
8 రోజుల మిషన్.. 9 నెలల హైటెన్షన్
అనుక్షణం ఒక అద్భుతం.. ప్రతీ క్షణం ప్రమాదంతో సహవాసం
నిజానికవి 9 నెలలు కాదు..ఒక్కో క్షణం ఒక్కో యుగం
అంతులేని ఒత్తిడిలోనూ అంతరిక్షాన్ని జయించిన సునీత.. ధీర వనిత అనుక్షణం ఒక అద్భుతం..
👉మరికొద్ది గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాక
లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా
భారత కాలమానం ప్రకారం.. 2.15గం. ప్రారంభం కానున్న లైవ్
- నాసా క్రూ 9 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్(ISS)కు వెళ్లిన సునీత, విల్మోర్
- 290 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన ఇరువురు నాసా వ్యోమగాములు
- భూమి యొక్క ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)
- అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళ(59 వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు
సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు!
- సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లతో పాటు భూమ్మీదకు రానున్న నిక్ హేగ్(నాసా), అలెగ్జాండర్ గుర్బునోవ్(రష్యా వ్యోమగామి)
- క్రూ-9లో భాగంగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లిన హేగ్, గుర్బునోవ్
- సునీత, బచ్‌ల కోసం కావాల్సినవి అందించడంతో పాటు వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేసిన ఈ ఇద్దరు
- స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ రానున్న మొత్తం నలుగురు
- కిందటి ఏడాది జూన్‌లో.. మానవ సహిత బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న ఇద్దరు
- స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చిక్కుకుపోయిన ఇద్దరు
ఇదీ చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
ఇండియన్ డాటర్‌కు స్వాగతం
- భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్
- సునీత సాహసయాత్రపై భారత్‌లో అభినందనల వెల్లువ
- త్వరలో భారత్‌కు రావాలంటూ లేఖ రాసిన ప్రధాని మోదీ
- క్షేమంగా రావాలంటూ గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో పూజలు, యాగాలు
👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు పయనం ఇలా..
- క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత: మంగళవారం ఉదయం 8.15కు మొదలు
- అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం: ఉదయం 10.15 గంటలకు ప్రారంభం.
- భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ఆన్: బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు.
- సాగర జలాల్లో ల్యాండింగ్: తెల్లవారుజామున 3.27 గంటలకు.
- సహాయ బృందాలు రంగంలోకి దిగి.. స్పేస్‌ఎక్స్ క్యాపూల్స్ క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి.
- ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
- దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు.
ఇదీ చదవండి: Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ?
Comments
Please login to add a commentAdd a comment