Heart
-
13 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు.. 13 నిమిషాలు..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్‌కు గ్రీన్‌చానల్ ద్వారా మెట్రో రైల్లో గుండెను తరలించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని, ఖైరతాబాద్ గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు.డాక్టర్ అజయ్‌జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆస్పత్రికి చేరుకుని, దాత శరీరం నుంచి గుండెను సేకరించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో దీన్ని తీసుకుని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య బృందం రాత్రి 9.30 గంటలకు ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరి 9.43 గంటలకు ఖైరతాబాద్ చేరుకుంది.పోలీసులు, మెట్రో అధికారులు, జీవన్‌దాన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట్, ఎంజీబీఎస్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లను మూసివేసి, ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. 13 కిలోమీటర్లు, 13 స్టేషన్లు దాటుకుని, 13 నిమిషాల్లో రైలు గమ్యస్థానానికి చేరుకుంది. -
Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు
హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హృద్రోగాల బారినపడి ఏటా లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2024 కూడా గుండె ఆరోగ్యానికి సవాలుగా నిలిచింది. గుండెపోటు, గుండె ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది లక్షలాదిమంది మృతిచెందారు.కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుండె జబ్బులు అధికంగా నమోదవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా మన దేశంలో లక్షలాది మంది మృతిచెందారు. 2024, ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో మరణించారు. రితురాజ్.. హిట్లర్ దీదీ తదితర టీవీ షోలలోనటించారు. అదేవిధంగా నటి కవితా చౌదరి కూడా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె ఉడాన్ తదితర సీరియళ్లలో నటించారు. టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి కూడా 48 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు.గుండెపోటుతో పాటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఈ ఏడాది అందరిలోనూ ఆందోళనను పెంచాయి. 2024 జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే(47) గుండెపోటుతో మరణించారు. కాగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి రెండు వేర్వేరు స్థితులు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి ఏర్పడిన కారణంగా, గుండెకు రక్త ప్రసరణ అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది.కరోనా ఇన్ఫెక్షన్, మరణాల ముప్పును తగ్గించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టీకా గుండెపోటుతో పాటు మరణాల కేసులు పెరిగాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ముందస్తుగా గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెపోటు వచ్చిన బాధితునికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును నివారించడానికి సరైన జీవనశైలిని అనుసరించడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం రక్తపోటును, షుగర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
డార్క్ చాక్లెట్ టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పదే పదే నొక్కి చెప్పేవారు. కానీ మోతాదుకి మించొద్దు అని సూచించేవారు. అయితే ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదా..? అనే విషయంపై పరిశోధనలు జరగుతూనే ఉన్నాయి. తాజాగా హార్వర్డ్‌కి చెందిన యూఎస్, చైనీస్ శాస్త్రవేత్తలు అది నిజమేనని నిర్థారించారు. మిల్క్ చాక్లెట్లు తిన్న వారికంటే డార్క్ చాక్లెట్లు తిన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చి చెప్పారు. అలాగే ఈ చాక్లెట్లు తినడం వల్ల బరువుపై ప్రభావం చూపదని కూడా నిర్థారించారు. అందుకోసం మహిళా నర్సులపై పరిశోధన చేశారు.దాదాపు 1986-2018 వరకు వారి హెల్త్ డాటాను ట్రాక్ చేశారు. అలాగే పురుష ఆరోగ్య నిపుణలపై కూడా 1986 నుంచి 2020 వరకు హెల్త్ డేటాను పరిశీలించారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలున్న వారిని మినహా మిగతా అందరి జీవనశైలి వారి తీసుకునే డార్క్ చాక్లెట్ మోతాదుని పరిశీలించారు. వీరిలో మిల్క్ చాక్లెట్ తిన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. అయితే కేవలం డార్క్ చాక్లెట్‌ని తిన్న వారిలో కోకో ఉత్పత్తులు జీవక్రియను మెరుగుపరిచిందన్నారు. ఇది రక్తపోటులో గణనీయమైన తగ్గుదల తోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచిందని వెల్లడించారు. అంతేగాదు అధిక బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులలో కూడా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచిందన్నారు. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడేలా టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21% మేర తగ్గిస్తుందని నిర్ధారించారు పరిశోధకులు. ఒత్తిడిని కూడా నివారిస్తుందని చెప్పారు. అయితే ఈ సత్ఫలితాలు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని వారు త్వరితగతిన పొందగలరని అన్నారు. మిగతా వారికి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలవ్వుతుందని అన్నారు.(చదవండి: కూర్చోవడం ధూమపానం లాంటిదా? కేన్సర్‌కి దారితీస్తుందా..?) -
అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!
సంతాన సాఫల్య చికిత్సల ద్వారా జన్మించే శిశువుల్లో గుండె లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. స్వీడిష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ యు.బి.వెనర్హోమ్ ఈ అంశాన్ని తన అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఐవీఎఫ్ సహా వివిధ రకాల కృత్రిమ పద్ధతుల ద్వారా జన్మించిన శిశువుల్లో సహజంగా జన్మించిన శిశువుల్లో కంటే జన్యు సమస్యల వల్ల గుండె లోపాలు తలెత్తే అవకాశాలు 36 శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్ వెనర్హోమ్ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని వైద్యుల బృందం డెన్మార్క్, ఫిన్లండ్, స్విట్జర్లండ్, నార్వే దేశాల్లో కృత్రిమ పద్ధతుల ద్వారా 1990–2015 మధ్య కాలంలో జన్మించిన సుమారు 1.71 లక్షల శిశువుల ఆరోగ్య వివరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.సహజంగా జన్మించిన శిశువుల కంటే, కృత్రిమ పద్ధతుల ద్వారా పుట్టిన శిశువుల్లోనే తర్వాతి కాలంలో గుండె లోపాలు ఎక్కువగా బయటపడినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ఇటీవల ప్రచురించింది.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
గుండెకు మేలు చేసే పండ్లు..!
గుండెజబ్బులను నివారించడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో భాగంగా డాక్టర్లు చాలా రకాల మార్గాలు సూచిస్తుంటారు. అందులో పండ్లు తినడమూ ఒకటి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రుచిగా ఉండటంతోపాటు, వాటిలో ఉండే కొన్ని రకాల పోషకాల వల్ల గుండెకు పటిష్టమైన రక్షణనిస్తాయి. వాటితోపాటు పూర్తి ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అలా గుండెకు మేలు చేయడానికి వాటిల్లోని ఏయే పోషకాలూ, ఏయే అంశాలు ఉపయోగపడతాయో చూద్దాం. అన్ని చోట్లా దొరుకుతూ, అన్ని వేళలా లభ్యమయ్యే పండ్లలో అరటి, నారింజ, ఆపిల్ వంటివి చాలా ముఖ్యం. అలా గుండెకు మేలు చేసే ఆల్ సీజన్ పండ్ల గురించి తెలుసుకుందాం. అరటి పండు: ఈ పండులోని పొటాషియమ్, మెగ్నీషియమ్‌లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీ అన్నది గుండె΄ోటుకు ఒక రిస్క్‌ఫ్యాక్టర్ కాబట్టి అరటిలోని పొటాషియమ్ హైబీపీని తగ్గించడం ద్వారా పరోక్షంగా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలా అరటి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండు కేవలం రక్త΄ోటును అదుపు చేయడం, గుండె΄ోటు నివారించడమే కాకుండా... ఇందులోని విటమిన్ బి6, విటమిన్ – సి, పీచుపదార్థాలు దేహానికీ మేలు చేస్తాయి. ఇవి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉండటమన్నది ఓ సానుకూల అంశం. ద్రాక్ష: మన దేహంలో ఆయా అవయవాల ఆకృతికి దగ్గరిగా మంచి పోలిక కలిగి ఉండే పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆయా దేహ భాగాలకు మేలు చేస్తాయనే భావన చాలామందిలో ఉంది. ఉదాహరణకు ఆక్రోట్ వంటివి మెదడుకు ఆకారంలో ఉండి మెదడుకు మేలు చేస్తాయనీ... అలాగే అడ్డుగా కోసినప్పుడు అచ్చం కన్నులోని నల్లగుడ్డులో ఉన్నట్లుగా రింగులు కనిపించే క్యారట్ కన్నుకు మేలు చేస్తుందంటారు. అలాగే ద్రాక్షగుత్తిని చూసినప్పుడు... ఆ పండ్లు ఉండే ఈనెలన్నీ దేహంలోని రక్తప్రసరణ వ్యవస్థలో ఉండే రక్తనాళాల్లా కనిపిస్తాయి. ఈ కారణం చేత ద్రాక్ష పండు గుండెకు మంచిదని అంటుంటారు. ద్రాక్షగుత్తి మొత్తాన్ని చూసినప్పుడు కూడా అది గుండె ఆకృతిలోనే ఉంటుంది. నిర్దిష్టంగా చూస్తే పండు ఆకృతి కీ, అది చేసే మేళ్లకూ సైంటిఫిక్‌గా ఎలాంటి నిదర్శనాలూ లేవు. అయినప్పటికీ కాకతాళీయంగానైనా ఇది రక్తనాళాల్లోని కొవ్వులను తొలగిస్తుంది. ద్రాక్షపండ్లు మన రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె΄ోటు అవకాశాలను నివారిస్తాయి. ద్రాక్షలోని పోషకాలైన లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రోయాంథో సయానిడిన్స్ వంటివి హైకోలెస్ట్రాల్ను తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. నారింజపండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి వంటి పండ్లన్నీ గుండెకు బాగా మేలు సమకూర్చేవే. బాగా పండిన నారింజలో విటమిన్ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుందనీ దాంతో గుండెకు రక్షణ కలుగుతుందన్న విషయం తెలిసిందే. ఇవి కూడా ఏ సీజన్లోనైనా దొరకే పండ్లు కావడం ఓ మంచి విషయం. ఆపిల్ : ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతో΄ాటు రక్తనాళాలు మూసుకు΄ోకుండా చూడటం, కొలెస్టాల్ను తగ్గించడం కూడా చేస్తాయి. ఇలా అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కర్బూజ (కాంటలౌప్) : ఈ పండ్లలోని ΄÷టాషియమ్ రక్త΄ోటును నియంత్రించి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండ్లలోని విటమిన్–ఏ, విటమిన్–బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అన్ని చోట్లా దొరికే ద్రాక్ష, అరటి, నారింజ, ఆపిల్‌తోపాటు దాదాపుగా పట్టణ, నగర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లలో దొరకే మరికొన్ని పండ్లు కూడా గుండెకు మేలు చేస్తాయి. వాటిలో కొన్ని... బెర్రీపండ్లు: బెర్రీ పండ్లలో కూడా పొటాషియమ్ ఎక్కువగానే ఉంటుంది. పొటాషియమ్ రక్త΄ోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుందని అరటిపండు విషయంలో చూశాం కదా. అందుకే ఇది కూడా అరటి మాదిరిగానే గుండెకు మేలు చేస్తుంది. ఇక బెర్రీపండ్లలోని బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీలలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. కివీ: ఇప్పుడు నగర ప్రాంతాల్లోని పెద్దపెద్ద మార్కెట్ల తోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ కివీ పండ్లు దొరుకుతున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతాయి. కివీలోని విటమిన్–ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితం గా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం తగ్గి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అప్రికాట్: ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే అప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్–కె – రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాదు అప్రికాట్‌లో ఉండే విటమిన్– ఏ, విటమిన్– సీ, విటమిన్–ఈ వల్ల పూర్తి శరీర ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పైన పేర్కొన్నవాటి తోపాటు బ్రైట్‌గా ఉండి ముదురురంగుల్లో మెరుస్తున్నట్లు కనిపించే రంగులతో ఉండే పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. ఆపిల్ ఈ కోవలోనిదే. ఇక పండ్ల తోపాటు మిగతాజీవనశైలి మార్గాలను సైతం పాటిస్తూ ఉంటే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. ∙ -
ఛాతీలో నీరు చేరితే...?
ఛాతీలో నీరు చేరడాన్ని ‘ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇది నీరు కావచ్చు లేదా చీము, రక్తం కావచ్చు. ఇది ఒక పక్క లేదా రెండువైపులా చేరవచ్చు. నీరు ఎక్కువగా చేరితే దాన్ని ‘మాసివ్ ప్లూరల్ ఎఫ్యూజన్’ అంటారు. ఇలాంటి వారిలో ఆయాసం కూడా ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి వారిలో తక్షణం ఆ నీటిని తీయాల్సి ఉంటుంది. కారణాలు... ఛాతీలోకి నీరు చేరడం అనేది హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్య, లివర్ సమస్యలను సూచిస్తుంది. చీము చేరడం అనేది ఊపిరితిత్తులకు గాని, ప్లూరల్ స్పేస్‌కు గానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరుగుతుంది. ఉదా: నిమోనియా, టీబీ ఇన్ఫెక్షన్లు. సాధారణంగా మొదటిదశలో అది చీము అవునా, కాదా అన్నది కనుక్కోవడం కుదరదు. పరీక్షలకు పంపాక మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యను ట్రాన్స్డేటివ్ లేదా ఎగ్జూడేటివ్ అని విభజిస్తారు. ట్రాన్స్డేటివ్ నీరు చేరడమనే సమస్య సాధారణంగా మందులతోనే తగ్గిపోతుంది. అయితే ఎగ్జుడేటివ్ నీరు చేరడమనే సమస్యలో దాని దశని బట్టి చికిత్స మారుతుంటుంది. ఈ సమస్యకు నిమోనియా కారణమై, నీరు కొద్దిగానే ఉంటే, సాధారణంగా అది యాంటీబయాటిక్స్‌తో తగ్గి΄ోతుంది. కానీ చీము చాలా ఎక్కువగా ఉంటే, వెంటనే ఛాతీలోకి గొట్టం వేసి దాన్ని డ్రైయిన్ చేసేయాలి (ఆ చీమును బయటకు ప్రవహింపజేయాలి... అంటే తొలగించాలి). ఒకసారి గొట్టం వేశాక చీము రోజుకు ఎంత పరిమాణంలో డ్రైయిన్ అవుతోంది అన్న అంశం మీద దాన్ని తీసేయడం ఆధారపడి ఉంటుంది. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి, అక్కడ తేనెతుట్టెలాగా మారిపోతుంది. అలాంటి దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. గొట్టం వేసి, ఆ తేనెతుట్టె లాంటి దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని మూడు రోజుల పాటు లోనికి పంపుతారు. అప్పటికీ లోపలి ఫైబ్రస్ పార్టిషన్స్ కరగకపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం. ముందుగా అసలు ఈ చీము ఎందుకు చేరుతుందో కనుక్కోవాలి. అందుకోసం తగిన పరీక్షలూ, కల్చర్స్ చేయించాలి. ఇన్ఫెక్షన్ అదుపు చేయడానికి అవసరమైన మందుల్ని డాక్టర్లు సూచించినంత కాలం వాడాలి. కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల చీము చేరడమే కాకుండా ఊపిరితిత్తులకు కన్నం పడుతుంది. దానివల్ల గాలి లీక్ అవుతుంది. దీన్ని ‘బ్రాంకోప్లూరల్ ఫిస్టులా’ అంటారు. ఇలాంటివారిలో ఛాతీలో గొట్టం ఎక్కువరోజులు... అంటే ఫిస్టులా మూసుకు΄ోయే వరకూ ఉంచాలి. ఇందుకు ఒక్కోసారి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. కొంతమందిలో ఆపరేషన్ ద్వారా ఫిస్టులాను రిపేర్ చేయవచ్చు. చీము తీసేయడం ఆలస్యమైతే, లోపల అనేక ఫైబ్రస్ పార్టిషన్స్ (గదులు) ఏర్పడి,అక్కడ తేనెతుట్టెలా మారి΄ోతుంది. ఈ దశలో ఆపరేషన్ అవసరం కావచ్చు. అప్పుడు గొట్టం వేసి, దాన్ని కరిగించడానికి ఫిబ్న్రోలైటిక్స్ అనే మందుల్ని పంపుతారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ (చదవండి: -
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
చెదురుతున్న గుండెకు అండగా...!
గుండె తన పూర్తి సామర్థ్యాన్ని కనబరచకుండా అది విఫలమయ్యే కండిషన్‌ను ‘హార్ట్ ఫెయిల్యూర్’గా చెబుతారు. హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు... తాము కొద్దిగా నడవగానే వారికి ఊపిరి సరిగా అందకపోవడం, తీవ్రంగా ఆయాసం రావడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. హార్ట్‌ఫెయిల్యూర్ బాధితులు ఈ కింద సూచించిన జీవనశైలి మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ద్రవాహారానికి దూరంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో ఒంట్లోకి నీరు చేరుతుంటే వాళ్లు ద్రవాహారం తీసుకోవడం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరనివాళ్లు మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. ఉప్పు బాగా తగ్గించడం : ఒంట్లో నీరు చేరడం, ఆయాస పడటం, ఊపిరి అందక΄ోవడం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. వీళ్లు తినే వంటల్లో ఉప్పు వేయకపోవడం మేలు. పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, బయటి చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. డ్రైఫ్రూట్స్, పండ్లు, పాలు : బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యానికి చేటు చేసే లవణాలు తక్కువ. విశ్రాంతి : హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చాలామందిలో ఓ అపోహ. అయితే ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత మేరకు, ఆయాసం రానంత వరకు శరీరాన్ని మరీ కష్టపెట్టకుండా శ్రమ చేయవచ్చు. తేలికపాటి నడక, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలూ చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం: హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడేవారు తమ సమస్య కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకూ లోనుకావచ్చు. వారు ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఈ మందులు వద్దు : హార్ట్ఫెయిల్యూర్తో బాధపడేవారు కొన్ని మందులకు... ముఖ్యంగా నొప్పి నివారణ కోసం వాడే... ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులకు దూరంగా ఉండాలి. స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మేలు. ఇంకా చెప్పాలంటే కార్డియాలజిస్ట్‌కు చెప్పకుండా ఎలాంటి మందులూ వాడకపోడమే మంచిది. ఇక నొప్పులు మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు అవి తగ్గేందుకు డాక్టర్‌ను ఒకసారి సంప్రదించి పారాసిటమాల్ వంటి సురక్షిత మందుల్ని వాడుకోవచ్చు. ∙వైద్యపరమైన జాగ్రత్తలు బాధితులు తమ గుండె వైఫల్యానికి వాడుతున్న మందులతోనూ అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే ఎప్పటికప్పుడు డాక్టర్ ఫాలో అప్‌లో ఉంటూ, అవసరాన్ని బట్టి వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే తరచూ గుండెవైద్య నిపుణులను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, జాగ్రత్తలు అనుసరించాలి. (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం..!
శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం, కాలానుగుణ మార్పులు తదితరాల కారణంగా అధిక రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ కాలంలో హృదయనాళం పనితీరుకు అనుగుణమైన ఆహారపదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలను నివారించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగాయాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉన్నవి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వణికించే చలిలో రక్తపోటుని నిర్వహించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మేలని చెబుతున్నారు. అవేంటో చూద్దామా..ఆకు కూరలుపాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కే, ఫైబర్ తోపాటు ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకుకూరలు నైట్రేట్లను కలిగి ఉంటాయి. అందువల్ల రక్తపోటును తగ్గించి, ధమనుల పనితీరును మెరుగ్గా ఉంచడంలో కీలకంగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు హాని కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారిస్తాయి.నారింజదీనిలో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నారింజలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడగా, ఫైబర్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇక విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నట్స్:ముఖ్యంగా వాల్నట్లు, బాదంపప్పులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, మెగ్నీషియం తదితరాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఒమేగా -3లు వాపును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అయితే మెగ్నీషియం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే.. ఎలాంటి హృదయ సంబంధ సమస్యలు తలెత్తవు.దానిమ్మ..దానిమ్మపండులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం త్రాగడం లేదా విత్తనాలు తినడం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లివెల్లుల్లిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఇది గుండె-ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. ఈ చలికాలంలో దీన్ని జోడించటం వల్ల రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్‌లు ఏర్పడే అవకాశం ఉండదు, గుండె పనితీరు కూడా బాగుంటుంది. క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యారెట్లు పచ్చిగా, ఆవిరిలో ఉడికించి లేదా సూప్‌లాగా తీసుకోవచ్చు.బీట్రూట్లుబీట్రూట్లలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇవన్నీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే గాక సమతుల్యమైన ఆహారం శరీరానికి అందించగలుగుతాం. గమనించి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..) -
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
మహిళల్లో గుండె పరీక్షలు ఏ వయసు నుంచి?
గుండె జబ్బుల్ని ముందుగానే తెలుసుకుంటే మరణాలను నివారించడమే కాదు... చాలారకాల అనర్థాలను సమర్థంగా నివారించవచ్చు. నిజానికి ఏ వయసు నుంచి మహిళలు గుండె పరీక్షలను చేయించుకోవడం మంచిది అనే అంశంపై కొంతమంది నిపుణులైన కార్డియాలజిస్టులు చెబుతున్న మాటలేమిటో చూద్దాం. మహిళలకు స్థూలకాయం, దేహ జీవక్రియలకు సంబంధించిన ఆరోగ్య రుగ్మతలు (మెటబాలిక్ డిజార్డర్స్), కుటుంబంలో (చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు (ప్రీ–మెచ్యూర్ హార్ట్ డిజీసెస్) కనిపిస్తుండటం వంటి ముపుప ఉన్నప్పుడు వారు తమ 20వ ఏటి నుంచే ప్రతి ఏటా బేసిక్ గుండె పరీక్షలైన ఈసీజీ, 2 డీ ఎకో వంటివి చేయించుకుని నిర్భయంగా ఉండటం సముచితమంటున్నారు పలువురు గుండెవైద్య నిపుణులు. ఒకవేళ ఏవైనా గుండెజబ్బులకు కారణమయ్యే నిశ్శబ్దంగా ఉండు ముప్పు అంశాలు (సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్) కనిపిస్తే వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలను ముందునుంచే తీసుకుంటూ ఉడటం, నివారణ చర్యలను పాటిస్తూ ఉండటం వల్ల ప్రాణాంతక పరిస్థితులను చాలా తేలిగ్గా నివారించవచ్చు. ఉదాహరణకు హైబీపీ లేదా రక్తంలో కొవ్వుల మోతాదులు ఎక్కువగా ఉండే డిస్లిపిడేమియా అనే పరిస్థితి ఉన్నట్లయితే వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశముంటుంది. అదే పైన పేర్కొన్న ముప్పు ఉన్నవారైతే 20వ ఏటి నుంచీ లేదా అన్నివిధాలా ఆరోగ్యవంతులైన మహిళలు తమ 40 ల నుంచి గుండె పరీక్షలను తరచూ ( లేదా మీ కార్డియాలజిస్ట్ సిఫార్సు మేరకు) చేయించుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎప్పుడూ పాటించడమనే అంశం కూడా గుండెజబ్బులతో పాటు చాలా రకాల జబ్బులు, రుగ్మతలను నివారించి మహిళలెప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుంది. (చదవండి: -
టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!
గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి. విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే. బాదంపప్పు, అక్రోటు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. -
ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!
గుండెకు రూపం ఉంటుంది. హృదయానికి కాదు. గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడు తన హృదయం చేసే ఉద్వేగాలను అదుపు చేసుకోవాలి. అయితే అన్నిసార్లూ అలా ఉండదు. ఒక్కోసారి గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడి గుండె కొట్టకులాడుతుంది. ఆ గుండెను ఎలాగైనా కాపాడాలని పెనుగులాడుతుంది. పరితపిస్తుంది. అలాంటి ఒక అరుదైన కేసు వివరాలివి... దాదాపు రెండేళ్ల కిందట మా దగ్గరికి 32 ఏళ్ల సతీష్ (పేరు మార్చాం) తీవ్రమైన ఛాతీనొప్పి, గుండెదడతో వచ్చాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చూస్తే అతడి గుండె నార్మల్ కంటే చాలా వేగంగా కొట్టుకుంటూ, ఆగిపోయింది. ఇలాంటప్పుడు కరెంట్‌తో షాక్ ఇచ్చి మళ్లీ కొట్టుకునేలా చేస్తుంటాం. గుండె మరీ బలహీనంగా కొట్టుకుంటున్నప్పుడు లేదా హార్ట్ అటాక్‌తో గుండె ఆగిపోయినప్పుడు కరెంట్‌తో షాక్ ఇచ్చి తిరిగి స్పందించేలా చేయడం మామూలే. సతీష్‌కూ ఇలాగే షాక్ ఇచ్చి ఆగిపొయిన గుండె మళ్లీ స్పందించేలా చేశాం. ఆ తర్వాత వెంటనే అతణ్ణి కాథ్ల్యాబ్కు తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి చూస్తే అందులో ఏమీ తేడా లేదుగానీ, వేగంగా కొట్టుకుంటున్న అతడి గుండె స్పందనలు నార్మల్ కాలేదు. గుండె బాగా బలహీనంగా ఉంది. లంగ్స్‌లోకి నీరు చేరింది. వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. గుండె ఇలా వేగంగా కొట్టుకునే కండిషన్‌ను ‘వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా – వీటీ’ అంటారు. ఒకసారి షాక్ తర్వాత... గుండె స్పందించడం మొదలయ్యాక మళ్లీ మునుపటి పరిస్థితి రాకుండా ఉండటానికి అనేక ఇంజెక్షన్లు ఇచ్చాం. కానీ వీటీ అదుపులోకి రాలేదు. మల్టిపుల్ ఇంజెక్షన్స్ తర్వాత కూడా అతడి పరిస్థితి చక్కబడకపోవడంతో చాలా బాధేసింది. పాపం... పెళ్లి వయస్సుకు వచ్చిన కుర్రాడు. సాధారణంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా (వీటీ)ని చక్కదిద్దడానికి పేస్ మేకర్ అమర్చుతారు. ఇది గుండె స్పందనల్లో మార్పులు వచ్చినప్పుడల్లా ఓ చిన్న షాక్‌ను ఉత్పన్నం చేసి, గుండె స్పందనలను సాధారణ స్థితిలోకి వచ్చేలా చేస్తుంది. కానీ అతడికి వస్తున్నది వీటీల పరంపరం. దాన్ని వీటీ స్టార్మ్ అంటారు. అంటే వీటీల తుఫాను. ఇలా ఆగకుండా వస్తున్న వీటి పరంపరకు పేస్‌మేకర్ అమర్చినా లాభం ఉండదు. అది వేగంగా మాటిమాటికీ కరెంట్‌తో షాక్‌లిస్తూ పోతుంటే అందులోని బ్యాటరీ అయిపోతుంది తప్ప... ఇంక పెద్దగా ప్రయోజనం ఉండదు. బయటి నుంచే ఓవర్ డ్రైవ్ పేసింగ్ చేసే ఓ చిన్న పేస్ మేకర్ పెట్టి చూశాం. లాభం లేదు. వైద్య చికిత్సల్లో ఇలాంటి పరిస్థితిని ఎన్ని రకాలుగా ట్యాకిల్ చేయవచ్చో అన్నీ చేశాం. సిటీలోని ఇతర కార్డియాలజిస్టులతోనూ మాట్లాడాం. ఇలా వీటీ వచ్చినప్పుడల్లా బ్లడ్‌ప్రెషర్ డౌన్ అయిపోతోంది. కొన్నిసార్లు 50కు కూడా పడిపోయింది. వీటీలు ఆగడం లేదు. ఊపిరితిత్తుల్లో నీరు. పేషెంట్ వెంటిలేటర్ మీద. అలా వెంటిలేటర్ మీద ఉంచాల్సిరావడంతో కిడ్నీలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి మెడిసిన్స్ ఇచ్చాం. ఎన్నెన్నో ఇంజెక్షన్లు చేశాం. నార్మలైజ్ చేయడానికి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నీ చేసి చూశాం. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. చిన్న వయసు. లోకం అంతగా చూడని కుర్రాడు కళ్ల ముందే చనిపోతున్నాడనిపించింది. చనిపోవడం ఖాయం. ఒక చివరి ప్రయత్నంగా మెడికల్ లిటరేచర్ అంతా చదివా. ‘‘సింపథెక్టమీ’’ అనే ఓ ప్రోసీజర్ ఉంటుంది. ఇందులో నెర్వ్‌కు సంబంధించిన గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇస్తే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లోని నరాలు నెమ్మదిస్తాయి. దాంతో వీటీ ఆగుతుంది అని లిటరేచర్‌లో ఉంది. పేషెంట్ బంధువులను అడిగితే ‘ఎలాగూ చనిపోయేలా ఉన్నాడు. ఆ ప్రోసీజర్ చేస్తే బతుకుతాడేమో చేయండి సర్’ అన్నారు.దాంతో సింపథెక్టమీ చేసే నా జూనియర్... డాక్టర్ విజయభాస్కర్ అని ఉన్నాడు. అతణ్ణి పిలిపించాం. వెంట్రిక్యులార్ ట్యాకికార్డియాకు సింపథెక్టమీ చేయడం మెడికల్ లిటరేచర్‌లో రాసి ఉన్న చాలా అరుదైన ప్రోసీజర్. నిత్యం మెడికల్ ప్రాక్టీస్‌లో అనుసరించేది కాదు. కేవలం ప్రయోగాత్మకంగా చేయాలనుకున్నది మాత్రమే. ప్రపంచం మొత్తమ్మీద ‘వీటీ’కి అప్పటికి జరిగిన సింపథెక్టమీ ప్రోసీజర్లు చాలా తక్కువ. పేషెంట్‌ను క్యాథ్ల్యాబ్లోకి తీసుకెళ్లాం. వెంటనే సింపథెక్టమీకి పూనుకున్నాం. వెన్నుపూస ఇరువైపులా ఉన్న గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం డాక్టర్ విజయభాస్కర్ సహాయంతో ‘బై లేటరల్ సర్వైకల్ సింపథెక్టమీ’ అనే ప్రోసీజర్ చేశాం. ఒకసారి సింపథెక్టమీ చేశాక... ఒకటి రెండు సార్లు వీటీ వచ్చింది. అయితే ‘ఓవర్‌డ్రైవ్ పేసింగ్’తో తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్లీ వీటీ రాలేదు. వీటీ ఆగిపోగానే నెమ్మదిగా బాధితుడి కండిషన్ మెరుగవ్వడం మొదలైంది. మూత్రం రావడం మొదలైంది. డయాలసిస్ ఆపేశాం. వెంటిలేటర్ కూడా తీసేశాం. ఆ తర్వాత పేస్ మేకర్ అమర్చాం. రెండేళ్ల తర్వాత మొన్ననే ఓసారి అతడు వచ్చాడు. పరీక్షల్లో గుండె కండిషన్ బాగా మెరుగైనట్లు కనిపించింది. ఈమధ్య పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇదో టీమ్ వర్క్. ఓ బృందంలా చాలా ఫోకస్డ్గా పనిచేశాం. చావు తప్ప మరో దారే లేదనుకున్న ఓ బాధితుడి జబ్బును పూర్తిగా నార్మల్ చేయడం మా కార్డియాలజిస్టులకు దేవుడిచ్చిన ఒక అరుదైన అవకాశమని భావిస్తున్నాం. డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ (చదవండి: కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?) -
ముప్పైలో హృదయం పదిలంగా ఉండాలంటే..!
గుండె జబ్బులు ఒకప్పుడూ వృద్దులలోనే కనిపించేవి. కానీ ప్రస్తుత జీవన విధానంలో జస్ట్ 30 ఏళ్లు కూడా నిండని యువకులే గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖులు వరకు చాలా మంది చిన్న ఏజ్‌లోనే గుండె సమస్యలతో చనిపోయిన సంఘటనలను చూశాం. అలాగే కొందరూ ఫిట్నెస్ పేరుతో గుండె అలిసిపోయేలా వర్కౌట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాలు కూడా చూశాం. అందుకే నిపుణులు సింపుల్ ట్రిక్‌తో ముప్పై నుంచే హృదయ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడమని చెబుతున్నారు. ఏంటంటే అది..!.నిజానికి 30వ దశకం జీవితం వేగంగా సాగిపోతున్నట్లు ఉంటుంది. కెరీర్ లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలతో బిజీగా ఉంటారు. అందువల్ల సమయమే తెలియదు. ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ఉండదు. యంగ్‌గా ఉన్నాం మనకేంటి అనే భావనతో ఉంటారు. అదేతప్పని అంటున్నారు. ఈ సమయమే దీర్థకాలిక జబ్బుల బారిన పడేందుకు కీలకమైనదని చెబుతున్నారు. ఇప్పుడే గనుక ఆరోగ్యంపై శ్రద్ధపెడితే 60లో కూడా చలాకీగా తిరగగలుగుతారని చెబుతున్నారు. అందుకోసం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ 30 మెట్లు ఎక్కండి అని అంటున్నారు. 30 మెట్లు..స్థిరంగా ఒకచోట కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్లకు ఇది మంచిది. జంక్‌ఫుడ్‌కి అలవాటు పడ్డవాళ్లకి కూడా ఇది బెస్ట్ వ్యాయామం అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ఎలివేటర్ ఉపయోగించకుండా ఉంటే చాలు ప్రత్యేకించి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని అన్నారు. రోజువారీ పనుల్లో, కార్యాలయాల్లో మెట్లు ఎక్కండి చాలు గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. ప్రయోజనాలు..మెట్లు ఎక్కడం వల్ల శరీరం అంతటా రక్త ప్రసరణ అయ్యి ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె పంపింగ్‌ను వేగవంతం చేస్తుంది. కేలరీలు బర్న్ అవ్వడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహించేందుకు మంచి వర్కౌట్చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి బాధ్యత వహిస్తుందిశారీరక శ్రమ రక్తపోటుని తగ్గిస్తుంది. ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటుకి ప్రధాన కారణమైన రక్తపోటుని నివారించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు గుండె ఆర్యోగ్యానికి సంబంధించిన మరిన్ని వర్కౌట్లు చేయడం కూడా మంచిది. అయితే ఇది కేవలం గుండె ఆరోగ్యానికి సరైన ప్రారంభం అని అన్నారు నిపుణులు. అలాగే హార్ట్‌కి సంబంధించి.. కీలకమైన రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో చక్కెర వంటివి ఎప్పకప్పుడు చెకప్ చేయించుకోవాలని చెబుతున్నారు. వీటి తోపాటు..డైట్లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి.ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనల మేరకు అనుసరించడం మంచిది. -
పిక్కకు ఓ లెక్కుంది..! అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు..!
మనిషికి శరీరం పైభాగంలో అంటే రొమ్ములో ఒక గుండె ఉంటుంది. అదే రీతిలో రెండు కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... పిక్కలు. నిజానికి అవి అచ్చంగా గుండెలు కాకపోయినప్పటికీ గుండె చేసే పనినే పిక్కలూ కొంతవరకు చేస్తాయి. గుండె రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేసినట్టే సరిగ్గా పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్ చేయడంతోపాటు పైకెళ్లాల్సిన రక్తం భూమ్యాకర్షణకు లోనై కిందికి వెళ్లకుండా అక్కడి కవాటాలు ఆపుతాయి. అందుకే ‘పిక్క’ను శరీరపు రెండో గుండెకాయగా కొందరు చెబుతుంటారు. గుండె చేసే పనిని పిక్కలు ఎలా చేస్తాయో చూద్దాం. పిక్కను పరిశీలనగా చూసినప్పుడు అది కూడా ఇంచుమించూ ‘హార్ట్ షేపు’లోనే కనిపిస్తుంది. గుండె తన పంపింగ్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంటే... కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వచ్చేలా చూస్తుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండె డ్యూటీలను పిక్క ఎలా చేస్తుందంటే... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడి రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే కండరాలు ఈ పనిలో కీలకంగా ఉంటాయి. ఈ కండరాలు క్రమబద్ధమైన రీతిలో స్పందిస్తూ... ముడుచుకోవడం (కాంట్రాక్ట్ కావడం), తెరచుకోవడం (రిలాక్స్‌కావడం)తో కాళ్లకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. రక్తం మళ్లీ కిందికి పడిపోకుండా వాల్వ్స్ (కవాటాల) సహాయంతో మూసుకు΄ోతూ పైవైపునకే ప్రవహించేలా చూస్తాయి. ఒకవేళ అలా పిక్కలు పనిచేయకపోతే రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అప్పటికీ ఈ రక్తంలోని ఆక్సిజన్‌ను కండరాలు వినియోగించుకున్నందున తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసటకు గురవుతాయి. పిక్క గుండెలా పనిచేయకపోతే... కాళ్ల చివరలకు రక్తసరఫరా తక్కువగా జరగడం వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం సరిగా జరగకపోవడం చెడు రక్తాన్ని తీసుకు΄ోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో ఈ కింది పరిణామాలు జరగవచ్చు. అవి... ⇒ కాళ్లు అలసిపోవడం ⇒ కాళ్లూ, పాదాలలో వాపు ⇒ కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకపోవడం ⇒ కాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటం వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి చర్మం నుంచి బయటకు కనిపించడం) ∙కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్). ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటే...? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిలో ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండే లెక్చరర్లు, టీచర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ ΄ోలీసులు... మొ‘‘ వారిలో స్థూలకాయుల్లో గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలల్లో ఈ సమస్య కనిపించవచ్చు.సమస్యను అధిగమించడం కోసం... పాదాలను మడమ దగ్గర్నుంచి పైకీ కిందికీ (ఫ్లెక్స్ అండ్ పాయింట్) కదిలిస్తూ ఉండటం ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్) బరువును / ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం. కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమిపెట్టేలా ‘వీనస్ స్టాకింగ్స్’ వంటి తొడుగులను ధరించాలి. అప్పటికీ అలాగే కనిపిస్తుంటే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. --డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, సీనియర్ వాస్కులార్ అండ్ ఎండో వాస్కులార్ సర్జన్(చదవండి: డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్) -
నిగనిగలాడే జుట్టునుంచి గుండె దాకా, నల్ల ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో !
చూడటానికి చిన్నగా ఉన్నా నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లగా నిగనిగలాడుతూ తీయని రుచితో నోరూరిస్తూ ఉంటాయి నల్ల ద్రాక్ష పండ్లు. నల్ల ద్రాక్షలో సీ, ఏ విటమిన్లు, బీ6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషక గుణాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే తెల్ల ద్రాక్ష మంచిదా? నల్ల ద్రాక్ష మంచిదా అని ఆలోచిస్తే రెండింటిలోనూ కాస్త రుచిలో తప్ప ప్రయోజనాల్లో పెద్దగా లేదనే చెప్పాలి. నల్ల ద్రాక్షతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ‘రెస్వెరాట్రాల్’ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బులు కేన్సర్‌తో సహా అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచికాపాడుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.గుండె ఆరోగ్యానికి : నల్ల ద్రాక్ష అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి గుండె ఆరోగ్యానికి తోడ్పడే సామర్థ్యం. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డకట్టడాన్నినివారిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే పాలీఫెనాల్స్‌లో అభిజ్ఞా సామర్థ్యాలు , జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి నరాల కణాలు లేదా న్యూరాన్లను రక్షించడంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నరాల సంబంధిత అనారోగ్యాల సంభావ్యతను తగ్గిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: నల్ల ద్రాక్షలో కనిపించే విటమిన్ సీ, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది : బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ద్రాక్ష మంచి ఎంపిక. అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. భోజనం మధ్య చిరు తిండిగా తినవచ్చు. ఇంకా, నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల షుగర్ వ్యాధి పీడితులకు మంచి పండుగా చెప్పవచ్చు.జీర్ణ ఆరోగ్యానికి: నల్ల ద్రాక్ష జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తొలగించడంలో,గట్ బ్యాక్టీరియా అభివృద్ధికి తోడ్పడుతుంది. మెరిసే చర్మం కోసం : నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. మొటిమలు, వివిధ చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది : నల్ల ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలకు బలాన్నిస్తాయి. బోలు ఎముకల వ్యాధి , పగుళ్లు వంటి ఇతర ఎముక సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో లభించే అధిక శాతం నీరు బాడీని హైడ్రేడెటెడ్గా ఉంచుతుంది. అన్ని వయసుల వారికీ మంచిది.బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది : మధుమేహ నిర్వహణలో ఇది మంచి ఫలితాలనిస్తుంది. ఇందులోని ఫైబర్, రక్తప్రవాహంలోకి సుగర్ స్థాయిలను త్వరగా వెళ్లకుండా నిరోధిస్తుంది.యాంటీఆక్సిడెంట్ ఫినాల్స్ సమ్మేళనాలు ఇన్సులిన్ నియంత్రణలో సహాయపడతాయి.వాపులను తగ్గిస్తుంది : దీర్ఘకాలం వాపు వల్ల ఆర్థరైటిస్ , గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. నల్ల ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మానవ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. మెరిసే జుట్టు: ఇందులోని విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.చుండ్రు, జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పండురూపంలో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. జ్యూస్‌లా తీసుకున్నా కూడా మంచిదే. -
హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే హృదయ ఆరోగ్యం వైపు వేస్తున్న తొలి అడుగు. ఇక్కడ అంత పెద్ద సర్జరీ తర్వాత త్వరితగతిన కోలుకోవడంలో తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారంపై దృష్టిసారిస్తే త్వరితగతిన కోలుకోవడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ సర్జరీ తర్వాత లిక్విడ్ డైట్‌తో ప్రారంభించి..కోలుకున్న వెంటనే రెగ్యులర్ డైట్‌ని ఫాలో అవ్వడానికి ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే..?మళ్లీ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడూ ఆకలి లేకపోవడం, వికారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చంటే..గుండెకు ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారాలు..హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేసే అత్యుత్తమమైన ఆహారాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండేవి తీసుకోవాలి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు..మీలో కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.అందుకోసం వేయించిన ఆహారాలు, మాంసాహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవోకాడోస్, నట్స్, గింజలు,సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను తినండి. అలాగే వేరుశెనగ, బియ్యం ఊక, పొద్దుతిరుగుడు లేదా ఆవాల నూనెలను వంటనూనెలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించండి..రక్తపోటుని నిర్వహించేందుకు ఉప్పు తక్కువుగా తీసుకోవడం అత్యంత ముఖ్యం. అధిక సోడియం ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, స్నాక్స్‌కి బదులుగా ఉప్పులేని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.ప్రోటీన్ ప్యాకేజీలు రికవరీకి లీన్ ప్రోటీన్లు కీలకం, ఎందుకంటే అవి కణజాల మరమ్మత్తు, కండరాల బలానికి సహాయపడతాయి. పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు వంటి లీన్ సోర్స్‌లను ఎంచుకోండి. కండరాల రిపేర్‌కు తోడ్పడేందుకు, అలాగే నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి భోజనంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..సర్జరీ తర్వాత కోలుకోవాలంటే హైడ్రేటెడ్ ఉండటం అత్యంత కీలకం. శరీరం బాగా పనిచేసేలా రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. చక్కెర పానీయాలు, కెఫిన్‌లను నివారించండి. డైటీషియన్ సలహాలు తీసుకోవడం..సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం మంచిదనేది మన వైద్య చరిత్ర తెలిసిన డైటీషియన్‌ని అడగడం మంచిది. అది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడమే గాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు ఉపకరిస్తుంది. బాడీ పరిస్థితిని అర్థం చేసుకోండి..దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో అలాగే మనం తీసుకునే ఫుడ్‌కి శరీరం ఎలా రియాక్షన్ ఇస్తుందనేది గమనించడం అంతే ముఖ్యం.అలాగే ఎప్పటికప్పుడూఆరోగ్య సంరక్షణ నిపుణులు సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా విస్మరించొద్దని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్) -
క్రికెటర్ల హ్యాపీ రక్షాబంధన్.. ఫొటోలు
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నిమ్స్‌లో హార్ట్ వాల్వ్ బ్యాంకు!
లక్డీకాపూల్: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్ వాల్వ్)లను అందించేందుకు నిమ్స్ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్ వాల్వ్ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి సేకరణ..బ్రెయిన్ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్ బ్యాంక్) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. -
'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!
ఆధునాతన వైద్య విధానం కొంత పుంతలు తొక్కుతోంది. దీనికి తోడు ఏఐ సాంకేతికత ఆరోగ్య నిర్వహణను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా మార్చింది. అందుకు ఉదహారణ ఈ రియల్ ఐరన్ మ్యాన్. ఎంతలా వైద్య విధానం అభివృద్ధి చెందుతున్నా.. అవయవమార్పిడి విషయంలో దాతల కొరత వైద్యులను వేదిస్తున్న ప్రధాన సమస్య. దీన్ని నివారించేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఐతే కొన్ని ప్రధాన అవయవాలైన గుండె, మూత్రపిండాలు వంటి వాటిల్లో కృత్రిమ అవయవాలు ఎంత వరకు పనిచేస్తాయనేది ధర్మసందేహంగా ఉండేది. అది ఈ వ్యక్తికి విజయవంతంగా అమర్చిన కృత్రిమ గుండెతో వైద్యుల మదిలో మెదిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా చేసింది. కొత్త ఆశలను రేకెత్తించింది. నిజ జీవిత ఐరన్ మ్యాన్‌గా పిలిచే ఆ వక్తి కథ ఏంటో చూద్దామా..!అమెరికాకు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాడు. అయితే గుండె ఇచ్చే దాతలు అందుబాటులో లేకపోవడంతో టైటానియంతో తయారు చేసిన గుండెను అమర్చారు వైద్యులు. ప్రపంచంలోనే ఇలా కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి అతడే. అంతేగాదు ప్రస్తుతం అతడిని రియల్ ఐరన్ మ్యాన్‌గా పిలుచుకుంటున్నారు అంతా. ఇది ఒకరకంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు ఉదహారణగా నిలచింది. ఇది పల్లాడియంతో నడిచే ఆర్క్ రియాక్టర్ మార్వెల్‌తో పనిచేస్తుంది. ఇది విఫలమైన మానవ గుండె పనితీరును పూర్తిగా భర్తీ చేయడానికి రూపొందించిన టైటానియం బ్లడ్-పంపర్. దీన్ని బైవేకర్ అనే వైద్య సంస్థ అభివృద్ధి చేసంది. ఇది టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్(టీఏహెచ్) అని అంటారు. ఇది అచ్చం మానవ గుండె మాదిరిగా డిజైన్ చేశారు. అయితే సహజ హృదయస్పందనను అనుకరించదు. బదులుగా ఊపిరితిత్తులకు, శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి అయస్కాంతంగా లెవిటేటింగ్ రోటర్‌ను ఉపయోగిస్తుంది. ఈ వినూత్న డిజైన్ సౌకర్యవంతమైన గదులు లేదా పంపింగ్ డయాఫ్రాగమ్ల అవసరాన్ని తొలగిస్తుంది. చెప్పాలంటే ఇది మన్నికైన మరియు కాంపాక్ట్ పరికరంగా పేర్కొనవచ్చు.ఈ కృత్రిమ హార్ట్ ఇంప్లాంటేషన్ టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని బేలర్ సెయింట్ లూక్స్ మెడికల్ సెంటర్లో జరిగింది. ఈ మేరకు సదరు వైద్యులు మాట్లాడుతూ.."బాధితుడికి దాత అందుబాటులోకి వచ్చేవరకు ఈ కృత్రిమ గుండె ఎనిమిది రోజుల పాటు సమర్థవంతంగా పనిచేసింది. అంతేగాదు ఎన్నోఏళ్లుగా ఈ విషయమై సాగుతున్న పరిశోధనకు ఈ ఇంప్లాంటేషన్ సర్జరీ ముగింపు పలికింది. సదరు రోగి కుటుంబ సహకారం వల్ల ఇదంతా సాధ్యమయ్యింది.దీని కాంపాక్ట్ సైజు, ఇంచుమించు పిడికిలిలా ఉంటుంది. ఇది పురుషులు, స్త్రీలతో సహా అనేక రకాల రోగులకు అనుకూలంగా ఉంటుంది. ఏటా గుండె మార్పిడి డిమాండ్ అధికంగా ఉంది. దాతలు అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమస్యకు ఈ కృత్రిమ గుండె చెక్‌పెట్టి..ఆయా బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషస్తుంది. అంతేగాదు ఇది తీవ్రమైన గుండె వైఫల్య చికిత్సలో కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుంది." అని అన్నారు. (చదవండి: గంజాయితో లాభాలు! పరిశోధనలో షాకింగ్ విషయాలు..!) -
శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్‌చేస్తే..!
అత్యవసర శస్త్ర చికిత్స చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ భయానక ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..యూకేకి విశ్వవిద్యాలయ విద్యార్థి చార్లీ విన్సెంట్ యూఎస్‌లో న్యూ హాంప్‌షైర్‌లోని వేసవి శిబిరంలో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆరోజు అధిక సూర్యరశ్మీ అతని కాళపై పడటంతో కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి వడదెబ్బకు ురై ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ వైద్య పరీక్షలో అతడికి న్యూమోనియా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్ రావడం ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది. వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చిన పనిచేయడం ప్రారంభమయ్యింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. దీనిని కార్డియోమొగలీ అని పిలుస్తారని వైద్యులు అన్నారు. అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడిపోయారు. ఎందుకంటే.. ఇక్కడ ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు. అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకుని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఈ మేరకు అతడి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..ఒకానొక సమయంలో చార్లీ బతికే అవకాశాలు లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అతడు అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిదని అన్నారు. సదరు బాధితుడు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్‌గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..
బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారుప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి కొంగొత్త అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా ఉండటం లేదు. ఈ క్రమం లోనే చాలా మంది జనాలు ఆయుర్వేదం,పురాతన వైద్యం చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాలలో గుండె,కాలేయం,కిడ్నీ ఉన్నాయి. ఒక మొక్క ఈ మూడు అవయవాలను 70 ఏళ్ళ పాటు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుతుంది అని చాలా మందికి తెలియదు. ఈ అవయవాలకు ఆ మొక్క సంజీవినిలాగ పని చేస్తుంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయిలో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. బొప్పాయి ఆకుల రసంలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది. గర్భాశయ, ప్రోస్టేట్,రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మలబద్దకం సమస్య ఉన్న వారికి ఈ రసం ఔషధంలా పని చేస్తుంది.ఈ రసాన్ని బేది మందు అని కూడా అంటారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయ పడతాయి. గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది. అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవనిలాగ పని చేస్తుంది అని నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే స్ట్రాటజీ ఇదే..!) -
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
పెయిన్‌కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్‌ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్‌కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్‌కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్‌కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
Viral Photo: స్టూడెంట్ రాక్, టీచర్ షాక్.. గుండె నిండా అమ్మాయిలే
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్మేట్ అని పేర్కొన్నాడు.ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్ రాక్.. టీచర్ షాక్’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ స్పందించారు. -
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
-
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఓమేగా3, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది చేపలను తినేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇదే కారణంతో ఫిట్నెస్ ఔత్సాహికులు, బాడీ బిల్డర్లు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఐతేఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనుకున్నంత సత్ఫలితాలు ఉండవని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. పైగా స్ట్రోక్ తోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. మంచి గుండె ఆరోగ్యం ఉన్న వ్యక్తులు చేపల నూనె సప్లిమెంట్స్ క్రమం తప్పకుండ ఉపయోగించడం వల్ల గుండె దడ వంటి ప్రమాదాలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చాలా అరుదైన సందర్భాల్లోనే క్రమం తప్పకుండా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుందని డాక్టర్ ఆండ్రూ ఫ్రీమాన్ తెలిపారు.ప్రొఫెషనల్ మెడికల్ మార్గదర్శకాల్లో కూడా డైలీ ఈ సప్లిమెంట్స్‌ని వినయోగించాలని లేకపోయినా.. ప్రజలు వినియోగిస్తుంటారని అన్నారు. దీని వినియోగం గురించే తాము యూకేలో సుమారు నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులపై అధ్యయనం చేయగా.. చేపనూనె సప్లిమెంట్లు తీసుకున్న వారిలో క్రమరహిత హృదయస్పందన, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తింనట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే అసలు గుండె సమస్యలు లేని వ్యక్తుల్లో స్ట్రోక్‌లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. దాదాపు 12 ఏళ్లపాటు ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కార్డియోవాస్కులర్ వ్యాధి ఉన్నవారిలో, రెగ్యులర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ గుండె దడ నుంచి గుండెపోటు వచ్చే అవకాశం 15 శాతం, గుండె వైఫల్యం నుంచి మరణం వరకు 9 శాతం వరకు పురోగతిని తగ్గించాయని అధ్యయనం పేర్కొంది. వాస్సెపా, లోవాజా వంటి ఫిష్ ఆయిల్ ప్రిస్క్రప్షన్ వెర్షన్లు గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉన్న వారిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, ఒక రకమైన బ్లడ్ ఫ్యాట్కి దారితీసి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని ఫ్రీమాన్ చెబుతున్నారు. అలాగే అత్యంత శుద్ది చేసిన ఫిష్ ఆయిల్ వెర్షన్లలో కూడా హార్ట్ స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఐతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు వైద్యుల సిఫార్సు మేరకు ఈ సప్లిమెంట్స్ వాడొచ్చని చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఈ సప్లిమెంట్స్ సూచించే ముందు శరీరంలో ఓమెగా -3 ఫ్యాటీ యాసిడ్ స్టాయిలను పరీకించి సిఫార్సు చేయాలని చెబుతున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఈ ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను ఆహార వనరుల నుంచే పొందేందుకు ప్రయత్నించాలని చెప్పారు. చెప్పాలంటే..ఆల్గే, సీవీడ్, ఒమేగా 3 ఫిష్ మూలాలు. చియా విత్తనాల, ఎడామామ్, అవిసె గింజలు, హెంప్సీడ్లు, వాల్నట్లలో ఒమెగా -3 అధికంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ఆధారపడటం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!) -
హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్‌లో హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం. రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది. గుండె పెరగడం.. రకాలు.. గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి.. డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్) రెండూ పెరుగుతాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అంటారు. ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్ డయలేటెడ్ కార్డియో మయోపతి అంటారు. కారణాలు.. గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకారై్డటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం. గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. దీన్ని ఎక్స్–రే ద్వారా కనుగొంటారు. రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల. కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి). దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్‌టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు. లక్షణాలు.. శ్వాస సరిగా అందకపోవడం కాళ్ల / పాదాల వాపు బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం. నిర్ధారణ పరీక్షలు.. కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్‌మిల్‌పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. చికిత్స.. గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా. రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా. గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్‌లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా. మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. ఇతర మందుల వాడకంతోనూ.. కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్తో రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో. రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్తో. గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు. గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు. గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్‌మేకర్’ అమర్చడం ద్వారా. లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ) అనే ఉపకరణాన్ని. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో. చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇవి చదవండి: మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి.. -
గుండె సంరక్షణకు లీ హెల్త్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: న్యూట్రాసూటికల్స్ తయారీ సంస్థ లీ హెల్త్ డొమెయిన్ గుండె సంరక్షణకై సహజ సిద్ధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను తయారు చేసింది. వెల్లుల్లి సారం, గామా ఒరిజనోల్, ఫైటోస్టెరాల్, లైకోపీన్, పసుపులో ఉండే కుర్కుమిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన పైపెరిన్‌తో వీటిని రూపొందించామని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. ‘అత్యంత శక్తివంతమైన ఈ సమ్మేళనాలు కొలె్రస్టాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేస్తాయి. క్రమ రహిత హృదయ స్పందనలను స్థిరీకరిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి’ అని చెప్పారు. అమెజాన్, లీ హెల్త్ డొమెయిన్, ఫార్మసీలలో లైఫోస్టెరాల్ లభిస్తుంది. -
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
‘లేజర్’తో యాంజియోప్లాస్టీ..!
కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడ్డప్పుడు బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ వంటి అనేక ప్రక్రియలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఇటీవల అనేకమంది గుండెజబ్బుల బాధితులను రక్షిస్తున్న సంగతులూ తెలిసినవే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియను లేజర్ సహాయంతో మరింత సురక్షితంగా చేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని తేలింది. గుండెజబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకూ, పురోగతికీ ప్రతీక అయిన ఈ సరికొత్త ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి తెలుసుకునే ముందు కరోనరీ యాంజియోప్లాస్టి అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులున్నప్పుడు, శస్త్రచికిత్స చేయకుండానే... చేతి లేదా కాలి దగ్గరున్న రక్తనాళం నుంచి చిన్న పైపుల్ని పంపి గుండె రక్తనాళాల వరకు చేరతారు. ఇక్కడ అడ్డంకులను తొలగించడం, నాళం సన్నబడ్డ లేదా అడ్డంకి ఉన్న చోట బెలూన్ను ఉబ్బించి, నాళాన్ని వెడల్పు చేసి, స్టెంట్ వేసి, రక్తం సాఫీగా ప్రవహింపజేసే ప్రక్రియనే ‘కరోనరీ యాంజియోప్లాస్టీ’ అంటారు. ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారంటే... రక్తనాళాల్లో అడ్డంకులు/బ్లాకులనేవి అక్కడ కొవ్వు పేరుకుపోవడంవల్ల ఏర్పడతాయి. యాంజియోప్లాస్టీలో... ముందుగా బ్లాక్ ఉన్న రక్తనాళంలోకి ఓ పైప్‌ను ప్రవేశపెడతారు. దీన్ని ‘గైడింగ్ క్యాథేటర్’ అంటారు. ఆ పైపులోంచి వెంట్రుక అంత సన్నటి తీగను... అడ్డంకిని సైతం దాటేలా... రక్తనాళం చివరివరకు పంపిస్తారు. ఈ సన్నటి తీగనే ‘గైడ్ వైర్’ అంటారు. ఒకసారి గైడ్ వైర్ అడ్డంకిని దాటి చివరి వరకు వెళ్లాక, గైడ్ వైర్ మీది నుంచి ఒక బెలూన్ని బ్లాక్ వరకు పంపిస్తారు. బ్లాక్‌ను దాటి వెళ్ళగానే, ఆ బెలూన్ని పెద్దగా ఉబ్బేలా చేస్తారు. ఒకసారి బెలూన్ సహాయంతో, రక్తనాళాన్ని తగినంతగా వెడల్పు చేశాక... ఆ బెలూన్ని వెనక్కి తీసుకువచ్చి, దాని స్థానంలో ఒక స్టెంట్ని ప్రవేశపెడతారు. స్టెంట్ అనేది లోహంతో తయారైన స్థూపాకారపు వల (జాలీ) వంటి పరికరం. ఇలా ఈ స్టెంట్‌ను... వేరొక బెలూన్ సహాయంతో బ్లాక్ ఉన్నచోట అమరుస్తారు. అలా అమర్చిన స్టెంట్ ని వేరొక బెలూన్‌తో బాగా ఎక్కువ ఒత్తిడితో రక్తనాళం గోడకు పూర్తిగా అనుకునేలా చూస్తారు. దీంతో యాంజియోప్లాస్టీ పూర్తవుతుంది. యాంజియోప్లాస్టీలో వచ్చే ఇబ్బందులు కొన్నిసార్లు యాంజియోప్లాస్టీని నిర్వహించే సమయంలో గైడ్ వైర్ బ్లాక్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఒక్కో సారి... దాటి వెళ్ళినప్పటికీ, దానిమీది నుంచి బెలూన్ వెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల... బెలూన్‌తో ఉబ్బించే ప్రక్రియ చేసినప్పటికీ... ఆ బ్లాక్ తొలగకపోవచ్చు. ఇంకొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో రక్తం గడ్డకట్టడం వల్ల బెలూనింగ్ చేసినప్పుడు... ఆ రక్తం గడ్డలు నాళంలోనే మరోచోటికి వెళ్లి, రక్త ప్రవాహానికి అవరోధంగా మారవచ్చు. ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి ఇప్పుడు లేజర్ ప్రక్రియని వాడుతున్నారు. అసలు లేజర్ అంటే ఏమిటి? ‘లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’ అన్న పదాల సంక్షిప్త రూపమే ‘లేజర్’. దీని సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పవచ్చు. మామూలుగా కాంతి కిరణాలు నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన ఏకరీతితో మరింత శక్తిమంతంగా ప్రసరింపజేసినప్పుడు వెలువడే కిరణాన్ని ‘లేజర్’ అనవచ్చు. శక్తిమంతమైన ఈ కాంతికిరణాల్ని (లేజర్లను) అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వైద్య చికిత్సల్లోనూ అనేక రకాలైన లేజర్లు వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేక లేజర్లలో గుండె కోసం వాడే వాటిని ‘ఎగ్జిమర్ లేజర్’ అంటారు. లేజర్‌తో అడ్డంకుల తొలగింపు ఎలాగంటే...? లేజర్ కిరణాలు మన కణజాలాలని తాకినప్పుడు మూడు రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. అవి... ఫొటో కెమికల్, ఫొటో థర్మల్, ఫొటో కైనెటిక్ ఎఫెక్ట్స్. ఈ ప్రభావాల సహాయంతో అక్కడ పేరుకున్న వ్యర్థ కణజాలాన్ని (దాదాపుగా) ఆవిరైపోయేలా చేయవచ్చు. రక్త నాళంలోని అడ్డంకులనూ అదేవిధంగా ఆవిరైపోయేలా చేయడానికి లేజర్ సహాయం తీసుకుం టారు. ఏయే దశల్లో లేజర్‌ను ఎలా ఉపయోగిస్తారంటే... గైడ్ వైర్ మీదనుంచి బెలూన్ వెళ్లలేకపోయిన సందర్భాల్లో లేదా బెలూన్ ద్వారా బ్లాక్‌ను మార్చలేకపోయినప్పుడు. ∙రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన బ్లాక్స్ ఉన్నప్పుడు, అవి మరోచోటికి చేరి మళ్లీ రక్తప్రవాహానికి అవరోధంగా మారకుండా చూడటానికి. గుండె రక్తనాళాల్లో సంపూర్ణంగా, చాలాకాలం నుంచి ఉండిపోయిన మొండి బ్లాక్‌లను తొలగించడానికి. ∙కాల్షియం అధికంగా ఉన్న గుండె రక్తనాళాల్లో బ్లాక్‌ని తొలగించడానికి. ఒకసారి వేసిన స్టెంట్లో మరోసారి అడ్డంకి బ్లాక్ ఏర్పడినప్పుడు రక్తనాళం మొదట్లో ఉన్న అడ్డంకులు, లేదా మరీ పొడవుగా ఉన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు. ఇది యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయమా? సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో లేజర్ యాంజియోప్లాస్టీ అన్నది... సంప్రదాయ యాంజియోప్లాస్టీ కన్నా తక్కువ ఖర్చుతో రక్తనాళంలోని అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. లేజర్ని యాంజియోప్లాస్టిలో ఒక అనుబంధ విధానంగా వాడుకోవచ్చుగానీ లేజర్ అనేదే ఆంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు. బాధితులందరికీ ఈ లేజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. లేజర్‌కు అయ్యే ఖర్చు ఎక్కువే కాబట్టి... కేసు తీవ్రతను బట్టి ఎవరికి అవసరం అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ణయించే అంశమిది. కేవలం చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది అవసరం పడవచ్చు. --డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?) -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్‌బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్‌బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్‌దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్‌బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్‌దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,500 సార్లు లేదా సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె నిముషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కాగా బ్లూ వేల్ గుండె భారీ పరిమాణం కలిగివుంటుంది. జీవులలో అతిపెద్ద గుండె బ్లూ వేల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సముద్ర జీవి రెండు బస్సులకు మించిన పొడవు కలిగివుంటుంది. దాని గుండె లవ్సీట్ ఆకారంలో ఉంటుంది. అది 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాని గుండె నిమిషానికి కనీసం రెండుసార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నీటి అడుగున ఉండే ఈ నీలి తిమింగలం ఛాతీపై జెయింట్ స్టెతస్కోప్ పెట్టిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలోని అన్ని జీవులలో తిమింగలం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. దాని గుండె చాలా పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దాని గుండె కొలతలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో బ్లూ వేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె బరువు 190 కిలోలు. ఈ జీవి మొత్తం బరువులో గుండె ఒక శాతం ఉంటుంది. అంటే గుండె బరువు 400 పౌండ్లు అయితే తిమింగలం మొత్తం బరువు 40,000 పౌండ్లు. చేపల బరువు పౌండ్లలో కొలుస్తారు. మనిషి గుండె బరువు 10 ఔన్సులకు సమానం. కేజీలోకి మారిస్తే 283 గ్రాములు. తిమింగలం గుండె బరువు మనిషి గుండె కంటే 640 రెట్లు అధికం. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు? -
గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి ..
ఇటీవల చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ప్లానే చేసుకునేలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టాబ్లెట్ల దగ్గర నుంచి వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. కాకపోతే అవన్నీ వైద్యుల సూచనలు సలహాల మేరకే వినియోగించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడొక మహిళ కూడా గర్భం రాకుండా ఉండేలా అత్యాధునిక వైద్యం చేయించుకుంది. అందులో భాగంగా ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తే అది కాస్త నేరుగా ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్‌కి చెందిన 22 ఏళ్ల క్లో వెస్టర్వే తన చేతికి రెండేళ్ల క్రితం గర్భ నిరోధక పరికరాన్ని ఇంప్లాంట్ చేశారు. ఈ వైద్య విధానంలో భాగంగా ఓ ఫ్లైక్సిబుల్ రాడ్‌ని ఆమె చేతికి ఇంప్లాంట్ చేశారు. నిజానికి ఈ రాడ్ ప్రతినెల అండోత్సర్గాన్ని ఆపేలా ప్రొజెస్టెరాన్‌ను రక్తప్రవాహంలో విడుదల చేస్తుంది. ఈ రాడ్ మూడు సంవత్సరాల వరకు గర్భరాకుండా చేస్తుంది. పైగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రోజు గర్భం రాకుండా మాత్ర వేసుకునే ఇబ్బందకి చెక్ పెడుతుంది. ఆరోగ్య పరంగా మంచిది. అందుకనే ఎక్కువ మంది మహిళలు గర్భం రాకుండా ఉండేలా ఈ ఇంప్లాంట్కే ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రధాన కారణం. అయితే ఏం జరిగిందో ఏమో! సడెన్‌గా ఈ ఇంప్లాంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి క్లో గుండెల్లో మంట, వాంతులు, అధిక రక్తస్రావం, దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్చేయగా ఆమెకు ఇంప్లాంట్ చేసిన రాడ్ చేతి వద్ద కనపించలేదు. ఎంత ప్రయత్నించిన వైద్యులుఆ రాడ్ ఎక్కడుందనేది కనుగొనలేకపోయారు. చివరికి ఆ రాడ్ ఆమె గుండెలోని పల్మనరీ ధమనుల్లోకి వెళ్లిపోయిందని గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు. అది సుమారు నాలుగు సెంటిమీటర్ల పరికరం. నిజానికి ఇది వైద్యులు గర్భం రాకుండా ఉండేలా ఆమె చేతిపై చర్మం వద్ద ఉంచిన ఒక ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ రాడ్. దీని కారణంగా ఆమె తీవ్రమైన నరాల నొప్పి, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలను చవిచూసింది. ఇప్పుడూ ఆ ఫ్లెక్సిబుల్ రాడ్‌ని తొలగించేందుకు సదరు బాధిత మహిళకు మొదటగా ఊపిరితిత్తుల ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, తదితర శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె కోలుకోవడానికే దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. దీని కారణంగా ఆమె జీవితంలో ఆమె ఏ బరువైనా వస్తువుని పైకి ఎత్తలేదు, తనంతట తాను స్వయంగా లేవలేదు. కాగా యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం గర్భనిరోధక ఇంప్లాంట్ వికటించిన కేసులు 18 ఉన్నాయి. అలాగే ఆమెలా గుండె పల్మనరీ ధమనుల్లోకి పరికరం చేరిన కేసులు 107 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి ఆ పరికరం పనిచేయకపోతే ఇలా గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలు గర్భధారణను నివారించడంలో 99% సమర్థవంతంగా పనిచేస్తుందని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఐతే ఇలా కొన్ని కేసుల్లో ఈ పరికరం ఎందుకు వికటిస్తోందో తెలియాల్సి ఉందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..) -
పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
తిరుపతి: తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. 33 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం గుంటూరు నుంచి ప్రత్యేక చాపర్‌లో గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రికి తరలించారు. గుండె తరలింపునకు సీఎం జగన్ చొరవతో ప్రత్యేక చాపర్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చొరవతో రెండేళ్ల కిందటే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తున్నారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అనతికాలంలోనే ది బెస్ట్‌గా గుర్తింపు సాధించింది. ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి -
గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోండి! లేదంటే..
ట్రైగ్లిజరైడ్స్ అన్నవి కొలెస్ట్రాల్‌లాగానే రక్తంలోని ఒక రకం కొవ్వులని చెప్పవచ్చు. ఇవి ఉండాల్సిన మోతాదు పెరిగితే ఆ కండిషన్‌ను ‘హైపర్ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. వీటి మోతాదులు పెరగడం గుండె జబ్బులకు దారితీయవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని అదుపు చేసుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆహారంలో కొవ్వుల్ని... అంటే శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ మోతాదులను బాగా తగ్గించాలి. ఉదాహరణకు... నెయ్యి, వెన్న, వూంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. వాటితో పాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడమూ మంచిదే. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. పొట్టు తీయని ధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రోట్స్) తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్మీట్ను పూర్తిగా మానేయాలి. అయితే మాంసాహారాన్ని ఇష్టపడే వారు వారంలో వుూడుసార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవీ, గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోకూడదు∙ పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయాలి. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పవు!
ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతమంది గుండెజబ్బు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. మన దేశంలో ఏటా కోటీ 79 లక్షలమంది గుండెజబ్బులతో చనిపోతున్నారు. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా గుండె జబ్బుల్ని చాలావరకు నివారించవచ్చు. గుండెకు చేటు తెచ్చిపెట్టే ఆరు ముఖ్యమైన అంశాలు... అధిక రక్తపోటు (హై–బీపీ) : ఇది ఓ సైలెంట్ కిల్లర్. దాదాపు 75% గుండెపోట్లకు కారణం. స్థూలకాయులు తమ బరువులో 10 శాతం తగ్గించుకున్నా ఏ మందులూ లేకుండానే హైబీపీని చాలావరకు అదుపు చేయవచ్చు. మధుమేహం: డయాబెటిస్ ఉన్నవారు చాలావరకు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. అందుకే 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలను ఏడాదిలో కనీసం రెండుమూడుసార్లు చేయించుకోవాలి. ఒంట్లో కొవ్వులూ, కొలెస్ట్రాల్ : ఆహారంలో కొవ్వులతో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగి, గుండెకు చేటు తెచ్చిపెడుతుంది. దేహంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ : చాలాకాలం పాటు ఒత్తిడికీ, ఇతర దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్లకూ గురవుతూ ఉండటం, నిద్రలేమి, పొగతాగే అలవాట్లు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినేందుకు దోహదపడతాయి. దాంతో రక్తంలోకి విషపూరితమైన రసాయనాలు విడుదలై రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెను దృఢంగా ఉంచుకోడానికి చేయాల్సినవి... లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం. ఒకేచోట కూర్చోకుండా నడక... సామర్థ్యం మేరకు పరుగు లేదా జాగింగ్. కార్లూ, బైకులకు బదులు సైకిల్ వాడటం. ∙ఈత, తోటపని చేస్తూ ఉండటం. ∙పొగతాగడం, నిద్రలేమికి దూరంగా ఉండటం... ఇవన్నీ దేహానికీ, దాంతోపాటు గుండెకూ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. డా‘‘ ప్రదీప్ కె. రాచకొండ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జరీ. (చదవండి: భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త) -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
గర్భధారణ సమయంలో గుండెల్లో వచ్చే మంట ప్రమాదమా..?
గర్భవతుల్లో గుండెల్లో లేదా ఛాతీలో మంటగా ఉండటం, తేన్పులు, అజీర్తి ఫీలింగ్... ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అయితే స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ గర్భవతుల్లో... మరీ ముఖ్యంగా ఐదారు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ. ఎందుకు వస్తుందంటే.. కారణాలివి... గర్భవతుల్లో ప్లాసెంటా నుంచి ప్రోజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. నెలలు నిండుతూ గర్భసంచిలో పిండం పెరుగుతున్న కొద్దీ... దానికి మరింతగా చోటు కల్పించడానికి గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతిపరమైన ఏర్పాటిది. ఈ హార్మోన్ కేవలం గర్భసంచినే కాకుండా జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే ‘లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’పైనా ప్రభావం చూపుతుంది. దాంతో ఆ స్ఫింక్టర్ వదులై, జీర్ణరసాలు పైకి ఎగజిమ్మడంతో గర్భవతుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. నివారణ: ఆహారంలో కారం, మసాలాలూ, వేపుళ్లు పరిమితంగా తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి భోజనం పూర్తికాగానే పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ తిరగాలి∙ పడుకునే సమయంలో తలగడ పెట్టుకుని, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి అప్పటికీ సమస్య తగ్గకపోతే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే యాంటాసిడ్స్ వాడాలి. (చదవండి: కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?) -
వాట్సాప్‌లో హార్ట్ సింబల్స్ పంపుతున్నారా.. మీకు జైలు శిక్షే
ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ ఫ్రెండ్లీగా, ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడకుండా ఉండలేరేమో.యూత్‌లోనూ వాట్సాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా మెసేజ్‌లో టైప్ చేసేవారు. కానీ ఇప్పుడంతా ఎమోజీల కాలం అయిపోయింది. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, ఆకలి..ఇలా ఏ ఫీలింగ్ అయినా ఒక్క ఎమోజీలో చెప్పేస్తున్నారు. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందట. ఈ కొత్త రూల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎలాంటి ఎమోజీలు వాడకూడదు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వాట్సాప్ వాడనిదే రోజు గడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రతిరోజూ అవసరం కోసమో, ఏదైనా విషయాన్ని చెప్పాలన్నా వాట్సాప్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇక ప్రేమలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల కంటే ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా హార్ట్ ఎమోజీలతో ఇంప్రెస్ చేసేస్తుంటారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు హార్ట్ సింబల్స్ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందట. వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త తరహా రూల్‌ను తెచ్చి పెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు ఈ కొత్త ప్రయత్నమని వివరించారు. -
40 మీటర్ల ఎత్తులో రోప్ ర్యాక్.. అమాంతం పడిపోయిన బాలుడు..
మెక్సికోలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రోప్స్ ర్యాక్‌లో ఆరేళ్ల పిల్లాడు 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు పిల్లాడు పడిపోయే ప్రదేశంలో చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పింది. మాంటెర్రేలోని ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో కుటుంబంతో అందరూ కలిసి వచ్చారు. ఈ క్రమంలో రోప్స్ ర్యాక్ సాహస క్రీడలో పాల్గొనడానికి పిల్లలు వెళ్లారు. అందులో ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్‌పై ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్‌పై వెళ్లాడు. ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే అబ్బాయి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడ కింద చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది. 🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA — Around the world (@1Around_theworl) June 26, 2023 స్వల్ప గాయాలతో బయటపడిన బాధితున్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోప్ ర్యాక్ నిర్వహణలో యాజమాన్యం సరిగా స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే!
సజీవంగా ఉండాలంటే ప్రతీ జీవికి గుండె ఎంతో అవసరం. గుండె అనేది శరీరం అంతటికీ రక్తం సరఫరా చేయడంతోపాటు పలు విధులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒకటి కన్నా ఎక్కువ గుండెలు కలిగిన జీవుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపచంలో అనేక జీవజాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి కింద, మరొకొన్ని చెట్ల మీద నివాసం ఏర్పరుచుకుంటాయి. వీటిలో కొన్ని జీవులకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ గుండెలు ఉంటాయి. వీటిలో ఆక్టోపస్‌కు 3 గుండెలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలుసు. అయితే ఆక్టోపస్తోపాటు మరి ఏ జీవులకు అత్యధిక గుండెలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్టోపస్ ఇది సముద్ర జీవి దీనికి 3 గుండెలు, 8 కాళ్లు ఉంటాయి. దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. దీని జీవిత కాలం 6 నెలలు మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్క్విడ్ ఈ చేప చూసేందుకు ఆక్టోపస్ మాదిరిగానే కనిపిస్తుంది. దీనికి కూడా 3 గుండెలు ఉంటాయి. దీనిలో ఒక గుండె దాని శరీరానికంతటికీ రక్తం సరఫరా చేస్తుంది. మిగిలిన రెండు గుండెలు గిల్స్‌లో ఆక్సిజన్ పంప్ చేస్తాయి. గిల్స్ అనేది చేపకు ఆక్సిజన్ అందించే అవయవం. ఎర్త్‌వార్మ్ ఎర్త్‌వార్మ్ అంటే వానపాము. ఇది వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తుంది. దీనికి కూడా పలు గుండెలు ఉంటాయి. దీని హృదయం పనిచేసే విధానాన్ని ‘ఎరోటిక్ ఆర్చ్’ అని అంటారు. ఇది పంపింగ్ ఆర్గాన్ మాదిరిగా పనిచేస్తుంది. శరీరం అంతటికీ ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాక్రోచ్ కక్రోచ్కు ఒకే గుండె ఉన్నప్పటికీ దానికి 13 చాంబర్లు ఉంటాయి. దీని గుండెలోని ఒక చాంబర్‌కు గాయమైతే, మిగిలిన చాంబర్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా హృదయానికి గాయమైనా అది చనిపోదు. ఇది కూడా చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! -
బాలికకు విజయవంతంగా గుండె మార్పిడి
సాక్షి,తిరుపతి(తుడా): తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండెమారి్పడి చికిత్సను వైద్యులు శనివారం విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలికకు 6 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. కొంతకాలంగా ఆ బాలిక గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించడంతో అనారోగ్యం బారినపడింది. ఆమెకు గుండె మార్పిడి అనివార్యమని ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తేల్చారు. బాలిక పేరును ‘ఏపీ జీవన్‌దాన్’లో రిజిస్టర్ చేయించారు. కాగా, చెన్నైకు చెందిన 29 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ కావడంతో యువకుడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. అతడి నుంచి సేకరించిన గుండెను తమిళనాడు, తిరుపతి జిల్లా పోలీసులు 2.32 గంటల్లో గ్రీన్ చానల్ ద్వారా హృదయాలయానికి తరలించి బాలికకు అమర్చారు. కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షించారు. చదవండి: ప్యాసింజర్ రైళ్లకు మంగళం -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్చార్జి డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్‌రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్‌లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్‌కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్‌కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్‌కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు. ఆగిన గుండె.. గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్‌కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్‌ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే? ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్‌కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్‌లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. -
వింత ఘటన: గుండె లేకుండా జీవించిన తొలి మానవుడు!
సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..క్రెయిగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ బిల్లీకోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, లూయిస్ రక్తాన్ని పల్స్ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు. అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్‌లైన్ చూపిస్తుందని డాక్టర్ కోన్ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు. ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్‌ని డయాలసిస్ మెషిన్, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్ నిలిచాడు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
థాయ్ ప్రిన్స్‌కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్‌లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్‌కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్‌లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్‌లాండ్‌లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
అతి వ్యాయామంతో గుండెకు చేటు.. పోటు!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి.. అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్సైజ్లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్ కుమార్ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. -
సిగరెట్.. గుండెనూ కాల్చేస్తుంది
సాక్షి, అమరావతి: గుప్పెడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంటుంది. అంతటి కీలకమైన గుండెకు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధూమపానం గుండె ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతోందని కర్నూలు జీజీహెచ్ వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ వైద్యనిపుణుడు వినోద్ బైపాస్ సర్జరీ కేసులపై పరిశీలన జరిపారు. 2016 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య కర్నూలు జీజీహెచ్‌లో నిర్వహించిన 108 బైపాస్ సర్జరీ కేసులను అనలైజ్ చేశారు. ఈ కేసుల్లో గుండె జబ్బు బాధితుల కనిష్ట వయసు 35, గరిష్ట వయసు 85 సంవత్సరాలు కాగా.. మొత్తం కేసుల్లో పురుషులు 90 మంది.. మహిళలు 18 మందిఉన్నారు. అధిక కేసులకు ధూమపానమే కారణం మెడికల్ అనలైజేషన్ ప్రొటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా.. 108 బైపాస్ సర్జరీ కేసుల్లో 60 మందిలో ధూమపానమే ప్రధాన కారణంగా నిర్ధారించారు. ధూమపానం అనంతరం రెండో స్థానంలో మద్యపానం ఉంది. 36 మందిలో మద్యపానం గుండె జబ్బుకు కారణంగా తేలింది. 28 మందిలో రక్తపోటు, 19 మందిలో మధుమేహం చరిత్రను గుర్తించారు. ధూమపానం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉన్న వ్యక్తులు యుక్త వయసు నుంచే ఆ వ్యసనానికి అలవాటుపడి ఉన్నట్టుగా నిర్ధారించారు. సుదీర్ఘకాలం పొగతాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీలకు దారి తీసింది. రక్తనాళాలకు హాని ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసినప్పుడు పీల్చే రసాయనాలు గుండె, రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో ఫలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కొంతమందికి, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే స్త్రీలకు, మధుమేహం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరి తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు -
ఆ గుండె వయసు.. 38 కోట్ల సంవత్సరాలు!!
వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. గోగో చేప.. ఊహాత్మక చిత్రం ఇదీ చదవండి: కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు -
స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?
అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది. గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు చెబుతారు. అయితే స్టెంట్ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు హఠాత్తుగా ఛాతీలో నొప్పి చెమటలు పట్టడం వాంతులు దీర్ఘకాలికమై లక్షణాలు శ్వాసలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం నడక, కదలికల సమయంలో ఆయాసం తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం. నిర్ధారణ పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కరొనరీ యాంజియోగ్రామ్ పూడికలు ఎక్కడ వస్తాయంటే...? ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్‌కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటే... స్టెంట్ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటారు. ఈ పూడికను కరొనరీ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్ అంటే ‘ఇంట్రావాస్క్యులార్ అల్ట్రాసౌండ్’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్ ప్రక్రియలు. ఇలా స్టెంట్ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్ అండర్–ఎక్స్‌ప్యాన్షన్’ అంటారు. అలాగే స్టెంట్ ఫ్రాక్చర్‌కు గురికావచ్చు కూడా. స్టెంట్ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్‌ల్యాప్ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే స్టెంట్ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. స్టెంట్ లోపల మరో స్టెంట్... ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్లోపల మరోస్టెంట్ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్... స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. ప్రస్తుతం బేర్ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్ మెటల్ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్ మెటల్ స్టెంట్లకు బదులుగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్ మెటల్ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్‌తో పూడిక తొలగింపు.... స్టెంట్లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్‌ను ‘టిష్యూ హైపర్‌ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్‌ను లేజర్‌తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్’ అనే ఔషధాలను (డ్రగ్స్)ను వైద్యులు ఉపయోగిస్తారు. ఇన్స్టెంట్ స్టెనోసిస్‌కు చికిత్స ఇలా... కరొనరీ ఇమేజింగ్ ద్వారా స్టెంట్ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్ తాలూకు అండర్–ఎక్స్‌ప్యాన్షన్ కండిషన్‌కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టెంట్ చుట్టూరా క్యాల్షియమ్ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్‌ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్‌ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్ ఎ. శరత్‌రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
సైరస్ మిస్త్రీ విషాదం: పోస్ట్‌మార్టం నివేదిక ఏం చెబుతోందంటే?
ముంబై: గత ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాథిమిక పోస్ట్‌మార్టం పూర్తియింది. దీని ప్రకారం ఆయన తలకు, గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా అంతర్గత రక్తస్రావంతో అక్కడి కక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది. అలాగే పాలీట్రామా (శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బ తినడం)కు గురయ్యారని ఈ నివేదిక తేల్చింది.(Instagram: భారీ జరిమానా..షాకింగ్! ఎందుకో తెలుసా?) సోమవారం తెల్లవారుజామున ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రిలో సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరి శవపరీక్ష నివేదికను కాసా పోలీస్ స్టేషన్‌కు (ప్రమాదం జరిగిన ప్రాంతం)పంపారు. మరో రెండురోజుల్లో తుది నివేదిక వెలువడ నుంది. ఇందులో మిస్త్రీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిస్త్రీ శరీరంనుంచి ఎనిమిది శాంపిళ్లను సేకరించి, తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలు భద్రం చేశారు. మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: New milestone: వావ్.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి ముగిసిన అంత్యక్రియలు జేజే ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిన ఆయన భౌతికకాయాన్నిస్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు వర్లీ శ్మశానవాటికలో ఉంచారు. అనంతరం సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ సంఘం సభ్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు దహన సంస్కారాలకు హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ సోదరుడు షాపూర్ మిస్త్రీ, మామ, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు సైరస్ మిస్త్రీకి తుది నివాళులర్పించారు. అమూల్ ప్రత్యేక నివాళి డైనమిక్ బిజినెస్‌మ్యాన్ అంటూ అమూల్ ఇండియా మిస్త్రీకి నివాళులర్పించింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్‌ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండెను తయారు చేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: రిఫ్రిజిరేటర్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటివి పాడైపోతే ఏం చేస్తాం? మరమ్మతు చేయించుకుని వాడుకుంటాం. లేదా కొత్తవి కొనుక్కుంటాం. అదే మన శరీరం లోని ఏదైనా అవయవం పాడైతే..? మందు లేసుకునో, శస్త్ర చికిత్స చేయించుకునో పనిచేసేలా చూస్తాం. చాలా అరుదుగా అవయవ మార్పిడి తప్ప మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన అవయవాన్ని తెచ్చి అమర్చు కునే పరిస్థితి లేదు. కానీ అలాంటి వెసులుబాటు ఉంటే, మనకు కావాల్సిన అవయవాన్ని తయారు చేసుకోగలిగితే? ఇలాంటి అద్భుతం సాకారమయ్యేందుకు మార్గం సుగమమైంది! చైనాలోని ట్సింగ్హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూలకణాలపై ఈ మేరకు జరిపిన ఓ ప్రయోగం విజయవంతమైంది. మూలకణాలే మూలం.. అవయవాల తయారీ ఎలా అన్న విషయాన్ని తెలుసుకునే ముందుగా మనం మూలకణాల గురించి కొంత అర్థం చేసుకోవాలి. పిండ దశ నుంచి బిడ్డ పుట్టి ఎదిగేంతవరకూ మానవ అవయవాల్లో మూల కణాలు ఉంటాయి కానీ.. వేటి లక్షణాలు వాటివే. పిండంలో ఉండే కణాలనే ఉదాహరణగా తీసుకుంటే అవి గర్భంలో ఉన్న దశలో అన్ని రకాల కణజాలాలు, అవయవాలుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి. బిడ్డ పుట్టిన తరువాత.. ఎదిగిన తరువాత మాత్రం ఒక్కో అవయవంలో అత్యల్ప స్థాయిలో ఉండే మూలకణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవు. అంటే మూత్రపిండంలోని మూల కణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవన్న మాట! అయితే పిండదశలో ఉన్న మూలకణం గుండె గానూ మారగలదు. మూత్రపిండంగానూ తయారు కాగలదు. ఉమ్మినీరు గానూ మారగలదు. వీటిని టూటీపోటెంట్ స్టెమ్‌సెల్స్ అని పిలుస్తారు. స్థూలంగా చెప్పాల్సి వస్తే... నాలుగైదు రోజుల వయసున్న పిండంలోని కణాలే ఈ టూటీ పోటెంట్ కణాలు. ఆ తరువాత కొంత సమయానికి ఇవి శరీరంలోని వేర్వేరు కణాలుగా మారగల సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. వీటిని ప్లూరీపోటెంట్ స్టెమ్‌సెల్స్ అని పిలుస్తారు. పిండంలో అవయవాలు ఏర్పడటం మొదలైన తరువాత వాటికేదైనా నష్టం జరిగితే సరిచేసేందుకు వీలుగా కొన్ని మూలకణాలు ఉంటాయి. అవి ఆ అవయవ కణాలుగా మాత్రమే మారగలవు. వీటిని మల్టీపోటెంట్ కణాలు అంటారు. పిండం కూడా సృష్టించొచ్చు! ఇవి ఏ అవయవంగానైనా మారగలవని ముందే చెప్పుకున్నాం కదా. ఆ విధంగా సుదూర భవిష్యత్తులో నిస్సంతులకు వీర్యం, అండాల అవసరం లేకుండా పిండాన్ని సృష్టించేందుకు కూడా ఈ టెక్నాలజీ పయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పిండాన్నే సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు అవసరమైన అవయవాల తయారీ పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మరింత క్షుణ్ణంగా పరిశోధనలు జరపడం ద్వారా ఫలితాలను మరింత కచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూలకణాలను మార్చేశారు చైనా వర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల అవయ వాల్లోని మల్టీ పోటెంట్ మూలకణాలను తీసుకుని.. రసాయన మిశ్రమం సాయంతో టూటీపోటెంట్ కణా లుగా మార్చేశారు. ఇంకోలా చెప్పాలంటే.. పిండ దశలో ఉన్న మూలకణాల మాదిరి మార్చేశారన్నమాట. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మల్టీపోటెంట్ కణా లను ప్లూరీపోటెంట్ కణాలుగా మార్చడంలో విజ యం సాధించారు కానీ.. టూటీపోటెంట్ కణా లుగా మార్చడం మాత్రం ఇదే తొలిసారి. ఇందు కోసం వారు కొన్ని వేల పరమాణువుల మిశ్రమా లను పరీక్షించి చివరకు మూడింటిని గుర్తించారు. టీటీఎన్పీబీ, 1–అజాకెన్పాల్లోన్, డబ్ల్యూఎస్6 అని పేర్లు పెట్టిన ఈ మూడు రసాయనాలు ఎలుకల్లోని ప్లూరీపోటెంట్ కణాలను టూటీపోటెంట్ కణాలుగా మార్చగలవని నిర్ధారించుకున్నారు. ఎలుకల పిండాల్లో, పరిశోధన శాలలు రెండింటిలోనూ జరిపిన పరిశోధనల ద్వారా వీటి లక్షణాలన్నీ టూటీపోటెంట్ కణాల మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమైంది. -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్‌ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్‌లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్‌లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
ఇన్నోసెంట్ హార్ట్ మర్మర్.. చిన్నారుల గుండె గుసగుస..!
గుండెల్లో గుసగుసలు అన్న మాట ఇక్కడ కవిత్వమో, భావుకతో కాదు. ఇది పక్కా వాస్తవం. కొందరు చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణం. దీన్నే ఇన్నోసెంట్ హార్ట్ మర్మరింగ్ అంటుంటారు డాక్టర్లు. ఈ గుసగుసలు ఎందుకో, అప్పుడేం చేయాలో తెలిపే కథనం ఇది. నెలల పిల్లలు మొదలుకొని... ఏడాదీ లేదా రెండుమూడేళ్ల పిల్లలను డాక్టర్లు స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు కొంతమంది చిన్నారుల్లో గుసగుస శబ్దం (మర్మర్) వినపడుతుంది. అలా వినగానే ‘ఇదేమిటి?... ఇదేదో తేడాగా ఉందే!’ అనిపిస్తుంది. కానీ అలా వినిపించినప్పటికీ దాదాపు చాలా కేసుల్లో తేడా ఏమీ ఉండదు. ఇది చాలావరకు నిరపాయకరమైన కండిషన్. అందుకే దీన్ని ఫంక్షనల్, బినైన్, ఫ్లో మర్మర్ లేదా స్టిల్ మర్మర్ అంటుంటారు. మర్మర్ మర్మమేమిటి? మర్మర్ మర్మమేమిటని పరిశీలిస్తే... ఇదేమైనా గుండె ఆకృతి (స్ట్రక్చరల్) లేదా నిర్మాణపరమైన (అనటామికల్) కారణాలతో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అంతా నార్మల్ అయితే ఈ శబ్దం ఎక్కడిది అనే అనుమానం వస్తుంది. అయితే ఈ శబ్దమంతా రక్తప్రవాహానిది. గుండెలోకి రక్తం వస్తున్నప్పుడు కలిగే ప్రవాహపు ఆటంకాలు (ఫ్లో డిస్ట్రబెన్స్)గానీ లేదా రక్తం అక్కడ సుడులు తిరగడం (ఫ్లో టర్బ్యులెన్సెస్), ఆ శబ్దం ప్రకంపనలు (రెసొనెన్సెస్) వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి ఏ సమస్యా లేకపోయినా శబ్దం వినిపించవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో ఇది ఏమాత్రం అపాయం కలిగించని సమస్యగా డాక్టర్లు చెబుతుంటారు. ఇది ఎంతమంది పిల్లల్లో? ఎవరిలో? పుట్టిన పిల్లల్లో కనీసం సగం మందికి... అంటే 50 శాతం మంది పిల్లల్లో ఈ హార్ట్ మర్మర్ ఉంటుంది. పుట్టిన పిల్లలు మొదలుకొని... చిన్నారుల్లో ఏదో ఒక దశలో ఇది కనిపించవచ్చు. ఇక ఏ చిన్నారిలోనైనా ఇది రావచ్చు. అయితే జ్వరంతో బాధపడే పిల్లల్లోనూ లేదా గుండె వేగంగా కొట్టుకునేవారిలోగానీ లేదా ఉద్వేగాలకు గురైనప్పుడు గుండె వేగం పెరిగే పిల్లల్లో సాధాణంగా ఈ కండిషన్ కనిపిస్తుంది. పెరిగాక ఈ కండిషన్ తగ్గిపోయినప్పటికీ... కొందరిలో వారు వ్యాయామం చేస్తున్నప్పుడు, బాగా ఉద్వేగానికి గురైనప్పుడు శబ్దం మళ్లీ వినపడవచ్చు. లక్షణాలేమిటి? సాధారణంగా కనిపించే గుండె స్పందనలు కాకుండా... కాస్తంత రక్తప్రవాహపు శబ్దాలు వినిపించడం తప్ప మరే రకమైన ఇతర లక్షణాలూ వీళ్లలో ఉండవు. ఒకవేళ వాళ్లలో ఇంకా ఏవైనా లక్షణాలు కనిపిస్తే అవి మాత్రం గుండెకు ఆపాదించకూడదు. పరీక్షలు ఏవైనా అవసరమా? స్టెతస్కోప్‌తో విన్నప్పుడు నిపుణులైన డాక్టర్లకు గుండె శబ్దం, లయను బట్టి అది సాధారణమా లేక ఏదైనా సమస్య (అబ్నార్మాలిటీ) ఉందా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ల ఆధ్వర్యంలో కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. పిల్లల ఆరోగ్య చరిత్రను బట్టి ఆ పరీక్షలేమిటన్నది నిర్ణయిస్తారు. సాధారణంగా ఈసీజీ, అటు తర్వాత ఎకోకార్డియోగ్రామ్తో అది సాధారణమా, అసాధారణమా అన్నది తెలిసిపోతుంది. ఒక్కోసారి గుండె, ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోడానికి ఓ సాధారణ ఎక్స్–రే సరిపోతుంది. చికిత్స ఏదైనా ఉందా? చాలా సందర్భాల్లో ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ చిన్నారులు, పెద్దపిల్లలుగా ఎదిగే సమయానికి ‘గుండె గుసగుసలు’ వాటంతట అవే తగ్గిపోవచ్చు. చిన్నతనంలో ఇలా హార్ట్ మర్మర్ ఉన్న పిల్లలు ఎదిగాక... వారు పూర్తిగా నార్మల్ వ్యక్తుల్లాగే పెరుగుతారు. అంతే ఆరోగ్యంగా ఉంటారు. మరేదైనా కారణాలతో వారికి గుండె సమస్యలు రావచ్చేమోగానీ... భవిష్యత్తులో వారికి వచ్చే గుండె సమస్యలకు ఇది మాత్రం కారణం కాబోదు. అందుకే హార్ట్ మర్మర్ అంటూ రిపోర్ట్ వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు చిన్నపిల్లల వైద్యులూ... చిన్నారుల గుండెనిపుణులు. -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు -
ఎక్మో ఎలాంటి సందర్భాల్లో వాడతారో తెలుసా?
ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం. ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు. ఎలా పని చేస్తుంది? ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్‌గా)వాడుతారు. ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్‌ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు. అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా? పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు. ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు. ‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్‌ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్‌గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్‌గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరెవరిలో... ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్‌గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు. అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సక్కెస్ రేటు తక్కువా? సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్‌కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి. అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క. కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ -
AP Special: పాములలో గుండె కదులుతూ ఉంటుందా..!?
ఆత్మకూరురూరల్:పాము కనిపిస్తే చాలు మన గుండె వేగం పెరగడం ,రక్తం వడవడిగా పరుగులెత్తడం సాధారణమే. మన గుండె ఒకే చోట ఉంటుంది. పాము విషయానికి వస్తే అలా కాదు. పాము గుండె పరిస్థితులను బట్టి తన శరీరంలో గుండెను మార్చుకుంటూ ఉంటుంది. వేగంగా కదిలే పాము చెట్లను ఎక్కుతున్న పుడు,తన పరిమాణానికి మించిన ఆహార జంతువును మింగుతున్నపుడు గుండె ఒకే చోట ఉంటే అది ఒత్తిడికి గురి అవుతుంది? అలాంటి సందర్భంలో పాము ఎలా అధిగమిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటిలో పాములపై జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఎన్ఎస్టిఆర్(నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్)వన్యప్రపాణుల వైద్యు నిపుణుడు డాక్టర్ ఆచార్య పాముల గురించి కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. డాక్టర్ ఆచార్య మేరకు పాములలో గుండె స్థిరంగా ఒక చోట ఉండదు. సాధారణంగా పాములను మూడు భాగాలుగా విభజిస్తే తల ఉన్న ప్రాంతంలో మెదడు, నాలుక,కోరలు, విషగ్రంధులు ఉంటాయి. మధ్యభాగంలో గుండె, చిన్న ప్రేగులు, తోక ప్రాంతంలో పెద్దప్రేగులు ఉంటాయి. అయితే పాములు తమ పరిమాణానికి మించిన జంతువులను మింగుతుంటాయి. ఉదాహరణకు కొండ చిలువలు మేకలను జింకలను మింగుతాయి. అలాగే నాగుపాములు పెద్ద ఎలుకలను మింగుతుంటాయి. పాములకు దంతాలు లేనందున ఆహారాన్ని నమిలి తినలేవు. యథాతధంగా ఫలానా జంతువును మింగినప్పుడు అనివార్యంగా పాము శరీరాన్ని రబ్బరులా సాగతీస్తుంది. ఈ సమయంలో పాము అంతర్భాగమంతా తాను మింగిన జంతువుతో నిండి పోతుంది. అపుడు గుండె ఒక చోట స్థిరంగా ఉంటే అది ఆహార జంతువు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో పాము గుండె దాని తోక వైపు పయనిస్తుంది. ఆహారపు జంతువు జీర్ణమవగానే తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. అలాగే పాములు వేగంగా చెట్లను ఎగబాకేటపుడు పూర్తిగా ఏటవాలుగా అవ్వడంతో అవసరమైన రక్తాన్ని పాము మెదడుకు పంప్ చేయడానికి గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో కూడా పాము గుండె పాము తలబాగానికి ప్రయాణం చేసి పాము మెదడుకు సులువుగా రక్తాన్ని పంప్ చేయగలుగుతుంది. చదవండి: అంతరిక్షంలోనూ అమోఘం -
మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్
న్యూయార్క్: మిస్ వరల్డ్ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ సైనీ నిలిచింది. వాషింగ్టన్‌కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ కావడం విశేషం. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్‌మేకర్ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి అయినప్పటికీ వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ......." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిస్ వరల్డ్ అమెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో "మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ అయిన శ్రీ 'ఎండబ్ల్యూఏ నేషనల్ బ్యూటీ అంబాసిడర్' అనే ప్రతిష్టాత్మక స్థానంలోఉంది, ఆమె నిరంతరం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది. అంతేకాదు డాక్టర్లు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె కనబర్చిన సేవ దృక్పథాన్ని యూనిసెఫ్, సుసాన జి కొమెన్(యూఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్) వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్ వరల్డ్ అమెరికా మిషన్ పట్ల అవగాహన కలిగిస్తుంది" అని ప్రశంసించింది. View this post on Instagram A post shared by Shree Saini👑Miss World America (@shreesaini) (చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!) -
ఆ వయసులోపు వారిలో కూడా పెరుగుతున్న గుండెపోటు..
మారుతున్న జీవనశైలి, స్తబ్దమైన యాంత్రిక జీవనం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సమయ పాల నలేని ఆహారం, రక్తపోటు, షుగర్ వ్యాధితో పాటు శరీర బరువుపై అదుపుకోల్పోవడం, వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. దీంతో పాటు మధుమేహం అధిక ముప్పుగా మారింది. అధిక రక్తపోటు, ఊబకాయ సమస్యలూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రెండేళ్లుగా సహజంగా గుండెపోటు మరణాలు పెరిగాయి. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల రెట్టింపు అయ్యాయి. ప్రమాదవశాత్తు కాకుండా వయసుతో సంబంధం లేకుండా చోటుచేసుకునే మరణాల్లో ఎక్కువగా గుండె పోటుతోనే అనేది చేదునిజం. బుధవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో 35శాతం బాధితులు ఉమ్మడి జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు 35శాతం ఉన్నట్లు అంచనా. వీరిలో మగవారు 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణాల్లో వీరి 56శాతం ఉంటుందని వైద్యాధికారుల తేల్చారు. ఆకస్మిక సమస్య ఎదురైన వారిలో 10శాతం మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. 20ఏళ్ల లోపు వారికి.. గుండె పోటు చాలా తక్కువగా 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం 20ఏళ్ల వయసు యువకుల దగ్గర నుంచి 70ఏళ్ల వరకు వస్తుంది. ప్రధాన కారణంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, ఫాస్ట్‌ఫుడ్, లావు పెరగడం, చెడు కొలాస్ట్రాల్ వల్ల దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100రోగులలో 70శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. 50 నుంచి 60శాతం పెరిగాయి జిల్లాలో కోవిడ్ వల్ల 50నుంచి 60శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు పెరిగాయి. కరోనా సోకిన 7నుంచి 10రోజుల మధ్య కాలంలో ఈ సమస్య బాగా వేధిస్తుంది. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మద్యం, సిగరెట్ వల్ల సమస్య ఉండేది. అధిక ఆయాసం, గుండె నొప్పి ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర సరైన చికిత్స తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – మహేష్ బాబు, కార్డియాలజిస్ట్, మహబూబ్‌నగర్ వ్యాయామం లేకపోవడం వల్లే.. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడంతో పాటు ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల అధికంగా ఊబకాయం పెరిగి చిన్న వయస్సులో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఉద్యోగులు పనులు పూర్తి చేసుకొని ఎలాంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. తెలియకుండానే కొవ్వు పెరిగి రక్తంలో బ్లాక్స్ ఏర్పాటు అవుతాయి. దీంతో గుండె, మెదడు స్ట్రోక్ వస్తోంది. రోజు 45నిమిషాల పాటు వ్యాయామం చేసి, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిది. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. – బాలశ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, మహబూబ్‌నగర్ చదవండి: Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్.. -
World Heart Day: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!
World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన. చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు! ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్స్కీ తెలిపారు. చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. -
ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే!
Single Glass Of Alcohol Also Affects Atrial Fibrillation: ఒక్క పెగ్గు మద్యంతో నష్టం లేదు.. పైగా ఆరోగ్యానికి మంచిది అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఒక్క స్మాల్ వేసుకున్నా సరే.. అది గుండెకు చేటే అంటోందీ తాజా పరిశోధన! ఆరోగ్యంపై మద్యం ప్రభావంపై చర్చ ఈ రోజు తాజాది కాదు. కాకపోతే చాలాకాలంగా అందరూ బలంగా విశ్వసించిన విషయం ఏమిటంటే.. ‘ఏదో.. అప్పుడప్పుడూ సరదా కొద్దీ... విందు భోజనం తరువాత కొంచెం ‘పుచ్చుకుంటే’ తప్పేమీ కాదు’ అన్నది! కానీ... కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక పరిశోధన మాత్రం అవన్నీ హంబగ్ అని తేల్చేసింది. వీరి లెక్క ప్రకారం.. ఒక్క డ్రింక్ తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ‘‘ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువని ఒక అంచనా ఉండేది. కానీ ఒక డ్రింకు పుచ్చుకున్నా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది’’ అని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవ్తేత గ్రెగరీ మార్కస్ చెబుతున్నారు. తాము వంద మంది రోగులపై పరిశోధన చేశామని, ఒక డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వారికి ఆట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం రెట్టింపు అయ్యిందని చెప్పారు. వీరు రెండో డ్రింక్ కూడా తీసుకుంటే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే తాము పరిశోధనలు చేసిన వారు ముందుగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారు కాబట్టి సాధారణ వ్యక్తుల్లో ఒక్క డ్రింక్ కూడా ప్రమాద హేతువు కావచ్చునని చెప్పవచ్చునని వారు వివరించారు. శషభిషలకు తావు లేకుండా... ముందుగా చెప్పుకున్నట్లు ఆరోగ్యంపై మద్యం ప్రభావాన్ని కచ్చితంగా లెక్కకట్టడం అంత సులువైన పనేమీ కాదు. పరిశోధనలో పాల్గొన్న వారు తాము ఎంత మద్యం పుచ్చుకున్నదీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండటం దీనికి ఒక కారణం. అంతేకాకుండా.. వారి జీవితాల్లోని ఇతర అంశా లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది అంచనా వేయాల్సి ఉంటుంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ శషభిషలను, ఊహాగానాలను తొలగించేందుకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. పరిశోధనల్లో పాల్గొన్న వారు తరచూ తమ రక్తాన్ని స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేశారు. మధుమేహ పరీక్ష తరహాలో రక్తంలో మద్యం మోతాదును లెక్కకట్టారు. ‘‘ఫలితాలు చెప్పే విషయం ఒక్కటే.. మద్యం ఎంత ఎక్కువైతే.. ప్రమాదమూ అంతేస్థాయిలో పెరుగుతోంది’’ అని మార్కస్ వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు దశాబ్దాలుగా చాలామంది రోగులు చెప్పిన అంశాలకు దగ్గరగా ఉన్నాయని, కాకపోతే ఈసారి కచ్చితమైన లెక్కలతో తాము ఫలితాలను నిర్ధారించగలిగామని వివరించారు. తగినన్ని నీళ్లే ఆయుధం...! గుండెజబ్బులను నివారించేందుకు జీవనశైలి మార్పులు ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. యూరప్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని, కనీసం ఒక్క గ్లాసు అదనంగా తాగినా గుండెసంబంధిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు చెబుతున్నారు. ‘గుండె విఫలమయ్యేందుకు ఉన్న అవకాశాలను నివారించేందుకు లేదా ఆలస్యం చేసేందుకు నీళ్లు చాలా ఉపయోగపడతాయి’ అంటారు ఈ తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నటాలియా దిమిత్రైవ. ప్రతిరోజూ పురుషులైతే మూడు లీటర్ల వరకూ నీరు తీసుకోవాలని, మహిళలైతే 1.6 నుంచి 2.1 లీటర్ల వరకూ ఉండాలని తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
పిక్కలు.. గుండెకు బ్రాంచ్ ఆఫీస్‌లు
పిక్కలు... గుండెకు బ్రాంచ్ఆఫీస్లా పనిచేస్తాయి. దేహం పై భాగంలో ఉండే గుండె మెయిన్ ఆఫీస్ అయితే... పిక్కలు కాళ్లలో ఉన్న క్యాంప్ ఆఫీసు అన్నమాట. గుండె అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్ చేసినట్టే... పిక్క కూడా పై వైపునకు రక్తం వేగంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. పిక్క చేసే ఎక్స్ట్రా డ్యూటీ గురించి తెలిపే కథనం ఇది. గుండె పంపింగ్ ప్రక్రియ వల్ల దేహంలోని అన్ని భాగాలకూ రక్తం అందుతుంది. మెదడు ఇతర భాగాల నుంచి మళ్లీ గుండెకు రక్తం చేరడం ఒకింత సులువు. కానీ పాదాల నుంచి పైవైపునకు రక్తం అందడం భూమ్యాకర్షణ (గ్రావిటేషనల్) శక్తి కారణంగా ఒకింత కష్టం అవుతుంది. కానీ పైవైపునకు రక్తప్రవాహం సాఫీగా జరిగేందుకు పిక్క దోహదపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ అంటారు. దేహానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండెకు బ్రాంచ్ ఆఫీస్ డ్యూటీ ఇలా... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి గుండె డ్యూటీలు నిర్వహించినప్పటికీ... గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే ప్రధాన కండరాలు మరింతగా ఈ విధిని నిర్వహిస్తాయి. ఇవి ఓ క్రమపద్ధతిలో ముడుచుకుంటూ, విప్పారుతూ (రిలాక్స్ అవుతూ) ఓ క్రమబద్ధమైన రీతిలో రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి నెడుతుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా ఈ రక్తనాళల్లోని రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) ఆపుతుంటాయి. ఇలా... గుండెకు చేరాల్సిన రక్తాన్ని కిందికి రాకుండా ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి. ‘పిక్క’ బలం లేకపోతే... పిక్క సరిగా పనిచేయకపోతే వైవైపునకు ప్రవహించాల్సిన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అందులో ప్రాణవాయువు లేకపోవడం వల్ల అక్కడి కండరాల్లోని కణాలకు తగినంత ఈక్సిజన్ అందదు. ఫలితంగా ఆ కండరాలు అలసటకు గురవుతాయి. దాంతో వచ్చే సమస్యల్లో కొన్ని... ► కాళ్ల చివరలకు రక్తసరఫరా తగ్గడం ∙ వ్యాధి నిరోధకత ఇచ్చే లింఫ్ నిర్వీర్యం కావడం ∙చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా... ► కాళ్లు ఎప్పుడూ అలసినట్టుగా ఉండటం ►కాళ్లూ, పాదాలలో వాపు ►వేరికోస్ వెయిన్స్ సమస్య కనిపించడం (అంటే... కాళ్లలో చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం బయట నుంచి కనిపిస్తుండటం). దాంతో కాలిపై పుండ్లు ఓ పట్టాన తగ్గవు. ►కాళ్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్) వంటి సమస్యలు రావచ్చు. నివారణ ఇలా... ► బరువును అదుపులో ఉంచుకోవాలి. ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడక వ్యాయామం అవసరం. దాంతో కేవలం పిక్కలకు మాత్రమే కాకుండా... అన్ని కండరాలకూ వ్యాయామం సమకూరి ఆరోగ్యం బాగుంటుంది). ∙కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి ఉంచే ‘వీనస్ స్టాకింగ్స్’ అనే సాక్స్ వంటి తొడుగులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఒకవేళ అప్పటికీ ఫలితం కనిపించకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యలు ఎవరిలో... ► చాలా సేపు కదలకుండా అదేపనిగా కూర్చుని పనిచేసేవారికి ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు, ట్రాఫిక్పోలీసులు... మొదలైనవారికి) ∙స్థూలకాయంతో ఉన్నవారిలో ∙గర్భవతులుగా ఉన్న సమయంలో మహిళల్లో కొందరికి ఈ సమస్య రావచ్చు. -డాక్టర్ పీ సీ గుప్తా సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్ -
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్‌దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్‌గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
కరీంనగర్: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్‌లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
వైద్యశాస్త్రంలో వింత: ఓ యువతికి కుడి వైపున గుండె
Right Side Heart Girl: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్ సైడ్ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి వైపు గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్‌కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి క్లారీ మక్ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడంతో పరీక్షించుకోవాలని ఆస్పత్రికి వెళ్లింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తుండడంతో జలుబు, దగ్గు సాధారణంగా భావించినట్లు క్లారీ తెలిపింది. జూన్‌లో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని వైద్యులు భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్ రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. వైద్యులు వచ్చి ‘నీకు గుండె కుడి వైపున ఉంది’ అని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని.. షాక్‌లో ఉన్నట్లు క్లెయిర్ మక్ తెలిపారు. నాకేమన్నా అవుతుందని వైద్యులను అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మక్ టిక్‌టాక్‌లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను లక్షల్లో చూశారు. 4,33,00 మంది కామెంట్లు చేశారు. దేవుడి దయతో బాగున్నానని ఆ వీడియోలో తెలిపింది. -
కోవిడ్ నుంచి కోలుకున్నాక మన గుండె పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వచ్చి తగ్గిన మొత్తం బాధితుల్లో దాదాపు నాలుగోవంతు మందికి గుండె సమస్యలు వస్తుంటే... వారిలోనూ నాలుగో వంతు మందిలో అవి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘జామా కార్డియాలజీ’లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... అంతకు ముందు అస్సలు గుండె సమస్యలు లేనివారు సైతం... కోవిడ్ తర్వాత గుండెజబ్బుల బారినపడి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని తేలింది. కరోనా నుంచి బయటపడ్డాక కూడా గుండె సమస్యలు ఎందుకొస్తున్నాయి ? గుండె కణాల్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్–2 (ఏసీఈ–2) అనే రిసెప్టార్లు ఎక్కువ. వీటికి అంటుకునే కరోనా మన దేహంలోకి చొరబడుతుంది. ఇలా ఈ రిసెప్టార్ల వల్లనే వ్యాప్తి చెందుంతుంది కాబట్టి గుండెకు సంబంధించిన కండరాలు ప్రభావితమయ్యే అవకాశాలూ ఎక్కువ. ఆ తర్వాతి క్రమంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ... వైరస్‌తో పోరాడే సమయంలో అక్కడ (గుండెలోని కణాల్లో) జరిగే ప్రతిక్రియల వల్ల గుండె కణాలూ, కండరాలు దెబ్బతింటాయి. అలాగే గుండెలోపలా, పైనా ఉండే రక్తనాళాలూ (ధమనులూ, సిరలు) ప్రభావితమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ ధమనులూ, సిరల్లోనూ లోపలి పొరలో (లైనింగ్లో) ఉండే ‘ఎండోథీలియల్’ కణాలు దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాల్లోని కణాలూ దెబ్బతినడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావిమవుతుంది. అది మళ్లీ గుండెపైనే ప్రభావం చూపుతుంది. ప్రధానమైనది ‘పాట్స్’ కరోనా సోకి కోలుకుంటున్న కొందరిలో పాట్స్ అనే సమస్య కనిపించవచ్చు. ‘పోష్చురల్ ఆర్థోస్టాటిక్ టాకికార్డియా సిండ్రోమ్’ అనే వైద్య సమస్య (కండిషన్)కు సంక్షిప్త రూపమే ఈ ‘పాట్స్’. ప్రస్తుతం ఈ పాట్స్కూ... కోవిడ్‌కు ఎంతవరకు సంబంధం ఉందనే అంశంపై పరిశోధనలు చాలా చురుగ్గా, విస్తృతంగా జరుగుతున్నాయి. ఇది కొంత ‘గుండె’కు సంబంధించిన, మరికొంత ‘నాడీ వ్యవస్థ’కు సంబంధించిన సమస్య. గుండె స్పందనలను నియంత్రించే నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యతో పాటు గుండె కూడా ప్రభావితం కావడం వల్ల గుండె సంస్పందనలు ప్రభావితమవుతాయి. దాని కారణంగానే చాలామందిలో కోవిడ్ అనంతర పరిణామంగా చెప్పుకుంటున్న అయోమయ పరిస్థితి (బ్రెయిన్ ఫాగ్), తీవ్రమైన నిస్సత్తువ (ఫెటీగ్), గుండెదడ (పాల్పిటేషన్స్), తల అంతా తేలికైపోయినట్లుగా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించే లైట్‌హెడెడ్‌నెస్ వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. సాధారణ లక్షణాలివే.. గుండెపై కరోనా అనంతర ప్రభావాల వల్ల కనిపించే లక్షణాలు చాలా ఉన్నాయి. తీవ్రమైన నిస్సత్తువ అందులో ఒకటి. కరోనా వల్ల రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరా తగ్గడం వంటివి సంభవిస్తాయని చెప్పుకున్నాం కదా. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన అలసట కనిపిస్తుంటుంది. దాంతో వారాల తరబడి పడకకే పరిమితమవుతారు. కొన్నిసార్లు ఊపిరి అందకపోవడం, త్వరత్వరగా ఊపిరిపీలుస్తూ ఉండటం, ఆయాసం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో ఛాతీనొప్పి, గుండెదడ వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వీటిలో కొన్ని గుండెకు సంబంధించిన లక్షణాలూ అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి అందకపోవడం, ఆయాసం, నిస్సత్తువ, నీరసం వంటి లక్షణాలు కనిపించనప్పుడు అది ఊపిరితిత్తులకు సంబంధించినవి కావచ్చు అని అనుకోకుండా ఒకసారి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెదడ అయితే అది గుండెకు సంబంధించిన సమస్యే అని తెలిసిపోతుంది కాబట్టి నిర్ద్వంద్వంగా గుండె డాక్టర్‌ను సంప్రదించాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత... కోవిడ్ నుంచి కోలుకున్నవారూ కనీసం మూడు నెలల పాటు అందరిలాగే మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం / శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాలు పాటించడం వంటి కోవిడ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి. ∙అంతకు ముందు తాము తమ వైద్య సమస్యల కారణంగా వాడుతున్న మందులనూ / చికిత్సనూ ఆపకుండా కొనసాగించాలి. ఛాతీలో నొప్పి / అసౌకర్యం, చెమటలు పెట్టడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి.మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ఒత్తిళ్లు, యాంగై్జటీ గుండెకు కీడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ∙కోవిడ్–19 నుంచి కోలుకున్న చాలామందిలో గుండె స్పందనల రేటు నిమిషానికి 100 – 120 ఉండటం కూడా వైద్యనిపుణులు గుర్తించారు. కాబట్టి గుండెదడగా అనిపించినప్పుడు అది పల్మునరీ ఎంబాలిజమ్ (రక్తప్రవాహంలో గాలి బుడగ రావడం), మయోకార్డయిటిస్ (గుండె కండరానికి ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ రావడం), హైపాక్సియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లోపించడం) వంటి సమస్యలా లేక సాధారణ సమస్యలా అన్నది నిర్ధారణ చేయడానికి తక్షణం హృద్రోగ నిపుణులను సంప్రదించాలి. చాలామంది యువకులు నెగెటివ్ రిపోర్టు రాగానే వ్యాయామం మొదలుపెడుతున్నారు. అలా చేయడం సరికాదు. ఊపిరితిత్తులు తగినంత బలం పుంజుకునేంతవరకు కొంత వ్యవధి ఇవ్వడమే మేలు. మరీ ముఖ్యంగా లంగ్ నిమోనియా / సీటీ స్కాన్ కౌంట్ 9 లేదా 10 ఉన్నవారు వ్యాయాయం మొదలుపెట్టడానికి ముందర తప్పనిసరిగా తగినంత సమయం తీసుకోవాలి. ∙మంచి పోషకాహారం తీసుకుంటూ, తగినంతగా నీళ్లు తాగుతూ (హైడ్రేటెడ్‌గా ఉంటూ), బాగా విశ్రాంతి తీసుకుంటూ, గుండెకు సంబంధించిన మందులు లేదా ఇతరత్రా మందులను కొనసాగిస్తూ... ఆందోళన కంటే అవగాహన పెంచుకుని నిశ్చింతగా ఉండటం మంచిది. ఇది గుండెతోపాటు వారి సాధారణ ఆరోగ్య మెరుగుదలకూ దోహదపడుతుందన్నది నిపుణుల మాట. గుండె స్పందనల్లో మార్పులు... కోవిడ్ తర్వాత చాలామందిలో గుండె స్పందనల వేగం పెరిగి గుండెదడగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ఇలాంటివారు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తీరాలి. ఈ గుండెదడకు ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు దేహానికి సరిపడా నీరు అందనప్పుడూ గుండెదడ వస్తుంది. అంటే బాగా నీళ్లు తాగడం, తగినంతగా ద్రవాహారం తీసుకోవడం వల్ల గుండెదడ దానంతట అదే తగ్గుతుంది. ఇలాంటివే మరికొన్ని చిన్నా, పెద్దా కారణాల వల్ల కూడా గుండెదడ రావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో... నిజంగా అది ‘డీ హైడ్రేషన్’ కారణంగా వస్తున్న గుండెదడా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది డాక్టర్ నిర్ణయించడమే మంచిది. అందుకే గుండె లయ (రిథమ్) తప్పడం, తలతిరుగుతున్నట్లు అనిపించడం (డిజ్జీనెస్), ఛాతీలో అసౌకర్యం (చెస్ట్ డిస్కంఫర్ట్) వంటివి కనిపించినప్పుడు తప్పనిసరిగా గుండెవైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నాయా... అప్రమత్తం కండి... ► త్వరత్వరగా గాలి పీలుస్తూ ఉండాల్సి రావడం, పడుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ (ఫెటీగ్ / టైర్డ్‌నెస్) ఉంటూ... ఆక్సీమీటర్ పెట్టినప్పుడు రక్తంలో ఆక్సిజన్ శాతం 92% కంటే తగ్గడం. ► ఛాతీనొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, తలతిరిగినట్లుగా ఉండటం, బాగా విశ్రాంతిగా ఉన్నప్పుడు లక్షణాలు తగ్గినట్లుగా అనిపించడం. గుండెపై ప్రభావం తాత్కాలికమా... శాశ్వతమా? ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘గుండెపై ఉన్న ఈ ప్రభావం తాత్కాలికమా? లేక శాశ్వతంగా ఉంటుందా?’ అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. తాము నేరుగా కోవిడ్ బారిన పడకపోయినా... తమ ఇంట్లోని కుటుంబసభ్యులెరిలోనైనా ఈ లక్షణాలు కనిపించినా ఇవే సందేహాలు ముప్పిరిగొంటాయి. అయితే గుండె కండరం ఏ మేరకు దెబ్బతింది, ఎంత మేరకు ప్రభావితమైంది అనే అంశాల ఆధారంగానే అది శాశ్వతమా, తాత్కాలికమా అన్నది ఆధారపడుతుంది. ఈ అంశంపై ఇంకా పరిశోధనలూ, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచి ఫిట్నెస్తో ఉండి, బాగా ఆటలాడే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో సైతం కోవిడ్ తర్వాత వారి గుండె కండరం మీద గాటు / గీత (స్కార్) రావడం చాలామందిలో కనిపించింది. ఇలాంటివారిని ఏ తరుణంలో మళ్లీ క్రీడలకు అనుమతించాలనే అంశంపై నిపుణులు తగిన ప్రోటోకాల్ నిర్ణయించే పనిలో ఉన్నారు. మరికొన్ని అనర్థాలు... మరికొందరిలో గుండె పంపింగ్ తీరు దెబ్బతినడం, అది రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోవడం వంటి సమస్యలనూ గమనించారు. కొందరు అథ్లెట్లలో కోవిడ్ తర్వాత మునుపటి ఫిట్నెస్ దానంతట అదే రాకపోవడంతో... ఫిజియోథెరపీ అవసరం కావడం, బ్రీతింగ్ వ్యాయామాలతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తోంది. -
వంకర తిరిగిన గుండె
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా అందరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. 20 వేల మందిలో ఒకరికి కుడివైపున ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం పూర్తిగా ఛాతి మధ్యలో ఉంది. అది కూడా వంకర తిరిగి ఉండటంతో వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఇలాంటి వ్యక్తికి బైపాస్ సర్జరీ చేయడం ప్రపంచంలోనే రెండోదని వైద్యులు ప్రకటించారు. వివరాలను మంగళవారం కర్నూలులోని గౌరీగోపాల్ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ పీఎన్ఎన్. లక్ష్మణస్వామి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘కడప నగరానికి చెందిన గౌస్ మొహిద్దీన్ (57) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రెండు నెలల నుంచి ఆయాసం ఎక్కువై ఇటీవల గుండెపోటు వచ్చింది. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకోగా వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని కర్నూలుకు రెఫర్ చేశారు. హాస్పిటల్లో చేరిన అతనికి 2డీ ఎకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా మీసో కార్డియా అనే పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కూడా ఉందని నిర్ధారించాం. ఈ సమస్య వల్ల అతని గుండె ఎడమ వైపునకు గాకుండా ఛాతి మధ్యలో ఉండటంతో పాటు వంకరగా తిరిగింది. ఇలాంటి గుండెలో బైపాస్ సర్జరీ ఇప్పటికి ఒకసారి మాత్రమే 2016లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇలాంటి గుండెకు బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీని అనెస్తెటిస్ట్ డాక్టర్ భానుప్రకాష్తో కలిసి ఈ నెల 25వ తేదీన కర్నూలులో విజయవంతంగా నిర్వహించాం. ఇలాంటి బైపాస్ సర్జరీ ప్రపంచంలో రెండోది మాత్రమే. ప్రస్తుతం గౌస్ మొహిద్దీన్ కోలుకుంటున్నాడు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించాం. గౌరీగోపాల్ హాస్పిటల్లో 3వేల కార్డియోథొరాసిక్, వాస్కులర్ ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. -
శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తున్న కరోనా
కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడంతో రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతూ పోతుంది. కోవిడ్ -19 రోగుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఇతర అవయవ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. కోవిడ్ -19 వెంటనే శ్వాసకోశ వ్యవస్థ చూపినప్పటికి, తర్వాత కాలంలో ఇది లాంగ్-కోవిడ్ అని పిలువబడే మరొక స్థితికి మారుతుంది. ఇప్పుడు ఈ లాంగ్-కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులను, శాస్త్రవేత్తలను మరింత కలవరానికి గురిచేస్తుంది. కోవిడ్ -19 వచ్చిన రోగులలో కొందరు తర్వాత గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులతో తిరిగి ఆసుపత్రులకు వస్తున్నట్లు కనుగొన్నారు. కోలుకున్న రొగులు గుండెకు సంబందించిన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు. లాంగ్-కోవిడ్ వ్యాది 2020లోనే మొదట నివేదించారు. కోవిడ్ -19 శరీరంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నట్లు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కోవిడ్ -19 వల్ల గుండె ప్రతికూల ప్రభావానికి గురైతున్నట్లు వివిధ అధ్యయనాలలో కనుగొనబడింది. లాన్సెట్ నివేదిక, జామా నివేదికలో ఇవి గమనించవచ్చు. కోవిడ్ -19 శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడిని పెంచి గుండె కండరాలను బలహీనపరుస్తుంది. 8 నుంచి 12 శాతం గుండె పోటు కూడా వస్తుంది. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇలా రక్త నాళాలపై పడే విపరీతమైన ఒత్తిడి కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న రొగులు గుండెకు సంబందించి ఏమైన ఇబ్బంది కలిగితే వెంటనే గుండెకు సంబందించి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. క్రింద చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఛాతిలో అసౌకర్యంగా ఉండటం చేతుల్లో నొప్పి లేదా ఒత్తిడి కలగడం వివరించలేని విదంగా విపరీతమైన చెమట పట్టడం హృదయ స్పందన సక్రమంగా పనిచేయక పోవడం శారీరక శ్రమ లేకున్న అధిక అలసట లేదా అలసట కలగటం చదవండి: కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా -
‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’
వాషింగ్టన్: కొన్ని రకాల నేరాలు.. వాటికి పాల్పడిన వ్యక్తుల్ని చూస్తే.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా.. ఇంత క్రూరంగా.. దారుణంగా ఓ మనిషిని చంపగలరా అనే అనుమానం, భయం కలుగుతాయి. వారిని తిట్టడానికి.. వారి చేష్ట గురించి వివరించడానికి ఏ భాష సరిపోదు. తాజాగా ఇలాంటి భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత పాశవీకంగా ఒకరిని చంపి.. గుండెని పెకిలించి.. దాన్ని కూర వండిన పైశాచిక చర్య వెలుగు చూసింది. నేరస్తుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులకే వెన్నులో ఒణుకు వచ్చింది. ఓక్లహోమాలో చోటు చేసుకున్న ఈ భయానక దారుణం వివరాలు.. లారెన్స్ పౌల్ ఆండర్సన్ వ్యక్తి డ్రగ్స్ కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి కొన్ని వారాల కిందటే విడుదలయ్యాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంటి పక్క వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మరణించిన వ్యక్తి గుండెని బయటకు తీసి.. దాన్ని తన అంకుల్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెని కోసి.. ఆలుగడ్డలతో కలిపి కూర వండాడు. ఆ తర్వాత అంకుల్ కుటుంబ సభ్యుల చేత దాన్ని తినిపించాలని భావించాడు. ఇతడి వికృత చేష్టలు చూసిన పౌల్ అంకుల్, అతడి కుటుంబ సభ్యులు భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పౌల్ అతడి అంకుల్ని, వారి నాలుగేళ్ల కుమార్తెని చంపేశాడు. అంకుల్ భార్యని చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ఎలానో తప్పించుకుని.. బయటపడగలిగింది. స్థానికులు ఆమెని ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు విస్తుపోయే అంశాలు వెల్లడించాడు. తన అంకుల్ ఇంట్లో రాక్షసులు ఉన్నారని.. వారిని తరమడం కోసం.. గుండెని వండి వారితో తినిపించాలని భావించాను అన్నాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో చంపేయాల్సి వచ్చిందని తెలిపాడు. లేదంటే ఆ రాక్షసులు అంకుల్ కుటుంబాన్ని పీడించి.. వారిని ఆవహించి.. జనాలను చంపేసేవారు అన్నాడు పౌల్. చదవండి: కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు టిక్‌టాక్‌లో.. కాస్ట్లీ మిస్టేక్! -
హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు ఆద్యంతం ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్‌కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్లోకి చేరుకున్నారు. వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్‌లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. గుండెను సకాలంలో తరలించాం ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్లోనూ ఆపకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ -
గుండె స్పందనల వేగం పెరిగిందా?
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. ఇలా గుండె వేగం పెరిగిన కండిషన్‌ను సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షలల్లాంటివి చేయించాలి. ఓ వ్యక్తి అలా స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. -
ఇనుములో ఓ హృదయం మొలిచెనే!
సాక్షి, గుంటూరు: ఇనుములోనూ ఓ హృదయాన్ని సృష్టించారు. అద్భుత కళానైపుణ్యంతో ఇనుప వ్యర్థాలకు జీవం పోశారు. అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ కళారూపాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. తెనాలికి చెందిన శిల్పకళాకారులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర వీటిని సృష్టించగా, వార్ఫ్రోడ్డులోని వర్క్‌షాపులో గురువారం ప్రదర్శించారు. ఆటోమొబైల్ పరికరాలతో భారీ శిల్పాలను తయారుచేస్తూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ప్రస్తుతం ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంతో ప్రత్యేకించి ఈ తరహాలో భారీ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఆరడుగుల ఎత్తులో డోలు, తబల, 15 అడుగుల పొడవైన సన్నాయి, ఎద్దుల బండి, క్రీస్తును శిలువ వేసిన బొమ్మను రూపొందించారు.