
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్‌లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్‌లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?
Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha
— DD India (@DDIndialive) May 16, 2025
‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’
వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్‌లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.
ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు
‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.