మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విముక్తి, ఉక్రెయిన్ యుద్దం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఉక్రెయిన్‌తో రస్యా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం దేనికి పరిష్కారం అవ్వదని ప్రధాని మోదీ పుతిన్‌తో అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పుతిన్‌కు చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇద్దరూ ‘ఓపెన్ మైండ్’తో చర్చలు జరిపినట్లు మోదీ చెప్పారు.
“ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఓపెన్ మైండ్‌తో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరు చాలా గౌరవంగా విన్నాం. యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. ఎవరికైనా ప్రాణహాని జరిగినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే హృదయాన్ని కదిలిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీనిపై కూడా నేను మీతో చర్చించాను," అని మోదీ పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి పునరుద్ధరణకు సహకరించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పుతిన్‌తో చెప్పారు.భారత్ శాంతికి అనుకూలంగా ఉందని మేము మీతో పాటు ప్రపంచానికి హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇక శాంతిపై పుతిన్ మాట్లాడిన మాటలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పుతిన్‌కు మోదీ హగ్.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment