గుండెపోటులో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
గుండెపోటులో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
Published Fri, Aug 19 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని రాంలింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోచంపల్లికి చెందిన సంగెం మురళి(47) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. రాఖీ పండుగ కోసం బుధవారం తుంగతుర్తి మండలం తిరుమలగిరి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడే ఇతడికి గుండెపోటు వచ్చింది. ఇతను ఎమ్మార్పీ కార్యాలయంలో సీఆర్‌పీగా, పీఆర్‌టీయూ సంఘంలో వివిధ హోదాలో సేవలందించారు. ప్రస్తుతం పీఆర్‌టీయూ మండల కార్యదర్శిగా ఉన్నాడు. 2013లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. నిరుపేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన మురళి ఒకవైపు మగ్గం నేసుకుంటూనే, ఉన్నత చదువులు చదివి 1998 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. రాజపేట, వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఏడేళ్లుగా రాంలింగంపల్లి పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
పలువురి సంతాపం...
ఉపాధ్యాయుడు సంగెం మురళి మృతి పట్ల ఎంఈఓ రాజేందర్‌రెడ్డి, ఇంద్రియాల సర్పంచ్ బండి కృష్ణ, ఎంపీటీసీ సంతోశ్‌కుమార్, పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, జె.సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు కె.అనిల్‌కుమార్, రాష్ట్ర నాయకుడు వై.రవీందర్, సయ్యద్ అమర్, టీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇ.రఘునందన్, సుతారపు వెంకటనారాయణ, రాచకొండ మధుసూదన్, పోతగల్ల దానయ్య, నోముల మాధవరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement