మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్.. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌కు రానున్నారు. పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
దేశాల పర్యటనపై పుతిన్,మోదీల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ సారి పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు.
మోదీ ఈ ఏడాది రెండుసార్లు రష్యాలో పర్యటించారు. జులైలో రష్యా రాజధాని మాస్కోలో 22వ రష్యా-ఇండియా సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. రెండోసారి ఈ అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment