ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారత్‌లోకి ప్రవేశించడానికి సరిహద్దుల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించాలని ప్రయత్నించగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. దయ చేసి నా మాట వినండి.. మీరు గట్టిగా అరిస్తే ఏమి రాదు’ అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లోని సరిహద్దు వెంబడి తమకు భారత్‌లోకి ప్రవేశం కోసం బంగ్లా పౌరులు వేడుకున్నారు. ఈ కమ్రంలో బీఎస్‌ఎఫ్ జవాన్ మాట్లాడుతూ.. ‘‘మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మా అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ ఈ విషయంపై చర్చ అవసరం. మేము ఇలాంటి సమస్యలను పరిష్కరించలేము. మిమ్మల్ని ఇలా సరిహద్దు దాటనివ్వలేము. ఇలాంటి సమయంలో నా మాట మీరు వినండి. అంతే కానీ మీరు గట్టిగా అరిచినా ఉపయోగం లేదు’’ అని ఒకింత భావోద్వేగంతో అన్నారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు జాతీయమీడియా పేర్కొంటోంది. అయితే ఆ జవాన్ వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు.
బంగ్లాదేశ్‌లో రాజకీయం సంక్షోభ నెలకొన్న ఈ నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించి.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పెంచింది. మరోవైపు.. ఆదివారం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల గుండా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులను భద్రతా బలగాలు పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా.. రిజర్వేషన్ కోటా అంశంలో అల్లర్లు హింసాత్మకంగా మారటంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. బంగ్లా వందలి భారత్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె దేశం విడిచినప్పటి నుంచి కూడా అల్లర్లు తగ్గటం లేదు. ఆమెకు అనుకూలంగా వ్యవహిరించిన వారు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment