జైపూర్: కేంద్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు పొంది న ఓ అధ్యాపకుడు గత 60 ఏళ్లుగా తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం పోరాడుతున్నారు. రాజస్తాన్‌కు చెందిన రామావతార్ శర్మ(80) బర్మర్ జిల్లాలోని పద్రు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1958లో టీచర్‌గా చేరారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసి ఏడాదిపాటు కొనసాగేలా చేసే అధ్యాపకులకు రెట్టింపు ఇంక్రిమెంట్ ఇస్తామని 1960లో రాజస్తాన్ పంచాయితీ సమితి ప్రకటించింది. దీంతో ఆ స్కూల్లో 38గా ఉన్న విద్యార్థుల సంఖ్య 138కి చేరుకునేలా శర్మ చర్యలు తీసుకున్నారు. తాను 1962 నుంచి ఇప్పటివరకూ 170 సార్లు సెక్రటేరియట్‌కు వెళ్లినా రావాల్సిన ఇంక్రిమెంట్ దక్కలేదని శర్మ వాపోయారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేబినెట్ కమిటీ శర్మను సోమవారం ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment