
నకిలీ నోట్లతో పోలీసులకు పట్టుబడిన జవాన్ వరప్రసాద్
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. బీఎస్‌ఎఫ్ కంపెనీ 125 బెటాలియన్‌లో జవాన్‌గా పనిచేస్తున్న నందిగాం మండలం దేవళభద్ర గ్రామానికి చెందిన పట్నాన వరప్రసాద్ నుంచి పోలీసులు రూ. 37 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టెక్కలిలో ఓ మద్యం దుకాణానికి వచ్చిన వరప్రసాద్ వద్ద నకిలీ నోట్లు ఉండడం గమనించిన దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎస్సై రాజేష్‌తో పాటు సిబ్బంది అక్కడకు చేరుకుని వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 37 వేల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో కాపలా ఉన్న సమయంలో తనకు నగదుతో ఉన్న బ్యాగు దొరికిందని విచారణలో వరప్రసాద్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు చెప్పారు.