సిడ్నీ : ఓ వికృత రూపంలో ఉన్న చనిపోయిన చేప ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ బీచ్ ఒడ్డుకొచ్చి పడింది. దాన్ని చూసిన వారు తీవ్ర ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాక్షస చేపలా ఉన్న దానిని చూసి ఈ చేపను ఏమంటారబ్బా అని తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే దాని బరువు కనీసం ఓ 150 కేజీలు ఉండి.. పొడవు దాదాపు ఐదున్నర అడుగులు ఉంది. జాన్, రిలే లిందామ్ అనే ఇద్దరు స్నేహితులు వివిధ రకాల జంతువులను చూస్తూ మూర్‌పార్క్ బీచ్ వైపు వెళ్లారు. అక్కడ దాదాపు కుళ్లిన స్థితిలో ఉన్న ఆ చేప కళేబరాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు.
'నేను చాలా రకాల చేపలను చూశాను. పెద్ద చేపలను కూడా.. కానీ, ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ గుర్తు తెలియని చేప కచ్చితంగా ఇప్పటి వరకు బయటి వ్యక్తులకు తెలియనిదే అయ్యి ఉంటుంది' అని లిందామ్ చెప్పాడు. అతడు ఆ చేప ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి ఈ చేప వివరాలేమిటో చెప్పండి అంటూ కోరాడు. రాక్షస చేపలాంటి మూతి, వీపుపై రంపాన్ని మించిన భారీ ముళ్లు, వెడల్పైన తోక మొత్తానికి ఒక వికృతాకారంలో మాత్రం అది ఉంది.
అది ఏం చేపనో చెప్పగలరా?
Published Fri, Mar 9 2018 3:52 PM | Last Updated on Fri, Mar 9 2018 4:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment