Monster
-
విల్లు అందుకుంటే ఇక విలయమే!
ఒక పెద్ద చెట్టు కింద నిల్చుంటాడు కథానాయకుడు. అది చెట్టు కాదని భయానకమైన మాన్స్టర్ అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. ఒక కొండ పక్కన కూర్చొని ఉంటాడు హీరో...‘కొండ కదులుతున్నదేమిటి!’ అనే ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే అది క్రూరమైన మాన్స్టర్ అని తెలుసుకుంటాడు. పూలతోటల నుంచి మంచుఎడారి వరకు రకరకాల మాన్స్టర్లను బుక్వార్క్లాంటి యంత్రం సహాయంతో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే వైల్డ్ హార్ట్స్ గేమ్. యాక్షన్–అడ్వెంచర్ వీడియో గేమ్ ‘వైల్డ్ హార్ట్’ నేడు విడుదల అవుతుంది. జపాన్‌కు చెందిన వీడియో గేమింగ్ కంపెనీ వొమెగా ఫోర్స్ దీన్ని రూపొందించింది. మాన్స్టర్ హంటింగ్ గేమ్స్‌లో చేయి తిరిగిన కొటారో హిరాట్ ఈ గేమ్‌కు డైరెక్టర్. అలనాటి ఫ్యూడల్ జపాన్ను స్ఫూర్తిగా తీసుకొని ‘అజుమి’ అనే మాయాప్రపంచాన్ని సృష్టించారు. భయంకరమైన మాన్‌స్టర్స్‌ను వేటాడే బాధ్యత ప్లేయర్స్‌పై ఉంటుంది. మోనస్టర్స్ను వేటాడడానికి వాగస, కలూనాలాంటి ఎనిమిది ఆయుధాలు ఈ గేమ్‌లో ఉంటాయి. బుక్వార్క్లాంటి యంత్రంతో ఎమిమీ దారిని బ్లాక్ చేయవచ్చు. ప్లాట్పామ్స్: పీఎస్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్, పీసీ మోడ్: సింగిల్ ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్‌గా సెట్స్‌కు వెళ్తే డల్‌గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
క్రేన్ చివర భారీ సముద్రపు జీవి.. చెడుకి సంకేతమా?
వైరల్: మనిషి నమ్మకం ఒక బలం. మూఢనమ్మకం మనిషిలోని బలహీనత. అయితే.. కొన్ని విషయాలను నమ్మితీరాలని వాదిస్తుంటారు పెద్దలు. అందుకు గతంలోని కొన్ని విషయాలను తెరపైకి తెస్తుంటారు. ఓ భారీ సముద్ర జీవి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. భారీ చేపను కొందరు ముచ్చటగా ఫోన్లలో చిత్రీకరిస్తుంటే.. చాలామంది మాత్రం అటువైపు చూడకుండానే వెళ్లిపోతున్నారు. చిలీలో స్థానికులు ఈ మధ్యే పదహారు అడుగుల పొడవున మాన్స్టర్ చేపను పట్టుకున్నారు. అరికా నగరంలో.. ఈ కోలోసాల్ ఓర్ఫిష్(రోయింగ్ ఫిష్) దర్శనమిచ్చింది. సాధారణంగా అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. కానీ, ఇలా పైకి రావడం మంచిది కాదని నమ్ముతున్నారు అక్కడి జనాలు. ఈ మేరకు క్రేన్‌కు వేలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చెడుకి సంకేతమని, సునామీ, భూకంపాలు వస్తాయని భయంతో వణికిపోతున్నారు. డిజాస్టర్ ఫిష్.. ఈ తెడ్డు చేపకు విపత్తుల చేప అని పేరు ఒకటి ముద్ర పడింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే ఈ రాకాసి చేప.. నీటిలోని భూగర్భ కదలికల తర్వాతే పైకి వస్తాయట. ఆ తర్వాత భారీ భూకంపం, సునామీ ముంచుకొస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. అంతేకాదు పట్టుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే నమ్మకం ఉంది. చిలీలోనే కాదు.. జపాన్, సముద్రపు తీరం ఉన్న దేశాల్లోనూ ఇలాంటి కథలు జోరుగానే ప్రచారం అయ్యాయి. అంతెందుకు అలా కనిపించిన తర్వాతే.. ఫుకుషిమాలో భూకంపం సంభవించిందని, 20 వేల మందిని బలి తీసుకుందని నమ్ముతున్నారు. పాపం.. చేప వీటిని సముద్రపు భారీ పాములు, సముద్ర రాక్షసి చేప అనే కథలు ఈ ఓర్ఫిష్ మీద ప్రచారం అవుతుంటాయి. కానీ, సైంటిఫిక్ కోణంలో పాపం అవి ప్రమాదకరమైనవి అసలే కావు. ఏనాడూ అవి మనుషులపైగానీ, పడవలపైగానీ దాడి చేసిన దాఖలాలు లేవు. జబ్బు పడినప్పుడు, చనిపోయినప్పుడు, పిల్లలను కనేటప్పుడు మాత్రమే నీటి అడుగు నుంచి పైకి వస్తాయి. ఒక్కోసారి తుఫానులు, బలమైన అలల ధాటికి కూడా కొట్టుకు వస్తాయి. ఓర్ఫిష్ చేపలు నాచు, పాచిని తింటాయి. అంతెందుకు వాటికి నిజమైన దంతాలు కూడా లేవు. బదులుగా.. చిన్న చిన్న చేపలను మింగడానికి గిల్ రేకర్స్ అని పిలువబడే వ్యవస్థ ఉంటుంది. వాటి జీర్ణవ్యవస్థకు చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. పైకి నీటిని చిమ్ముతుంటే.. చూడడానికి మాత్రమే అదొక భయంకరమైన జీవిగా కనిపిస్తుంది అంతే. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల కోసం ప్రకటనలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో ఒక శాతం పెరిగాయి. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. ‘గతేడాదితో పోలిస్తే క్రితం నెలలో ఉద్యోగ ప్రకటనలు 14 శాతం అధికమయ్యాయి. ఆన్లైన్ నియామకాలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో దుస్తులు, వస్త్రాలు, లెదర్, రత్నాలు, ఆభరణాల విభాగంలో 24 శాతం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ 17, తయారీ 8, చమురు, సహజవాయువు, పెట్రోలియం, విద్యుత్ 6, నౌకాశ్రయం, సముద్ర సంబంధ 4, బీపీవో, ఐటీఈఎస్ విభాగాల్లో 3 శాతం పెరిగాయి. కస్టమర్ సర్వీస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికం 2 శాతం, ఆతిథ్యం, యాత్రలు 1 శాతం అధికమయ్యాయి. ఆరోగ్యం, ఆర్థిక, అకౌం ట్స్ విభాగాల్లో ఎటువంటి వృద్ధి నమోదు కాలేదు. పండుగల సీజన్ సమీపిస్తుండడం ప్రకటనలు పెరగడానికి కారణం. వస్త్ర పరిశ్రమకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి కేబినెట్ ఆమోదంతో ఈ రంగం మరింతగా వృద్ధి చెందనుంది. రాబోయే నెలల్లోనూ.. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఉక్కు రంగాలు 7 శాతం, వ్యవసాయ సంబంధ 6, ఎఫ్ఎంసీజీ, ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్ 5, రవాణా, కొరియర్ 4 శాతం తగ్గాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుండి భారత్ కోలుకోవడంతో ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉద్యోగ నియామకాలలో సానుకూల, స్థిరమైన వృద్ధి ఉంది. నియామకాల విషయంలో మెట్రో నగరాల్లో మే నెల నుంచి స్థిరమైన పెరుగుదల కొనసాగుతోంది. ఇక నగరాల వారీగా చూస్తే నియామకాలు హైదరాబాద్, ముంబై, చెన్నైలో ఒక్కో నగరంలో 3 శాతం, కోయంబత్తూరులో 2 శాతం అధికమయ్యాయి. కొచ్చి, కోల్‌కతా 4 శాతం, చండీగఢ్, జైపూర్ 1 శాతం తగ్గాయి’ అని మాన్స్టర్.కామ్ వివరించింది. పండుగల సీజన్‌తోపాటు కాలానుగుణ డిమాండ్‌తో రాబోయే నెలల్లో నియామక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
ఇంటి సంఘటన తెరకు!
దర్శకుడు, నటుడు యస్.జె. సూర్య, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాన్స్టర్’. ‘ఒరు నాళ్ కూత్తు’ ఫేమ్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘మాయా– మా నగరం’ అనే చిత్రాన్ని నిర్మించిన పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మాణ సంస్థ తమ మూడవ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించనుంది. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా ఓ రోజు మా ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి స్క్రిప్ట్‌గా రాసుకున్నాను. బాలల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే కథ గురించి వేరే విషయాలు ఏమీ చెప్పలేను. యస్. జె సూర్య నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గత చిత్రం ‘ఒరు నాళ్ కూత్తు’లో సీరియస్ పాత్ర పోషించిన కరుణాకరన్ ఈ చిత్రంలో తన నటనతో కామెడీ కితకితలు పెడతాడు’’ అన్నారు. -
నిత్య సుమంగళి మండోదరి
మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే, ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి Ô¶ రీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
అపహాస్యం తెచ్చిన అనర్థం
సీతని ఎవరో రాక్షసుడు అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్న రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూన్న సమయంలో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా ఒక విచిత్రమైన, వికృతమైన ఆకారం వారికి కనిపించింది. ఆ ఆకారానికి తల, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం ఛాతీలోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే అగ్నిజ్వాలలా ఎర్రగా ఉన్న ఒక కన్ను, ఆ కంటికి ఒక పెద్ద రెప్ప ఉన్నాయి. ఆ ఆకారం చేతులు ఒక యోజనం పొడవుగా ఉన్నాయి. చూస్తుండగానే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుని, తినడానికి సంసిద్ధమయింది. వెంటనే రాముడు ఆ ఆకారం కుడిచేతిని, లక్ష్మణుడు ఎడమచేతినీ ఖండించి వేశారు. వారలా చేయగానే ఆ ఆకారం సంతోషంతో ‘మీరు రామలక్ష్మణులు కదా,’ అని అడిగింది. రామలక్ష్మణులు ఆశ్చర్యంతో ‘‘ఎవరు నీవు? నీకీ ఆకారం ఎలా వచ్చింది?’’ అని అడిగారు. ఆ ఆకారం ఇలా చెప్పింది. ‘నేను ధనువు అనే గంధర్వుడిని. అత్యంత సుందరమైన శరీరం కలిగిన వాడిని.ఆ అందం వల్ల కలిగిన గర్వంతో నా కామరూప శక్తి చేత విచిత్రమైన రూపాలు ధరించి ఋషులను, మునులను భయ కంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక ఋషికి ఈరోజు నేను ఉన్న ఈ రూపంతో కనిపించాను. సర్వజ్ఞుడైన ఆ రుషి ‘నీకు ఇటువంటి భయంకరమైన, జుగుప్సాకరమైన రూపం ఇష్టంలా అనిపిస్తున్నది కనుక నువ్వు ఎప్పటికీ ఈ రూపంతోనే ఉందువు గాక’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రాధేయపడ్డాను. ‘నీవు ఈ రూపంతో ఉండగా రామలక్ష్మణులు వచ్చి నీ చేతులు ఖండించి నిన్ను అగ్నిలో దహించిన తర్వాత నీకు నిజరూపం వస్తుంది’ అని సెలవిచ్చాడు. అప్పటినుండి నేను ఈ దారిన వెళ్లే జీవులందరినీ సంహరించి తింటూ, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత మీరు సీతమ్మను వెతకడానికి మార్గం చెప్పగలను’’ అని అన్నాడు. రామలక్ష్మణులు ఒక పెద్ద గొయ్యి తీసి, కబంధుడి శరీరాన్ని ఆ గోతిలోకి నెట్టివేసి, ఎండిన కర్రలను వేసి అగ్నిసంస్కారం చేసారు. ఆ శరీరం కాలగానే ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై వారికి నమస్కరించి ‘‘రామా! మీరు ఈ విధంగా వెతికితే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీకు ప్రపంచ మంతా చుట్టిన ఒక మిత్రుడు అవసరం. అటువంటి అత్యంత బలవంతుడయిన సుగ్రీవుడనే ఒక వానరరాజు ఉన్నాడు. ఆతను ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతను ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. నీవు అతనితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. మంచి జరుగుతుంది’’ అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పి వెళ్ళిపోయాడు. మన అందచందాలు, శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగడం, మనకున్న శక్తులను ఇతరులను అపహాస్యం చేసేందుకు ఉపయోగించడం మిక్కిలి అనర్థదాయకం. – డి.వి.ఆర్. భాస్కర్ -
రాక్షసుడు!
గతేడాది మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ పాత్ర చేసిన ఎస్.జె. సూర్య గుర్తుండే ఉంటారు. 2001లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’ చిత్రానికి కూడా ఎస్.జె. సూర్యానే దర్శకుడని తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హీరోగా, విలన్‌గా చేస్తుంటారాయన. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాన్స్టర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాన్స్టర్ అంటే రాక్షసుడు, భూతం అనే మీనింగ్స్ ఉన్నాయి. ‘ఒరు నాళ్ కూత్తు’ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకు దర్శ కత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పిల్లల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
బీచ్‌లోకి వెళితే వికృత రూపం..
సిడ్నీ : ఓ వికృత రూపంలో ఉన్న చనిపోయిన చేప ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ బీచ్ ఒడ్డుకొచ్చి పడింది. దాన్ని చూసిన వారు తీవ్ర ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రాక్షస చేపలా ఉన్న దానిని చూసి ఈ చేపను ఏమంటారబ్బా అని తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే దాని బరువు కనీసం ఓ 150 కేజీలు ఉండి.. పొడవు దాదాపు ఐదున్నర అడుగులు ఉంది. జాన్, రిలే లిందామ్ అనే ఇద్దరు స్నేహితులు వివిధ రకాల జంతువులను చూస్తూ మూర్పార్క్ బీచ్ వైపు వెళ్లారు. అక్కడ దాదాపు కుళ్లిన స్థితిలో ఉన్న ఆ చేప కళేబరాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. 'నేను చాలా రకాల చేపలను చూశాను. పెద్ద చేపలను కూడా.. కానీ, ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ గుర్తు తెలియని చేప కచ్చితంగా ఇప్పటి వరకు బయటి వ్యక్తులకు తెలియనిదే అయ్యి ఉంటుంది' అని లిందామ్ చెప్పాడు. అతడు ఆ చేప ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెట్టి ఈ చేప వివరాలేమిటో చెప్పండి అంటూ కోరాడు. రాక్షస చేపలాంటి మూతి, వీపుపై రంపాన్ని మించిన భారీ ముళ్లు, వెడల్పైన తోక మొత్తానికి ఒక వికృతాకారంలో మాత్రం అది ఉంది. -
అతడో మానవ మృగం: నటి
లాస్ ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ తనను లైంగిక వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించాడని నటి సల్మా హయక్ తెలిపారు. ఇప్పటికే 50కి పైగా నటీమణులు హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపులు, అత్యాచారాలపై నోరు విప్పిన సంగతి తెలిసిందే. ధైర్యంగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. వారి బాటలోనే తాను ముందుకు వచ్చినట్లు హయక్ చెప్పారు. అతడో మానవ మృగమని, ఎందరో ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడిన ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఏళ్ల తరబడి హర్వే వీన్‌స్టీన్ వేధించాడని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. 'అతడి ముందు స్నానం చేసేందుకు, మసాజ్ చేసేందుకు, నగ్నంగా ఫొటోలు పంపేందుకు, మరో మహిళతో నగ్నంగా సన్నిహితంగా ఉండేందుకు.. ఇలా పలు పనులకు మీరు నో చెప్పాలంటూ' హార్వే వీన్‌స్టీన్ చర్యలకు వ్యతిరేకంగా ఆమె పిలుపునిచ్చారు. వీన్‌స్టీన్ చెప్పినట్లుగా చేయకపోతే తన అశ్లీల వీడియోలు, ఫొటోలు తీశానని వాటిని అప్లోడ్ చేస్తానంటూ వేధించేవాడని సల్మా హయక్ వివరించారు. ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చిందని.. బాధితురాళ్లు ఇదే విధంగా తిరుగుబాటు చేస్తే వీన్‌స్టీన్ లాంటి మానవ మృగాల ఆట కట్టించవచ్చన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్ననిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ)జీవిత కాల నిషేధం విధించింది. వీన్‌స్టీన్ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట... పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. 1970వ దశకం నుంచీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడెమీ కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే. -
యశో గుణ సంపన్నుడు
పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ అతడు పరిపూర్ణంగా నచ్చుతాడో శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపాడు. తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నో చిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన తల్లికి నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. తల్లి ప్రేమపాశానికి లొంగిపోయి, గÆ ధర్వులకి శాపవిముక్తి కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులనెందరినో మట్టి కరిపించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను పరిపూర్ణంగా ప్రేమించాడు. తననే గుండెల్లో నింపుకుని, తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నిన తన్నుకు కూడా చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మాన సÆ రక్షణ చేశాడు. సుభద్రా తనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. తననే అన్నీ అనుకున్న పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారాడు. కొన్నితరాల వరకు స్థిరంగా నిలబడిపోయేటటువంటి లోకోత్తరమైన భగవద్గీతను మానవాళికి అందించాడు. తాను అండగా నిలచిన పాండుపుత్రులకోసం మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి మామూలు మానవునిలా బోయవాని చేతిలో మరణించిన కృష్ణుడు యశోగుణ సంపన్నుడు. ఈ పండగను ఇలా జరుపుకోవాలి శ్రావణ బహుళ అష్టమినాటి అర్ధరాత్రిపూట సాక్షాత్తూ ఆ పరమాత్ముడే దేవకీదేవి అష్టమగర్భాన జన్మించాడు. భూభారాన్ని తగ్గించడానికి అవతరించినప్పటికీ తన దివ్యప్రేమతో అందరినీ ఉద్ధరించిన అమృతమూర్తి. ఆబాలగోపాలం ఆయన పుట్టినరోజునే జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది. -
మిస్టర్ పశువు
రావణాసురుడు సీతను బంధించాడు.. రాక్షసుడు! కీచకుడు ద్రౌపదిని వేధించాడు..రాక్షసుడు! ఇంద్రుడు అహల్యను మోసగించాడు.. రాక్షసుడే! వీళ్లంతా పరస్త్రీని వేధించి రాక్షసులయ్యారు. మరి మొగుడే మృగంలా ప్రవర్తిస్తే? ఇఫ్ హి బికమ్స్ ఎ బీస్ట్ ఇన్ ద బెడ్రూమ్? వాడు... మిస్టర్ పశువు! వాడికి... సంకెళ్లు రెడీ!! రాత్రి .. పన్నెండుంపావు. వాక్... వ్వా.... క్...వాంతి చేసుకుంటోంది ప్రణవి. అంతకు ముందు జరిగింది గుర్తొచ్చి పొట్టలోంచి తన్నుకొస్తోంది వికారం. ఉండుండి కక్కుతోంది. మనసులో ఉన్న ఏవగింపూ బయటకు వస్తోంది వాంతి రూపంలో! ఓ పదిహేను నిమిషాలకు కడుపు ఖాళీ అయిపోయింది. కాని మెదడు ఇంకా భారంగానే ఉంది. తల నొప్పి మొదలైంది. మొహం కడుక్కొని టవల్‌తో తుడుచుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు భర్త. ఓ వికృత చేష్ట తర్వాత అలసిపోయిన మృగంలా కనిపించాడు ప్రణవికి.దుఃఖం ఆగట్లేదు. బెడ్ అంచు మీద కూర్చోని టవల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. అసలు నిద్ర పట్టిందో లేదో కూడా తెలియదు! ఆ బాధ, ఆ వికారం, ఆ వాంతులు, ఏవగింపు, జుగుప్స .. ఆ రాత్రే కొత్త కాదు. మొదలూ కాదు. ఆఖరిది కూడా కాదు ప్రణవికి. కొన్నాళ్లే... సంబరం! ప్రణవి, మోహన్ పెళ్లయి పదకొండు నెలలవుతోంది. పెద్దలు కుదిర్చిందే. పెళ్లయిన నెల అంతా సవ్యంగా, నార్మల్‌గా గడిచింది. నిజం చెప్పొద్దూ... మోహన్ లాంటి వ్యక్తి భర్తగా దొరికినందుకు ప్రణవీ మురిసిపోయింది. తమ బంధువుల్లోని ఆడపిల్లల సంసారాలతో తన కాపురాన్ని పోల్చుకొని పొంగిపోయింది. తన అదృష్టాన్ని తలచుకొని తబ్బిబ్బయింది. హనీమూన్ తర్వాత తొలిసారిగా తల్లిగారింటికి వెళ్లిన ప్రణవి మొహంలో ఆనందాన్ని పసిగట్టి ఇంటివాళ్లూ సంతోషపడ్డారు. కాని ఈ సంబరమంతా ఒక్క నెలరోజులే సాగింది! ఊహించని ఉన్మాదం మోహన్లోని అసలు మనిషి బయటకు వచ్చాడు. రాత్రవుతోందంటే చాలు ప్రణవికి చెమటలు పట్టేవి. వెన్నులోంచి వణుకొచ్చేది. అసలే ఆ పిల్లకు సెక్సువల్ లైఫ్‌కి సంబంధించిన నాలెడ్జ్ తక్కువ. పెళ్లికి ముందు దాని గురించి చెప్పినవాళ్లూ లేరు. అమ్మ చెప్పినా.. అమ్మమ్మ చెప్పినా.. మేనత్త చెప్పినా.. నానమ్మ చెప్పినా.. అత్తమామలకు, భర్తకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి.. తల్లిగారింటి మర్యాద ఎలా కాపాడాలి.. అత్తింటి గుట్టు ఎంత చక్కగా గుప్పిట్లో దాచాలనే తప్ప సంసార జీవితం ఎలా ఉంటుంది.. ఎలా ఉండాలి.. ఏది నార్మల్.. ఏది అబ్నార్మల్.. అనే విషయాల గురించి ఊసే లేదు ఎవరి మాటల్లోనూ! అందుకే పది నెలల నుంచి పడకగదిలో భర్త అబ్నార్మల్ ప్రవర్తనను నార్మల్ అనుకునే భరిస్తూ వస్తోంది. తన ఒంటి నిండా భర్త పంటి గాట్లే. ప్రైవేట్ పార్ట్స్ పుండవుతున్నాయి. ఒళ్లు పులిసిపోతోంది. తన నోటిని కూడా అసహ్యం చేస్తున్నాడు. తెల్లవారి అన్నం తినలేకపోతోంది. ఈ పదినెలలలో చాలా బరువు తగ్గింది. ప్రాణం కళ్లలోకి వచ్చింది. అయినా కనికరం చూపట్లేదు భర్త. చివరకు బహిష్టు సమయాల్లోనూ తనను వదలట్లేదు. ఇక తన వల్ల కాదు అనుకుంది. ప్రతి రాత్రీ కంపరం ఎప్పటిలాగే భోజనం ముగించుకొని బెడ్రూమ్లోకి వెళ్లాడు మోహన్. వంటిల్లు సర్దుతూ, గిన్నెలు కడుక్కుంటూ గదిలోకి రావడానికి తాత్సారం చేస్తున్న భార్యను వచ్చేవరకు పిలుస్తూనే ఉన్నాడు. అసహ్యాన్ని, నిస్సహాయతను, బాధను, భయాన్ని పంటిబిగువున పట్టి ఉంచి లోపలికి వెళ్లింది ప్రణవి. మోహన్లోని పర్వర్షన్ ఒళ్లు విరుచుకుంది. ప్రణవిని బొమ్మలా చేసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఉన్మాదాన్ని భరించలేని ప్రణవి అప్పటికప్పుడే భర్తని విడిపించుకుని, ఎప్పుడో సమాచారం సేకరించి పెట్టుకున్న ఓ ఎన్జీవో హోమ్‌కి పరుగున బయల్దేరి వెళ్లింది ఆ చీకట్లోనే! ‘బీస్టియాలిటీ’ని భరించనక్కర్లేదు ప్రణవి భర్త సెక్సువల్ బిహేవియర్ సోడొమీ, ఫెలేషియో కిందకు వస్తుంది. అంటే ఆనల్ సెక్స్, సకింగ్ లేక లికింగ్ ఆఫ్ జెనైటల్స్! ఇలాంటి విపరీతమైన ప్రవర్తనతో చాలామంది మహిళలు శారీరక హింసకు, ఎవర్షన్కు గురవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, కాపురం అంటే అలాగే ఉంటుందేమోనని భరిస్తున్నారు. కాని ఇలాంటి ప్రవర్తన సాధారణం కాదు. సెక్సువల్ పర్వర్టెడ్నెస్, అన్ నేచ్యురల్ సెక్స్. ఇలాంటి అసహజమైన శృంగారాన్ని బీస్టియాలిటీ లేదా బెస్టియాలిటీ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఇవి నేరాలు కూడా. శారీరక కలయిక అన్నది సహజంగా, సౌకర్యంగా, అనందంగా ఉండాలి. అంతేకాని అసహజంగా, రాక్షసంగా ఉండకూడదు. ఈ ప్రవర్తన మానసిక హింస కిందకు కూడా వస్తుంది. ఇలాంటి బాధలు పడే మహిళలు హిందూ వివాహచట్టం సెక్షన్ 13 (2- జీజీ) ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడే గ్రౌండ్. ప్రణవికి ఈ సెక్షన్ ధైర్యాన్ని ఇచ్చింది. లీగల్ కన్సల్టెంట్ సహాయం, భరోసాతో విడాకులకు కేస్ వేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరింది. అయితే ఇక్కడ ప్రణవి విషయంలో ఇంకో అన్యాయం కూడా జరిగింది. ప్రణవితో కంటే ముందే మోహన్‌కు ఇంకో అమ్మాయితో పెళ్లయింది. మోహన్ పైశాచిక ప్రవృత్తిని భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రణవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె విడాకుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రహస్యం బయటపడింది. ప్రణవికి విడాకులు మంజూరయ్యాయి. ఇవన్నీ ఆలస్యంగా తెలుసుకున్నందుకు, తమ కూతురి బాధను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు ప్రణవి తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రణవి నిర్ణయాన్ని ఆమోదించడమే కాక ఆమెకు కొండంత అండగా నిలబడ్డారు ఆ పేరెంట్స్! ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com నశించిన సహనం ‘మీ ఆయన ఆగడాల గురించి మీ ఇంట్లో వాళ్లకెప్పుడూ చెప్పలేదా?’ గృహహింస ఎదుర్కొంటున్న స్త్రీల కోసం, ఒంటరి స్త్రీల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలో ఉన్న లీగల్ కన్సల్టెంట్ అడిగింది ప్రణవిని. ‘చెప్పాను మేడమ్. పెళ్లయిన ఆర్నెల్లకే. ముందు అందరూ అలాగే ఉంటారేమో అనుకొని సహించా. ఆ పిచ్చి రోజురోజుకూ ఎక్కువవుతుంటే అమ్మకు చెప్పా. అర్థం చేసుకోలేదు. తప్పించుకుంటున్నానుకొని నాకే సుద్దులు చెప్పి తిరిగి పంపించింది. అలా పంపిన రెండునెలలకే వచ్చి మళ్లీ చెప్పా. ఈసారి నానమ్మ, అమ్మ కలిసి క్లాస్ తీసుకున్నారు. ‘దొంగవేషాలు వేయకు.. పొద్దస్తమానం కాపురం వదులుకొని పుట్టింటికి వస్తే ఏ మొగుడు ఊరుకుంటాడు? ఇంకో దాని వలలో పడతాడు జాగ్రత్త. వెళ్లు.. వెళ్లి మీ ఆయన చెప్పినట్టు నడుచుకో’ అని మళ్లీ పంపించారు. ఇక చెప్పడం అనవసరమని భరించడం మొదలుపెట్టా. కానీ.. ఈమధ్య భరించే స్థితీ పోయింది మేడమ్’ అంటూ చేతుల్లో మొహం దాచుకొని గుండెపగిలేలా ఏడుస్తోంది ప్రణవి. తన చెయిర్లోంచి లేచి ఎదురుగా ఉన్న ప్రణవి దగ్గరికి వచ్చి ఆమె భుజాలు పట్టుకుంది లీగల్ కన్సల్టెంట్ అనునయంగా.. అభయంగా! - సరస్వతి రమ -
'ఆ రాక్షసికి తల్లయినందుకు బాధగా ఉంది'
'నాకో రాక్షసి పుట్టింది... జిహాదీతో ఆమె పెళ్లి ఆపేందుకు చైన్లతో కట్టేసి కూడ ప్రయత్నించాను. కానీ ఆపలేకపోయాను. చివరికి ఆమె అనుకున్నట్టుగానే సిరియా చేరిపోయింది' అంటూ ఐసిస్ పోస్టర్ గర్ల్ తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. ఇరవై ఏళ్ళ ఫాతిమా ధర్ఫరోవా సిరియా ప్రయాణాన్ని ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఫాతిమా సోషల్ మీడియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా పోస్టులు చేసేదని తల్లి శాఖ్లా బోఖరోవా వెల్లడించింది. పారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను, రష్యన్ పర్యాటక విమానం కూల్చిన వారిని ఫాతిమా కీర్తించడం రష్యన్లకు ఆగ్రహం తెప్పించిందని, అతివాద ఇస్లామిక్ నియామకుడి ఆకర్షణలో పడి, నాలుగో భార్యగా మారిన కూతురి పై ఆ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ తల్లీ ఇటువంటి రాక్షసులకు జన్మనివ్వాలని అనుకోదని, నిజంగా ఇటువంటి భూతానికి తల్లినైనందుకు చింతిస్తున్నానని బొఖరోవా అంది. ఒక ఉగ్రవాదికి తల్లిగా జీవించడం కంటే మరణించడం మేలని ఆవేదన వ్యక్తం చేసింది. 2014 లో సిరియాకు చేరిన 17 ఏళ్ళ సామ్రా కేసినోవిక్, ఆమె స్నేహితురాలు సబీనా సెలిమోవిక్ ఐఎస్ఐఎస్ పోస్టర్ గర్ల్స్ గా మారారు. ఆ తర్వాత జిహాదీల చేతిలో తీవ్రంగా హింసకు గురై హతమయ్యారు. ఇప్పుడు తన కూతురికీ అదే దుస్థితి దాపురిస్తుందని ఆ తల్లి తీవ్రంగా రోదిస్తోంది. ఫాతిమా చిన్నతనం నుంచి తనతో ఎంతో సన్నిహితంగా, ప్రేమగా ఉండేదని చెప్పింది. అయితే సైబీరియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాతే ఆమెలో ఎంతో మార్పు వచ్చిందని, సిరియా పారిపోయిన తన పెద్ద కూతుర్ని తిరిగి చూడగలనా అంటూ శాఖ్లా బోఖరోవా ఆవేదన చెందుతోంది. 'అక్కడ ఫాతిమా నిజంగానే ఓ రిక్రూటర్ గా ఉంటే... తూటాలకు బలవ్వక తప్పదు. ఉగ్రవాదులు ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టరు. ఆమె జీవితం ఇలా మారిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు. యూనివర్శిటీకి వెళ్ళిన తర్వాతే ఫాతిమాలో పూర్తిగా మార్పు చోటు చేసుకుంది. కనీసం కుటుంబంతో కలసి పండుగ చేసుకోవడానికి కూడ నిరాకరించేది. ఆమెలో రోజురోజుకూ వచ్చిన మార్పు చివరికి జిహాదీల వద్దకు చేర్చింది' అంటూ ఫాతిమా తల్లి రోదించింది. 'ఓసారి అబ్దుల్లా మా కుమార్తెను పెళ్ఙ చేసుకుంటానని పర్మిషన్ అడిగాడు. అప్పటికే ముగ్గురు భార్యలున్నారని, ఒక్కొక్కరికీ ముగ్గురు చొప్పున పిల్లలు కూడ ఉన్నారని చెప్పాడు. దాంతో నేను అస్సలు ఒప్పుకోలేదు. ఫాతిమా తనను ప్రేమిస్తోందని, తాను కూడ ఫాతిమాను ఇష్టపడ్డానని అబ్దుల్లా చెప్పాడు. నా కూతురితో మాట్లాడి ఆమె పెళ్లి నిర్ణయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. ఆమె ఉగ్రవాది కాకుండా కాపాడేందుకు ప్రయత్నించినా నా మాట వినలేదు. ఇక నా కూతుర్ని ఈ జన్మలో చూడలేను' అంటూ ఫాతిమా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. -
రానున్నది కొలువుల జాతర...
మైహైరింగ్‌క్లబ్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : వచ్చేది పండుగ సీజనే కాదండీ.. నిరుద్యోగులకు ఆనందాన్ని పంచే కాలం కూడా. ఎందుకంటే వచ్చే మూడు నెలల కాలంలో ఉద్యోగ నియామకాలు జోరు మీద ఉండనున్నాయి. ప్రముఖ నియామకాల ప్లాట్‌ఫామ్ మైహైరింగ్‌క్లబ్.కామ్ నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం.. గత త్రైమాసికంతో పోల్చినా, ఏడాది క్రితంతో పోల్చినా రానున్న త్రైమాసికంలో అధిక ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. ఈ ట్రెండ్ అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో కనిపించనుంది. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది రానున్న కాలంలో ఉద్యోగ నియామకాల జోరు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే 10 శాతం మంది ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల ఉంటుందని, 8 శాతం మంది ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. వచ్చే త్రైమాసికంలో కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టనున్నాయని మైహైరింగ్‌క్లబ్.కామ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. దీనివల్ల నిరుద్యోగులకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్-ఫైనాన్షియల్, తయారీ-ఇంజనీరింగ్ రంగాల్లో ఈ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఆగస్ట్‌లో ఆన్లైన్ నియామకాల జోరు: మాన్స్టర్ దేశంలో ఆన్లైన్ నియామకాల వృద్ధి ఆగస్ట్ నెలలో 36%గా నమోదైంది. ఈ ఏడాది మొత్తంలో ఇదే అధిక వృద్ధి. దీంతో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉండనుందని మాన్స్టర్.కామ్ సర్వేలో పేర్కొంది. మాన్ స్టర్.కామ్ ఉద్యోగ సూచీ ఆగ స్ట్ నెలలో 55 పాయింట్ల వృద్ధితో 208కి పెరిగింది. ఈ సూచీ గతేడాది ఇదే సమయంలో 153గా, జూలై నెలలో 204గా ఉంది. తయారీ/ఉత్పత్తి, బ్యాంకింగ్, బీమా రంగాల్లో అధిక నియామకాలు జరగనున్నాయి. -
రాక్షసుడు
నిజాలు దేవుడికెరుక అమెరికాలోని యుటా, 1975. రాత్రి పన్నెండున్నర కావస్తోంది. సబార్డినేట్లతో కలిసి రోడ్లమీద పెట్రోలింగ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఆర్నాల్డ్. చలికాలం సమీపిస్తుం డటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అయితే అప్పుడప్పుడూ వచ్చి తాకుతోన్న చలిగాలులు ఎముకల్ని కొరకాలని ప్రయత్నించడమే కాస్త ఇబ్బంది పెడుతోంది. ‘‘ఇప్పుడే ఇంత చలిగా ఉంది... ఇంకొన్ని రోజులు పోతే ఏంటి మన పరిస్థితి?’’ అన్నాడు ఆర్నాల్డ్ స్వెటర్‌ని సరి చేసుకుంటూ. ‘‘నిజమే సర్, చలి కొరికేస్తోంది’’ వంతపాడాడు సబార్డినేట్లలో ఒక వ్యక్తి. ‘‘ఏమైనా ఈ మధ్య కాస్త క్రైమ్ రేట్ తగ్గినట్టే ఉంది కద సర్’’... పరిసరాలను పరిశీలిస్తూ అన్నాడు మరొకతను. అలా అన్నాడో లేదో... కారుకి సడెన్ బ్రేకు పడింది. అందరూ అదిరిపడ్డారు. ‘‘ఏంటి డ్యానీ... ఏమైంది?’’ అన్నాడు డ్రైవర్‌వైపు చూస్తూ ఆర్నాల్డ్. ‘ఒకసారి అటు చూడండి సర్’’ అన్నాడు డ్యానీ చేయి చాచి ఎదురుగా చూపిస్తూ. అందరూ అటువైపు చూశారు. ఓ అమ్మాయి కారుకు అడ్డుగా నిలబడింది. కారు కింద పడబోయి తప్పించుకున్న ట్టుంది... భయంతో వణికిపోతోంది. కారు దిగి ఆమె దగ్గరకు వెళ్లారు అందరూ. ‘‘సారీ అమ్మా... దెబ్బలేమీ తగల్లేదు కదా’’ అన్నాడు ఆర్నాల్డ్ అనునయంగా. ఆమె మాట్లాడలేదు. వణికిపోతూనే ఉంది. అంత చలిలోనూ చెమటలు పోస్తున్నాయి. కళ్లు భయంతో పెద్దగా విచ్చుకున్నాయి. రెప్ప కూడా వేయకుండా ఉండిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లాడు ఆర్నాల్డ్. భుజమ్మీద చేయి వేస్తే ఉలిక్కిపడిందామె. ‘‘నన్నేం చేయొద్దు... నీకు దణ్నం పెడతాను... నన్ను వదిలెయ్’’... బిగ్గరగా అరవసాగింది. అందరూ అవాక్కయ్యారు. గబగబా వెళ్లి ఆమెను పట్టుకున్నారు. ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఆమె ఊరుకోలేదు. అరుస్తూనే ఉంది. అరిచి అరిచి చివరకు స్పృహ కోల్పోయింది. ఆమెను కారులో వేసుకుని ఆస్పత్రికి బయలుదేరారు. ‘‘నేను... నేను ఎక్కడున్నాను?’’... కళ్లు తెరుస్తూనే ఉలిక్కిపడి లేచి కూర్చుందామె. భయంభయంగా చుట్టూ చూస్తోంది. ‘‘దేన్నో చూసి బాగా భయపడింది సర్. నన్ను వదిలెయ్ అని అరుస్తోందంటే ఆ భయానికి కారణం ఒక మనిషే అయి ఉండొచ్చు’’... చెప్పాడు డాక్టర్. అలాగా అన్నట్టు తల పంకించాడు ఆర్నాల్డ్. ఆమె దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించాడు. బెదిరి దూరంగా జరిగి పోతోంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. తన పోలీసు తెలివితేటలతో చాకచక్యంగా మాట్లాడి ఆమె నమ్మకాన్ని గెల్చుకున్నాడు. ధైర్యం చెప్పాడు. దాంతో ఆమె నె మ్మదించింది. అప్పుడు అడిగాడు ఆర్నాల్డ్... ‘‘నీ పేరేమిటి? నీకు ఏమయ్యింది? అంత రాత్రివేళ... ఎందుకలా రోడ్డుమీద పరిగెడుతున్నావ్?’’ ఆ ప్రశ్నలు వినగానే ఆమె కళ్లలో మళ్లీ భయం పెరిగింది. ‘‘నా పేరు... నా పేరు... క్యారల్. నేను మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లి వస్తున్నాను. అప్పుడు... అప్పుడు...’’.. భయంతో మాట పెగల్లేదు. ‘‘డోన్ట్ వర్రీ క్యారల్. నేనున్నానుగా! ఏం జరిగిందో చెప్పు’’... అనునయంగా అన్నాడు ఆర్నాల్డ్. దాంతో మెల్లగా మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘పార్టీ అయ్యాక రోడ్డుమీదికొచ్చాను. ట్యాక్సీ స్టాండ్ వైపు నడుస్తుంటే చెప్పు జారి కాలు బెణికింది. దాంతో నడవలేక అక్కడే కూలబడిపోయాను. అంతలో ఓ కారు వచ్చి నా దగ్గర ఆగింది. లిఫ్ట్ కావాలా అంటే సరే అన్నాను. కానీ అతను... కారెక్కి కొంచెం దూరం వెళ్లాక రూటు మళ్లించేశాడు. ఎక్కడో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిపోయాడు. అరిస్తే కొట్టాడు. రేప్ చేయడానికి ప్రయత్నిం చాడు. ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాను. దార్లో మీ కారు కింద పడ్డాను.’’ తల పంకించాడు ఆర్నాల్డ్. ‘‘అతని గుర్తులు, ఆ కారు గుర్తులు చెప్పగలవా?’’ చెప్పిందామె. అతని గుర్తులు ఎక్కడా తెలిసినవిలా అనిపించలేదు. కానీ కారు గుర్తులు, నంబరు చెబుతుంటే ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. వెంటనే స్టేషన్‌కి వెళ్లి పాత ఫైళ్లు తిరగేశాడు. కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న ఓ పోలీసును గుద్దేసి వెళ్లిపోయిన కారు అది. అంటే వాడు పొరపాట్న యాక్సిడెంట్ చేసినవాడు కాదు. క్రిమినల్ అన్నమాట. వాడినెలా అయినా పట్టుకోవాలి. అనుకున్నదే తడవుగా వేట మొదలుపెట్టాడు ఆర్నాల్డ్. ఎట్టకేలకు అతని జాడ కనిపెట్టాడు. ‘‘ఎస్... ఎవరు కావాలి?’’... అడిగీ అడగడంతోనే అతని గూబ గుయ్మంది. కానీ అతను షాక్ తినలేదు. కొట్టినందుకు ఫీలవనూ లేదు. చాలా కూల్‌గా అన్నాడు... ‘‘అడిగితే కొడతారేంటి సర్?’’ ‘‘నువ్వే కావాలి మిస్టర్ టెడ్ బన్డీ’’ అంటూ చేతులకు బేడీలు వేశాడు ఆర్నాల్డ్. అప్పుడు కూడా అతను కంగారు పడలేదు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. ఇంటరాగేషన్ రూమ్‌లో కూడా అతని తీరు అదే. పోలీసుల కళ్లలోకి సూటిగా చూస్తున్నాడు. ఏదడిగినా చకచకా సమా ధానం చెబుతున్నాడు. ఓ నేరస్తుడు, తమ సమక్షంలో అంత కూల్‌గా ఉండటం చూసి విస్తుపోయారు పోలీసులు. ‘‘చెప్పు... క్యారల్ని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ప్రయత్నించావ్ కదూ?’’... ఆర్నాల్డ్ గొంతు కటువుగా పలికింది. ‘‘తెలిసే కదా అరెస్ట్ చేశారు?’’ చుర్రుమంది ఆర్నాల్డ్‌కి. లాగి ఒక్కటివ్వబోయి తమాయించుకున్నాడు. ‘‘కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసాఫీసర్ మీద కారు ఎక్కించి, ఆగ కుండా వెళ్లిపోయావ్. అప్పుడు తప్పించు కున్నావ్ కానీ ఇప్పుడు దొరికిపోయావ్.’’ ‘‘కావాలని గుద్దలేదు. ఒక అమ్మాయి నా నుంచి పారిపోయింది. ఆమెను పట్టుకునే క్రమంలో వేగంగా డ్రైవ్ చేశాను. పొరపాటున మీ ఆఫీసర్ని గుద్దేశాను. అంతే.’’ విస్తుపోయాడు ఆర్నాల్డ్. క్షణం పాటు మాట్లాడలేక పోయాడు. అతడు మౌనంగా అయిపోవడం చూసి టెడ్ అన్నాడు... ‘‘షాక్ తిన్నారు కదూ! నాకిది మామూలే. మీరు ఇప్పుడే వింటున్నారు కదా... అందుకే అంతగా షాకవుతున్నారు.’’ ఇంకా బుర్ర తిరిగిపోయింది ఆర్నాల్డ్‌కి. అతణ్ని ఇక పెద్దగా శ్రమ పెట్టకుండానే టెడ్ తన గురించిన నిజాలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు. 1946లో ఓ పెళ్లికాని అమ్మాయి కడుపున పుట్టాడు టెడ్. ఊహ తెలిసి నప్పటి నుంచీ తన తండ్రి ఎవరో తెలుసు కోవాలని తపన పడ్డాడు. తల్లి చెప్పలేదు. కలత చెందాడు. తండ్రి ఎవరో తెలియని బిడ్డగా తనను ఈ లోకానికి తెచ్చిన తల్లిమీద అయిష్టాన్ని పెంచుకున్నాడు. ఆ బాధ, కోపం, విసుగు అన్నీ కలసి అతడి మనస్తత్వాన్ని విచిత్రంగా తయారు చేశాయి. ఎదుటివాళ్లు బాధపడితే చూడ టంలో ఆనందం కలిగేది. ఉండేకొద్దీ కావాలని ఇతరులను బాధపెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత తన తల్లిని పెళ్లాడిన వ్యక్తి తనను చేరదీసినా అతనికి దగ్గర కాలేకపోయాడు. అతని పిల్లలతో తనను సమానంగా చూసినా ఆనందించ లేకపోయాడు. అతని పిల్లలను హింసించే వాడు. ఓసారి చెల్లెల్ని మేడమీది నుంచి కూడా తోసేశాడు. దాంతో టెడ్‌ని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్ జీవితం టెడ్కి చాలా నచ్చింది. అక్కడతని ఆలోచనల్ని, చేతల్ని గుర్తించేవారెవరూ లేకపోవడంతో టెడ్‌లో వికృతత్వం పురులు విప్పుకుంది. ఏదో తెలియని కసి పెరిగింది. అది ఎలా తీర్చు కోవాలా అని చూసేవాడు. సైకాలజీలో డిగ్రీ చేసి, లా కాలేజీలో చేరాడు. సరిగ్గా అదే సమయంలో టెడ్ ప్రేమించిన యువతి అతనితో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయింది. తట్టుకోలేకపోయాడు. అన్నే ళ్లుగా అతనిలో అణచి పెట్టిన ఉన్మాది ఒక్క సారిగా బయటకు వచ్చాడు. తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టాడు. దారుణంగా రేప్ చేసి చంపేశాడు. అతడిలో ఏదో ఆనందం! అంతే... నాటి నుంచీ మొదలైంది టెడ్ నేరాల పరంపర. రాత్రిళ్లు ఒంటరిగా కనిపించిన అమ్మాయిలకు లిఫ్ట్ పేరుతో ఎర వేసే వాడు. కారు ఎక్కాడ కిడ్నాప్ చేసి తీసుకు పోయేవాడు. తన కారులోనే చిత్రహింసలు పెట్టేవాడు. అలా మొత్తం ముప్ఫై మందికి పైగా అమ్మాయిలను పొట్టన పెట్టుకు న్నాడు. కొందరిని చంపడానికి ముందే రేప్ చేశాడు. కొందర్ని చంపేశాక వారి మృతదేహాలతో కోరిక తీర్చుకున్నాడు. తన మాజీ గాళ్ఫ్రెండ్లాగా నీలి కళ్లు, నల్లని జుత్తు ఉన్న అమ్మాయిలంటే టెడ్కి పిచ్చి. అలాంటి అమ్మాయిల్ని చంపేసి, వారి మృతదేహాలు కుళ్లి కృశించే వరకూ వాటి తోనే గడిపేవాడు. కొందరి తలల్ని తన ఇంట్లో ట్రోఫీల్లాగా దాచుకున్నాడు. టెడ్ పైశాచికత్వానికి న్యాయస్థానం సైతం ఉలిక్కిపడింది. ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టి ప్రాణాలు తీయమంటూ ఆదేశించింది. 1989, జనవరి 24న ఆ శిక్ష అమలయ్యింది. ఆ మానవమృగం ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. విచిత్రం ఏమిటంటే... చనిపోయే ముందు కూడా టెడ్ కాస్తయినా పశ్చాత్తాపపడక పోవడం. చనిపోతున్నందుకు బాధగా లేదా అని అడిగితే... ‘‘నాకు నచ్చింది నేను చేశాను... మీరు చేయాల్సింది మీరు చేయండి’’ అన్నాడు టెడ్. అతడికి మరణ శిక్ష వేయడమే న్యాయమని ఆ చివరి మాటలు సైతం రుజువు చేశాయి! టెడ్‌ని అరెస్ట్ చేసిన తర్వాత అతని కారును సీజ్ చేశారు పోలీసులు. అప్పుడా కారులో ఉన్న మారణాయుధాలను చూసి షాక్ తిన్నారు వాళ్లు. రకరకాల చాకులు, చిత్ర విచిత్రమైన కత్తులు ఉన్నాయి ఆ కారులో. పైగా రక్తం ఇంకిపోయి సీట్లు రంగు మారిపోయాయి. దానికి తోడు భరించలేని దుర్వాసన. తాను చాలా హత్యలు ఈ కారులోనే చేయడంతో దాని పరిస్థితి అలా తయారైందని విచారణలో చెప్పాడు టెడ్! -
అమ్మవారికి రోజుకో అలంకారం ఎందుకు?
అంతరార్థం చాలా పండుగలలాగానే దేవీనవరాత్రులకు ఆధారమైనదీ దానవ సంహారమే. వరబలం వల్ల కలిగిన మదగర్వంతో మహిషుడనే రాక్షసుడు, వాడి అనుచరగణం లోకాల్లో కల్లోలం సృష్టించసాగారు. వారి ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ఆదిపరాశక్తి తనలోని వివిధ అంశలకు చెందిన శక్తులన్నింటినీ ఒక్కటిగా చేర్చి జగదంబగా అవతరించింది. త్రిమూర్తులు సహా అష్టదిక్పాలకులు తదితర దేవతలందరూ తమ ఆయుధాలను, శస్త్రాస్త్రాలను ఆమెకు అందించారు. వాటిని ఆసరాగా చేసుకుని అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి కదన రంగానికి కదలి వెళ్లింది. మాయావులైన రాక్షసులను ఏమార్చడానికి ఆమె కూడా రోజుకో అవతారం ధరించవలసి వచ్చింది. ఆయా అసురులను సంహరించడం వల్ల ఆమెకు వారి పేర్లే చిరకీర్తి నామాలుగా సుస్థిరమయ్యాయి. అమ్మవారు అలనాడు చేసిన దానవ సంహారానికి ప్రతీకగానే నేటికీ ఆమెను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవావతారాలతో అలంకరించి, పదవ రోజున విజయ దశమి పండుగ జరుపుకుంటున్నాం. -
ఉద్యోగప్రాప్తి‘మస్తు’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్ని సంవత్సరాలుగా స్థబ్దుగా ఉన్న జాబ్ మార్కెట్లో తిరిగి కదలిక మొదలయ్యింది. ఆశావాహక వాతావరణంతో కంపెనీలు రిక్రూట్‌మెంట్స్‌ను మొదలు పెడుతున్నాయి. మాన్స్టర్, నౌకరీ డాట్‌కామ్, టీమ్‌లీజ్ తాజా నివేదికలకు తోడు, ఐఎస్బీ, ఐఎంటీ వంటి బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీల రిక్రూట్మెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనలో గతేడాదితో పోలిస్తే 14% వృద్ధి నమోదైనట్లు మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ పేర్కొంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 64 శాతం కంపెనీలు నియామకాలు చేపడుతున్నట్లు నౌకరీ డాట్ కామ్ సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 800 నియామక సంస్థలను సంప్రదించగా 64% మంది కొత్త నియామకాలు చేపడుతున్నామని చెప్పగా, గతేడాది ఇది కేవలం 54%గా ఉంది. ఎన్నికల అనంతరం కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో కంపెనీలు ముందుగానే నియామకాలు చేపడుతున్నట్లు టీమ్‌లీజ్ తన సర్వేలో పేర్కొంది. జీతాల్లో పెరుగుదల అంతంతే.. రిక్రూట్మెంట్, ప్లేస్మెంట్ చేసే కంపెనీలు పెరుగుతున్నా, జీతాలు మాత్రం అంతగా పెరగడం లేదు. చాలాచోట్ల జీతాలు గతేడాదిలాగే స్థిరంగా ఉండగా, మరికొన్ని చోట్ల 5 నుంచి 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. గడిచిన సంవత్సరం నియామకాల కోసం మా క్యాంపస్‌కి 56 కంపెనీలు రాగా, ఈ ఏడాది 80కిపైగా వచ్చినట్లు హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) డెరైక్టర్ డాక్టర్.వి.పాండురంగారావు తెలిపారు. కాని విద్యార్థులు అందుకున్న సగటు వార్షిక జీతం గతేడాదిలాగానే రూ.6 లక్షలుగానే ఉందన్నారు. అదే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు 90 శాతం వరకు పూర్తయ్యాయి. గతేడాది కంటే కంపెనీల సంఖ్య పెరిగాయని, అలాగే వార్షిక సగటు వేతనం కూడా స్వల్పంగా రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెరిగినట్లు ఐఎస్బీ అధికారి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జీతాలు 5 నుంచి 15% పెంచి తీసుకోవడానికి 70% కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు నౌకరీ డాట్‌కామ్ సర్వేలో వెల్లడయ్యింది. స్టార్ట్అప్ జోరు... విద్యార్థులు అనుభవం, పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థల కంటే స్టార్ట్అప్ కంపెనీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ముఖ్యంగా ఆన్లైన్, ఈ కామర్స్, టూరిజం, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో వస్తున్న కంపెనీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఐఎస్బీలో గతేడాది 32 స్టార్ట్అప్ కంపెనీలు పాల్గొని 26 ఆఫర్లు ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 46 కంపెనీలు పాల్గొని 48 ఆఫర్లను ఇచ్చాయి. కొత్త తరహా వ్యాపారం అయ్యి ఉండి, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కొంత జీతం తక్కువైనా రిస్క్ చేయడానికి విద్యార్థులు సిద్ధపడుతున్నట్లు పాండురంగారావు పేర్కొన్నారు. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.