మాస్కో: భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా ఫస్ట్ పాలసీ మేకిన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న15వ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో కొనియాడారు.
ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భాగున్నాయి. ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment