జూలైలో తగ్గిన ఆన్‌లైన్ హైరింగ్ | Online hiring activity in July down 4 pct over last year: Monster | Sakshi
Sakshi News home page

జూలైలో తగ్గిన ఆన్‌లైన్ హైరింగ్

Published Thu, Aug 22 2013 3:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Online hiring activity in July down 4 pct over last year: Monster

న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్‌లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్‌లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్‌లైన్ హైరింగ్  కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది.
 
 గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు.  కాగా ఆన్‌లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్‌పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్‌లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement