన మంత్రి పదవి లభించినప్పటికీ ఏ కేబినెట్ కమిటీల్లోనూ స్థానం లభించక పోవడం పార్టీ లోపల, వెలుపల చర్చనీయాంశం అయింది. ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీల్లోకిగానీ భద్రత, నియమకాలు, అకామిడేషన్ లాంటి మంత్రివర్గ కమిటీల్లోకిగానీ ఆమెను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పదవంటే ప్రభుత్వానికి ప్రతిబింబం లాంటిది. అలాంటి కీలక పదవిని నిర్వహిస్తున్న వారికి కేబినెట్ కమిటీల్లో స్థానం కల్పించడం పరిపాటి. స్మృతి ఇరానీకి ముందు సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతలను స్వీకరించిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుకు కూడా పలు కమిటీల్లో భాగస్వామ్యం కల్పించారు. వారికి ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి కనుక కేబినెట్ కమిటీల్లో స్థానం కల్పించి ఉండవచ్చని ఎవరైనా వాదించవచ్చు. కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనీష్ తివారీ సహాయ మంత్రిగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు పనిచేసినప్పటికీ ఆయనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి శాశ్వత ఆహ్వానితునిగా తీసుకున్నారు. అలాంటిది స్మృతి ఇరానీని క్యాబినెట్ కమిటీల్లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆమె అంటే పడక పోవడమే కారణమని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ బీజేపీ నాయకుడు తెలిపారు. ఎందుకు పడదని రెట్టించి ప్రశ్నించగా ‘వెళ్లి అమిత్ భాయ్’నే అడగమని సమాధానం చెప్పిన ఆయన అంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. 2015, మార్చి నెల నుంచి వారి మధ్య సఖ్యత లేదని, అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ కార్యవర్గం నుంచి స్మృతి ఇరానీని తొలగించారు. ఎంతో మంది కేబినెట్ మంత్రులను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి కొత్తగా తీసుకున్నప్పటికీ ఆమెను తొలగించడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, స్మృతి ఇరానీని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రిగా తొలిసారి తన కేబినెట్లోకి తీసుకున్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జౌళి శాఖకు మారినప్పటి నుంచి ఆమెను ఏ కేబినెట్ కమిటీల్లోకి తీసుకోలేదు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చి వెంకయ్య నాయుడు తప్పుకోవడంతో ఆయన స్థానంలో స్మృతి ఇరానీకి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ దక్కింది. ఆమె తిరిగి తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంటున్నారని, ఆమె తన వారసురాలిగా ఎంపికవడం పట్ల వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆమెను కేబినెట్ కమిటీల్లోకి తీసుకోకపోవడం అమిత్ షాకు ఇష్టం లేకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకు ఇష్టంలేదు, ఆమె అంటే ఆయనకు ఎందుకు చెడిందన్న ప్రశ్నకు మాత్రం ఎవ్వరూ బయటకు సమాధానం చెప్పడం లేదు. -
ఎయిర్ ఇండియా విక్రయం.. నిపుణులకోసం కసరత్తు
ముంబై: ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలనుకుంటున్న కేంద్ర సర్కారు ఇందుకు సంబంధించి లావాదేవీ సలహాదారులు, న్యాయ సలహాదారులు, ఆస్తుల విలువ మదింపు దారులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ దిశగా ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ త్వరలోనే ఆహ్వానం పలకనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జూన్ 28న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎటువంటి గడువును పేర్కొనకపోయినప్పటికీ, రానున్న 12–18 నెలల్లో విక్రయాన్ని పూర్తి చేయాలనుకుంటోంది. -
గ్లాండ్ ఫార్మా డీల్‌కు బ్రేక్!
♦ అభ్యంతరం తెలిపిన కేబినెట్ కమిటీ ♦ నిలిచిపోయిన రూ.8,800 కోట్ల డీల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్లాండ్ ఫార్మాలో మెజారిటీ వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌నకు చుక్కెదురైంది. గ్లాండ్ ఫార్మాలో 86 శాతం వాటాను రూ.8,800 కోట్లకు దక్కించుకునేందుకు షాంఘై ఫోసన్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమావేశమైన కేబినెట్ ఎకనమిక్ అఫైర్స్ కమిటీ ఈ డీల్‌పై పలు అభ్యంతరాలను లేవనెత్తింది. గ్లాండ్ ఫార్మా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఇంజెక్టబుల్ సాంకేతిక పరిజ్ఞానం మరో దేశం చేతుల్లోకి వెళ్తోందని కేబినెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు షాంఘై ఫోసన్ డీల్‌కు ఏప్రిల్‌లో అంగీకారం తెలుపుతూ కేబినెట్ కమిటీ అనుమతి కోసం ప్రతిపాదించింది. కేబినెట్ కమిటీ మాత్రం అభ్యంతరాలు లేవనెత్తింది. డీల్ కుదిరితే గ్లాండ్‌లో 100 శాతం వాటాను ఇతర షేర్‌హోల్డర్ల నుంచి దక్కించుకోవడానికి ఫోసన్‌కు వీలుకలుగుతుంది. అలాగే చైనా కంపెనీకి భారత్‌లో ఇదే అతిపెద్ద ఒప్పందం కానుంది. కాగా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని గ్లాండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రవి పెన్మత్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రవి పెన్మత్స, అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ కంపెనీ కేకేఆర్‌కు గ్లాండ్‌లో 95 శాతం వాటా ఉంది. -
‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే
రూ.3,631 కోట్ల అంచనా వ్యయం, ఐదేళ్లలో పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది. గుంటూరు–గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్ ఉందని, డబుల్ లైన్ నిర్మాణంతో భవిష్యత్తు అవసరాలనూ తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైల్వే లైన్ వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు వివరిం చారు.రాయల సీమనుంచి రవాణా మెరుగు అవుతుం దన్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరేందుకు సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. -
రెగ్యులరైజ్ చేయలేం
- కాంట్రాక్ట్ ఉద్యోగులపై మంత్రివర్గ ఉపసంఘం స్పష్టీకరణ - క్రమబద్ధీకరణకు ఇబ్బందులున్నాయని వెల్లడి - ఎన్నికల హామీ అమలు చేయకుండా చేతులెత్తేసిన సర్కారు - 50 శాతం జీతాల పెంపునకు ఆమోదం.. కేబినెట్‌కు సిఫార్సు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీ కరించేది లేదని అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయమై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళ వారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సమావేశమైంది. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బందులు ఉన్నందున వారికి 50% జీతాలు పెంచాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌కు సిఫార్సు చేస్తూ ఉపసంఘంలోని మంత్రులు యనమల, గంటా, కామినేని, కాల్వ శ్రీనివాసులు నిర్ణయించారు. ఉపసంఘం నిర్ణయాలను మంత్రులు కాల్వ, కామినేని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 26,664 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.199.74 కోట్లు భారం పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆయా శాఖలే తమ బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఏ శాఖ అయినా ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగుల్ని నియమించుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యూవల్స్‌ను ఆయా శాఖలే చేసుకుని, వాటిని ఆర్థిక శాఖకు అందించాలని చెప్పారు. -
కలెక్టర్లకే డబుల్ బెడ్రూం ఇళ్ల నిధులు
డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రగతిపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష కాంట్రాక్టర్లకు భరోసా కోసం తాయిలాలు... ఉచితంగానే ఇసుక, కంపెనీ ధరలకే సిమెంటు సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ పడింది. దీన్ని వేగవంతం చేయడానికి తీసుకోవా ల్సిన చర్యలపై కమిటీ సోమవారం సమావేశమైంది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ధర గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడంతో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యం లో ఇళ్ల నిర్మాణంలో సమస్యల పరిష్కారం కోసం గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమా వేశంలో మంత్రులు టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పి.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించారు. కంపెనీ ధరకే సిమెంట్‌ను అందించ డానికి కంపెనీలు అంగీకరించాయి. ఇళ్ల నిర్మాణానికి మార్కెట్ కంటే రూ.50–70 తక్కువగా రూ.230కే బస్తా సిమెంటు అందనుంది. ఇళ్లను వేగంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు వెసులుబాట్లను కల్పించా లని ఉపసంఘం సిఫారసు చేసింది. పనులు పూర్త య్యాక జిల్లా స్థాయిల్లోనే చెల్లింపులు చేయడానికి నిధుల విడుదల అధికారాలను కలెక్టర్లకు అప్పగించాలని సీఎంకు సిఫారసు చేయనుంది. ఏడాదిలో 2.60 లక్షల ఇళ్లు లక్ష్యం ఈ ఏడాదిలో కనీసం 2.60 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరిలోగా టెండర్లను పూర్తిచేసి, ఇళ్ల నిర్మాణాలను ఏడాది చివరిలోగా పూర్తిచేయడానికి కలెక్టర్లతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం కోరింది. సీనరేజ్ చార్జీలను తగ్గించడం, ఇసుక, ఇతర మెటీరియల్ ఉచితంగా అందించడం వల్ల ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణానికి కనీసం రూ.100–110 మేర వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. నోడల్ అధికారిని నియమించే యోచన: ఇంద్రకరణ్‌రెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించామని, తీసుకున్న పలు నిర్ణయాలను సీఎంకు నివేదిస్తామని తెలిపారు. బూడిద ఇటుకల తయారీ కోసం ఫ్లయిగ్ యాష్‌ను ఉచితంగా తరలించడానికి ఎన్టీపీసీ అంగీకరించిందని పేర్కొన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 9 నుంచి బడ్జెట్ సమావేశాల మలి దశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్(మార్చి 8) ముగిసిన తర్వాతి రోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్ని జనవరి 31న ప్రారంభించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంతకుముందే సూచించింది. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి. -
దేవుడితో ‘అసెస్మెంట్’ దందా
దేవాదాయశాఖ పరిధిలోకి ఆలయాల మళ్లింపులో చేతివాటం - రూ. 50 వేల పరిమితి ప్రాతిపదికగా 633 ఆలయాలకే గుర్తింపు - ఇప్పుడు వాటి సిబ్బందికే కొత్త వేతన విధానం అమలు యోచన - మిగతా ఆలయాల్లో అలజడి - అస్తవ్యస్త విధానాన్ని పట్టించుకోని మంత్రివర్గ ఉపసంఘం సాక్షి, హైదరాబాద్: ‘‘నెలకు రూ.50 వేలకుపైబడి ఆదాయం ఉన్న దేవాలయాలకు కొత్త వేతన విధానం అమలు చేయాలి’’ ఇది తాజాగా దేవాదాయశాఖ పనితీరును సమీక్షించి సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నిర్ణయం. ఇప్పుడీ వ్యవహారం దేవాదాయశాఖలోని అస్తవ్యస్త వ్యవస్థను మరోసారి బట్టబయలు చేసింది. ఇంత ఆదాయం ఉన్న ఆలయాల ఆదాయన్ని సమీక్షించి దేవాదాయశాఖ అధీనంలోకి తీసుకుని, నిర్వహణకు సిబ్బందిని నియమించి కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు కొత్త వేతన విధానం అమలు చేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. కానీ... అలా సమీక్షించిన దేవాలయాల జాబితాలో లేని ఆలయాల్లో చాలావాటి ఆదాయం మరింత ఎక్కువగా ఉంది. కానీ అవి దేవాదాయశాఖకు పన్ను చెల్లించ డం లేదు. ఇప్పటికీ పాలకమండళ్ల అధీనంలో అవి నడుస్తున్నారుు. అలాంటి ఆలయాలు దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లకుండా కొందరు తెరవెనక చక్రం తిప్పుతున్నారని, ఇందులో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనేది తాజాగా వెల్లడైన వివాదం. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా దృష్టి సారించి దేవాదాయశాఖలో జరుగుతున్న ఇష్టారాజ్యానికి చెక్ చెప్పాల్సి ఉంది. కానీ.. ఆ తేనెతుట్టెను ముట్టుకోవడం కంటే.. జాబితాలో చోటు దక్కించుకున్న తక్కువ సంఖ్యలోని ఆలయాలకే కొత్త వేతనాలను వర్తింపజేసి చేతులు దులుపుకోవాలనే సూచనలు వారి చెవులకందుతుండటం విశేషం. ఏంటీ గందరగోళం..? ప్రస్తుతం రాష్ట్రంలో దేవాదాయశాఖలో రిజిస్టర్ అరుున దేవాలయాలు 12 వేలకుపైగా ఉన్నారుు. రిజిస్టర్ కానివి వేలల్లో ఉన్నారుు. దేవాదాయశాఖ నోటిఫై చేసిన (అసెస్డ్) ఆలయాలు మాత్రం కేవలం 633. వీటిల్లో సిబ్బం దితోపాటు అర్చకులకు ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆల య ఉద్యోగులు, అర్చకుల డిమాండ్ మేరకు ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లించాలని నిర్ణరుుంచింది. ఈ నిర్ణయాన్ని కేవలం ఈ 633 ఆలయాలకే వర్తింపజేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. ఇక్కడే వివాదం రాజు కుంది. తామేం తప్పు చేశామంటూ మిగతా ఆలయాల అర్చకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు గుట్టు వెల్లడవుతోంది. రూ. 50 వేలు వస్తున్న ఆలయాలన్నింటితో అసెస్డ్ జాబితాను రూపొందిం చారు. కానీ.. అసెస్డ్ జాబితాలో లేని చాలా ఆలయాల ఆదాయం అంతకంటే చాలారెట్లు అధికంగా ఉంది. వాటిని దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లకుండా ఆ ఆలయాల పాలకమండళ్లు తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారుు. దీనివల్ల వాటి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన 12 శాతం కాంట్రిబ్యూషన్ రాకపోవటమే కాకుండా, ఆలయానికి వస్తున్న భారీ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పోరుుంది. వీటిలో కొన్ని ఆలయాలను అసెస్ చేసేందుకు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసినా స్వయంగా కొందరు మంత్రులు రంగంలోకి దిగి వాటిని ఉపసంహరింప చేస్తున్నట్టు ఆరోపణలున్నారుు. ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని దైవసన్నిధానానికి అధికారులు నోటీసు జారీ చేసినా ఓ నేత ఒత్తిడితో అది వెనక్కు మళ్లింది. చాలా ఆలయాల పరిస్థితి ఇదే. దేవాదాయశాఖలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. -
సచివాలయం అప్పగింతపై మంత్రివర్గ ఉపసంఘం
- దాని నివేదికను బట్టి నిర్ణయం - కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాల పరిశీలనకు మరో సంఘం - పలు సంస్థలకు భారీగా భూకేటాయింపులు - మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపసంఘం ఇచ్చిన నివేదికను బట్టి భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వ్యవహారాలపై చర్చించేందుకు మరో ఉపసంఘాన్ని నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడించారు. ► హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను అప్పగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంపై చర్చ. ఏపీ సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, దీంతోపాటు పునర్విభజన చట్టం ప్రకారం అప్పగింత వల్ల చట్టప్రకారం ఎదురయ్యే సమస్యలను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలి. కమిటీ సభ్యులు, దాని గడువుపై త్వరలో జీఓ జారీ చేయాలని నిర్ణయం. ► కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహారాలను చర్చిం చేందుకు మరో ఉపసంఘం ఏర్పాటు. ► మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని 2005-2010 విధానం ప్రకారం ఏర్పాటైన 62 టెక్స్టైల్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ యూనిట్‌కు 0.75 పైసల నుంచి రూపాయికి పెంపు. 2010-15 విధానం ప్రకారం ఏర్పడిన 32 స్పిన్నింగ్ మిల్లులు బాగా నష్టాల్లో ఉండడంతో 0.75 పైసలున్న విద్యుత్ సబ్సిడీ రెండు రూపాయలకు పెంపు. ► పశుగ్రాస అభివృద్ధి విధానం 2016-2020కి రూపకల్పన. రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులు, ఉత్పత్తిదారుల కోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ మిత్ర ఫెడరేషన్’ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక చేయూత. రైతు ఉత్పత్తిదారుల సంస్థల, గొర్రెల పెంపకందార్లకు బ్యాంకు రుణాలిచ్చేందుకు వంద జీవాలు ఒక యూనిట్‌గా రెండు లక్షలకు మించకుండా 50 శాతం సబ్సిడీ, మిగిలిన సొమ్ముకు పావలా వడ్డీతో రుణం మంజూరు. ► ఉడా (విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో భూసమీకరణ పథకం నిబంధనలు-2016 రూపకల్పన, అమలుకు ఆమోదం. ► మరో నాలుగు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్, ఆర్ ఎస్ ట్రస్ట్ (వెల్‌టెక్), వరల్డ్ పీస్ యూనివర్సిటీ (మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్), గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం. ► విజయవాడలో భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) ఏర్పాటుకు ఆమోదం. ► విశాఖ జిల్లా మాకవారిపాలెం మండలం రామన్నపాలెంలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఫ్రిజీరియో కన్జర్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 115 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీఐఐసీకి అనుమతి. ఈ భూముల్లో రెండు దశల్లో రూ.160 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణం. ► వివిధ శాఖల్లో కొత్తగా 500 పోస్టుల మంజూరు, పదోన్నతికి అంగీకారం. దీంతో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 21.70 కోట్ల భారం పడుతుంది. ► సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటించాలని కేంద్రం నిర్ణయించడంపై హర్షం. భారీ భూకేటాయింపులు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎప్పటి మాదిరిగానే భారీగా భూకేటాయింపులు చేసేందుకు మంత్రివర్గ ఆమోదించింది. ► విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో 78 ఎకరాలను ఎకరం 8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపు. ► ఏపీఐఐసీకి ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలోఎకరాకు రూ. 18 లక్షల చొప్పున చెల్లించేలా 129.99 ఎకరాల భూమి కేటాయింపు. ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని ఆముదాలపాడులో ఏపీజెన్కోకు చెందేలా దామోదర సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించిన అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం 4.96 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ. 10.25 లక్షలు, ముతుకూరు మండలంలోని పిడతపోలూరులో ధర్మల్ స్టేషన్‌కు అప్రోచ్ రోడ్ కోసం 3.29 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ.10.25 లక్షలకు, ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామంలో అప్రోచ్ రోడ్ కోసం 1.12 ఎకరాల భూమిని ఎకరం రూ. 10.25 లక్షలు, నేలటూరు గ్రామంలో 13.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం రూ. 9.75 లక్షలకు కేటాయింపు. ► సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ వారికి సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు గుంటూరు నగరంలో 400 చ.గ స్థలం లక్ష రూపాయలకు కేటాయింపు. ► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు 69.03 ఎకరాలు (67.40 ఎకరాల డీకేటీ భూమి, 1.63 ఎకరాల ప్రభుత్వ భూమి) ఎకరం రూ. 5 లక్షల చొప్పున చెల్లించేలా జీఓ నెం. 155 (19-4-2016) మేర కేటాయించేందుకు ఆమోదం. ► చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం శ్రీనివాసపురం, చిందేపల్లి, పంగూరు గ్రామాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు 255.09 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం. ► అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సమగ్ర మంచినీటి సరఫరా మెరుగుదల పథకానికి 23 ఎకరాల భూమిని మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ. 3.50 లక్షల చొప్పున కేటాయింపు. ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో రోజుకు మూడు వేల టన్నుల సామర్థ్యంతో చక్కెర శుద్ధి కర్మాగారం స్థాపన కోసం నెక్కంటి మెగా ఫుడ్ పార్క్‌కు 52.22 ఎకరాలు కేటాయింపు. -
రైల్వే నెట్వర్క్ బలోపేతం
- విజయవాడ-గూడూరు మధ్య రూ. 3,875 కోట్లతో మూడో లైను నిర్మాణం - తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ మార్గంలో మూడో లైను - బల్లార్షా-కాజీపేట్ మూడో లైనుకు రూ. 2,403 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్‌ను మరింత పటిష్టపరిచే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 24,374.86 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 9 రాష్ట్రాల్లో కీలక మార్గాల బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. పలు కీలక రైల్వే నిర్ణయాలు: ► విజయవాడ జంక్షన్- గూడూరు జంక్షన్ మధ్య రూ. 3,246.26 కోట్ల అంచనా వ్యయంతో 287.67 కి.మీ. మేర మూడో రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పారు. ఈ లైను పూర్తయ్యేందుకు రూ. 3,875.68 కోట్లు కావొచ్చని అంచనా. ఈ మార్గం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గుండా వెళుతుంది. కృష్ణపట్నం, సమీప పోర్టుల నుంచి వస్తు రవాణా చేసుకునే సామర్థ్యం పెంపు. ► తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు ఢిల్లీకి వెళ్లే మార్గాల్లో కీలకమైన జంక్షన్ల మధ్య మూడో లైనును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కాజీపేట్-బల్లార్షా మధ్య 201.04 కి.మీ.ల మూడో లైను (రూ. 2,063.03 కోట్ల అంచనాతో) ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర గుండా ఈ మార్గం ఉంది. ► దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలోనే నాగ్‌పూర్-ఇటార్సీ జంక్షన్ మధ్య రూ. 2,449.91 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైను (280 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆమోదం. ఐదేళ్లలో పూర్తికి నిర్ణయం. -
‘జోనల్’ గందరగోళం తొలగించాలి
- జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్లపై చర్చ అవసరం - ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్ల మార్పు అంశాలపై లోతైన చర్చ, అధ్యయనం అవసరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా పని మేం చేస్తాం అంటే కుదరదని, ఇది ప్రజాస్వామ్య దేశమని.. ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జోనల్ వ్యవస్థతో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని, దీనిపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చి గందరగోళాన్ని పోగొట్టాలన్నారు.ఇందుకు కేబినెట్ కమిటీ, అధికారుల కమిటీలు వం టివి వేసి సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని సీఎం కేసీఆర్‌కు సూచిం చారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ విద్యా వంతుల వేదిక’ రూపొందించిన ‘మరో ఉదయం’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలసి కోదండరాం ఆవిష్కరించారు. పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని, ఆ పాలన పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. స్థానిక రిజర్వేషన్లపై 1970లో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయని, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ దీనిపై నివేదికను ఇచ్చిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆలోచనా, ప్రజాభిప్రాయ సేకరణ చాలా అవసరమని, దుబారాగా నిధులు ఖర్చు చేస్తే అది రాజ్యాంగ స్ఫూర్తి కాదన్నారు. ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు పరిశీలించాలన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ ప్రజలు పోరాటంలో ముందుంటున్నారన్నారు. ఏపీలో రాజధాని పేరిట 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎలా ఉద్యమించాలనే విషయం వారికి అంతుపట్టట్లేదని, కానీ మల్లన్నసాగర్ విషయంలో ఇక్కడ ప్రజలంతా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉంటే నయీమ్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడని, అతడిని పెంచి పోషించింది గత పాలకులేనని ఆరోపించారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధా న కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, అడ్వొకేట్ జేఏసీ నాయకుడు ప్రహ్లాద, మహిళా విభాగం కన్వీనర్ రమాదేవి ప్రసంగించారు. -
శరవేగంగా కొత్త జిల్లాల కార్యాచరణ
హుటాహుటిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ జిల్లాలవారీగా రేపటి నుంచి 3 రోజులు సమావేశాలు హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం హుటాహుటిన రంగంలోకి దిగింది. బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన మరో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యా రు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభిప్రాయాలు, ప్రతిపాదనలను పరిశీ లించారు. అధికారులతో చర్చించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసేలోపు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వరుసగా పది రోజుల పాటు సమావేశాలు, సమీక్షలు జరపాలని నిర్ణయిం చారు. వీటిలో వచ్చే అభిప్రాయాలు, నిర్ణయాల మేరకు జిల్లాల కసరత్తును కొలిక్కి తెస్తారు. 12 నుంచి సమావేశాలు: తాజా షెడ్యూలు ప్రకారం ఒక్కోరోజు మూడు నాలుగు చొప్పున శుక్రవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్; 13న కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం; 14న మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజాప్రతి నిధులు, కలెక్టర్లతో సమావేశాలుంటాయి. ఆయా జిల్లాల మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు పాల్గొంటారు. జిల్లాకు 2 గంటల సమయం కేటాయించి చర్చించనున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాలతో భేటీ జోనల్ వ్యవస్థతో పాటు ఉద్యోగుల విభజన తదితరాలపై శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో ఉపసంఘం ప్రత్యేకంగా భేటీ కానుంది. తర్వాత ఈ నెల 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త జిల్లాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు బుధవారమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులిచ్చారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కన్వీనర్‌గా, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ కార్యదర్శిగా ఉంటారు. కొత్త జిల్లాల సంఖ్య, వాటి ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లు, ఆఫీసులు, ఉద్యోగుల విభజన, జోన్ల విధాన మార్గదర్శకాలు తదితరాలపై సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించారు. కమిటీ ఖరారు చేసిన తాజా షెడ్యూలు ఆగస్టు 12: ఉద్యోగ సంఘాలతో కమిటీ ప్రత్యేక భేటీ ఆగస్టు 12: ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు ఆగస్టు 13: కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఆగస్టు 14: మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్