గుండె జబ్బులు ఒకప్పుడూ వృద్దులలోనే కనిపించేవి. కానీ ప్రస్తుత జీవన విధానంలో జస్ట్ 30 ఏళ్లు కూడా నిండని యువకులే గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖులు వరకు చాలా మంది చిన్న ఏజ్‌లోనే గుండె సమస్యలతో చనిపోయిన సంఘటనలను చూశాం. అలాగే కొందరూ ఫిట్‌నెస్ పేరుతో గుండె అలిసిపోయేలా వర్కౌట్‌లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉదంతాలు కూడా చూశాం. అందుకే నిపుణులు సింపుల్ ట్రిక్‌తో ముప్పై నుంచే హృదయ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడమని చెబుతున్నారు. ఏంటంటే అది..!.
నిజానికి 30వ దశకం జీవితం వేగంగా సాగిపోతున్నట్లు ఉంటుంది. కెరీర్ లక్ష్యాలు, వ్యక్తిగత ఆశయాలతో బిజీగా ఉంటారు. అందువల్ల సమయమే తెలియదు. ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ఉండదు. యంగ్‌గా ఉన్నాం మనకేంటి అనే భావనతో ఉంటారు. అదేతప్పని అంటున్నారు. ఈ సమయమే దీర్థకాలిక జబ్బుల బారిన పడేందుకు కీలకమైనదని చెబుతున్నారు. ఇప్పుడే గనుక ఆరోగ్యంపై శ్రద్ధపెడితే 60లో కూడా చలాకీగా తిరగగలుగుతారని చెబుతున్నారు. అందుకోసం పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ 30 మెట్లు ఎక్కండి అని అంటున్నారు.
30 మెట్లు..
స్థిరంగా ఒకచోట కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్లకు ఇది మంచిది. జంక్‌ఫుడ్‌కి అలవాటు పడ్డవాళ్లకి కూడా ఇది బెస్ట్ వ్యాయామం అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ఎలివేటర్ ఉపయోగించకుండా ఉంటే చాలు ప్రత్యేకించి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని అన్నారు. రోజువారీ పనుల్లో, కార్యాలయాల్లో మెట్లు ఎక్కండి చాలు గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.
ప్రయోజనాలు..
మెట్లు ఎక్కడం వల్ల శరీరం అంతటా రక్త ప్రసరణ అయ్యి ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె పంపింగ్‌ను వేగవంతం చేస్తుంది.
కేలరీలు బర్న్ అవ్వడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహించేందుకు మంచి వర్కౌట్
చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి బాధ్యత వహిస్తుంది
శారీరక శ్రమ రక్తపోటుని తగ్గిస్తుంది. ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటుకి ప్రధాన కారణమైన రక్తపోటుని నివారించడంలో సహాయపడుతుంది.
దీంతోపాటు గుండె ఆర్యోగ్యానికి సంబంధించిన మరిన్ని వర్కౌట్‌లు చేయడం కూడా మంచిది. అయితే ఇది కేవలం గుండె ఆరోగ్యానికి సరైన ప్రారంభం అని అన్నారు నిపుణులు.
అలాగే హార్ట్‌కి సంబంధించి.. కీలకమైన రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో చక్కెర వంటివి ఎప్పకప్పుడు చెకప్ చేయించుకోవాలని చెబుతున్నారు.
వీటి తోపాటు..
డైట్‌లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి.
ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనల మేరకు అనుసరించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment