
మాడ్యూల్ నుంచి సునీతను బయటకు తీసుకొస్తున్న దృశ్యం..
అమెరికా ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్
సుమారు 9 నెలల నిరీక్షణ.. కోట్లాది మంది ప్రార్థనలు.. నాసా శాస్త్రవేత్తల అవిరళ కృషి.. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ తోడ్పాటు.. ఎట్టకేలకు భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు భువికి తిరిగొచ్చారు.భూమిపైకి దిగాక మాడ్యూల్‌లో సునీత, ఇతర వ్యోమగాములు
ఫ్లోరిడా సముద్రజలాల్లో దిగిన డ్రాగన్ మాడ్యూల్
2.17: స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ
2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్ పూర్తి
2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది.
2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్‌క్రాఫ్ట్ కిందకు దిగడం ప్రారంభమైంది.
3.10: డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో సిగ్నల్ కట్ అయింది. 3.21కి సిగ్నల్ కలిసింది.
మాడ్యూల్‌ను నౌకలోకి ఎక్కిస్తున్న దృశ్యం
3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్‌లు తెరుచుకున్నాయి.
3.28: డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది.
3.55: మాడ్యూల్‌ను నౌకలో ఎక్కించారు.
4.23: మాడ్యూల్ నుంచి సునీతను బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు.

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కో
దివి నుంచి భూమికి సేఫ్‌గా అడుగు పెట్టిన సునీతా విలియమ్స్
ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక
అత్యంత ఉత్కంటగా సాగిన చివరి 7 నిమిషాలు
ఈ రోజు ఉ.3.27 గంటలకు భూమికి చేరిన సునీతా
క్రూ డ్రాగన్ వ్యోమనౌక దగ్గరకు వచ్చిన నాసా శాస్త్రవేత్తలు
క్రూ డ్రాగన్ సేఫ్ ల్యాండిగ్‌తో నాసా శాస్త్రవేత్తల సంబరాలు
ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు
అక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు
సుదీర్గకాలం స్పేస్‌లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు
ఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు పరీక్షించనున్న వైద్యులు
దీంతో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్
గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్
Comments
Please login to add a commentAdd a comment