Sanjay Modi
-
జూలై ఆన్లైన్ నియామకాల వృద్ధి 32%
న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్లైన్ నియామకాల జోరు పెరిగింది. జూలై నెలలో ఆన్లైన్ నియామకాల వృద్ధి 32 శాతంగా నమోదైంది. మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జూలై నెలలో 50 పాయింట్లు పెరిగి 204 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ సూచీ 154 పాయింట్ల వద్ద ఉంది. జూన్‌తో పోలిస్తే జూలైలో మాన్స్టర్ ఉద్యోగ సూచీ 2 పాయింట్లు పెరిగింది. ఆన్లైన్ ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల నమోదుకావడంతో మాన్ స్టర్.కామ్ సూచీ ఈ ఏడాది 32 శాతం వృద్ధితో గరిష్ట స్థాయికి చేరిందని మాన్స్టర్.కామ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సంజయ్ మోదీ తెలిపారు. వంద స్మార్ట్ నగరాల ఏర్పాటు, మేకిన్ ఇండియా కార్యక్రమం వంటి పలు కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో వ్యాపార అనుకూల పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఆన్లైన్ నియామకాల వృద్ధి అత్యధికంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో (73 శాతం) నమోదైంది. దీని తర్వాతి స్థానాల్లో తయారీ (72 శాతం), ఆటోమేషన్ రంగాలు ఉన్నాయి. ఆన్లైన్ నియామకాల వృద్ధిని పట్టణాల వారీగా చూస్తే.. బరోడా 55 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో పుణే (43 శాతం), ముంబై (39 శాతం), బెంగళూరు (39 శాతం) ఉన్నాయి. -
కొత్త కొలువుల కళకళ...
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాబ్ మార్కెట్ ఆశావహంగా కన్పిస్తోంది. ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు జనవరిలో వరుసగా నాలుగో నెల కూడా పెరగడం ఇందుకు నిదర్శనం. దేశంలో ఆన్లైన్ జాబ్ డిమాండుకు ఓ ప్రామాణికమైన మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జనవరిలో 7 పాయింట్లు (5.18 శాతం) వృద్ధిచెంది 142 పాయింట్లకు చేరింది. వరుసగా ఆరు సంవత్సరాలు దిగువముఖంలో ఉన్న రిక్రూట్మెంట్ సూచీ గతేడాది 11 శాతం పెరగడం గమనార్హం. ఐటీ (సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్), రిటైల్ రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని మాన్స్టర్.కామ్ ఎండీ సంజయ్ మోడీ తెలిపారు. ఉద్యోగ సూచీ గత అక్టోబర్ నుంచి క్రమంగా పెరుగుతోందని చెప్పారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, హెచ్ఆర్ కన్సల్టెంట్ల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు వివరించారు. ఐటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక సౌకర్యాలు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలు జాబ్ మార్కెట్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ జోరు.. మాన్స్టర్.కామ్ సూచీ పర్యవేక్షణలోని 13 నగరాలకు గాను 11 సిటీల్లో ఆన్లైన్ జాబ్ డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి రేటు గతేడాది రెండంకెల స్థాయిలో ఉందని మాన్స్టర్.కామ్ నివేదిక పేర్కొంది. బరోడా, కోయంబత్తూరు నగరాలు మాత్రమే తిరోగమనంలో ఉన్నాయని తెలిపింది. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.