govt teacher
-
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది. ఏడాది కిందటి వరకు చిత్తూరులో టీచర్‌గా పనిచేసిన ఆమె ఇంటికి దగ్గరగా ఉండాలని కోరి మరీ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కానీ అంతలోనే విధి వెక్కిరించి ఆమెను తీసుకెళ్లిపోయింది. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతి చెందా రు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండేవారే. ఏడాది కిందటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని టెక్కలి మండలం సన్యాసిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆమె స్వగ్రామం నుంచి పాఠశాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. తిమ్మాపురం నుంచి కోటబొమ్మాళి వరకు బస్సులో వచ్చి.. అక్కడ ఉంచిన తన స్కూటీపై బడికి వెళ్లేవారు. బుధవారం కూడా కోటబొమ్మాళి నుంచి తన పాఠశాలకు వెళ్లేందుకు గాను టెక్కలి వైపుగా స్కూటీపై బయల్దేరారు. అదే సందర్భంలో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఏపీ 39 జేక్యూ5568 నంబర్ గల కారు జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న త్రివేణి బండిని ఢీకొని అప్రోచ్ రోడ్డులోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాదంలో టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టెక్కలి మండల ఎంఈఓలు తులసీరావు, చిన్నారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయురాలి మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. త్రివేణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. టీచర్ చనిపోయారని తెలిసి సన్యాసిపేట వాసులు ఘట నా స్థలానికి చేరుకుని రోదించారు. కోటబొమ్మాళి ఎస్ఐ బి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పిల్లలను అంగన్వాడీలో ఉంచి..ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (30) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెద్ద కుమార్తె చైత్ర, చిన్న కుమార్తె ఇషికలను అంగన్వాడీ కేంద్రంలో విడిచిపెట్టి ఆమె స్కూల్‌కు బయల్దేరారు. అంతలోనే ఆమె చనిపోయారన్న వార్త తెలియడంతో భర్త సింహాచలంతో పాటు స్థానికులు నిశ్చేషు్టలయ్యారు. సాయంత్రానికి అమ్మ వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న ఆ చిన్న పిల్లలను చూసి కంట తడి పెట్టారు. వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి.. -
సర్కస్ కాదు.. సర్కారు ఉద్యోగి సాహసం
-
ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం
సాక్షి, టాస్‌్కపోర్సు: అధికార దర్పంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. తమ ఆగడాలను అడ్డుకున్న వారిపై విరుచుకుప డుతున్నారు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఓ టీడీపీ నాయకుడు ఇష్టారీతిన బూతులు తిడుతూ బెదిరించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లె గ్రామంలో జరిగింది. ఇటీవల రేషన్ డీలర్షిప్ దక్కించుకున్న టీడీపీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలు దించుతుండగా విద్యార్థులకు ఇబ్బంది అంటూ ఓ ఉపాధ్యాయుడు అడ్డు చెప్పారు. దీంతో టీడీపీ నేత బూతులతో చెలరేగిపోయాడు. ‘ఎవడు ఎంఈవో.. చెçప్పుతో కొడతా.. ఏం పీకుతావ్ రా ఎర్రి.. (బూతు)? లోఫర్ నా కొడకా.. మాకు ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా? 164 సీట్లొచ్చాయి. స్టోర్ బియ్యం బడిలో ఎలా దించుతావని మమ్మల్నే ప్రశ్నిస్తావా? ఇక్కడ ఉండలేకపోతే ... (బూతు)’ అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు బిత్తరపోయాడు. సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే ఇలా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడంతో ఆ ఉపాధ్యాయుడు మిన్నకుండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ నాయకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత జరిగినా విద్యాశాఖ అధికారులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ స్పందించక పోవడం విచారకరం. -
రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్
మహబూబ్‌నగర్ క్రైం: కిరాణ సామాన్లు తీసుకుంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు గవినోళ్ల వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్ రోడ్డుపై ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస కాలనీకి చెందిన గవినోళ్ల వెంకట్‌రెడ్డి శనివారం సాయంత్రం 5:40గంటల ప్రాంతంలో ఎస్వీ మార్ట్ దగ్గర కిరాణా సామాన్లు తీసుకుంటున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ కొంతమందితో అక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు ప్రచారం చేశావని తనపై దాడి చేస్తూ సూపర్మార్కెట్లో నుంచి బయటకు తెచ్చారని వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. రెండు గంటల పాటు ధర్నా దాడిఘటనపై కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇటూ జడ్చర్ల వైపు అటూ బస్టాండ్ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ సమయంలో ఒకరిద్దరూ రోగులు ఆస్పత్రికి వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేస్తున్న వారితో జిల్లా అదనపు ఎస్పీ రాములు చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా వెంకట్‌రెడ్డి ఇంటికి ఇద్దరూ కానిస్టేబుల్స్‌ను రక్షణగా ఇచ్చారు. ఇది చదవండి: రిటైర్డ్ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్ -
ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
కరీంనగర్ రూరల్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్ పోలీసుల కథనంమేరకు కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్‌కుమార్(30)కు పదేళ్లక్రితం పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉందనే కారణంతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మంచిగా ఉంటానని పంచాయితీ పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఎన్నిసార్లు చెప్పిన తన భార్య వినకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లిన అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే భార్య వివాహే తర సంబంధమే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియో తీసి పెద్దబావ శ్రీనివాస్‌కు పంపించాడు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 2గంటలకు మృతిచెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. -
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
నంద్యాల: పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ వెంకటరెడ్డి అందించిన సమాచారం మేరకు.. స్థానిక రోజా డీఎడ్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న సౌభాగ్యలక్ష్మి(52) సంజామల మండలం ఆకుమల్ల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె కుమారుడు విక్రమ సింహారెడ్డి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సమస్యలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో అప్పటి నుంచి సౌభాగ్యలక్ష్మి తీవ్ర మానసిక వేదనతో భాదపడుతోంది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె బెడ్రూంలో నిద్రకు ఉపక్రమించింది. భర్త సుధాకర్‌రెడ్డి సోపాలోనే నిద్రపోయాడు. మానసిక క్షోభను ఎదుర్కొంటున్న సౌభాగ్యలక్ష్మి అర్ధరాత్రి బెడ్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం భర్త లేచి చూసే సరికి ఉరికి వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మూడేళ్ల వ్యవధిలో కుమారుడు, భార్యను కోల్పోయి సుధాకర్‌రెడ్డి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సీఎం యోగి ఆదేశాలు.. వీడిన మర్డర్ కేసు మిస్టరీ
లక్నో: అవును.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలతోనే ఆ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. అయోధ్య పర్యటనలో ఉండగా స్థానికంగా ఓ గర్భిణి హత్య గురించి విని ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా.. విమర్శల నడుమే ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆ కేసు చిక్కుముడి విప్పారు. అయోధ్య కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో జూన్ 1వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుప్రియా వర్మ(35) దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఎవరో ఆమె వీపుభాగంలో పొడిచి చంపి.. దొపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. పైగా ఆమె ఐదు నెలల గర్భవతి. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. ఆదేరోజు అయోధ్య పర్యటనలో ఉన్న సీఎం యోగికి విషయం తెలిసింది. వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్ డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈకేసులో విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో.. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఎం యోగి ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో టీషర్టు ధరించిన ఓ యువకుడిని గుర్తించారు. ఆ కంపెనీ టీషర్టుల ఆన్లైన్ డెలివరీల మీద ఆరా తీసి.. చివరికి నిందితుడిని పట్టేశారు. శారీరక సంబంధమే! అంబేద్కర్‌నగర్ జిల్లా పథాన్పూర్ ఎట్రావులికి చెందిన సుప్రియా వర్మ.. పోస్టింగ్ రిత్యా అయోధ్యలో ఉంటోంది. ఆమె భర్త ఉమేష్ వర్మ కూడా ప్రభుత్వ టీచరే. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న ఓ మైనర్‌తో ఆమె సంబంధం నడిపించింది. అయితే ఆమె గర్భం దాల్చడంతో భయపడ్డ మైనర్.. ఎలాగైనా ఆ సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ కుర్రాడు దారుణానికి తెగబడ్డాడు. హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు.. ఇంట్లో నుంచి యాభై వేల రూపాయల నగదును, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంవో కార్యాలయానికి అందజేసినట్లు అయోధ్య డీఐజీ ఏకే సింగ్ వెల్లడించారు. -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. -
ప్రతిభకు గుర్తింపు: విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్
ముదిగుబ్బ: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు. చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ చదవండి: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ -
పెళ్లయిన కొన్నాళ్లకే వరుడు కన్నుమూత.. విషాదంలో వధువు
బరంపురం: గంజాం జిల్లా సరగడ సమితిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యకాంత్ గౌడ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. సమితిలోని చికిలి గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యకాంత్ గౌడకు మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగి మూడు నెలలు కాకముందే ఆయన మృతిచెందిన వార్త జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నింపింది. సూర్యకాంత్ గౌడకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుదూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందారు. అయితే కరోనా భయంతో ఉపాధ్యాయుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు, స్నేహితులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తహసీల్దార్ స్పందించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. చదవండి: తండ్రి సాహసం.. బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై.. -
ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
యశవంతపుర: కరోనా భూతం ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకున్న ఘటన బాగలకోట తాలూకా దేవినాళ గ్రామంలో జరిగింది. వెంకటేశ్ ఒంటగోడి (45) అయన భార్య రాజేశ్వరి (40), రాజేశ్వరి తండ్రి రామనగౌడ (74), తల్లి లక్ష్మీబాయి (68)లు బలయ్యారు. మే 3 నుండి 15 వరకు వీరందరూ బాగలకోటలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుసగా మృతి చెందారు. రాజేశ్వరి ప్రభుత్వ టీచర్ కాగా, భర్త వెంకటేశ్ రామదుర్గలో ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అధికారి. ఇటీవల బెళగావి ఉప ఎన్నికలలో పనిచేసిన రాజేశ్వరికి మొదట కరోనా సోకింది. తరువాత కుటుంబసభ్యులందరికీ వ్యాపించింది. మరోవైపు బాగలకోట జిల్లా వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు మైనుద్దీన్ నబివాలె (57) కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. -
కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్ హత్య
మహబూబ్‌నగర్ క్రైం: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతున్నాడని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు. మొదట కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత చనిపోలేదని భావించి కత్తులతో గొంతుకోశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంటకి చెందిన నరహరి (40), అతడి భార్య అరుణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జిల్లా కేంద్రంలోని వైష్ణవిదేవి కాలనీలో నివాసం ఉంటున్నారు. నరహరి చిన్న చింతకుంట మండలం ఉంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన జగదీశ్ కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని సద్దల గుండు చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ.. మహబూబ్‌నగర్‌లో ‘వండర్ లైఫ్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే దాదాపు రెండేళ్ల నుంచి జగదీశ్‌తో నరహరికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ కోసం అవసరం ఉందని నరహరి దగ్గర దశల వారీగా జగదీశ్ దాదాపు రూ.కోటి వరకు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 నెలల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని జగదీశ్‌ను పలుమార్లు నరహరి అడుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి జగదీశ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన నరహరి.. అర్ధరాత్రి వరకు అక్కడే డబ్బుల విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిరోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో నరహరి అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత అక్కడి నుంచి బైక్‌పై తన ఇంటికి బయల్దేరాడు. అయితే షాషాబ్‌గుట్ట నుంచి భగీరథ కాలనీ వైపు వస్తుండగా.. మార్గమధ్యలో పసుల కిష్టారెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలో టీఎస్ 06 ఈఎస్ 3618 నంబర్ కలిగిన కారుతో వెనుక నుంచి నరహరి బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టారు. కిందపడిపోన నరహరి చనిపోలేదని భావించిన దుండగులు కత్తులతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం వారు ఉపయోగించిన కారును సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడా? టీడీపీ కార్యకర్తా?
సాక్షి, అనంతపురం: మంచి మాటలను బోధిస్తూ ఆ దారిలో నడవాల్సిన ఉపాధ్యాయుడు తప్పటగులు వేశాడు. రాజకీయాలకతీతంగా విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి టీడీపీతో చేతులు కలిపి అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. కదిరికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారు గంగాధర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తూ రాజధాని ఉద్యమాలు చేస్తున్నాడు. టీడీపీ నేతలతో కలిసి అమరావతి జేఏసీ సైతం ఏర్పాటు చేశాడు. అతని చేష్టలతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ!
సాక్షి, బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): విద్య నేర్పిన గురువును శిష్యులు సేవించి తరించడం చూశాం.. విద్యార్థులకు శ్రద్ధగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులనూ చూశాం.. కానీ, విద్యార్థులకు సొంత తండ్రిలా వారి ఆలనాపాలనా చేస్తున్న ఈ ప్రిన్సిపాల్ మాత్రం అందరికీ భిన్నం. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట సమీపంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ జీవీకే నాయుడు.. పాఠశాలలోని విద్యార్థుల్లో కొంతమందికి తరచూ ఈ ఫొటోలో ఉన్నట్లుగా తన స్వహస్తాలతో స్నానం చేయిస్తుంటారు. బయట వారికి ఇది కొత్తగా అనిపించినా ఇక్కడి పిల్లలకు మాత్రం ఇది మామూలే. తమ ఆలనాపాలన ఆయన దగ్గరుండి ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని విద్యార్థులు చెబుతున్నారు. చదువుపట్ల పిల్లలు మరింత శ్రద్ధ కనబరిచేందుకే ఆయన వారితో మమేకమై ఇలా చేస్తుంటారని.. విద్యార్థులతో కలిసి నిద్రిస్తుంటారని సహోపాధ్యాయులు చెబుతున్నారు. అన్నట్టు.. ఈ ప్రిన్సిపాల్ సేవా భావాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా పలుమార్లు పురస్కారాలు అందించింది. తల్లిలా శిక్షణ.. తండ్రిలా రక్షణ అంటే ఇదే కదూ! -
కష్టాలను గెలిచిన ముత్యం
చదువుకోవాలనే తపన ఉంటే పరీక్షల్లో ఫెయిలైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించాడు తాండూరు పట్టణానికి చెందిన ముత్యాల ప్రభు. నాన్న మంచం పట్టడంతో.. కుటుంబ భారాన్నంతా అమ్మ తనపై వేసుకుని నడిపించడాన్ని మర్చిపోలేదని చెప్పారు. 8 మంది సంతానానికి కూడు, గుడ్డ కోసం ఆమె పడిన ఇబ్బందులను కళ్లారా చూశాడు. ఇదే అతని పట్టుదలకు కారణమైంది. పక్క రాష్ట్రంలోని ఊరూరూ తిరిగి ముత్యాలమ్మిన ఆయన.. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. తాండూరు: పట్టణంలోని సాయిపూర్ ప్రాంతం ముత్యాల బస్తికి చెందిన ఒబులమ్మ, లక్ష్మణ్ దంపతులకు 8 మంది సంతానం. ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.. వీరిలో మూడవ కుమారుడు ముత్యాల సెని ప్రభు. ఈయన 1నుంచి 7వ తరగతి వరకు దయానంద్ బాలవిహార్ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం 8నుంచి 10వ తరగతి వరకు విలియమూన్ హైస్కూల్లో చదివాడు. అంబేడ్కర్ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరి.. ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయ్యాడు. అమ్మకు ఆసరాగా.. కుటుంబం గడవటం ఇబ్బందిగా మారడంతో ముత్యాల ప్రభు 1999లో చదువుకు బ్రేక్ వేశాడు. అమ్మ ఒబులమ్మ చేస్తున్న ముత్యాల వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అమ్మ, అన్నయ్య నుంచి రూ.5 వేలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి వెళ్లి ముత్యాలు, రోల్డ్ గోల్డ్ వస్తువులను కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, ముంబై తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి విక్రయించాడు. ఇలా వచ్చిన లాభాన్ని అన్న, తమ్ముళ్ల చదువు కోసం ఖర్చు చేశాడు. వీరిలో ఒక అన్న టీచర్‌గా, ఇద్దరు తమ్ముళ్లు పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరో అన్న పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. వీరి ఎదగడంలో ప్రభు కృషి ఎంతగానో ఉంది. ఉన్నత చదువులు.. ఇంటర్లో ఫెయిలైనా కూడా చదువుకునే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రభు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్టడీ సర్కిల్లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం నిర్వహించిన అర్హత పరీక్షలో పాసయ్యాడు. తర్వాత ముత్యాల వ్యాపారం చేస్తూనే 9 ఏళ్ల పాటు చదువును కొనసాగించాడు. డిగ్రీ అనంతరం పీజీ పూర్తిచేశాడు. తర్వాత బీఈడీలో చేరాడు. వైఎస్సార్ హయాంలో నిర్వహించిన 2008 డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విజయవాడ వెళ్లి మూడు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అర్హత సాధించాడు. తాండూరు మండలం రాంపూర్‌తండా ప్రాథమిక పాఠశాలలో తొలిసారి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాండూరు మండలం పర్వతాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ప్రోత్సాహం.. తన విజయంలో భార్య ఉమారాణి ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రభు చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రణవ్య, అక్షిత ఉన్నారు. ఉమారాణి మధ్యలోనే చదువు ఆపేసినా పెళ్లి తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఆత్మహత్యలు సరికాదు.. ఇంటర్లో ఫెయిలయ్యామనే కారణంతో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదు. చదువులేకపోయినా జీవితంలో ఎదిగేందుకు అనేక అవకాశాలు వస్తుంటాయి. అన్ని సమస్యలను అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. చదువులో ఫెయిలైతే బతుకు ముగిసినట్లు కాదు. -
టెన్త్‌లో రెండు, ఇంటర్లో మూడు సార్లు ఫెయిల్..
సూర్యాపేటటౌన్ : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొచ్చెర్ల వేణు. పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా చదువును మధ్యలో అపేయకుండా కొనసాగించాలనే సంకల్ఫమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటున్నాడు. ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అన్ని సార్లు ఫెయిల్ అయ్యావు.. ఇక ఏం చదువుతావులే అని అన్నప్పటికీ పట్టుదలతో చదివాడు. తండ్రి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు డబ్బులు ఇవ్వకున్నా తాను సొంతంగా లేబర్ పని చేస్తూ వచ్చే డబ్బులతో కోచింగ్ తీసుకొని టెన్త్, ఇంటర్లో పాసయ్యాడు. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల వేణు. తాను ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో అదే సబ్జెక్టు టీచర్‌గా కొనసాగుతున్నాడు. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల రాములు,లక్ష్మమ్మ కుమారుడు కొచ్చెర్ల వేణు. అతని తోడ ఇద్దరు చెల్లెళ్లు, అక్క, అన్నయ్య ఉన్నారు. తండ్రి రాములు సుతారి మేస్త్రీగా పని చేస్తూ పిల్లలను చదివించేవాడు. కాగా వేణు 7వ తరగతి చదువున్న సమయంలో తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి వేణుకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే వారి పెద్ద అక్కకు పెళ్లి చేశారు. ఇద్దరు చెళ్లెళ్లను ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. సమయానికి ఇంట్లో వండి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో వేణు, అతని అన్నయ్య ఇద్దరు కలిసి వండిపెట్టే వారు. ఇంట్లో పనులు చూసుకుంటూ వేణు స్కూల్‌కు వెళ్లేవాడు. ఫెయిల్ అయినా కుంగిపోలేదు సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో వేణు పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1982 మార్చిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వేణు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మళ్లీ సప్లమెంటరీ పరీక్ష రాసి సైన్స్ పాసయ్యాడు. మ్యాథ్స్ ఫెయిలయ్యాడు. 1983 మార్చిలో మళ్లీ పరీక్ష రాసి మ్యాథ్స్ ఉత్తీర్ణుయ్యాడు. అనంతరం ఇంటర్ విద్యకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. 1983–84లో ఇంటర్ ఫస్టియర్‌లో గణితం తప్పాడు. సప్లమెంట్ పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. 1984–85లో ఇంటర్ సెకండరియర్లో ప్రవేశించాడు. ఆ సంవత్సరం వార్షిక పరీక్షలో సెకండరియర్ ఉత్తీర్ణుయ్యాడు. కానీ, ప్రథమ సంవత్సరం గణితం మాత్రం పాస్ కాలేదు. ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ ఇంటర్లో పాస్ కాకపోవడంతో ర్యాంకు వచ్చినా నిష్పయోజనమైంది. ఎఫ్‌సీఐ గోదాంలో పని చేస్తూ.. ఇంటర్ ఫెయిల్ కావడంతో చేసేదేమీ లేక రెండు సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ గోదాంలో లేబర్‌గా పనికి కుదిరాడు. పని చేస్తూనే ఇంటర్లో తప్పిన సబ్జెక్టు కోసం ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యావు ..ఇక ఏం చదువుతావు లే.. పనికి వెళ్లూ అని తన తండ్రి చెప్పినా నిరాశ చెందలేదు. పనికి వెళ్తూనే ఫెయిల్ అయిన సబ్జెక్టులో పాస్ అయ్యేందుకు పట్టుదలతో చదివిడు. ఒక సంవత్సరం ఉప్పలపహాడ్ సమీపంలోని సంగీత కెమికల్స్‌లో పని చేసేవాడు వేణు. అలా పని చేసూకుంటూ 1987 అక్టోబర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్ష రాసి పాసయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1988లో సిటీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరాడు. డిగ్రీ చేస్తూనే వివిధ కంపెనీల్లో పార్ట్‌టైం పని చేస్తూ తన చదువుకు అయ్యే ఖర్చులు వెళ్లదీస్తూ చదివాడు. గణితంలో ఫెయిల్ అయ్యాననే కసితో... తాను టెన్త్, ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాననే కసితో మ్యాథ్స్‌ను బాగా నేర్చుకుని అదే సబ్జెక్టులో బీఈడీలో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. 1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. మొదటి ఉద్యోగాన్ని 1995లో ఆత్మకూర్(ఎం) మండలం కూరెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్న తి వచ్చింది. ప్రస్తుతం పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే కానీ.. పరీక్షే జీవితం కాదు. ప్రతి ఓటమిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి. మన బల, బలహీనతలను అంచనవేసుకొని ముందుకెళ్లాలి. ఎక్కడ అపజయం ఎదురైందో అక్కడే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. పరీక్ష ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందనే భావన మన మనసులో ఉండకూడదు. –కొచ్చెర్ల వేణు, స్కూల్ అసిస్టెంట్ పిల్లలమర్రి జెడ్పీహెచ్ఎస్ -
సార్ మీ ప్రవర్తన మార్చుకో..
కొండపాక(గజ్వేల్): విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్న ఉపాధ్యాయుడితో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక యువకులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కొండపాక మండలంలోని కుకునూరుపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గడీల సుధాకర్‌రెడ్డి అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు మూడు నెలల క్రితం బదిలీపై కుకునూరుపల్లి హైస్కూల్‌కు వచ్చాడు. నాటి నుంచి 9వ తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్నాడని బాధిత చిన్నారులు ఆరోపిస్తున్నారు. పాఠ్యాంశాల్లో అర్థం కాని విషయాలను అడిగితే ఛీదరించుకుంటూ, అవహేళనగా మాట్లాడుతుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వారు తమ కుటుంబీకులతో చెప్పడంతో స్థానిక యువకులతో కలిసి విషయం తెలసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థుల కుటుంబీకులకు, యువకులకు, ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి నడుమ మాటా మాటా పెరగడంతో విషయం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి కుకునూరుపల్లి హైస్కూల్‌కు చేరుకొని విద్యార్థుల కుటుంబీకులను, యువకులను, ఉపాధ్యాయుడిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. హెచ్ఎం గజ్జెల కనుకరాజు వైఖరిపై సైతం యువకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డిని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి మందలించారు. విద్యార్థులతో సరైన రీతిలో మెదగాలని సూచించారు. ఈ విషయమై ప్రధానోపాద్యాయుడు కనుకరాజుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
ఆ సారు మళ్ళీ తిరిగొచ్చేశారు
సాక్షి, చెన్నై: భగవాన్ మాస్టర్ బదిలీపై ఆందోళకు దిగిన విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు తమిళనాడు సర్కార్ దిగి వచ్చింది. భగవాన్ మాస్టర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ అంశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన బదిలీని నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. బదిలీని నిలిపివేయాలంటూ పిల్లలు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భగవాన్ను బదిలీ చేయడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. భగవాన్ మాస్టారు తిరిగి స్కూలుకు వచ్చారన్న వార్త విన్న విద్యార్థులు స్కూలుకు పరుగులు తీశారు. తమకు ఎంతో ఇష్టమైన టీచర్ తిరిగి రావడంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలు అంతా సంబురాలు చేసుకున్నారు. మాస్టారును హత్తుకుని తమ ప్రేమను చాటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పరిణామంపై ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తన కోసం పడ్డ తపన చూసి భగవాన్ కళ్లు చెమర్చాయంటూ భగవాన్ సంతోషం వ్యక్తంచేశారు. ఓ విద్యార్ధి తండ్రి మాటల్లో... 'నా కూతురు దేనికీ ఇంతగా సంతోషపడ లేదు' అని తొమ్మిదో తరగతి చదువుతోన్న సంఘవి అనే విద్యార్థిని తండ్రి వెల్లడించారు.' భగవాన్ సార్ ఏ పాఠమైనా అద్భుతంగా చెప్తారు. ప్రొజెక్టర్ల సాయంతో మాకు అర్థమయ్యే రీతిలో బోధిస్తారని విద్యార్ధులు తెలిపారు. కాగా తిరువల్లూరు జిల్లా వెల్లియగరం ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ టీచర్ భగవాన్ బదిలీకావడంతో అక్కడి విద్యార్థుల్లో తీవ్ర విచారాన్ని నింపింది. దీంతో వారు తమకెంతో ఇష్టమైన భగవాన్ సార్ తమను విడిచి వెళ్లడానికి అంగీకరించలేకపోయారు. మా సార్ మాకు కావాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
ఇంక్రిమెంట్ కోసం 60 ఏళ్లుగా పోరాటం!
జైపూర్: కేంద్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు పొంది న ఓ అధ్యాపకుడు గత 60 ఏళ్లుగా తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం పోరాడుతున్నారు. రాజస్తాన్‌కు చెందిన రామావతార్ శర్మ(80) బర్మర్ జిల్లాలోని పద్రు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1958లో టీచర్‌గా చేరారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసి ఏడాదిపాటు కొనసాగేలా చేసే అధ్యాపకులకు రెట్టింపు ఇంక్రిమెంట్ ఇస్తామని 1960లో రాజస్తాన్ పంచాయితీ సమితి ప్రకటించింది. దీంతో ఆ స్కూల్లో 38గా ఉన్న విద్యార్థుల సంఖ్య 138కి చేరుకునేలా శర్మ చర్యలు తీసుకున్నారు. తాను 1962 నుంచి ఇప్పటివరకూ 170 సార్లు సెక్రటేరియట్‌కు వెళ్లినా రావాల్సిన ఇంక్రిమెంట్ దక్కలేదని శర్మ వాపోయారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేబినెట్ కమిటీ శర్మను సోమవారం ఆహ్వానించింది. -
ఉపాధ్యాయుడి అద్బుత ప్రతిభ
-
ఫేస్బుక్లో రూ.8.52 లక్షలకు టోకరా
సాక్షి, పెనమలూరు: ఫేస్బుక్లో పరిచయమై రూ.8.52 లక్షలకు తనను మోసం చేశారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం కామయ్యతోపు (కానూరు)కి చెందిన కడియం శివ కామేశ్వరి నూజివీడులోని సీతారామపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఫేస్బుక్లో అశ్విధామ్సన్ అనే వ్యక్తితో శివ కామేశ్వరికి పరిచయం ఏర్పడింది. పదిహేను రోజుల క్రితం రూ .41 లక్షలు విలువైన ఆభరణాలు, సామాగ్రి బహుమతి వచ్చిందని శివకామేశ్వరికి ధామ్సన్ తెలిపాడు. స్థానిక చార్జీలు భరించాలన్నాడు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఎలైడ్ కొరియర్ సర్వీస్ నుంచి శివ కామేశ్వరికి ఫోన్ వచ్చింది. స్థానిక చార్జీలు కింద రూ 8.52 లక్షలు చెల్లించాలని కొరియర్ సర్వీస్ ప్రతినిధులు చెప్పారు. ఎస్బీఐ రెండు ఖాతాలు, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలకు శివకామేశ్వరి రూ 8.52 లక్షలు జమ చేసింది. డబ్బు చెల్లించినా కొరియర్ రాకపోవటంతో ఫేస్బుక్లో థామ్సన్‌తో సంభాషణ జరిపేందుకు ప్రయత్నం చేశారు. అయితే థామ్సన్ ఫేస్బుక్లో అందుబాటులోకి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన కామేశ్వరి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్ తెలిపారు. -
భార్య టెట్ పరీక్ష తాను రాస్తూ..
మహబూబ్‌నగర్ జిల్లా: భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు. తీరా అధికారులకు దొరికి పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పరీక్ష హాల్ నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పాన్‌గల్ మండలం రేమొద్దులు పాఠశాలలో పరంధామయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల టెట్ పరీక్షకు భార్యాభర్తలు ఇద్దరూ దరఖాస్తు చేశారు. ఆదివారం పరీక్షా కేంద్రంలో భార్యకు బదులుగా తాను రాస్తూ డీఈఓకు పట్టుబడ్డాడు. మరి ఏమైందో ఏమో గానీ కాసేపైన తర్వాత పరందామయ్య అక్కడి నుంచి జారుకున్నాడు. -
ఉపాధ్యాయుడి ఆత్మహత్య
వి.కోట: మండలంలోని గోనుమాకులపల్లెలో గురువారం ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గోనుమాకులపల్లెకు చెందిన నవీన్(27) కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు కిందికి దించి వి.కోట సీహెచ్‌సీకి తరలించారు. అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
అమ్మను మించిన అమ్మ
తాము జన్మనిచ్చిన ఒకరిద్దరు పిల్లల్ని ఉదయం నిద్రలేపడం.. వారి అల్లరిని భరించి స్నానం చేయించడం.. టిఫిన్ తినిపించి.. హోం వర్క్ చేయించి బడికి పంపేటప్పటికే అమ్మలు అలసిపోతున్నారు. సాయంత్రం మళ్లీ పిల్లలు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్లను నిద్రపుచ్చే వరకు అమ్మ అవస్థలు చెప్పలేం. కానీ పదకొండేళ్లుగా అనాథలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారిని 300 మంది ఆలనాపాలన చూస్తోంది ఈ అమ్మను మించిన అమ్మ. కేకేనగర్: వేలకు వేలు ఫీజులు పోసి చదివిస్తున్న పాఠశాలలకు వచ్చే పిల్లలు క్రమశిక్షణగా ఉండకపోతే వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ పంపుతున్నారు. అలాంటి రోజుల్లో అనాథ పిల్లలకు తల్లి, తండ్రి.. గురువు.. దైవం.. అన్నీ తానై నిలుస్తోంది ఓ ప్రేమమూర్తి. ఆమె తిరువణ్ణామలై జిల్లా జవ్వాదు పర్వత ప్రాంతంలోని హాస్టల్‌తో కూడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి. ఈ పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు హాస్టల్లో బసచేసి చదువుతున్నారు. వారిలో చాలామంది అనాథలు. మరికొందరు సమీప ప్రాంతంలోని గిరిజనుల బిడ్డలు. 2006వ సంవత్సరంలో మహాలక్ష్మి ఈ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వచ్చారు. మొదటిరోజు బడిలో పిల్లలన్ని చూస్తే అంతా జుట్టు పెంచుకుని, మాసిన బట్టలతో కనిపించారు. అందరూ శుభ్రంగా క్రాప్ చేసుకుని, ఉతికిన బట్టలు వేసుకుని రావాలని ఆమె పిల్లలకు చెప్పారు. మరుసటి రోజు నుంచి సగం మంది పిల్లలు స్కూలుకు రావడం మానేశారు. అసలు సంగతి ఏంటని వాకబు చేశారు. వారందరికీ క్రాప్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసింది. దీంతో ఆమె తల్లిడిల్లిపోయింది. మరుసటి రోజు నుంచి పిల్లలకు ఆమే స్నానం చేయించడం.. గోరుముద్దలు తినిపించడం.. పాఠశాల సమయం అయిపోయాక వారిని ఆడించడం మొదలుపెట్టారు. వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. చివరకు జుట్టు పెరిగి ఉన్న పిల్లలకు తానే క్రాప్ చేయడం ప్రారంభించారు. మొదట్లో తెలిసినట్లు ఎలాగో జుట్టు కత్తిరించారు. ఒకరికి క్రాప్ చేసేందుకు అరగంట పట్టింది. అయినా సరిగ్గా రాకపోవడంతో ఆమె సంతృప్తి చెందలేదు. కొద్దిరోజులు సెలూన్‌కు వెళ్లి క్రాప్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాల్లో క్రాప్ చేసి వారికి స్నానం చేయిస్తున్నారు. పిల్లల మొహంలో చిరునవ్వు చూడాలని.. తల్లిదండ్రులు లేని అనాథలు.. అమ్మానాన్న ఉన్నా వారికి దూరంగా ఉన్న వారిలో చిరునవ్వు చూడాలనుకున్నాను. పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. వారికి అమ్మా నాన్న లేని లోటు తీర్చాలనుకున్నాను. వారికి సేవ చేయడంలో నాకు ఎంతో తృప్తిగా ఉంది. వారంతా నా బిడ్డలుగానే భావిస్తున్నాను. – మహాలక్ష్మి -
గుండెపోటులో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని రాంలింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోచంపల్లికి చెందిన సంగెం మురళి(47) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. రాఖీ పండుగ కోసం బుధవారం తుంగతుర్తి మండలం తిరుమలగిరి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడే ఇతడికి గుండెపోటు వచ్చింది. ఇతను ఎమ్మార్పీ కార్యాలయంలో సీఆర్పీగా, పీఆర్టీయూ సంఘంలో వివిధ హోదాలో సేవలందించారు. ప్రస్తుతం పీఆర్టీయూ మండల కార్యదర్శిగా ఉన్నాడు. 2013లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. నిరుపేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన మురళి ఒకవైపు మగ్గం నేసుకుంటూనే, ఉన్నత చదువులు చదివి 1998 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. రాజపేట, వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఏడేళ్లుగా రాంలింగంపల్లి పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పలువురి సంతాపం... ఉపాధ్యాయుడు సంగెం మురళి మృతి పట్ల ఎంఈఓ రాజేందర్‌రెడ్డి, ఇంద్రియాల సర్పంచ్ బండి కృష్ణ, ఎంపీటీసీ సంతోశ్‌కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, జె.సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు కె.అనిల్‌కుమార్, రాష్ట్ర నాయకుడు వై.రవీందర్, సయ్యద్ అమర్, టీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇ.రఘునందన్, సుతారపు వెంకటనారాయణ, రాచకొండ మధుసూదన్, పోతగల్ల దానయ్య, నోముల మాధవరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఉపాధ్యాయుడు
కొత్తగూడ : సరదాగా గాలాలతో చేపల వేటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అందుగులగూడెం గ్రామానికి చెందిన మద్దెల శ్రీను(35) మండలంలోని కర్నెగండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. తన స్నేహితులు మహేష్, సారయ్యతో కలసి సరదాగా పాఖాల సరస్సుకు వెళ్లే బూర్కపల్లి వాగులో గాలాలతో చేపలు వేటాడేందుకు ఆదివారం వెళ్లారు. ముగ్గురు వేర్వేరు చోట్ల గాలాలు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం మహేష్, సారయ్యలు శ్రీను కూర్చున్న స్థలానికి రాగా ఆయన లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి వెళ్లిపోయారు. అయితే, శ్రీను ఇంటికి రాలేదని బార్య సరిత వాకబు చేసే సరికే చీకటి పడింది. ఈ మేరకు చేపల వేటకు వెళ్లిన వాగులో సోమవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వెతకగా శ్రీను మృతదేహం లభించింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు శరణ్య, స్నేహిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై వివరించారు. కాగా, శ్రీను మృతదేహం వద్ద ఆయన భార్య, పిల్లల రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
కీచక ఉపాధ్యాయుడు
► మహిళపై అత్యాచారయత్నం ► దేహశుద్ధి చేసిన మహిళ, బంధువులు పోరుమామిళ్ల: మండలంలోని మంగనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మంగళవారం ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగనపల్లె పాఠశాల పక్కనే వంట కోసం నిర్మించిన గది నిరుపయోగంగా ఉండటంతో అక్కడే నివసిస్తున్న ఓ కుటుంబం అందులో ధాన్యం, ఇతర వస్తువులు ఉంచుకున్నారు. రోజు లాగే మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంటికి చెందిన మహిళ వంటగదిలోకి వెళ్లి ధాన్యం తీసుకుంటుండగా, సదరు ఉపాధ్యాయుడు ఆ గదిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే ఆ మహిళ ప్రతిఘటించి పాదరక్షలతో దేహశుద్ధి చేసింది. దీంతో అతను పాఠశాల వదిలి మోటార్‌బైక్‌పై పొరుగూరికి వెళ్లి అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని తిరిగి వస్తుండగా మంగనపల్లె వద్ద ఆ మహిళ భర్త, బంధువులు మరోమారు దాడి చేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడి భార్య ప్రాధేయపడటంతో వారు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు ఇటీవల అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
కొడుకు వేధింపులతో తల్లి ఆత్మహత్య
పగిడ్యాల (కర్నూలు): డబ్బుల కోసం కుమారుడు వేధిస్తుండడంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పశ్చిమ పాతకోట గ్రామంలో ఆదివారం జరిగింది. చౌడమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. ప్రభుత్వ టీచర్‌గా పనిచేసిన భర్త రంగసాని మృతి చెందడంతో చౌడమ్మకు నెలకు రూ.10వేలు పింఛను వస్తోంది. ఆ డబ్బుల కోసం చిన్న కుమారుడు కొంత కాలంగా చౌడమ్మను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి తల్లిని కొట్టడంతో ఆమె తెలిసిన వారింట్లో ఆశ్రయం పొందింది. ఆదివారం వేకువజామున గ్రామంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.