న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్‌లైన్ నియామకాల జోరు పెరిగింది. జూలై నెలలో ఆన్‌లైన్ నియామకాల వృద్ధి 32 శాతంగా నమోదైంది. మాన్‌స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జూలై నెలలో 50 పాయింట్లు పెరిగి 204 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ సూచీ 154 పాయింట్ల వద్ద ఉంది. జూన్‌తో పోలిస్తే జూలైలో మాన్‌స్టర్ ఉద్యోగ సూచీ 2 పాయింట్లు పెరిగింది. ఆన్‌లైన్ ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల నమోదుకావడంతో మాన్ స్టర్.కామ్ సూచీ ఈ ఏడాది 32 శాతం వృద్ధితో గరిష్ట స్థాయికి చేరిందని మాన్‌స్టర్.కామ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సంజయ్ మోదీ తెలిపారు.
వంద స్మార్ట్ నగరాల ఏర్పాటు, మేకిన్ ఇండియా కార్యక్రమం వంటి పలు కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో వ్యాపార అనుకూల పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ నియామకాల వృద్ధి అత్యధికంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో (73 శాతం) నమోదైంది. దీని తర్వాతి స్థానాల్లో తయారీ (72 శాతం), ఆటోమేషన్ రంగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ నియామకాల వృద్ధిని పట్టణాల వారీగా చూస్తే.. బరోడా 55 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో పుణే (43 శాతం), ముంబై (39 శాతం), బెంగళూరు (39 శాతం) ఉన్నాయి.
జూలై ఆన్‌లైన్ నియామకాల వృద్ధి 32%
Published Thu, Aug 6 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement