BSF jawan
-
మహిళా బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లా ఎనీ్టపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మహిళా బీఎస్ఎఫ్ జవాన్ బల్లా గంగాభవాని (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ దంతివాడలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. శనివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. గంగాభవాని విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఆమె నివాసం ఉండే గదికి చేరుకుని చూశారు. గది తలుపులు వేసి ఉండటంతో వాటిని పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకుని కనిపించారు. రామగుండం ఎన్టీపీసీ సుభాష్ గర్‌లో నివాసం ఉంటున్న బల్ల సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల కుమార్తె గంగాభవానికి 2021లో బీఎస్ఎఫ్లో ఉద్యోగం లభించింది. తొలుత ఆమె పశి్చమబెంగాల్లో పనిచేశారు. ఇటీవల గుజరాత్‌లోని గాం«దీనగర్ దంతివాడకు బదిలీపై వెళ్లారు. గతనెల 5వ తేదీన నుంచి 24వ తేదీ వరకు సెలవుపై రామగుండం వచ్చిన గంగాభవాని.. ఈనెల రెండో తేదీన తిరిగి విధుల్లో చేరారు. అయితే, అక్కడ రోజూ 18 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఆరు గంటలే విశ్రాంతి ఉంటోందని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. ‘అమ్మా.. నాన్న.. ఈ ఉద్యోగం చేయలేను.. ఇక్కడ ఉండలేను’అని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు తెలిసింది. దీంతో ఇబ్బందిగా ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలని చెప్పామని, ఇంతలోనే తమ కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. గంగాభవాని మృతదేహాన్ని ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి కుటుంబసభ్యులు స్వస్థలానికి తీసుకొచ్చారు. -
బంగ్లా పౌరులకు బీఎస్ఎఫ్ జవాన్ భావోద్వేగపు విజ్ఞప్తి!
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారత్‌లోకి ప్రవేశించడానికి సరిహద్దుల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ప్రవేశించాలని ప్రయత్నించగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. దయ చేసి నా మాట వినండి.. మీరు గట్టిగా అరిస్తే ఏమి రాదు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లోని సరిహద్దు వెంబడి తమకు భారత్‌లోకి ప్రవేశం కోసం బంగ్లా పౌరులు వేడుకున్నారు. ఈ కమ్రంలో బీఎస్ఎఫ్ జవాన్ మాట్లాడుతూ.. ‘‘మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మా అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ ఈ విషయంపై చర్చ అవసరం. మేము ఇలాంటి సమస్యలను పరిష్కరించలేము. మిమ్మల్ని ఇలా సరిహద్దు దాటనివ్వలేము. ఇలాంటి సమయంలో నా మాట మీరు వినండి. అంతే కానీ మీరు గట్టిగా అరిచినా ఉపయోగం లేదు’’ అని ఒకింత భావోద్వేగంతో అన్నారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు జాతీయమీడియా పేర్కొంటోంది. అయితే ఆ జవాన్ వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు. బంగ్లాదేశ్‌లో రాజకీయం సంక్షోభ నెలకొన్న ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించి.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పెంచింది. మరోవైపు.. ఆదివారం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల గుండా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులను భద్రతా బలగాలు పట్టుకున్నారు.ఇదిలా ఉండగా.. రిజర్వేషన్ కోటా అంశంలో అల్లర్లు హింసాత్మకంగా మారటంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. బంగ్లా వందలి భారత్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె దేశం విడిచినప్పటి నుంచి కూడా అల్లర్లు తగ్గటం లేదు. ఆమెకు అనుకూలంగా వ్యవహిరించిన వారు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది. -
మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
ఇంఫాల్: మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు మంగళవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆకస్మికంగా కాల్పులు జరిపారు. నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం -
అనారోగ్యంతో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
విజయనగరం: మండలంలోని చినభోగిలి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నగర ప్రసాద్(44) అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారు. ప్రసాద్ మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామం చినభోగిలికి కుటుంబీకులు తీసుకొచ్చారు. బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొని అధికారిక లాంఛనాలతో నిర్వహించి వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శ్మశాన వాటిక వద్ద బీఎస్ఎఫ్కు చెందిన కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, సిబ్బంది పాల్గొని ఆయన భార్యకు జాతీయ పతాకాన్ని అందజేశారు. గార్డు ఆఫ్ హానర్ కార్యక్రమాన్ని నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వీరమణ, ఎస్సై కె.నీలకంఠం, ఆర్ఐ ఎన్.శ్రీనివాసరావు, సర్పంచ్ కురమాన రాధ, గ్రామ వీఆర్ఓ ఎస్ లక్ష్మి, కుటుంబ సభ్యులు,స్నేహితులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. కుటుంబసభ్యుల రోదన ప్రసాద్ గుజరాత్ రాష్ట్రంలోని పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 23ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రసాద్ సెలవుపై జూలై 30న ఇంటికి చేరుకున్నారని భార్య తెలిపారు. మృతి చెందిన ప్రసాద్‌కు తల్లిదండ్రులు గంగయ్య, సీతమ్మతో పాటు భార్య పవిత్ర, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న ప్రసాద్ మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకోపోయిన కుటుంబసభ్యులు భోరున విలపించారు. -
బిడ్డను వదల్లేక రైలెక్కిన మహిళ జవాన్.. సెల్యూట్ అంటూ నెటిజన్ల ప్రశంస!
కన్న తల్లి తన బిడ్డలను ఎంత అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ తెలుసు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తల్లి తన బిడ్డలను వదిలిపెట్టదు. కానీ, దేశ రక్షణలో భాగంగా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఓ తల్లి తన 10 నెలల పసికందును విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తన బిడ్డను భర్త, కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ కన్నీరు పెట్టుకుంది. పేగుబంధాన్ని విడిచి వెళ్లలేక బరువైన గుండెతో వెక్కివెక్కి ఏడుస్తూ విధులకు బయలు దేరింది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఆవేదనకు లోనయ్యారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ తాలూకా నంద్‌గావ్‌కు చెందిన వర్షా రాణి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్‌గా పని చేస్తోంది. పది నెలల కిందటే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పది నెలల పాటు ఆమె తన బిడ్డ ఆలనా పాలనా చూస్తూ ఎంతో సంతోషంగా కాలం గడిపింది. ఇక, మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయం రావడంతో విధులకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. డ్యూటీకి వెళ్లాలనే కోరిక ఏ మాత్రం లేకపోయినప్పటికీ బలవంతంగా రైలు ఎక్కింది. తన బిడ్డను భర్త చేతుల్లో పెడుతూ భావోద్వేగం ఆపులేక బోరున ఏడ్చేసింది. బిడ్డను వదల్లేక కన్నీళ్లు పెట్టుకుంది. భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది. అనంతరం అందర్నీ వదిలి రైలెక్కింది. రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని బిడ్డను చూస్తూ కన్నీటితో వీడ్కోలు పలికింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. जब देश की ज़िम्मेदारी के सामने घर की ज़िम्मेदारी हार जायें कोल्हापुर की वर्षणी पाटिल अपने दस महीने के बच्चे को छोड़ अपनी ड्यूटी पर वापस जाती हुई। ऐसी माताओं पर हर देशवासी को गर्व है। pic.twitter.com/iBVJ5tish5 — Shobhna Yadav (@ShobhnaYadava) March 19, 2023 -
భర్తను వదిలేసిన మహిళ వేధింపులు.. జవాను ఆత్మహత్య
సాక్షి, తాంసి (బోథ్): ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకోవాలంటూ భర్తను వదిలేసిన ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన గెడాం మారుతి (30) బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా మేఘాలయలోని 11వ బెటా లియన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత నెలలో సెలవుపై గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలోనే మారుతికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే గతంలో పరిచయం ఉన్న పార్వతీబాయి అనే మహిళ మారుతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకో వాలంటూ సమీప బంధువుతో కలసి వేధిస్తోంది. బుధవారం గ్రామపెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టారు. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఆమెసమీప బంధువుతో కలసి మారుతిపై కేసు పెడతామంటూ బెదిరించారు. మనస్తాపానికి గురైన మారుతి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయటపడుకుంటానని చెప్పి ట్రాక్టర్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం కుటుం బసభ్యులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. మృతుడి సోదరుడు సుదర్శన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణ హత్య.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు..! నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు -
ఎయిర్‌పోర్టులో ఏఎస్సై చేతివాటం
ఢిల్లీ: అనుమానాస్పద వ్యక్తులపై నిత్యం నిఘాపెట్టాల్సిన ఖాకీయే దారితప్పాడు. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకురాలి పర్సు దొంగిలించిన బీఎస్ఎఫ్ ఏఎస్సైని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళ్లేందుకు విమానం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ తన సీటు కింద పర్సు పెట్టి కూర్చుంది. అదే సమయంలో నిందితుడు నరేశ్ కుమార్ బాగ్డోగ్రా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే విమానం కోసం వేచి చూస్తూ, అదను చూసి పర్సును కొట్టేశాడు. ఆ పర్సులో దాదాపు రూ.15 లక్షల విలువైన బంగారు,వజ్రాభరణాలు ఉన్నాయి. కొద్దిసేపటికి పర్సు పోయిందని గ్రహించిన సదరు మహిళ అక్కడున్న అలారం మోగించి పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, బండారం బయటపడింది. వెంటనే పోలీసులు నరేశ్‌ని పట్టుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు. చోరీ సొమ్మును బాధిత మహిళకు అప్పగించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని, తను వెళ్లాల్సిన విమానం వచ్చుంటే ఈ సొమ్ముతో బయటపడేవాణ్ణని తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. -
ప్రధాని X మాజీ కానిస్టేబుల్
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. భద్రతాదళాలకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో ఫిర్యాదు చేసి విధుల నుంచి తొలగిన బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ నేత ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) లతో కూడిన ఎస్పీ కూటమి వారణాసి నుంచి మొదట తన అభ్యర్థిగా షాలిని యాదవ్‌ను ప్రకటించింది. ‘అవినీతిపై ప్రశ్నించినందుకు నన్ను విధుల నుంచి తొలగించారు. భద్రతా దళాల్లో ఉన్న అవినీతిని తొలగించడమే నా ప్రధాన ధ్యేయం’అని తేజ్ బహదూర్ విలేకరులకు వెల్లడించారు. మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయిన తేజ్ బహదూర్ యాదవ్ జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదుచేస్తూ 2017లో సోషల్ మీడియాలో ఓ వీడియో అప్లోడ్ చేశారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. 7వ దశ ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న ఎన్నికలు జరుగనున్నాయి. -
పాక్‌కు సరిహద్దు రహస్యాలు
ఫిరోజ్‌పూర్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని కంచెలు, రహదారులకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఏజెంటుకు అందజేశాడన్న ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ జవానును అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా షేక్ రియాజుద్దీన్ అనే జవానుపై నిఘా పెట్టిన బీఎస్ఎఫ్ వర్గాలు ఆయనను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాయి. రియాజుద్దీన్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా రెన్పురా గ్రామానికి చెందిన వాడని, పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌లోని 29వ సరిహద్దు భద్రతాదళానికి చెందిన బెటాలియన్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతని నుంచి రెండు సెల్ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థకు చెందిన మీర్జా ఫైజల్ అనే వ్యక్తికి సరిహద్దు ఫెన్సింగ్, రోడ్లు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు, ఇతర రహస్య వివరాలు రియాజుద్దీన్ అందజేసినట్టుగా బీఎస్ఎఫ్ వెల్లడించింది. 29వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రియాజుద్దీన్ పోలీసు రిమాండ్‌కోసం కోర్టును ఆశ్రయిస్తామని విచారణ అధికారి రంజిత్‌సింగ్ తెలిపారు. -
సర్జికల్స్ స్టైక్స్ రెండోసారి జరిగాయా?
-
మరిన్ని సర్జికల్ దాడులు..?!
న్యూఢిల్లీ : ‘సర్జికల్ స్ట్రైక్స్’ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్ పర్వ్’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘గత రెండు మూడు రోజుల్లో మరో పెద్ద విషయం జరిగింది. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను.. కానీ భవిష్యత్తులో తెలుస్తుంది’ అన్నారు. కొన్ని రోజుల క్రితం ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ సైన్యాలు నాగేంద్ర సింగ్ అనే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను కాల్చి చంపారు. ఈ సంఘటన నేపధ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్ మృతికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాలను నాశనం చేశారనే విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా తెలియజేశారని విశ్వసనియ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక విషయం అయితే జరిగింది.. కానీ దాని గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను. కానీ జరిగింది ఏదైనా మంచికే జరిగింది. నన్ను నమ్మండి. గడిచిన రెండు, మూడు రోజుల్లో చాలా గొప్ప విషయం ఒకటి జరిగింది. నిన్న, మొన్న ఏం జరిగిందనేది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ నిగూఢంగా మాట్లాడారు. ‘నేను మన బీఎస్ఎఫ్ జవాన్లకు ఒకటే చెప్పాను. ముందు పేలిన తూటా ఎప్పటికీ మనది కాకుడదు. వారు మన పొరుగువారు. కానీ వారు కాల్పులకు తెగబడితే మాత్రం ఊరుకోకండి. విజృంభించండి అని చెప్పాను’ అని వివరించారు. పాక్ సైన్యం నాగేంద్ర సింగ్‌ని అతి క్రూరంగా చంపేసినందుకు ప్రతీకారంగా బీఎస్ఎఫ్ కొన్ని చర్యలు తీసుకున్నట్లు.. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
జవాన్ నాగరాజుకు రిమాండ్
అనంతపురం సెంట్రల్: కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణానికి పూనుకుని పిస్టల్‌తో బెదరించాడన్న అభియోగం నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించింది. నాగరాజును సోమవారమే అదుపులోనికి తీసుకున్న నాల్గో పట్టణ పోలీసులు మంగళవారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా..ఆగస్టు 17వ తేదీ వరకూ కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రుద్రంపేట సమీపంలోని స్థల వివాదంలో బీఎస్ఎఫ్ జవాన్, మరోవర్గం వ్యక్తులు గొడవపడిన విషయం విదితమే. లైసెన్స్డ్ తుపాకీతో బెదిరించాడని ఆర్మ్డ్యాక్టు, ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ‘భరతమాత ముద్దు బిడ్డ.. పోలీసులకు సవతిబిడ్డ’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితంకాగా...పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పునరాలోచనలో పడ్డ పోలీసులు జవాన్‌పై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ వెంకట్రావ్ అధికారికంగా ధ్రువీకరించారు. జవాన్‌కు బెయిల్ రాగానే ఫిర్యాదు తీసుకుంటామని వెల్లడించారు. -
బీఎస్ఎఫ్ జవాన్ రేప్.. యువతి ఆత్మహత్య
ముజఫర్‌నగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి బీఎస్ఎఫ్ జవాను రేప్చేయడంతో ఓ యువతి(26) విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యూపీలో జరిగింది. ఆత్మహత్య ఘటనపై కొత్వాలి ఎస్‌హెచ్‌వో అనిల్ కపేర్వాన్ మాట్లాడారు. బాధితురాలు జూలై 6న విషం తాగగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయిందని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బీఎస్ఎఫ్ జవాను తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితురాలిపై లైంగికదాడిని వీడియో తీసిన నిందితుడు పెళ్లి ప్రస్తావన తెస్తే ఈ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించేవాడని తండ్రి ఫిర్యాదుచేశాడు. జవాను వేధింపుల్ని తట్టుకోలేక సదరు యువతి ప్రాణాలు తీసుకుందన్నారు. -
పాక్‌పై భారత సైన్యం ప్రతీకారం.. 15మంది ఖతం!
జమ్మూ: అకారణంగా తమ జవాన్‌ను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ సైన్యంపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు బుధవారం రాత్రి పాక్ ఆర్మీ పోస్టులపై మెరుపు దాడులు చేశాయి. సరిహద్దుల మీదుగా ఉన్న దాయాది సైనిక పోస్టులను ధ్వంసం చేసి.. దాదాపు 15మంది పాకిస్థాన్ రేంజర్లను హతమార్చారు. బుధవారం సాయంత్రం పాక్ ఆర్మీ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా.. ఏకపక్షంగా భారత సైన్యం లక్ష్మంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్పీ హజ్రా తీవ్రంగా గాయపడ్డారు. పుట్టినరోజు నాడే పాక్ కాల్పుల్లో గాయపడిన హజ్రా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన భారత సైన్యంలో ప్రతీకారేచ్ఛను రగిలింది. సరిహద్దుల్లో పాక్ యథేచ్ఛగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. చిన్నపాటి ఆయుధాలు, మోటార్ షెల్స్ దాడులతో భారత సైన్యాన్ని కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించిన భారత్ సైన్యం సరిహద్దుల దాటి పాక్ పోస్టులను మూడింటిని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో 12 నుంచి 15మంది పాక్ రేంజర్లు హతమైనట్టు తెలుస్తోంది. -
పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి..
సాక్షి, జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనను అతిక్రమించింది. దీంతో భారత బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. శుక్రవారం జమ్మూ జిల్లాలోని దేశసరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్ బిజేందర్ బహుదూర్(32) కు పాక్ సైన్యం షెల్లింగ్ మోర్టార్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని విద్యా భావన్ నారయపుర్ గ్రామానికి చెందని బహుదూర్‌కు భార్య సుశ్మితా సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజుల నుంచి వరుసగా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. భారత బలగాలు సైతం పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయి. గురువారం కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించగా ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
జవాన్ దుర్మరణం
- స్కార్పియో వాహనం బోల్తా - హుళేబీడు గ్రామం వద్ద ఘటన హుళేబీడు(ఆలూరు రూరల్) : ఆలూరు మండలం హుళేబీడు గ్రామశివారులోని మలుపు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. స్వయంగా వాహనం నడుపుతున్న అతడు మలుపు వద్ద నియంత్రించుకోలేకపోవడంతో బోల్తా పడింది. మృతుడు గుంతకల్‌కు చెందిన సి.రామ్‌బాబుగా తెలిసింది. ఇతడు డ్రైవింగ్ చేస్తూ ఆదోనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై మలుపు వద్ద వాహనాన్ని(స్కార్పియో: ఏపీ 21 ఏటీ296) నియంత్రించుకోలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్కార్పియో వాహనంలో ఇరుక్కుపోయిన రామ్‌బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఆధార్, ఐడెంటిటీ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. సి.రాంబాబు, సన్నాఫ్ ప్రకాష్ పేర్లున్నాయి. గుంతకల్‌కు చెందిన వ్యక్తిగా వివరాలు అందులో నమోదయ్యాయి. మరొక కార్డులో సి.రామ్‌బాబు, బీఎస్ఎఫ్ జవాన్ అనే ఐడెంటిటీ కార్డు కూడా లభ్యమైంది. వాహనంలో ఎందరు ప్రయాణిస్తున్నారు, ఆ వాహనం ఎక్కడికి వెళ్తుందన్న వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. -
‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’
-
‘సీఎం వెళ్లగానే ఏసీ, సోఫాలు తీసుకెళ్లారు’
న్యూఢిల్లీ: అమర జవాను ఇంటికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్నారని చేసిన ఏర్పాట్లన్ని ఆయన వెళ్లిపోయిన మరుక్షణమే తీసుకొని వెళ్లిపోయారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ సేనలు చేసిన అక్రమ దాడుల్లో బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్ సాగర్ వీరమరణం పొందాడు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వచ్చారు. అయితే, ఆయన రావడానికంటే ముందే, ఆ ఇంట్లోకి ఏసీలు, సోఫాలు, కర్టన్లు, కార్పెట్లు, కుర్చీలు తీసుకొచ్చి ఇంటినిండా నింపారు. దీంతో ఆ వస్తువులన్నీ వారికి తీసుకొచ్చారని ఆ గ్రామస్తులతోపాటు ఇంటివారు కూడా అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి వెళ్లిపోగానే చిన్నవస్తువుతో సహా ప్రతి ఒక్కటి అధికారులు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశలోకి కూరుకుపోవడమే కాకుండా అవమానభారంలోకి జారుకుంది. ‘ఏసీ, సోఫా సెట్లు, కార్పెట్, కుర్చీలు ముఖ్యమంత్రి వస్తున్నారని తీసుకొచ్చి ఇంటినిండా పెట్టారు. సీఎం వెళ్లిపోగానే మొత్తం తీసుకెళ్లారు’ అని జవాను సోదరుడు దయాశంకర్ అన్నారు. ఈ చర్య తమను తీవ్రంగా అవమానించినట్లుగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్ మీడియా ద్వారా ఆరోపించిన దేశంలో కలకలం సృష్టించిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను విధుల నుంచి తప్పించారు. ఆర్మీలో క్రమ శిక్షణ తప్పడంతోపాటు అతడు నిబంధనలకు విరుద్ధమైన ఎన్నో పనులు చేశాడనే ఆరోపణలు రుజువైనందున అతడిని విధుల నుంచి తొలగించినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ విషయంపై తాను ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తానని తేజ్ బహదూర్ తెలిపాడు. నిజాలు బయటకు చెప్పాననే కక్షతో తనపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పాడు. హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లాకు చెందిన తేజ్ బహదూర్ 1996లో బీఎస్ఎఫ్లో చేరాడు. గత ఏడాది చివర్లో తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ఇది పెద్ద ధుమారం రేగింది. దీంతో మధ్యంతర విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆ విచారణ కమిటీ తమకు నివేదికను అందించిందని, అందులో పలు విషయాలు తెలిశాయంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. -
ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు
-
బీఎస్ఎఫ్ జవాను ఫేస్బుక్ ఖాతాపై నిఘా
న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్ జవాన్ల భోజనం విషయంలో సామాజిక మాధ్యమంలో వీడియో పెట్టి సంచలనం రేపిన జవాను తేజ్ బహదూర్ ఫేస్బుక్ స్నేహాలపై నిఘా సంస్థలు దృష్టిపెట్టాయి. తేజ్‌కు చెందిన పలు ఫేస్బుక్ ఖాతాల్లో 6 వేల మంది స్నేహితులుండగా అందులో 17 శాతం మంది పాక్వారని హోం శాఖ వర్గాలు చెప్పాయి. తేజ్‌ను కలిసేందుకు ఆయన భార్య షర్మిలకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. తన భర్త జాడ తెలియడం లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు శుక్రవారం విచారించింది. తేజ్ నిర్బంధించలేదని, మరో బెటాలియన్ కు మార్చామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. -
‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఆయనను వేరే చోటుకు విధుల దృష్ట్యా బదిలీ చేసినట్లు ఢిల్లీ కోర్టుకు వివరించింది. గత మూడు రోజులుగా తన భర్త జాడ తెలియడం లేదని, ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఫిర్యాదు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి ఉంటారని అనుమానిస్తూ తేజ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఎందుకు తేజ్ భార్యను ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. కొత్త బెటాలియన్ క్యాంప్‌లో వీకెండ్లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కూడా అధికారులకు కోర్టుకు ఆదేశించింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లోని 88వ బెటాలియన్‌లో తేజ్ బహదూర్ పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జవాన్లకు పోషకాహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టి తేజ్ బహదూర్ యాదవ్ కలవరాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే అతడి భార్య పలుమార్లు ఆరోపిస్తూ వస్తోంది. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో ‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’ అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు? జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య -
నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య
న్యూఢిల్లీ: తన భర్త ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ భార్య అన్నారు. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని బయటపెట్టిన జవానే తేజ్ బహదూర్ యాదవ్. నాసిరకం ఆహారం విషయాన్ని బయటపెట్టిన కారణంగా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరించారని ఫోన్ లో 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ భార్యకు తెలిపారు. తన భర్త కోసం గత రెండు రోజులుగా ఎదురుచూస్తున్నానని, అయితే ఆయన ఇప్పటికీ ఇంటికి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏదో విధంగా వేరొకరి నుంచి మొబైల్ తీసుకుని తనకు కాల్ చేశారని, తాను నిర్బంధంలో ఉన్నానని ( అరెస్ట్ చేశారని) చెప్పాడని వివరించారు. అరెస్ట్ చేసిన తర్వాత భర్త రిటైర్మెంట్ ను రద్దు చేశారని చెప్పారు. జవాన్ల సౌకర్యాలు, ఆహారం, ఇతరత్రా సమస్యలను తేజ్ బహదూర్ తర్వాత సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీత్‌సింగ్, లాన్స్ నాయక్ యజ్ఞప్రతాప్ సింగ్ కూడా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రయత్నం మొదటగా చేసిన తన భర్తను రిటైర్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తేజ్ బహదూర్ కు ఏమైతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ అధికారులు తేజ్ బహదూర్ భార్య ఆరోపణలపై స్పందించారు. బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదని, వాలంటరీ రిటైర్మెంట్ ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 30న సాయంత్రం జవాన్ రిటైర్మెంట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. (చదవండి: అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?) (చదవండి: ఉరిమిన ‘యూనిఫాం’) -
‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’
న్యూఢిల్లీ: తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, ఆయన చేసిన పని కరెక్టేనని బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ భార్య తెలిపారు. బహదూర్ యాదవ్ మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఆయనకు మతిస్థిమితం లేకపోతే సరిహద్దులో ఎలా విధులు నిర్వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. మంచి ఆహారం పెట్టామని అడగడం తప్పుకాదని బహదూర్ యాదవ్ కుమారుడు రోహిత్ అన్నాడు. సైనికుల సరైన ఆహారం అందిచడం లేదని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. జమ్మూకశ్మీర్ 29వ బెటాలియన్ లో జవానుగా పనిచేస్తున్న తేజ్ బహదూర్ యాదవ్ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్చేసిన వీడియో దుమారం రేపింది. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం నుంచి తేజ్ బహదూర్ యాదవ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య వెల్లడించింది. ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు తేజ్ బహదూర్ యాదవ్ పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డి.కె. ఉపాధ్యాయ మంగళవారం తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!
భారత ఆర్మీపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని బీఎస్ఎఫ్ జవాను కుటుంబం ఆరోపించింది. పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని భారత జవాను గుర్నామ్ సింగ్ సోదరి గుర్జీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. కానీ గాయపడ్డ సైనికులను మాత్రం తీసుకెళ్లడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా వీలుకాని పక్షంలో విదేశాల నుంచి మంచి వైద్య బృందాన్ని అయినా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించొచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రస్తుతం తన సోదరుడు గుర్నామ్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియాకు వెల్లడించారు. జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్నామ్ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతడ్ని విదేశాలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని గుర్జీత్ కౌర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ లోని హిరానగర్ సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు.పాక్ రేంజర్స్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే.