
న్యూఢిల్లీ: గత నెల 23వ తేదీన పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారత బీఎస్‌ఎఫ్ జవాన్ పీకే(పూర్ణం కుమార్) షాను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బీఎస్‌ఎఫ్‌కు చెందిన భారత జవాన్ పీకే షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో పాకిస్తాన్ ఆ బీఎస్ఎప్ జవాన్ విడిచిపెట్టక తప్పలేదు
నిద్రలేని రాత్రులు.. మానసిక వేధన!
జవాన్ పీకే షా పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా ఆ జవాన్ భార్య పలు విషయాలను వెల్లడించారు. పీకే షా భార్య రజని మాట్లాడుతూ.. ‘ నా భర్తను శారీకంగా హింసించలేదని, ప్రతీ రాత్రి విచారించారని, ఇది మానసికంగా కుంగదీసిందని భర్త చెప్పినట్లు భార్య రజనీ తెలిపింది.
మూడు వారాలకు పైగా పాక్ కస్టడీలో ఉన్న షాను సైనికుడిలా కాకుండా గూఢచారిలా చూశారని, మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించారని చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. ఆ ప్రదేశాలల్లో ఒకటి ఎయిర్ బేస్ అయి ఉండొచ్చనే అనుమానం కల్గిందని భర్త చెప్పిన విషయాన్ని ఆమె వెల్లడించింది.
భర్త పీకే షాకు తిండి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా, బ్రష్ చేసుకోవడానికి అనుమతించే వారు కాదని. భర్త నిద్రలేమితో ఉన్నట్లు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందని ఆమె పేర్కొంది.