వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది.
దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
గోగో చేప.. ఊహాత్మక చిత్రం
ఇదీ చదవండి: కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు
Comments
Please login to add a commentAdd a comment