BSF
-
సరిహద్దుల్లో సాహసమే వెన్నెముకగా...
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. ఏకే 47తో సహా రకరకాల వెపన్లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి! కమాండర్ స్థాయికి చేరుకోవాలని...ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్ఎఫ్లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.– వై.మహాలక్ష్మి – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
చొరబాటుదారుణ్ణి మట్టుబెట్టిన బీఎస్ఎఫ్
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్‌తారన్ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. -
బంగ్లా పౌరులకు బీఎస్ఎఫ్ జవాన్ భావోద్వేగపు విజ్ఞప్తి!
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రజలు భారత్‌లోకి ప్రవేశించడానికి సరిహద్దుల వద్దకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ప్రవేశించాలని ప్రయత్నించగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. దయ చేసి నా మాట వినండి.. మీరు గట్టిగా అరిస్తే ఏమి రాదు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లోని సరిహద్దు వెంబడి తమకు భారత్‌లోకి ప్రవేశం కోసం బంగ్లా పౌరులు వేడుకున్నారు. ఈ కమ్రంలో బీఎస్ఎఫ్ జవాన్ మాట్లాడుతూ.. ‘‘మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మా అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ ఈ విషయంపై చర్చ అవసరం. మేము ఇలాంటి సమస్యలను పరిష్కరించలేము. మిమ్మల్ని ఇలా సరిహద్దు దాటనివ్వలేము. ఇలాంటి సమయంలో నా మాట మీరు వినండి. అంతే కానీ మీరు గట్టిగా అరిచినా ఉపయోగం లేదు’’ అని ఒకింత భావోద్వేగంతో అన్నారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు జాతీయమీడియా పేర్కొంటోంది. అయితే ఆ జవాన్ వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు. బంగ్లాదేశ్‌లో రాజకీయం సంక్షోభ నెలకొన్న ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించి.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పెంచింది. మరోవైపు.. ఆదివారం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల గుండా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులను భద్రతా బలగాలు పట్టుకున్నారు.ఇదిలా ఉండగా.. రిజర్వేషన్ కోటా అంశంలో అల్లర్లు హింసాత్మకంగా మారటంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. బంగ్లా వందలి భారత్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె దేశం విడిచినప్పటి నుంచి కూడా అల్లర్లు తగ్గటం లేదు. ఆమెకు అనుకూలంగా వ్యవహిరించిన వారు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడిస్తోంది. -
సరిహద్దులో ఉద్రిక్తత.. చొరబాటుకు బంగ్లాదేశీయుల యత్నం
కలకత్తా: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బలగాలు అడ్డుకున్నాయి. పశ్చిమబెంగాల్లోని కూచ్‌బెహార్ జిల్లా సరిహద్దు నుంచి వెయ్యి మంది భారత భూభాగంలో ప్రవేశించేందుకు యత్నించారు.సరిహద్దులోని ఫెన్సింగ్‌కు 400 మీటర్ల దూరంలో బంగ్లాదేశీయులు గుమిగూడడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ‘సరిహద్దు వద్ద గుమిగూడిన వందలాది మంది బంగ్లాదేశీయులను భారత భూభాగంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాం. వారందరినీ బంగ్లాదేశ్ బలగాలు వెనక్కి తీసుకెళ్లాయి’అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి భారత్‌లోకి చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. -
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
పంజాబ్‌లోకి పాక్ డ్రోన్..ఎందుకొచ్చిందంటే..?
ఫిరోజ్‌పూర్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా మబోక్ గ్రామంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌కూల్చివేసింది.ఈ డ్రోన్ చైనాలో తయారైనట్లు బీఎస్ఎఫ్ గుర్తించింది.కూల్చివేసిన డ్రోన్‌తో చిన్న పార్సిల్లు రవాణా చేయవచ్చని బీఎస్ఎఫ్ తెలిపింది. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం. డ్రోన్‌ను గుర్తించిన వెంటనే దానిని కూల్చివేశాం. పంజాబ్‌కు డ్రగ్స్ సప్లై చేసేందుకు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి. డ్రోన్ల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది’ అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితమే పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్‌లో కూల్చివేశారు. 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧𝐢 𝐝𝐫𝐨𝐧𝐞 𝐫𝐞𝐜𝐨𝐯𝐞𝐫𝐞𝐝 𝐛𝐲 𝐁𝐒𝐅 After a Pakistani drone violated Indian airspace and was intercepted by #BSF troops with firing. @BSF_Punjab troops launched a search operation, recovering a Pakistani drone (DJI Mavic 3 Classic - Made in China) from a… pic.twitter.com/HBo2ZZvcU4 — BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) December 9, 2023 ఇదీచదవండి..బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు -
ఈగలతో ప్రొటీన్ల సేద్యం!
సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్ఎఫ్ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్‌ఎఫ్‌పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్ గ్రాంటుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్ఎయు) ఏడాది క్రితమే వేస్ట్2వెల్త్ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ వివరాలతో ఆసక్తికర కథనం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్‌కు వెళ్లే దారిలో 14%, రిటైల్ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్ సోల్జర్ ఈగలు (బిఎస్ఎఫ్) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి. లేయర్ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్‌ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్ఎఫ్ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్ఎఫ్ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది. బిఎస్ఎఫ్ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి. అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్ మీల్‌తో పాటుగా 10 శాతం వరకు బిఎస్ఎఫ్ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. పిజెటిఎస్‌ఎయులో పైలెట్ ప్రాజెక్టు అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్ఎఫ్ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ‘వేస్ట్2వెల్త్’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్ఎయు పీజీ స్టడీస్ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్ సోల్జర్ ఫ్లైల పెంపకం కమ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్‌లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్‌కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్ఎఫ్ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్ఎఫ్ జాతికి వుంది. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత. ఎంటర్ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం! బ్లాక్ సోల్జర్ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్‌లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను పెంచుతున్నాం. వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం. సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్ సోల్జర్ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు... రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్ఎఫ్ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు. బిఎస్ఎఫ్ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్ సోల్జర్ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్ఎఫ్ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు. సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను ప్రొటీన్ సప్లిమెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్ఎఫ్ లార్వా సాగుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్‌తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్మీల్ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు. కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్‌లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్ఎఫ్ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్) బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్‌ఎఫ్‌తో పాటు మిడతలు, మీల్ వార్మ్స్, గొల్లభామలు, వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్ఎఓ చెబుతోంది. --పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
కేటుగాళ్ల కొత్త ప్లాన్.. 14కిలోల బంగారాన్ని మట్టిలో పాతిపెట్టి..
కోల్కత్తా: బంగారం తరలింపు కోసం కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులో, కార్లలో బంగారం తరలిస్తున్న ఘటనలు చూసే ఉంటాం. కానీ.. కొందరు కేటుగాళ్లు ఏకంగా బంగారాన్ని అడవిలో దాచిపెట్టి.. తరలింపునకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో భద్రతా దళాలు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్ చేశారు. BSF & DRI in a joint operation seized a total of 106 gold biscuits weighing 14.296 kg worth Rs 8.50 crore from a house in village Vijaypur and arrested 2 smugglers: BSF pic.twitter.com/HaldGUNMjs — ANI (@ANI) September 3, 2023 ఈ సందర్బంగా అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉంటుందని తెలిపార. ఈ బంగారం ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ఎల్బీనగర్లో దారుణం.. -
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
కేంద్ర పోలీస్ విభాగాల్లో 1.14 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి. కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. -
మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో బీఎస్ఎఫ్ జవాన్లు అల్లరి మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో సైన్యంలో పనిచేసి అమరుడైన సైనికుని కుటుంబాన్ని ఆందోళనకారుల నుంచి రక్షించారు. అమరవీరుని కుటుంబం నివసిస్తున్న మఫౌ గ్రామం ఆపదలో ఉందని గమనించి అక్కడకు చేరుకున్నారు. దేశానికి కాపాలా కాసిన అమరుని ఇంటికి జవాన్లు ప్రస్తుతం రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు, స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మణిపుర్‌లోని మఫౌ గ్రామానికి చెందిన పాయోటిన్సాట్ గైట్ బీఎస్ఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 2020 డిసెంబరు 1న కశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడుతూ గైట్ అమరుడయ్యాడు. ఆయన తెగువకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గైట్ స్వగ్రామం ఆపదలో ఉందని గుర్తించి బీఎస్ఎఫ్ జవాన్లు .. అల్లరి మూకలను పారదోలారు. ఆ గ్రామాన్ని రక్షించారు. ఇదీ చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్ సురక్షిత ప్రాంతంలో ఉన్న గైట్ తండ్రి టోంగ్జాంగ్ గైట్.. బీఎస్ఎఫ్ జవాన్లు తమను, తమ గ్రామాన్ని కాపాడిన తీరును వివరించారు. ' దాదాపు 1000 మంది అల్లరిమూకలు మా గ్రామంపై దాడి చేశారు. దీనిని పసిగట్టిన మేము గ్రామంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించాము. దాడిని పసిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. మా గ్రామానికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటికే 50 శాతం ఇళ్లు కాలిబూడిదయ్యాయి.' అని తెలిపారు. 'అమరవీరుని కుటుంబం అయినందున రెండేళ్ల క్రితం మణిపూర్ సీఎం మమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ మేము ఇప్పుడు ఈ దాడిలో బాధితులుగా మిగిలిపోయాము. మా ఇంటిని విడిచి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది.' అంటూ టోంగ్జాంగ్ గైట్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కోడలు హోనిల్హింగ్ గైట్ కూతుళ్ల చదువుల కోసం మేఘాలయాలో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇద్దరు 6, 3 ఏళ్ల వయస్సు కలిగిన మనవరాళ్లు ఉన్నట్లు చెప్పారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమ కోడలు, మనవరాళ్లతో ఇక్కడే ఉండాలని ఉందని తెలిపారు. ఇదీ చదవండి: ఒకపక్క మణిపూర్ అల్లకల్లోలంగా ఉంటే.. 718 మంది వలస వచ్చారు.. కారణం ఏమై ఉంటుంది? -
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత... కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 5న రాత్రంతా సాగిన ఈ ఘర్షణల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని జూన్ 10 వరకు పొడిచింది మణిపూర్ ప్రభుత్వం. స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగి... మణిపూర్ లో మే 3న జరిగిన అల్లర్లలో మెయితేయి కుకీ తెగల మధ్య దారుణ హింసాకాండ చోటు చేసుకుంది. సుమారుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయితేయి తెగ వారు తమని ఎస్టీల్లో చేర్చాలని చేస్తున్న డిమాండ్ ను కుకీ తెగ వారు వ్యతిరేకించడమే ఈ అల్లర్లకు ప్రధాన కారణం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 10 వేల అస్సాం రైఫిల్ బలగాలను మోహరించాయి. ఈ రెండు తెగల మధ్య సమన్వయాన్ని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తగ్గినట్టే తగ్గి... అంతలోనే మళ్ళీ... ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో మళ్ళీ సోమవారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ సుగ్ను, సెరో ప్రాంతంలో బిఎసెఫ్ బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బులెట్ గాయాలయ్యాయి. ఇంకా ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని జూన్ 10 వరకు మరో ఐదు రోజులపాటు పొడిగించింది. -
పెరిగిన పాక్ డ్రోన్ల ముప్పు
చండీగఢ్: పాకిస్తాన్ నుంచి డ్రోన్లు సరిహద్దును దాటి భారత్‌లోని పంజాబ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఇలా వచ్చిన డ్రోన్ల సంఖ్య కేవలం ఏడాదిలోనే నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. 2021లో 67 డ్రోన్లు, 2022లో 254 డ్రోన్లు పాక్ భూభాగం నుంచి పంజాబ్‌లోకి వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో 254 డ్రోన్లు రాగా, వీటిలో 9 డ్రోన్లను బీఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. 13 డ్రోన్లు వివిధ కారణాలతో నేలకూలాయి. పాక్ ముష్కరులు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రితో కూడిన డ్రోన్లను భారత్‌లోకి చేరవేస్తున్నట్లు సైనికాధికారులు చెబుతున్నారు. 2022లో గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో ఉన్న తూర్పు సరిహద్దులో 311 డ్రోన్లను గుర్తించారు. 2020లో 77, 2021లో 104 డ్రోన్లు పట్టుబడ్డాయి. సరిహద్దుల్లో జామింగ్ టెక్నాలజీ లేదా రైఫిల్ ఫైరింగ్ ద్వారా డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కూల్చివేతలో పాల్గొన్న బృందానికి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తున్నామని తెలిపారు. -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
సరిహద్దు భద్రతలో రాష్ట్రాలకూ బాధ్యత
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతలో బీఎస్ఎఫ్తోపాటు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత పంచుకోవాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శనివారం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్లో జరిగిన 25వ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించిన నేపథ్యంలో ఆయా చోట్ల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భేటీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ, ఒడిశా మంత్రి పాల్గొన్నారు. -
దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..
సాధారణ వ్యక్తుల పెద్ద మొత్తంలో మోసపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక వేళ్ల ఎవరైన కాస్త అధికారుల అండదండ ఉన్నాళ్లు అయితే కేసు ముందుకు వెళ్తుంది లేదంటే అంతే పరిస్థితి. సాక్షాత్తు బోర్డర్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ భారీ మొత్తంలో మోసానికి గురయ్యాడు. పాపం ఆయనే ఫిర్యాదు చేసేందుకు తొమ్మిదేళ్లుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. వివరాల్లోకెళ్తే....బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గుప్తాని గురుగ్రామ్‌కి చెందిన ఒక ఐటీ సంస్థ దాదాపు రూ. 5.5 లక్షల మేర మోసం చేసినట్లు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా తెలిపారు. సదరు ఇన్స్పెక్టర్ ఇండోర్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఆయనకి అక్టోబర్7, 2014న గురుగ్రామ్‌లో ఐటీపార్కు నుంచి కాల్ వచ్చిందని, ఆ కంపెనీ ఆయనకు కోట్లలో డబ్బు వస్తుందని ఆశ చూపి సుమారు రూ. 5 లక్షల మేర దోచుకున్నట్లు వెల్లడించారు. దీంతో గుప్తా పలుమార్లు సెబీకి ఫిర్యాదు చేసినట్లు శుక్లా తెలిపారు. రెండేళ్లకు పైగా సెబీతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపగా... గుప్తా పేర్కొన్న పేరుతో ఏ కంపెనీ రిజస్టర్ కాలేదని తెలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత గుప్తా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామనకుంటూ అసలు కుదరలేదని, తొమ్మిదేళ్లు పైగా కేసు నమోదు కాలేదని చెప్పారు. చివరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నెంబర్ సాయంతో ఫిర్యాదు చేయగలిగినట్లు శుక్లా వెల్లడించారు. అయితే ఈ కేసు ఆయనకు కంపెనీకి మధ్య జరిగిన ఫోన్, సోషల్ మీడియా చాట్ల సాయంతో దర్యాప్తు చేయనున్నట్లు సంజయ్ శుక్లా పేర్కొన్నారు. (చదవండి: విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ) -
సరిహద్దుల్లో మారణాయుధాల కలకలం
న్యూఢిల్లీ/జలంధర్: భారత్–పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌లో మంగళవారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) మారణాయుధాలను స్వాదీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్ సెక్టార్లో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్ మెషీన్ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం 10 మేగజీన్లున్న ప్యాకెట్లు ఒక పొలంలో పడి ఉండగా గుర్తించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. వీటిని పాకిస్తాన్ నుంచి తెచ్చారని భావిస్తోంది. మారణాయుధాలను సకాలంలో గుర్తించి సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా నివారించగలిగామని పేర్కొంది. ఇదీ చదవండి: పాకిస్తాన్లోకి బ్రహ్మోస్ క్షిపణులు మిస్‌ఫైర్.. ముగ్గురు వాయుసేన అధికారులపై వేటు -
నూపుర్ శర్మను చంపేందుకు దేశ సరిహద్దు దాటిన పాకిస్థానీ
జైపూర్: నూపుర్ శర్మను హత్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ జాతీయుడ్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో జులై 16న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐబీ సహా ఇతర నిఘా సంస్థల బృందం అతడ్ని విచారిస్తోంది. జులై 16న రాత్రి 11 గంటల సమయంలో హిందుమల్‌కోట్ సరిహద్దు అవుట్‌పోస్టు వద్ద అనుమానాస్పద రీతిలో కన్పించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అతని పేరు రిజ్వాన్ అశ్రఫ్ అని, పాకిస్థాన్‌లోని ఉత్తర పంజాబ్ మండీ బౌహద్దీన్ నగర వాసినని చెప్పాడని వెల్లడించారు. అతని వద్ద 11 అంగుళాల కత్తితో పాటు బ్యాగులో మతానికి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, ఆహారం, మట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను చంపేందుకే తాను దేశం దాటి వచ్చినట్లు రిజ్వాన్ ప్రాథమిక విచారణలో చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడ్ని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు -
సరిహద్దుల్లో బయటపడ్డ సొరంగం
సాంబా: జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగబోయే అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేం దుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గురువారం వెల్లడించింది. సాంబా జిల్లాలో సరిహద్దుల వెంట చాక్ ఫకీరా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 2 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. అందులో 265 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైపులను వెలికితీశామని పేర్కొంది. -
బీఎస్ఎఫ్లో భారీగా కొలువులు.. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి సరిహద్దు రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారికోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్(ట్రేడ్‌మెన్) పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత ► పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ► ఎత్తు: పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మ«ధ్య ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది. చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే.. ఎంపిక ఇలా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ► హైట్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీఈటీ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పురుçషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. రాత పరీక్ష ► పైన టెస్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించే ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ మీద రాయాలి. అంటే.. ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ► రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. జనరల్ అవేర్నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాట్రన్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లిష్/హిందీ.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులు కనీసం 35శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇలా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఖాళీలకు అనుగుణంగా సొంత రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో జనరేట్ అయ్యే ఐడీ, పాస్ట్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సదరు రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది రికార్డు నిమిత్తం భద్రపరుచుకోవాలి. దరఖాస్తును పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కరస్పాండెన్స్ అంతా ఈమెయిల్/ఎస్ఎంఎస్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తప్పులు లేకుండా ఫోన్, మెయిల్ ఐడీ సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ/పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు టెన్త్ సర్టిఫికేట్ అలాగే రెండేళ్ల పని అనుభవానికి సంబంధించి సర్టిఫికేట్, రెసిడెన్సీ, కాస్ట్ సర్టిఫికేట్(అవసరమైతే)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేతనాలు పే మ్యాట్రిక్స్ లెవల్–3 ప్రకారం–నెలకు రూ.21,700–రూ69,100–వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇవేకాకుండా ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 01, 2022 వెబ్సైట్: https://rectt.bsf.gov.in -
అలలపై ఆంబులెన్స్.. ఐడియా అదిరింది
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద ఉన్న చిత్రకొండ జలాశయం దగ్గర బోటు అంబులెన్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్‌కుమార్ సింగ్ హాజరై, బోటు అంబులెన్స్ ఆరంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. ఉదయం బీఎస్ఎఫ్ క్యాంపు ఆవరణలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమం అనంతరం ఇక్కడి ప్రజలకు తమ వంతు సహాయంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం విశేషం. ఇప్పటివరకు జలాశయం మధ్య భూభాగంలోని పనాస్‌పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలాశయం మధ్య గుండా పడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారి జరిగిన పడవ బోల్తా దుర్ఘటనల్లో పలువురు మృత్యువాత పడడం విచారకరం. ఇదంతా గమనించిన బీఎస్ఎఫ్ జవానులు వారి కష్టాలు తీర్చాలని యోచించారు. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ బోటు అంబులెన్స్‌ను ప్రస్తుతం ప్రజా వినియోగంలోకి తీసుకురావడం గమనార్హం. చదవండి: రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే! -
మైండ్‌బ్లోయింగ్ మోటర్ స్టంట్స్.. ‘సీమా భవాని’ గురించి తెలుసా?
సెల్యూట్ టు ప్రెసిడెంట్.. ఫిష్ రైడింగ్.. పీకాక్.. శక్తిమాన్ విండ్ మిల్....మొదలైన విన్యాసాలు ఆహా అనిపిస్తాయి! మనల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. మన చేత ఆగకుండా చప్పట్లు కొట్టిస్తాయి. చలిపులి తోకముడిచి ఎక్కడికో పారిపోతుంది. రిపబ్లిక్ డే పరేడ్ (రాజ్‌పథ్, దిల్లీ) విన్యాసాల్లో ‘సీమ భవాని’ బృందం 350 సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటర్‌సైకిళ్లపై చేసే విన్యాసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పదహారు రకాలైన డేర్ డెవిల్ స్టంట్స్‌తో ఆబాలగోపాలం చేత వహ్వా అనిపిస్తుంది బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో భాగమైన ఈ ఆల్–వుమెన్ యూనిట్. 2016లో మధ్యప్రదేశ్‌లోని టెకన్పూర్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ మోటర్ ట్రాన్స్పోర్ట్ (సీఎస్ఎంటీ)లో ‘సీమ భవానీ’కి అంకురార్పణ జరిగింది. అంతకుముందు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి మహిళలు పాల్గొని తన నైపుణ్యాలను ప్రదర్శించేవారు. 2018తో ఒక అధ్యాయం మొదలైంది... ఆ సంవత్సరం తొలిసారిగా ‘సీమ భవాని’ బృందం చేసిన మైండ్‌బ్లోయింగ్ మోటర్ స్టంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘అపురూపం, అసాధారణం’ అని వేనోళ్ల పొగిడేలా చేశాయి. మొదట్లో ‘సీమ భవాని’లో 27 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 110కి చేరింది. ‘సీమ భవాని’ టీమ్ కోసం 25–30 ఏళ్ల వయసు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఈ టీమ్‌కు ఎంపిక కావడం పెద్ద గౌరవంగా భావిస్తారు. ‘గతంలో ఎక్కడైనా మోటర్ సైకిల్ స్టంట్స్ చూసినప్పుడు కలా? నిజమా? అనుకునేదాన్ని. సీమ భవాని టీమ్ లో నేను భాగం కావడం సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది హిమాన్షు శిర్హోయి. ‘అసాధారణమై బృందానికి ఎంపిక కావడం నా జీవితంలో మరచిపోలేని రోజు. రోజూ ఎన్నో గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నప్పుటికీ కష్టం అనిపించలేదు’ అంటుంది సోనియా భన్వీ. ఈ ఇద్దరూ బీఎస్ఎఫ్లో ఇన్‌స్పెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. 110 మందితో కూడిన ‘సీమ భవానీ’కి కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన జయంతి ఎంపికైంది. బీఎస్ఎఫ్లో గత ఏడేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది జయంతి. పిరమిడ్ ఫార్మేషన్తో సహా కఠినతరమైన ఎన్నో విన్యాసాలలో గత ఏడు నెలలుగా శిక్షణ తీసుకుంది జయంతి. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో నాకు బాగా ఇష్టమైనవి మోటర్‌సైకిల్ విన్యాసాలు. ఎలా చేస్తున్నారో కదా! అని బోలెడు ఆశ్చర్యపోయేవాడిని. ఆ బృందంలో మా అమ్మాయి కూడా భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటున్నాడు జయంతి తండ్రి జయదేవ్ పిళ్లై. నిజానికి ‘సీమ భవాని’ తల్లిదండ్రుల సంతోషమేకాదు యావత్ దేశ సంతోషం. చదవండి: ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం #WATCH | Border Security Force's women contingent 'Seema Bhawani' is set to showcase its stunts at Rajpath on Republic Day parade This is the 2nd time when the Seema Bhawani team will showcase its stunts at Rajpath during the R-Day parade pic.twitter.com/3KzU7Em2EI — ANI (@ANI) January 3, 2022 -
చొరబడేందుకు కాచుకు కూర్చున్నారు
శ్రీనగర్/జమ్మూ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది మిలిటెంట్లు సరిహద్దు అవతల వేచి చూస్తున్నట్టు సమాచారం అందిందని కశ్మీర్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ సోమవారం తెలిపారు. చొరబాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దు వెంబడి గస్తీ పెంచామని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. తాలిబన్ల ముప్పు, అఫ్గానిస్తాన్ నుంచి కశ్మీర్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయనే వార్తలపై స్పందిస్తూ.. ఇప్పటివరకైతే అలాంటి సమాచారమేం లేదన్నారు. అయినా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, నిఘా పెంచామని చెప్పారు. కొంత మంది గైడ్లు నియంత్రణ రేఖ దాటి అవతలివైపునకు వెళ్లారని.. ఇటువైపు వచ్చాక వాళ్లపైన, వాళ్ల కుటంబాలపైనా నిఘా పెడతామన్నారు. యాంటీ డ్రోన్ పద్ధతులు వాడుతున్నాం సరిహద్దులో డ్రోన్ల సమస్య ఉందని, గతేడాది కూడా కొన్ని తమకు కనిపించాయని, అయితే మనవైపు రాలేదని ఐజీ వివరించారు. ఈ ఏడాది యాంటీ డ్రోన్ పద్ధతులను వాడుతున్నామని, డ్రోన్లు కూడా సమకూర్చుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు అవతలివైపు నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పంపేందుకు ప్రయత్నిస్తున్నారని, కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. సరిహద్దుల్లో 2021లో దాదాపు రూ. 88 కోట్ల విలువైన మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ: జమ్మూ ఐజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బోరా చెప్పారు. సరిహద్దు అవతలి నుంచి చొరబాట్లు జరగొచ్చని.. ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేయొచ్చని సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ డ్రోన్ ఎక్సర్సయిజ్లు, టన్నెల్స్‌ను గుర్తించడం ముమ్మరం చేశామన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్తో కలిసి గస్తీ పెంచామని తెలిపారు. వీలైనంత ఎక్కువ మందిని సరిహద్దులో మోహరించామన్నారు. -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
అమిత్ షాను కలుస్తా: శరద్ పవార్
ముంబై: బీఎస్ఎఫ్ వివాదాస్పద ఆదేశంపై కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని భారత భూభాగాలలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కార్యాచరణ అధికార పరిధిని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాను కలవనున్నట్టు పవార్ తెలిపారు. ‘హోం మంత్రి అమిత్ షాను కలవబోతున్నాను. దాని గురించి ఆయన ఆలోచనలను తెలుసుకుంటాను’ అని పవార్ పేర్కొన్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు నుండి పై మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్ల వరకు పనిచేసేందుకు బీఎస్ఎఫ్కు అధికారాలు కల్పించబడతాయి. ఇంతకుముందు ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్ల వరకే ఉండేది. కొత్త ఆర్డర్ వివాదాస్పదంగా ఉందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో సమానంగా బీఎస్ఎఫ్ అధికారాలు ఇచ్చేలా ఉన్న ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే తమ హక్కులకు భంగం కలిగే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కేంద్రం ఆదేశాలను పశ్చిమ బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే తీవ్రవాదం, సరిహద్దు చొరబాటు నేరాలను అదుపు చేయడానికి కొత్త ఆర్డర్ ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో శరద్ పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: కాంగ్రెస్ జోరు పెంచనుందా..? సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు) -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా. .మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్ అధికారులకు, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి. -
వార్షిక నివేదిక వెల్లడించిన బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా శనివారం వార్షిక నివేదికను వెల్లడించారు. గతేడాది సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.2,786 కోట్ల విలువైన 632 కిలోల డ్రగ్స్ పట్టుకున్నామని వెల్లడించారు. 55 తుపాకులు, 4223 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరిహద్దుల్లో 22 మంది చొరబాటుదారులను మట్టుబెట్టామని చెప్పారు. మొత్తం 165 మంది చొరబాటుదారులను అరెస్ట్ చేశామని తెలిపారు. -
సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?
కోల్‌కతా: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎవరినైనా.. ఎక్కడివారినైనా ప్రేమించొచ్చు. ప్రేమ పుట్టడమే అలస్యం.. ప్రేమించిన అమ్మాయి కోసం దేశాలు దాటి వెళ్లడానికి కూడా సిద్దం అవుతున్నారు కొందరు యువకులు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కోసం అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఇటువంటి సంఘటనే భారత్-బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని బల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్రరాయ్ (24)కు ఫేస్బుక్లో బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న సరిహద్దు దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. జూన్ 10వ తేదీన ప్రేయసి పరిణితిని వివాహమాడాడు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ వరకు ఇద్దరూ కలిసి అక్కడే ఉన్నారు. జూన్ 26న చంద్రరాయ్ తన భార్యతో కలిసి సొంతూరుకి బయలుదేరాడు. అయితే, బోర్డర్ దాటించేందుకు ఈ సారి కూడా రాజు మండల్ అనే బ్రోకర్ సాయం తీసుకున్నాడు. బోర్డర్ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్నట్టు బీఎస్ఎఫ్ బలగాలకు పక్కా సమాచారం అందింది. వెంటనే ఆప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ విచారణలో అబ్బాయిది పశ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వీరికి సరిహద్దు దాటేందకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా -
Pakistan Drone: పాకిస్తాన్ మరో కుతంత్రం
జమ్మూకశ్మీర్: భారత్‌పై దాయాది దేశం పాకి స్తాన్ కుట్రలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ డ్రోన్ జార విడిచిన ఏకే–47 తుపాకీ, ఒక పిస్టల్, మరికొంత ఆయుధ సామగ్రిని బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. భారత్–పాక్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ డ్రోన్ పాకిస్తాన్ భూభాగం నుంచే వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం గొప్ప విజయమని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట తాము ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజయంలో పాలుపంచుకున్న సిబ్బందిని అభినందించారు. -
పాక్ పన్నాగం: బయటపడ్డ రహస్య సొరంగం
సాక్షి, న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్తాన్ కుయుక్తి మరోసారి బయటపడింది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఒక సీక్రెట్ సొరంగాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. బీఎస్ఎప్ ఔట్‌పోస్ట్ సమీపంలో బోర్డర్ పోస్ట్ వద్ద 30 అడుగుల లోతైన రహస్య టన్నెల్‌ను గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం ప్రకటించారు. పాకిస్తాన్ మిలిటరీ, దాని ఉగ్రవాదుల సొరంగాలను గుర్తించడం చాలా ముఖ్యమనీ అక్రమ చొరబాట్లకు ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని, తీవ్రవాద నిరోధక అధికారి ఢిల్లీలో చెప్పారు. గత పదిరోజుల్లో రెండు భారీ సొరంగాలను బీఎస్ఎఫ్ గుర్తించిన కావడం గమనార్హం. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన భారీ రహస్య సొరంగాన్ని వినియోగించిందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాదిగా బీఎస్ఎఫ్ పలు సొరంగాలను పసిగట్టి ధ్వంసం చేస్తూ, పాక్ కుయుక్తులను నిర్వీర్యం చేస్తున్నామన్నారు. దీని ద్వారా గత ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తోందని అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖను దాటడం చాలా కష్టమైనప్పుడు, పాక్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎంచుకుంటారని తెలిపారు.2012 నుంచి పాకిస్తాన్ భారత శిబిరాలపై కాల్పులకు తెగ బడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే కొత్త బంకర్‌ను గుర్తించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పూంచ్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారంపై బీఎస్ఎఫ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాద దాక్కున్న స్థావరంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని గుర్తించింది. ముఖ్యంగా ఏకే-47 రైఫిల్, మూడు చైనా తయారు చేసిన పిస్టల్స్, అండర్ బారెల్ గ్రెనేడ్ లాండర్‌తో ఒక రేడియో సెట్‌ను స్వాధీనం చేసుకుంది. -
పాక్ కుట్ర.. భారత్‌లోకి 150 మీటర్ల సొరంగం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ భూభాగంలో నుంచి భారత్‌లోకి 150 మీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు బుధవారం ఉదయం గుర్తించారు. జమ్మూ కశ్మీర్లో ని హిర్నాగర్ సెక్టార్లో ఉన్న బోబి యాన్ గ్రామంలో ఈ సొరంగం వెలుగు చూసినట్లు బీఎస్ఎఫ్ ఐజీ ఎన్ఎస్ జంవాల్ చెప్పారు. ఇది అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న సాంబ, కతువా జిల్లాల్లో గత ఆరు నెలల్లో వెలుగు చూసిన మూడో సొరంగం కావడం గమనార్హం. అలాగే గత పదేళ్లలో ఇది తొమ్మిదవది. తాజా సొరంగం ఉన్న చోట పాక్ వైపు భారీగా లాంచ్పాడ్లు ఉండటంతో పాటు, అది ఉగ్రవాదుల బేస్‌లు ఉన్నాయని జంవాల్ వెల్లడించారు. సొరంగంలో కొన్ని ఇసుక పాకెట్లు దొరికాయని, వాటిపై పాక్ ముద్ర ఉందని అన్నారు. రెండు నుంచి మూడు అడుగల వ్యాసం ఉన్న సొరంగం దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. ఇసుక సంచులపై ఉన్న తయారీ తేదీలను బట్టి సొరంగాన్ని 2016–17 కాలంలో ఏర్పాటు చేసిఉంటారని, దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే గత కొంత కాలంగా ఈ సొరంగం ఉన్న చోట భద్రతా బలగాలు పహారా కాస్తుండడంతో దీన్ని పెద్దగా ఉపయోగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. పాక్ కెప్టెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు -
హిమాచల్‌లో భారీగా కురుస్తున్న మంచు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం రొహ్‌తంగ్‌లో దట్టమైన మంచు కారణంగా అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కొందరు పర్యాటకులు అటల్ టన్నెల్ దాటి లాహౌల్ వైపు వెళ్లారు. సాయంత్రం తీవ్రంగా మంచు కురియడంతో తిరిగి మనాలీ రావడం వీలుపడక అక్కడే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పర్యాటకులతో వస్తున్న వాహనాలు మంచు కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. బీఎస్ఎఫ్ సాయంతో రెండు బస్సులు సహా మొత్తం 70 వాహనాల ద్వారా పర్యాటకులను శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12.33 గంటల వరకు మనాలీకి తరలించడం పూర్తయిందని కుల్లు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. కాగా, టన్నెల్లో పోలీసులు ఓ పర్యాటకుడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్ టన్నెల్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. 10,040 అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లాహౌల్–మనాలీలను కలుపుతుంది. -
కోయి గోలి నహీ చలేగా..
కశ్మీర్: ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యల సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఓ ఉగ్రవాది.. భద్రతా దళాల ముందు లొంగిపోయినట్లు ఆర్మీ శుక్రవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. సరెండర్ సందర్భంగా అధికారులు అతని నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక సైనికుడు, పోరాట భద్రతా సామగ్రిని ధరించి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. ఇక లొంగిపోయిన వ్యక్తిని జహంగీర్ భట్‌గా గుర్తించారు. ఈ సంఘటన ఓ తోటలో జరిగింది. కేవలం ప్యాంట్ మాత్రమే ధరించిన ఉగ్రవాది చేతులు పైకి లేపి, సైనికుడిని సమీపించడం వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా సైనికుడు అతడికి ఎటువంటి హాని జరగదని భరోసా ఇస్తాడు. "కోయి గోలి నహీ చలేగా" (ఎవరూ కాల్పులు జరపవద్దు) అని అతను తన సహచరులకు చెప్పడం వీడియోలో చూడవచ్చు. అనంతరం ఉగ్రవాదిని ఉద్దేశించి ‘కుమారా నీకు ఏమీ జరగదు’ అని చెప్తాడు. అంతేకాక అతడికి మంచినీళ్లు ఇవ్వండి అని మరో సైనికుడిని ఆదేశిస్తాడు. (చదవండి: బీజేపీ సర్పంచ్‌ను కాల్చి చంపారు) ఆర్మీ విడుదల చేసిన మరో వీడియో క్లిప్‌లో.. ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలపడం చూడవచ్చు. ఆ సమయంలో సిబ్బంది "అతన్ని మళ్ళీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వవద్దు" అని జహంగీర్ తండ్రికి సూచిస్తారు. ఈ సందర్భంగా జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. "అక్టోబర్ 13 న, ఒక ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అతడి వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్) తో కనిపించకుండా పోయాయి. అదే రోజు, చాదూరాకు చెందిన జహంగీర్ భట్ తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జరిపిన ఉమ్మడి ఆపరేషన్‌లో అతడిని గుర్తించాము. ప్రోటోకాల్ ప్రకారం, భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్ లొంగిపోయాడు" అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం) "జహంగీర్‌ని కార్నర్ చేసినప్పుడు అతని తండ్రి అక్కడే ఉన్నాడు. భద్రతా దళాలు, అతడి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అతడిని ప్రమాదం నుంచి కాపాడాము. భారత సైన్యం ఉగ్రవాద నియామకాలను నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. యువత ఉగ్రవాదంలో చేరినట్లయితే, వారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. -
సరిహద్దుల్లో స్మగ్లర్ కాల్చివేత
కోల్‌కతా: భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక స్మగ్లర్ మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా గోపాల్‌నగర్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్మగ్లర్ కత్తితో జరిపిన దాడిలో జవాను ఒకరు స్వల్పంగా గాయపడ్డారని బీఎస్ఎఫ్ తెలిపింది. రాత్రి 10 గంటల సమయంలో భారత్, బంగ్లాదేశ్‌లకు చెందిన సుమారు 12 మందితో కూడిన స్మగ్లర్ల బృందం సరిహద్దు కంచెకు సమీపంలో సంచరిస్తున్నట్లు జవాన్లు పసిగట్టారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా తమ వద్ద ఉన్న దగ్గుమందు ఫెన్సిడైల్ బాటిళ్లను కంచె వద్ద పడేసి పరుగు తీశారు. ఒక బంగ్లాదేశీ స్మగ్లర్ మాత్రం జవానుపై కత్తితో దాడి చేశాడు. దీంతో జవాను ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సందర్భంగా మత్తు కోసం వాడే 75 బాటిళ్ల ఫెన్సిడైల్‌తోపాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 14 కేజీల బంగారం మాయం.. -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఏవోబీలో మావోయిస్టు డంప్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన నిర్థిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భద్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని సూధికొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్‌మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు వచ్చిన సమాచారంతో గాలింపులు నిర్వహించామని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు ఆయుధాలు తయారుచేస్తున్నట్లుగా తమకు రూఢీ అయిందని ఆయన తెలిపారు. -
చొరబాటుదారులను కాల్చి చంపిన బీఎస్ఎఫ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలోకి చొరబడాలని ప్రయత్నించిన ఐదుగురును సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి దుండగులు ప్రయత్నించారు. ఇంతవరకు ఇలా ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని ఇంత సంఖ్యలో కాల్చిచంపడం ఇదే ప్రధమం. ఇక దీని గురించి బీఎస్ఎఫ్ అధికారులు మాట్లాడుతూ, ‘103వ బీఎస్ఎఫ్ ట్రూప్ సరిహద్దులో అనుమానాస్పద కదలికలను గుర్తించింది. వారిని దేశంలోకి ప్రవేశించకుండా అక్కడే ఆగమని ఆదేశించగా వారు బీఎస్ఎఫ్ ట్రూప్‌పై కాల్పులు జరిపారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో 5గురు మరణించారు. దుండగులు పొడుగాటి గడ్డి మోపులను అడ్డుపెట్టుకొని దేశంలోకి ప్రవేశించాలని చూశారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 4:45 గంటల ప్రాంతంలో జరిగింది’ అని తెలిపారు. బీఎస్ఎఫ్ అధికారులు వారి వద్ద నుంచి ఒక ఏకే-47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్ -
బీఎస్ఎఫ్ డీజీగా రాకేష్ ఆస్థాన నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్ధానా సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆస్ధానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆస్ధానా 2021 జులై 31 వరకూ బీఎస్ఎఫ్ డీజీగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆయన విచారించారు. ఇక 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి.ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి. కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదిర్శిగా కౌముది కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఏపీ క్యాడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కౌముది నియమితులయ్యారు. కౌముది ప్రస్తుతం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇక యూపీ క్యాడర్‌కు చెందిన ఆయన బ్యాచ్‌మేట్ మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట -
పాకిస్తాన్ డ్రోన్ కలకలం : కూల్చివేత
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారం సీల్ చేశారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రావటంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనం లోధి రహదారిలోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉంది. ఇక బీఎస్ఎఫ్ కార్యాలయ భవనానికి శానిటైజేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బందితో కాంటాక్టు అయిన వారిని ట్రేస్ చేస్తున్నామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. (అస్సాంలో వెలుగుచూసిన స్పానిష్ ఫ్లూ) ఇక 126 బెటాలియన్‌కి చెందని 25 మంది బీఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 56 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో త్రిపుర రాష్ట్రానికి చెందన వారు 14 మంది, ఢిల్లీకి చెందిన వారు 43 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మే 3న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ రావటంతో సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్నిమూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటివకు సీఆర్పీఎఫ్లో 137 పాజిటివ్ కేసులు ఉండగా, ఒకరు మృతి చెందారు. మరో వైపు సీఐఎస్ఎఫ్లో కూడా తొమ్మిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. -
షాకింగ్ : కరోనా బారిన 25 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశ రాజధానిని వణికిస్తోంది. ఢిల్లీలో ఆదివారం 25 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలో పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బందిలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 42కు పెరిగింది. కాగా ఢిల్లీలో లాక్డౌన్ విధుల్లో ఉన్న 122 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 3738కి చేరగా 61 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 40,263కు ఎగబాకగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1306కు పెరిగింది. మరోవైపు సోమవారం నుంచి దేశమంతటా రెడ్జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో పలు నియంత్రణలతో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు. చదవండి : కరోనా యోధులకు గౌరవ వందనం -
కశ్మీర్లో మంచుఖండాల భీబత్సం : నలుగురు సైనికులు మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో గడిచిన 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ముంచుకొచ్చిన మంచుఖండాలతో నలుగురు బీఎస్ఎఫ్ సైనికులు మరణించారు. బండిపార జిల్లా గురెజ్, రాంపురా, కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఆవరించి అనూహ్యంగా మంచుఖండాలు ముంచెత్తడంతో విధి నిర్వహణలో నిమగ్నమైన సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మచిల్‌లో విధినిర్వహణలో ఉన్న నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. గుల్మార్గ్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనిక జవాన్ మంచుకొండల్లోకి జారిపడటంతో గల్లంతయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లంతైన జవాన్‌ను హవాల్ధర్ రాజేంద్ర సింగ్ నేగిగా గుర్తించారు. గల్లంతైన జవాన్లను కాపాడేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
భారత భూభాగంలో పాక్ డ్రోన్..
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను మంగళవారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. హుస్సేనివాలా చెక్‌పోస్ట్ సమీపంలోని హెచ్‌కే టవర్ వద్ద ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ పసిగట్టింది. ఈ డ్రోన్ భారత్ భూభాగంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఐదు సార్లు భిన్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్కు కనిపించింది. పాక్ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మందులు, ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు సాక్కు చెందిన ఉగ్రవాద గ్రూపులు ఈ డ్రోన్‌ను ఉపయోగించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా సరిహద్దు వెంట ఆయుధాలు జారవిడించేందుకు ఉపయోగిస్తున్న రెండు డ్రోన్లను ఇటీవల పంజాబ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం విశేషం. -
రాజస్థాన్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
జైపూర్ : గూఢచర్యం చేసేందుకు పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది రాజస్తాన్‌లోని బర్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతని పేరు కిషోర్ అని, పాకిస్తాన్‌కు చెందిన వాడిగా గుర్తించామని తెలిపారు. బీఎస్ఎఫ్, భారత ఆర్మీ కార్యకలాపాలపై కీలక సమాచారం తెలుసుకునేందుకు తన మేనమామే తనను భారత్‌కు పంపినట్లు సదరు వ్యక్తి వెల్లడించినట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ అతడు చొరబడినట్లు బీఎస్ఎఫ్ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లోని ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చానని.. అక్కడి నుంచి తాను సరిహద్దు దాటేందుకు పాక్ ఆర్మీ తనకు సాయపడిందని విచారణలో తెలిపాడు. మూడు రోజుల పాటు అతడిని విచారించారు. దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మారుస్తుండడంతో తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. కాగా సెస్టెంబర్ మొదటివారంలో కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకొని విచారించగా లష్కరే-ఇ-తొయిబాకు చెందిన 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐ)తో కలిసి పాక్ ఆర్మీ ఎల్వోసీ వద్ద దాడులకు తెగబడేందుకు 12కు పైగా లాంచింగ్ ప్యాడ్స్‌తో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
సీఏపీఎఫ్ రిటైర్మెంట్ @ 60 ఏళ్లు
న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ బలగాల్లో కానిస్టేబుల్ నుంచి కమాండెంట్ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమాన హోదా) స్థాయి వరకు ఉన్న నాలుగు కేంద్ర బలగాల అధికారులు (సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, సహస్త్ర సీమా బల్) ఇకపై 57 ఏళ్లకు బదులుగా 60 ఏళ్లకు పదవీ విరమణ చేయనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) నుంచి అత్యున్నత ర్యాంకు డైరెక్టర్ జనరల్(డీజీ) వరకు ఉన్న ఈ నాలుగు బలగాల అధికారుల రిటైర్మెంట్ వయస్సు కూడా ఇకపై 60 ఏళ్లే. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ బలగాలకు చెందిన అన్ని స్థాయిల అధికారులకు 60 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండగా తమకు మాత్రమే 57 ఏళ్లను రిటైర్మెంట్ వయస్సుగా నిర్ణయించటం వివక్ష చూపడమేనంటూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం.. ఇలా వేర్వేరు పదవీ విరమణ వయస్సులను నిర్ధారించడం ‘రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితం’ అని, బలగాల మధ్య అంతరం చూపడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని సవరించాలని జనవరిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా బలగాలను ఆదేశిస్తూ సోమవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా రిటైరై ఉంటే అలాంటి వారు తాము పొందిన రిటైర్మెంట్ ప్రయోజనాలను వాపసు చేసి తిరిగి విధుల్లో చేరవచ్చనీ లేదా 60 ఏళ్లు వచ్చే వరకు విధుల్లో కొనసాగి, రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకోవచ్చని తెలిపింది. రిటైరైన తర్వాత న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారు, స్టే పొందిన కూడా 60 ఏళ్లు వచ్చే దాకా తమ విధుల్లో కొనసాగవచ్చని కూడా స్పష్టత ఇచ్చింది. ఈ నాలుగు బలగాలకు చెందిన కమాండెంట్ స్థాయి దిగువ హోదా వారికి ఏడో వేతన సంఘం కమిషన్ సిఫారసులు సీఐఎస్ఎఫ్ మాదిరిగానే వర్తిస్తాయని పేర్కొంది. అయితే, తక్షణం కార్యక్షేత్రం దూకాల్సిన అవసరం ఉండే సీఆర్పీఎఫ్ వంటి బలగాల అధికారుల ఫిట్నెస్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి సీఏపీఎఫ్ నాయకత్వం తెలిపింది. -
మోదీ ముఖం మాడింది
పతారియా/జటారా: సార్వత్రిక ఎన్నికలు సగం పూర్తయ్యే సరికే ప్రధాని మోదీకి ఓడిపోతున్నామనే విషయం అర్థమైందని, దీంతో మోదీ ముఖం మాడిపోయిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ నివాసం ఉండే ఇంటి ముందు నిల్చుని చౌకీదార్ అని ఎవరైనా అరిస్తే.. ఆ ఇంటికి కాపలా ఉండే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం చోర్ అంటూ అరుస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో 15 మంది బడా వ్యక్తులకు చెందిన రూ.5.55 లక్షల కోట్ల రుణాన్ని మోదీ మాఫీ చేసిన విషయం దేశం మొత్తానికి తెలుసని విమర్శించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని తికమ్గఢ్ జిల్లాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్నపుడు బుందేల్‌ఖండ్ అభివృద్ధి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.3,800 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని, అయినా అభివృద్ధి జరగలేదన్నారు. ఏడాదిలో 22 లక్షల ఉద్యోగాలు.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యువత కోసం ఖాళీగా ఉన్న 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. భయం, ఆందోళనలో మోదీ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే యువతకు మొదటి మూడేళ్లు ఎటువంటి అనుమతులు తీసుకోనవసరం లేకుండా చేస్తామని వెల్లడించారు. -
పోలింగ్ కేంద్రం వద్ద గాల్లోకి కాల్పులు
లక్నో: పోలింగ్ కేంద్రంలో చెలరేగిన ఘర్షణను తగ్గించడానికి సరిహద్దు భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా షమ్లీ జిల్లా గుర్జాన్ గ్రామంలోని గురువారం పోలింగ్ జరిగింది. పోలింగ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. ఓటరు ఐడీ లేకపోయినప్పటికీ వారు ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులకు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే ఈ గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాలిలో 5 రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన అనంతరం అక్కడ పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. పోలింగ్ అధికార్లకు, ఆందోళనకారుల మధ్య వివాదం చాలసేపటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతుండటంతోనే బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. -
అమర జవానుకు అశ్రునివాళి
సాక్షి, రామచంద్రపురం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన శీలం రామకృష్ణ (30) వీరమరణం పొందారు. ఆయ న మృతదేహాన్ని బీఎస్ఎఫ్ నేతృత్వంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పట్టణంలోని శీలంవారి సావరంలో ఉన్న ఆయన ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన ఆయన మృతదేహాన్ని పట్టణ వాసులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలకు గౌరవ సూచకంగా జవాన్లు గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి, వందనం సమర్పించారు. విశాఖపట్నం, కాకినాడ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు రామకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వీర జవాను రామకృష్ణ మృతదేహం ఇంటికి చేరుకోగానే భార్య సౌందర్య, ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బీఎస్ఎఫ్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రామకృష్ణకు 2016లో సౌందర్యతో వివాహం జరిగింది. ఇటీవల ఇంటికి వచ్చిన రామకృష్ణ మాటల సందర్భంగా తన మామయ్యతో ‘‘నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దురుగాని’’ అని అన్నారు. రామకృష్ణ అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజల్ని చూసి.. ఆ మాటలే గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముని గిపోయారు. ఆర్డీఓ ఎన్.రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్సై ఎస్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్మశాన వాటికలో రామకృష్ణ మృతదేహానికి వైఎస్సార్ సీపీ రామచంద్రపురం ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు శ్రద్ధాంజలి ఘటించి, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు జవాన్లు మృతి
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందరాజ్ మాట్లాడుతూ.. 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కాల్పులకు దిగిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నమని ఆయన తెలిపారు. -
పాకిస్తాన్ మరో దురాగతం...
పంజాబ్ : భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న మరో దురాగతం వెల్లడైంది. ఫిరోజ్పూర్లో బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద రెక్కీ నిర్వహించిన పాక్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ పోస్ట్ ఫోటోలు తీసేందుకు గూఢచారి ప్రయత్నించాడు. యూపీలోని మొరదాబాద్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న అనుమానితుడి నుంచి పాకిస్తాన్‌కు చెందిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డును బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ నెంబర్ 8 పాక్ గ్రూప్‌లతో యాడ్ అయి ఉండగా, మరో ఆరు పాకిస్తాన్ ఫోన్ నెంబర్లను కూడా అధికారులు అతడి నుంచి గుర్తించారు. కాగా, సరిహద్దుల వద్ద భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ పోస్ట్‌ల వద్ద అనుమానితుడి రెక్కీ కలకలం రేపింది. -
2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు. జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్‌గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. -
చొరబాటుదారుడిపై బీఎస్ఎఫ్ కరుణ
జమ్మూ: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి తుపాకీ కాల్పులకు గాయపడిన యువకుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్‌లోని భోల్లియన్ డా కొథే గ్రామానికి చెందిన ఫరూఖ్ అహ్మద్ సైనికులు హెచ్చరిస్తున్నా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. దీంతో సైనికులు అతనిపై కాల్పులు జరపగా బుల్లెట్ తగిలి పడిపోయాడు. చనిపోయాడని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సిబ్బంది.. అతను బతికే ఉండటంతో వైద్యశాలకు తరలించారు. అతని వద్ద ఆయుధాలు లభించలేదనీ, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
సరిహద్దులో నకిలీ కరెన్సీ.. ఒకరు అరెస్ట్
కోల్‌కతా : బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మాల్దాలో సబ్దల్ పూర్లోని సరిహద్దు చెక్ పోస్టు వద్ద 24వ బెటాలియన్ బీఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రూ.4,76,000 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు. -
19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు. -
వియ్ కెన్
మార్చి 2017. గ్వాలియర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలో రైజింగ్ డే పెరేడ్ జరుగుతోంది. శిక్షణ పొందిన 67 మంది ట్రైనీ ఆఫీసర్లకు ర్యాంకు స్టార్లను ప్రదానం చేస్తున్నారు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వారిలో 66 మంది అబ్బాయిలు, ఒకే ఒక్క అమ్మాయి.. తనుశ్రీ పారీక్! ఇండియన్ ఆర్మీ చరిత్రలో తనుశ్రీది ఒక మైలురాయి. అర్ధశతాబ్దం దాటిన భారత ఆర్మీలో ఒక మహిళ కంబాట్ ఆఫీసర్‌గా నియామకం కావడం ఆమెతోనే మొదలు. అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ఆర్మీలోకి వచ్చిన తొలి యువతి తనుశ్రీ. రెండున్నర లక్షల సైనిక దళానికి ఆమె అధికారి. మళ్లీ ఇప్పుడొకసారి ఆమె గురించి దేశమంతా చెప్పుకుంది. డ్రగ్ మాఫియా నిర్మూలన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న తనుశ్రీ.. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఆడపిల్లల్లో చైతన్యం తీసుకువస్తోంది. తనుశ్రీ రాజస్థాన్ అమ్మాయి. తండ్రి డాక్టర్ ఎస్పీ జోషి బికనీర్ వెటర్నరీ యూనివర్శిటీలో పారాసైటాలజీ ప్రొఫెసర్. తల్లి గృహిణి. తనుశ్రీ బికనీర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ చేసింది. సాఫ్ట్వేర్ రంగం పరిచిన రెడ్ కార్పెట్‌ను కాదని ఆమె ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అడుగుపెట్టడానికి తగిన కారణాలే ఉన్నాయి. ఆమె ఎన్సీసీ క్యాడెట్. ఫైరింగ్, హార్స్ రైడింగ్, పైలటింగ్, క్యాంపింగ్లలో చురుగ్గా పాల్గొనేది. అందుకే రక్షణరంగం మీద ఆసక్తి, యూనిఫామ్ మీద వ్యామోహం కలిగాయి తనకు. అమ్మాయిలే కనిపించలేదు ‘‘2013లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లయ్ చేశాను. ప్రిపేరయ్యాను. కానీ లిస్ట్‌లో పేరు చూసుకునే వరకు నేను మాత్రమే మహిళను అనే సంగతి తెలియదు’’ అని నవ్వుతూ అంటుంది తనుశ్రీ. క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మొత్తం 16 వేల మంది.. బ్యాచ్‌మేట్స్ నుంచి, శిక్షణ ఇచ్చే అధికారుల వరకు అంతా మగవాళ్లే. మహిళలు కనిపించారు అంటే వాళ్లు అధికారుల కుటుంబ సభ్యులే. అప్పుడనిపించింది నేను తీసుకున్న బాధ్యత చిన్నది కాదని. కష్టకాలమూ ఉంది తనుశ్రీ పారిక్తోపాటు శిక్షణ తీసుకున్న వారిలో రెండు నెలలకే మానుకున్న వాళ్లూ ఉన్నారు. ఆ ప్రభావం తనుశ్రీని కూడా ఆవరించింది. తండ్రికి ఫోన్ చేసి బోరున ఏడ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నదామె. ‘‘మిలటరీ శిక్షణ కఠినంగానే ఉంటుంది. దేహం ఎండకు ఎండిపోయింది. రంగు మారడమే కాదు, చర్మం పొడిబారి గరుకు తేలింది. జుట్టు పెళుసుబారింది. ఒకరోజు అద్దంలో తేరిపార చూసుకుంటే.. నా రూపం చూసి నాకే భయమేసింది. నేనలా డీలాగా ఉన్న సమయంలో వచ్చింది నాన్న నుంచి ఫోన్. ‘ఎలా ఉన్నావు బేటా’ అనే ఆత్మీయమైన పలకరింపుతో కదిలిపోయాను. పెద్దగా ఏడ్చేశాను. ‘నాన్నా నేనిక్కడ రోజంతా కోతిలాగ దూకుతూ ఉన్నాను. నాతోపాటు బీటెక్ చేసిన వాళ్లు సౌకర్యవంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నేను ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చానా’ అని చాలా బాధపడ్డాను’’ అని చెప్పి నవ్వుతోందిప్పుడు. సమానంగా సాధించింది తనుశ్రీ మగవాళ్లతో తీసిపోకుండా ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అంతటి కఠోర శ్రమకు ప్రతిఫలంగా ఆమె 52 వారాల శిక్షణ తర్వాత బ్యాచ్‌లో రెండవ స్థానంలో నిలిచింది. డ్రిల్, ఆల్‌రౌండ్ బెస్ట్ ట్రైనీ, పబ్లిక్ స్పీకింగ్‌లలో అవార్డులందుకుంది. ‘అమ్మాయిని కాబట్టి వెసులుబాటు కల్పించండి’ అని అడగలేదు. ‘‘అలా వెసులుబాటు తీసుకుని ఉంటే నా మీద ‘తొలి మహిళాధికారి అయితే వచ్చింది కానీ, ఆమె పరీక్ష కూడా సరిగ్గా చేయలేదు’ అనే ముద్రను జీవితకాలమంతా మోయాల్సి వస్తుంది. నేను తొలి మహిళాధికారిని అనే ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ, ఆ మాటకు ట్యాగ్‌లైన్ గా వ్యంగ్యోక్తి కూడా భరించాలి కదా. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కూడా మహిళలు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా విధులు నిర్వర్తించగలరు అని చెప్పదలుచుకున్నాను. మహిళలు చేయగలరని నిరూపించాను కూడా’’ అంటోంది తనుశ్రీ. మత్తు మీద తూటా ఉద్యోగంలో చేరాక పంజాబ్ రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న మత్తుమందు మాఫియాను నిర్మూలించే బాధ్యత చేపట్టింది తనుశ్రీ. పరిస్థితి తీవ్రతను అంచనా వేయడానికి సరిహద్దు గ్రామాల్లో పర్యటించింది. మగవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు అనే తేడా ఏమీ లేదు, మహిళలకు, ఆడపిల్లలు కూడా మత్తు మందుకు బానిసలై ఉన్నారని తెలిసింది. పాకిస్థాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌లోకి వస్తున్న మత్తుమందును నిరోధించడానికి ఇరవై నాలుగ్గంటలూ కాపు కాసిందామె. బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగంలో ఇది యుద్ధసమయం, ఇది శాంతి సమయం అనే తేడా ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కశ్మీర్, గుజరాత్, పంజాబ్... ఒక్కో చోట ఒక్కో రకమైన సమస్యతో యుద్ధం చేయాలి. ఈ రోజువారీ యుద్ధాలు చేస్తూ వారాంతాల్లో గ్రామాల్లో పర్యటిçస్తుంటుంది తనుశ్రీ. స్టార్ క్యాంపెయిన్ ‘అసలే ఆడపిల్లవు, విధి నిర్వహణలో చనిపోతే’ అని ప్రేమతో కూడిన భయంతో ఆదుర్దాగా అడిగిన వాళ్లకు తనుశ్రీ చెప్పే సమాధానం ఒక్కటే. ‘మరణాన్ని గౌరవించాలి తప్ప, మరణానికి భయపడకూడదు. మరణం ఎప్పుడు వచ్చినా స్వాగతించాల్సిందే. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు పోవడం అంటే... అది సైనికుల గౌరవాన్ని పతాక స్థాయికి చేర్చే మరణం’ అంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే ఆమెను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించడం మరొక పెద్ద బాధ్యత. ‘ఆడపిల్లలను గర్భంలోనే చంపేయకండి, బతికి భూమ్మీదకు రానివ్వండి. వారిని వివక్షకు గురి చేయకుండా చదివించి ప్రయోజకులను చేయండి’ అని పెద్ద పెద్ద స్టార్లతో చెప్పించకుండా ఒక భద్రతాధికారి చేత చెప్పించడం వెనుక పెద్ద ఆంతర్యమే ఉంది. తనుశ్రీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చెప్తుంటుంది. ఆమె చెప్పిన విషయాల కంటే ఆమెను చూడటం ద్వారా ఆడపిల్లల్లో కలిగే చైతన్యం గొప్పది. తమలాంటి ఒకమ్మాయి ఇంత పెద్ద హోదాలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తోంది అనే భావనే చైతన్య పరుస్తోంది. మహిళలు ఇంకా వస్తారు తనుశ్రీ పారీక్ ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పే మాట ఒక్కటే... ‘‘అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా పెంచండి. ఇద్దరూ సమానమే అనే భావన ఇంటి నుంచే మొదలు కావాలి. అప్పుడే వాళ్లు వేధింపులకు భయపడరు. అమ్మాయి ధైర్యంగా కనిపిస్తే, ఆమెను వేధించడానికి అబ్బాయిలు భయపడతారు. ఆడపిల్లల్లో తాము ఎందులోనూ తక్కువ కాదు అనే విశ్వాసాన్ని పాదు కొల్పగలిగితే చాలు. ఆ పైన వాళ్ల ఆలోచలు, ఆశయాలు ఆకాంక్షలు, లక్ష్యాలకు ఆకాశమే హద్దవుతుంది’’ అని. బరువు తగ్గడమే పెద్ద పరీక్ష తనుశ్రీకి సిఎపిఎఫ్ పరీక్ష కంటే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టే అసలైన పరీక్షగా మారింది. ‘‘అప్పటి వరకు సీరియెస్‌గా వర్కవుట్స్, ఎక్సర్సైజ్లు చేసింది లేదు. రిటెన్ టెస్ట్ తర్వాత పిఈటీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పరుగెత్తేదాన్ని. లాంగ్‌జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేశాను. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నాను. జీఎమ్ డైట్‌తో నెలలో ఏడు కిలోలు తగ్గాను. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లలేదు. నాచురల్ ఎక్సర్‌సైజ్‌తోనే ఫిట్నెస్ వచ్చింది’’. తండ్రి మాటలే ధైర్యవచనాలు ‘‘రక్షణ రంగం ఉద్యోగాలు మహిళలకు సాధ్యం కావనే ఉద్దేశంతో చాలాకాలం అవకాశాలు రాలేదు. అవకాశం తలుపు తెరుచుకుందిప్పుడు. నువ్వు సాధించి చూపిస్తే ఇప్పటి వరకు మహిళల పట్ల స్థిరపడి ఉన్న అభిప్రాయం తప్పు అని రుజువవుతుంది. నువ్వు వెనక్కి వస్తే మహిళలకు ఇది అసాధ్యమైన పని, అవకాశం ఇచ్చినా మనలేరు అనడానికి నువ్వు కూడా ఒక కారణం అవుతావు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా బిడ్డ సంతోషంగా జీవించడమే నాక్కావలసింది. అయితే నువ్వు నీ తర్వాత ఈ ఉద్యోగాల్లోకి వచ్చే అమ్మాయిలకు ఉదాహరణగా నిలుస్తావు. ఆ నిర్ణయం ఏదయినా సరే’’ అన్నారాయన. తనుశ్రీలో కసి మొదలైన క్షణాలవి. మగవాళ్లు సగంలో వెళ్లిపోతే... ‘ఆ వెళ్లిపోయిన వాళ్లలో మానసిక దృఢత్వం లేదు, అందుకే వెళ్లిపోయారు’ అంటారు. ఒక మహిళ వెనక్కి వెళ్లిపోతే మాత్రం ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగాలు చేయలేరు, అందుకే ఆమె వెళ్లిపోయింది’ అంటారు. నేను వేసిన అడుగు నా తరవాతి వారికి రహదారి కావాలి తప్ప, నా కారణంగా దారి మూసుకుపోకూడదు. రక్షణ రంగంలో కొనసాగి తీరాల్సిందే. ఈ నిర్ణయం నా ఒక్క జీవితం కోసం కాదు, నా కుటుంబం కోసమూ కాదు. ఇది మహిళల కోసం’ అనుకుంది తనుశ్రీ. భయం పోగొట్టాలి ‘‘బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం కోసం చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న స్కూళ్లకు వెళ్లాను. అక్కడ అమ్మాయిల్లో తెలివితేటలున్నా, నోరు విప్పే ధైర్యం ఉండటం లేదు. కొత్త వాళ్ల ముందుకు రావడానికే బిగుసుకుపోతున్నారు. వాళ్ల ఇళ్లలో ఆడపిల్లలను మగవాళ్ల ముందు నోరు తెరవనివ్వరని తెలిసింది. ఈ ప్రచారం ఇంకా విస్తృతంగా చేయాల్సి ఉందని వాళ్లతో మాట్లాడిన తర్వాతే తెలిసింది. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులైన కుటుంబాల్లో వివక్ష ఎక్కువగా కనిపిస్తోంది. దేశమంతటా ఈ తరం పిల్లలందరినీ చదివిస్తే చాలు. ఇరవై ఏళ్లకు ఇప్పటి బాలతరం యువతరం అవుతుంది. ఇక చదివించమని చెప్పాల్సిన అవసరం ఉండదు’’. – తనుశ్రీ పారీక్, అసిస్టెంట్ కమాండెంట్, బిఎస్ఎఫ్ – వాకా మంజులారెడ్డి -
బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీలకు కొత్త చీఫ్‌లు
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లకు కొత్త అధిపతులను కేంద్రం గురువారం నియమించింది. 1984 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రజినీకాంత్ మిశ్రా బీఎస్ఎఫ్కు చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎస్ఎస్బీ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుత బీఎస్ఎఫ్ చీఫ్ కేకే శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందనుండటంతో ఆ స్థానాన్ని మిశ్రా భర్తీ చేసి, పదవీ విరమణ వరకు (2019 ఆగస్టు) కొనసాగనున్నారు. 1984 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ దేశ్వాల్ మిశ్రా స్థానంలో ఎస్ఎస్బీ చీఫ్‌గా నియమితులై, పదవీ విరమణ పొందే వరకు (2021 ఆగస్టు) కొనసాగుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది, నేపాల్ సరిహద్దులో ఎస్ఎస్బీ సిబ్బంది కాపలాగా ఉంటుడటం తెలిసిందే. -
పాక్ దొంగదెబ్బ.. ఐదుగురి మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్‌లోని అక్నూర్లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వీకే పాండే (27), ఏఎస్ఐ ఎస్ఎన్ యాదవ్ (48) సహా ముగ్గురు పౌరులు మృతి చెందారనీ పరగ్వాల్ చెక్ పోస్ట్ ఇన్చార్జ్ బ్రిజిలాల్ శర్మ తెలిపారు. ప్రతిగా భారత బలగాలు దాడులు ప్రారంభించాయని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరగ్వాల్ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్ చెప్పారు. సరిహద్దుల్లోని భద్రతపై కట్టుదిట్టమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుందామని పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. మే 29న భారత్‌కు పిలుపునివ్వడం గమనార్హం. కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పిలుపుపై భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే, ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా చేస్తోంది. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద పాక్స్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులోని ఎల్ఓసి వద్ద బీఎస్ఎఫ్ స్థావరాలపై పాక్ సోమవారం కాల్పులకు దిగింది. కాల్పుల ప్రభావం సరిహద్దులోని రెండు గ్రామాలపై ఉంటుందని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నందున కశ్మీర్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాక్ సరిహద్దులోని ఆర్నియా, ఆర్ఎస్ పుర, రాంగఢ్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పాక్ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టారని, పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందువల్ల ప్రతీకారం తీర్చుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఎల్ఓసీ సరిహద్దులోని ఆఖ్కూనూర్లో ఎనిమిది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోగా, ఆర్నియా సెక్టార్లో ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం పాక్ దళాలు కాల్పులకు పాల్పడటంతో వేగంగా స్పందించిన భద్రత దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టన విషయం తెలిసిందే. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నట్లు వెన్నకి తగ్గిన పాక్, సోమవారం మరోసారి రెచ్చిపోయి దాడులకు పాల్పడింది. పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏవిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందో 19 సెకన్ల థర్మల్ ఇమేజరీ ఫుటేజ్‌ను బీఎస్ఎఫ్ అధికారులు విడుదల చేశారు. కాగా ఏడాది సమయంలో పాక్ ఎల్ఓసి వద్ద 700 సార్లు దాడులకు పాల్పడిందని, 38 పౌరులు, 18 మంది భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారని ఆర్మీ ఈ అధికారులు తెలిపారు. -
‘బీటింగ్ రిట్రీట్’లో పాక్ క్రికెటర్ అతి
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య అట్టారి–వాఘా సరిహద్దులో నిర్వహించే జెండా అవనత కార్యక్రమం ‘బీటింగ్ రిట్రీట్’ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శనివారం బీటింగ్ రిట్రీట్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి పాక్ రేంజర్లు కవాతు చేస్తున్న చోటుకు దూసుకొచ్చిన అలీ.. భారత అభిమానుల వైపు తిరిగి తొడలు చరుస్తూ, రెండు చేతులు గాల్లోకి లేపి వికెట్లు తీసినట్లు సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మరో వ్యక్తి అతడిని వెనక్కు తీసుకెళ్లాడు. దీంతో ఈ ఘటనపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై బీఎస్ఎఫ్ ఐజీ(పంజాబ్ ఫ్రాంటియర్) ముకుల్ గోయల్ మాట్లాడుతూ..‘ అలీ చర్య బీటింగ్ రిట్రీట్కున్న గౌరవాన్ని దెబ్బతీసింది. ఇరుదేశాల పౌరులు గ్యాలరీలో కూర్చొని ఎలాంటి సంజ్ఞలనైనా చేయొచ్చు. కానీ కవాతు మధ్యలోకి ఇలా రావడానికి వీల్లేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ రేంజర్లకు మా నిరసన తెలియజేస్తాం’ అని వెల్లడించారు. అలీ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్వీటర్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
పాక్ యువ క్రికెటర్‌పై భారత సైన్యం ఆగ్రహం
-
పాక్ క్రికెటర్ చేష్టలు.. భగ్గుమన్న భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ యువ క్రికెటర్ హసన్ అలీపై భారత సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. అట్టరీ-వాఘా సరిహద్దులో భారత్-పాక్ దళాల బీటింగ్ రిట్రీట్ సమయంలో హసన్ చేసిన నిర్వాకమే ఇందుకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం భారత్ తరపున బీఎస్ఎఫ్.. పాక్ తరపున రేంజర్లు రెచ్చగొట్టే సంజ్ఞలతో అక్కడ హాజరయ్యే ఇరు దేశాల ప్రజలను అలరిస్తుంటారు. ఆనవాయితీగా జరిగే ఈ ప్రదర్శన మధ్యలో ఎవరూ రావటానికి వీల్లేదు. కానీ, పాక్ క్రికెటర్ హసన్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. గ్యాలరీ నుంచి లేచి వచ్చి పరుగు పరుగున మధ్యలో నిల్చుని వికెట్లు తీసే సమయంలో చేసే తన మార్క్ సంజ్ఞను ప్రదర్శించాడు. అయితే ఈ క్రమంలో అతను బీఎస్ఎఫ్ దళాలు, భారతీయుల ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ రెచ్చగొట్టే చేష్టలు చేశాడు. ఈ చర్యలపై భారత సైన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘ఇలాంటి చర్యలను మేం ఉపేక్షించబోం. పెరేడ్ తర్వాత ఎవరూ ఇలాంటి చేష్టలు చేసినా మేం పట్టించుకునేవాళ్లం కాదు. కానీ, మధ్యలో వచ్చి ఇలా రెచ్చిపోవటం ముమ్మాటికీ ఖండించదగ్గ అంశమే. ఈ మేరకు హసన్‌తో క్షమాపణలు చెప్పించాలని.. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని పాక్ సైన్యానికి లేఖ రాశాం’ అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అఫ్రిది.. నువ్వు ఎక్కడ పుట్టావ్? అయితే పాక్ సైన్యం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా నోరు మెదపలేదు. మరోపక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం తమ ఆటగాళ్లు వాఘాను సందర్శించిన ఫోటోలను ట్వీటర్లో పోస్టు చేయగా.. డాన్ పత్రిక హసన్ చేసిన పనిని కొనియాడుతూ ఓ కథనం ప్రచురించింది. బీటింగ్ రిట్రీట్ గురించి... ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది. -
ఇండో పాక్ బోర్డర్ మధ్యలో కోబ్రా తీగలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా పహారా కాసే సైనికులకు తోడ్పాటుగా భారత్ పాక్ సరిహద్దులోని హిందూమల్కోట్ ప్రాంతంలో గల బీఎస్ఎఫ్ పోస్టులో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. రాజస్థాన్‌లో ఉన్న హిందూమల్కోట్ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతం. శత్రువులు దేశంలోకి చొరబడకుండా బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ కాస్తుంటారు. డాగ్ స్వ్కాడ్ కూడా గస్తీలో పాల్గొంటుంది. తాజాగా ఈ ప్రాంతంలో హ్యాండ్ హ్యాండిల్ థర్మల్ ఇమేజర్(హెచ్‌హెచ్‌టీఈ)ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రసారమయ్యే పరారుణ కిరణాలు శత్రువుల రాకను మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలవు. సూర్యాస్తమయ సమయం అనంతరం హెచ్‌హెచ్‌టీఈ భద్రతకు దన్నుగా నిలుస్తుంది. దీంతో పాటు సరిహద్దు వెంబడి కోబ్రా తీగలను అమర్చి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ కోబ్రా తీగ హై ఓల్టేజ్ కరెంటు కలిగి ఉంటుంది. దీన్ని సరిహద్దు ఫెన్సింగ్ మధ్యలో అమర్చారు. ఈ తీగలు పాకిస్తాన్ నుంచి చొరబాట్లను అరికడుతుంది. చొరబాటుదారుడు ఈ తీగను తాకగానే స్పృహ కోల్పొతాడు. హెచ్‌హెచ్‌టీఈ ద్వారా జీవుల కదిలికలను కచ్చితంగా గుర్తించగల్గుతారు. గస్తీలో పాల్గొనే డాగ్స్వ్కాడ్లోని కుక్కలకు రాత్రిపూట పహారా కసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 ఆగస్టులోనే బీఎస్ఎఫ్ చీఫ్ శర్మ ఇండో పాక్ సరిహద్దులో సాంకేతిక పరిజ్ఞాన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ హై టెక్ పరిజ్ఞానాన్ని జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రవేశ పెట్టనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
బీఎస్ఎఫ్లో ఇంటిదొంగల కలకలం
న్యూఢిల్లీ : దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో ఇంటిదొంగల వ్యవహారం కలకలం రేపుతున్నది. శత్రుదేశాల ఏజెంట్లు, అసాంఘిక శక్తులతో కుమ్మక్కైన కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వెలుగుచూడటంతో అధికారులు అంతర్గత నిఘాను పటిష్టం చేశారు. విలాసవంమైన జీవనం గడుపుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై కన్నేసి ఉంచాలని, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈమేరకు 2017 సంవత్సరానికి గానూ అనుమానితుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇటీవలే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉగ్రవాదులకు సహకరిస్తోన్న బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారిని సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అతని వద్ద నుంచి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల సిబ్బంది కల్గిన బీఎస్ఎఫ్ ప్రతిష్టను కాపాడటం కోసమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతియడానికి కాదని స్పష్టం చేశారు. -
ఆ దేశం బిడ్డలు.. అంగడి బొమ్మలు
పేదరికంలో మగ్గుతున్న బంగ్లాదేశీయులు తమఉపాధికి ఆశాకిరణంగా భారత్‌ను భావిస్తున్నారు. ఇక్కడికి వస్తే తమ కుటుంబానికి బతుకుదెరువు దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు అక్రమార్కుల చేతిలో పడి మోసపోతున్నారు. ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా అవుతున్న మహిళలు, యువతులు హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్టు తేలింది. ఈ అంశంలో ముంబై తర్వాతి స్థానం నగరానిదే కావడం గమనార్హం. ‘హ్యూమన్ ట్రాఫికింగ్: మోడెస్ ఆపరెండీ ఆఫ్ టాట్స్ ఆన్ ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్’ పేరుతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. నగరానికి వస్తున్న వారికి శివార్లలోని పారిశ్రామిక వాడలు, మసాజ్ పార్లర్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మరోపక్క కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ముఠాలు బంగ్లా యువతులను ప్రధానంగా వ్యభిచార కేంద్రాలకు విక్రయిస్తున్నాయి. డ్యాన్స్ బార్లు, మసాజ్ పార్లర్లు, ఇళ్లల్లో పనిమనుషులు గాను వారిని మార్చేస్తున్నాయి. అక్రమ రవాణా బాధితుల్లో అనేకమంది బానిస కూలీలుగానూ బతుకుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి రవాణా అవుతున్న బాధితుల పరిస్థితిపై బీఎస్ఎఫ్ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో అనేక ఎన్జీఓల సహకారం తీసుకుంది. ఈ అధ్యయనం ఆధారంగా ‘హ్యూమన్ ట్రాఫికింగ్: మోడెస్ ఆపరెండీ ఆఫ్ టాట్స్ ఆన్ ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్’ నివేదికను రూపొందించింది. ఈ ట్రాఫికింగ్, హైదరాబాద్‌లో తిష్టవేస్తున్న అక్రమ బంగ్లాదేశీయుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ పోలీసు విభాగాన్ని హెచ్చరించింది. అక్కడ ఢాకా.. ఇక్కడ కోల్‌కతా.. బీఎస్ఎఫ్ నివేదిక ప్రకారం ఏటా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి కనీసం 50 వేల మంది బాలికలు, యువతులు అక్రమంగా రవాణా అవుతున్నారు. వీరిలో ప్రధానంగా 12 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. భారత్–బంగ్లా సరిహద్దుల్లో మాటు వేసిన కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నాయి. ఇవన్నీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తూ ఇందుకు కోల్‌కతాను ప్రధాన కేంద్రంగా వినియోగించుకుంటున్నాయి. బంగ్లాదేశీ యువతులు, మహిళలను తొలుత అక్కడికి రప్పించి ఆపై దేశంలోని అనేక నగరాలకు రవాణా చేస్తున్నాయి. దళారుల్లో మహిళలూ ఉన్నారు.. ఢాకా మొదలు భారత్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల వరకు అనేక మంది దళారులు ఓ సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ రవాణా దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో దళారులుగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశీయుల్లో 84 శాతం పురుషులు ఉండగా 16 శాతం మహిళలు ఉంటున్నారు. బంగ్లాదేశీయులను ట్రాప్ చేయడానికి ఈ దళారులు అనేక రకాలుగా ఎర వేస్తున్నారు. భారత్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయని, ఇంటి పనులు చేసే వారికి డిమాండ్ ఉందని చెబుతున్నాయి. కాస్త ఆకర్షణీయంగా ఉన్న యువతులకు సినిమాల్లో అవకాశాలు, ప్రేమ–పెళ్లి పేరుతో సరిహద్దులు దాటేలా కథ నడిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రామాల్లోని నిరుపేదలే వీరికి టార్గెట్‌గా మారుతున్నారు. వీరిలో జెసోర్, సత్ఖారీ, గోజడాంగ, హకీంపుర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. సరిహద్దుల్లో సరైన కంచె లేకపోవడం, ‘జీరోలైన్’గా పిలిచే ఇతర దేశ సరిహద్దు ప్రాంతం సమీపం వరకు జనావాసాలు విస్తరించడం ఈ ముఠాలకు కలిసి వస్తోంది. బీజీబీ సహకారంతోనే.. బంగ్లాదేశ్‌లోని కూరిగ్రామ్, లాల్‌మొన్నీర్‌హత్, నీల్ఫామారి, పంమఘార్, థకూర్గావ్, దినజ్‌ప్పూర్, నావ్‌గావ్, చపాయ్ నవాజ్‌గంజ్, రాజ్‌షహీ జిల్లాలు.. పశ్చిమ బెంగాల్‌లోని బినొపొల్ ప్రాంతాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటు బంగ్లా, ఇటు భారత్‌కు చెందిన వ్యవస్థీకృత ముఠాలు పక్కా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ అక్రమ రవాణాకు బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ) సహకరిస్తోంది. ఒక్కో యువతికి 200 నుంచి 400 టాకాల వరకు వసూలు చేస్తూ సరిహద్దులు దాటించేస్తున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ల పాటు సరిహద్దు గ్రామాల్లోనే వీరిని దాచి ఆపై వివిధ నగరాల్లోని తమ ఏజెంట్లకు విక్రయించేస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది యువతులు, మహిళలు ముంబైకి చేరుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుస్తున్నారు. బెంగళూరు, రాయ్‌పూర్, సూరత్‌లకూ పెద్ద సంఖ్యలో వీరు చేరుతున్నట్లు బీఎస్ఎఫ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. శివార్లలోనే ఎక్కువగా తిష్ట.. హైదరాబాద్ నగరం విభిన్న వర్గాల, ప్రాంతాలకు చెందిన వారి సమాహారం. ఈ నేపథ్యంలోనే ఇక్కడకు వస్తున్న బంగ్లాదేశీ యువతులు తేలిగ్గా స్థానికులతో కలిసిపోతున్నారు. మరోపక్క నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇలాంటి వారి ముసుగులోనే కొందరు బంగ్లాదేశీయులు స్థిరపడుతున్నారు. మరోపక్క హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ముఠాలు ఇలాంటి అక్రమ రవాణా/వలసదారులకు సహకరిస్తున్నాయి. అడ్డదారిలో ఆధార్, ఓటర్ గుర్తింపుకార్డు వంటివి ఇప్పిస్తూ వారిని స్థానికులుగా మార్చేస్తున్నాయి. ఈ వ్యవహారాలను పోలీసు విభాగం దృష్టికి తీసుకువచ్చిన బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. కొత్తగా ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుల కోసం ఎన్రోల్ అవుతున్న మేజర్ల విషయంలో అనేక కోణాల్లో వివరాలు సరిచూసిన తర్వాతే వీటిని జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ అక్రమ రవాణా, వలసదారుల కారణంగా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఎస్ఎఫ్ చెప్పింది. సిటీలో చిక్కిన బంగ్లాదేశీ యువతులు.. ♦ రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గతేడాది మే 28 ఆన్లైన్ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార రాకెట్‌ను పట్టుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న అక్తర్ షబామా అనే మహిళ ఈ రాకెట్లో కీలక పాత్ర పోషించింది. రెస్క్యూ అయిన వారిలో బంగ్లాదేశీ మహిళ సైతం ఉంది. ♦ 2015 మార్చి 6న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంబర్‌పేట కేంద్రంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. దీన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ షేక్ అక్రమ వలసదారుడే. ఇతడి ఆధీనంలో ఉన్న ఏడుగురు బంగ్లాదేశీ యువతుల్ని పోలీసులు రెస్క్యూ చేశారు. వీరంతా అక్రమ రవాణా ద్వారా ఇక్కడకు వచ్చిన వారే. ♦ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 2014 డిసెంబర్ 14న విజయ్‌పురికాలనీ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు. ఇక్కడ ముగ్గురు బంగ్లాదేశీ యువతుల్ని ఈ కూపం నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ జబ్బార్ ఉన్నట్లు గుర్తించారు. -
'ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు'
సాక్షి, చండీగఢ్ : సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికులకు పౌష్టికాహారం పెట్టడం లేదంటూ సంచలన వీడియో పోస్ట్ చేసి అనంతరం ఉద్యోగాన్నికోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కోర్టు మెట్లెక్కారు. తన ఉద్యోగాన్ని తనకు తిరిగి ఇప్పించాలంటూ హర్యానా కోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోను తాను అప్లోడ్ చేయలేదని, తన సహచరులే ఆ పనిచేశారని కోర్టుకు వెళ్లడించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖకు, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మకు, బీఎస్ఎఫ్ 29 బెటాలియన్ కమాండెంట్‌కు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వచ్చే మే (2018) 28కి వాయిదా వేసింది. తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఓ సెల్ఫీ వీడియోను తేజ్ బహదూర్ గత ఏడాది (2017) జనవరి 8న ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనం అయింది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతడిని ఎవరికీ తెలియని చోట పోస్టింగ్ ఇచ్చారని కక్ష పూరితంగా వ్యవహరించారిన తేజ్ భార్య కూడా ఆరోపించింది. అయితే, తేజ్ ఉద్దేశ పూర్వకంగా ఈ పనిచేశాడని పేర్కొంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ బీఎస్ఎఫ్ నిర్ణం తీసుకుంది. అయితే, ఆ వీడియోను తాను పోస్ట్ చేయలేదని, తన సహచర ఉద్యోగుల్లో ఎవరో ఒకరు అది చేసి ఉంటారని, అతడి ఉద్యోగంపై వేసిన వేటును బీఎస్ఎఫ్ వెనక్కు తీసుకొని తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ తేజ్ తరుపు న్యాయవాది తాజాగా కోర్టును అభ్యర్థించారు. -
బీఎస్ఎఫ్ మహిళల విన్యాసాలు అద్భుతం
-
పాక్‌కు షాక్.. 'ఇక మీ స్వీట్లు మాకొద్దు'
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ రేంజర్లకు భారత సరిహద్దు బలగాలు (బీఎస్ఎఫ్) షాకిచ్చాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాక్ రేంజర్లు ఆఫర్ చేసిన తీపి తినుబండారాలను తీసుకునేందుకు నిరాకరించాయి. సరిహద్దు వెంట ఆక్రమణ చర్యలకు, దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ రూపంలో నిరసన తెలిపాయి. అదేసమయంలో బంగ్లాదేశ్ బలగాలతో మాత్రం స్వీట్లు పంచుకున్నాయి. ప్రతి గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి సరిహద్దు వద్ద ఉన్న గేట్లను ఓసారి ఓపెన్ చేసి ఇరు దేశాలకు చెందిన సైనికులు గౌరవ వందనం చేసుకోవడంతోపాటు స్వీట్లు కూడా పంచుకుంటారు. కొన్ని పండుగల సమయాల్లో ప్రత్యేకంగా స్వీట్లు పంచుకుంటారు. అంతకుముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో మాత్రం మంచి సహకారం దయాగుణం ప్రదర్శిస్తారు. కానీ, ఈ సారి మాత్రం ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. అందుకు పాక్ కారణమైంది. 'రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్య లేనట్లయితే, ఉద్రిక్త పరిస్థితులు లేనట్లయితే శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. స్వీట్లు తీసుకునే వాళ్లం. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు' అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇటీవల పాక్ రేంజర్లు నిత్యం సరిహద్దులోని గ్రామాలపై దాడులకు పాల్పడుతుండటమే కాకుండా సైనికులపై కూడా కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. -
పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జమ్మూ/సాక్షి, చెన్నై: భారత్‌తో సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్ కాల్పులు ప్రారంభించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌కానిస్టేబుల్ ఎ.సురేశ్ చనిపోయారు. ఇంకా సరిహద్దులో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. -
సరిహద్దుల్లో భారత్ ప్రతీకారం!
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కుయుక్తులకు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌పై పాక్ సైనికులు కాల్పులు జరిపి హతమార్చటంతో రాత్రికి రాత్రే భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బుధవారం రాత్రి సాంబా సెక్టార్ సమీపంలో దాయాదిపై విరుచుకుపడిన భారత బలగాలు మూడు పాక్ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 8–10 పాకిస్తాన్ రేంజర్లు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించగా.. పాక్‌కు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ వెల్లడించారు. అటు, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపగా మిగిలిన వారు పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాక్‌తో 200 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’ ప్రారంభించింది. వేడెక్కిన సరిహద్దు బుధవారం రాత్రి ఆర్పీ హజారా అనే కానిస్టేబుల్ సాంబా సెక్టార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్ వైపునుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బలగాలు అప్రమత్తమై ప్రతిస్పందించేలోపే హజారా బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. వెంటనే బీఎస్ఎఫ్ ప్రతీకారానికి దిగింది. సాంబా సెక్టార్లో పాక్ మోర్టార్లున్న ప్రాంతాన్ని గుర్తించి భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ స్థాయిలో ప్రతిఘటనను ఊహించని పాక్‌కు ఈ మెరుపుదాడితో తీవ్ర నష్టం వాటిల్లింది. సోలార్ ప్యానళ్లు, ఆయుధాలు నష్టపోయాయని.. ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. చొరబాట్లపై ‘ఆపరేషన్ అలర్ట్’ శీతాకాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంచు తీవ్రస్థాయిలో కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో గస్తీకాసేందుకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని పాక్ వైపునుంచి చొరబాట్లకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నిరోధించేందుకు బీఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. మరోవైపు, పీవోకే సరిహద్దుల్లోని ఆర్ఎస్ పుర సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానిత ఉగ్రవాది చనిపోగా మిగిలిన వారు పారిపోయారని అధికారులు వెల్లడించారు. -
10 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు.. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు 10 వేల కిలోలకు పైగానే ఉంటాయని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో 49.44 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను తమ సిబ్బంది పట్టుకున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను బీఎస్ఎఫ్ బలగాలు బారీగా స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా 8,807 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న 439.21 కిలోల డ్రగ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌తో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను సైతం బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
శ్రీనగర్‌లో ఉగ్రదాడి
శ్రీనగర్: శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న బీఎస్ఎఫ్ శిబిరంపై ఫిదాయీన్(ఆత్మాహుతి) దళం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు దాడి జరిపింది. కాల్పులు జరుపుకుంటూ వచ్చిన ముష్కరులు బీఎస్ఎఫ్ శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. జవాన్లు కూడా దీటుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఇప్పటి వరకు ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన జవాన్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులను, ప్రయాణికులను, వాహనాలను ఎయిర్ పోర్టు దారిలోకి అనుమతించడం లేదు. అన్ని విమానసర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉ.11.30కి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. -
పాక్ నుంచి జమ్మూకు సొరంగం
జమ్మూ: పాకిస్తాన్ భూభాగం నుంచి జమ్మూ కశ్మీర్‌కు తవ్విన 14 అడుగుల సొరంగ మార్గం వెలుగుచూసింది. ఆర్నియా సెక్టార్‌లోని శూన్యరేఖ సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శనివారం దీన్ని గుర్తించింది. దీంతో భారత్‌లోకి చొరబాటు, ఉగ్రదాడి యత్నాలను భగ్నం చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు. శూన్యరేఖ వద్ద కొందరు సాయుధులు బీఎస్ఎఫ్ బృందాన్ని చూసి పారిపోవడంతో అనుమానమొచ్చి, క్షుణ్నంగా తనిఖీ చేయగా ఈ సొరంగ మార్గం బయటపడింది. అక్కడ పాకిస్తాన్లో తయారైన ఆహారపదార్థాలు దొరకడంతో సాధ్యమైనంత తొందరగా సొరంగ నిర్మాణాన్ని పూర్తిచేసి భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘సరిహద్దు కంచెకు సమీపంలోని ధమల్లా నల్లా ఒడ్డుపై ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సొరంగం ఎత్తు 3 అడుగులు. వెడల్పు రెండున్నర అడుగులు. బీఎస్ఎఫ్ గస్తీ బృందానికి అనుమానమొచ్చి తనిఖీలు చేపట్టగా సొరంగ మార్గం బయటపడింది. ఘటనా స్థలంలో అమెరికాలో తయారైన మార్గసూచి, రెండు మేగజీన్లు, 60 రౌండ్ల మందుగుండు సామగ్రి, హ్యాండ్ గ్రెనేడ్, పాకిస్తాన్ గుర్తులున్న మరిన్ని వస్తువులను కనుగొన్నాం’ అని బీఎస్ఎఫ్ ఐజీ అవతార్ చెప్పారు. పాక్ రేంజర్ల కనుసన్నల్లోనే! సొరంగ తవ్వకం పాకిస్తాన్ కుట్రేనన్న అవతార్, సమయానికి దాన్ని గుర్తించి భారత్‌లో ఉగ్రదాడులను నివారించామని చెప్పారు. అప్పుడే పెకిలించిన మట్టి, తవ్విన దూరాన్ని బట్టి చూస్తే సొరంగ నిర్మాణం 3 రోజుల క్రితమే ప్రారంభమై ఉంటుందన్నారు. ఈ సొరంగానికి ప్రవేశం పాకిస్తాన్లో ఉండగా, డెడ్‌ఎండ్... ఫెన్సింగ్, శూన్యరేఖ మధ్య ఉందని తెలిపారు. సొరంగ తవ్వకం గురించి పాకిస్తాన్ రేంజర్లకు తెలిసే ఉంటుందని అన్నారు. తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను బట్టి దీనికోసం నిపుణుల సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. ‘సొరంగం తవ్వకానికి ఎంచుకున్న ప్రదేశం, వాడిన పనిముట్లను బట్టి దీని కోసం నిపుణులను నియమించుకున్నట్లు అర్థమవుతోంది. నడుము వరకు వంగితే ఎవరైనా దీని గుండా నడవొచ్చు’ అని తెలిపారు. -
మేం ఎలుకలమే.. అలాగే వస్తాం!
సాక్షి, శ్రీనగర్ : పాకిస్తాన్ తన దొంగబుద్ధిని మరోచూపించుకుంది. ఇప్పటికే పలుసార్లు.. సరిహద్దునుంచి భారత్‌లోకి సొరంగాలు తవ్వి పట్టుబడింది. అంతర్జాతీయ సమాజం ముందు ఛీత్కరింపులు.. అవమానాలు ఎదురయినా నా బుద్ధి కుక్కబుద్ధేనని పాకిస్తాన్ ప్రకటించుకుంది. తాజాగా కశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తాన్ నిర్మించిన సొరంగాన్ని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. పాకిస్తాన్ రేంజర్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే.. ఇది బయటపడ్డం యాధృచ్ఛికం అని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెబుతున్నారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి మిలిటెంట్లు వచ్చేందుకు 14 అడుగుల పొడవుతో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సొరంగం గుండా మిలిటెంట్లు ఆయుధాలతో పాక్కుంటూ సరిహద్దులు దాటి సులువుగా వచ్చేందుకు అవకాశం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దేశంలో ఇక పండుగల హడావుడి మొదలైన నేపథ్యంలో ఈ సొరంగం గుండా మిలిటెంట్లు దేశంలోకి చొరబడి.. అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. ముగ్గురు నలుగురు పాకిస్తాన్ వ్యక్తులు సొరంగంలో పనులు చేస్తున్నట్లు అనుమానాలు రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులకు దిగాయి. కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిపిన వాళ్లు.. తరువాత పాకిస్తాన్‌కు పారిపోయారు. చొరబాట్లకు అవకాశం లేకపోవడంతో మిలిటెంట్లు సొరంగాలు తవ్వుకుని సరిహద్దులా దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి సొరంగాలను గుర్తించేందుకు ఇకపై ఫూల్ఫ్రూఫ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు బీఎస్ఎఫ్ బలగాలు ప్రకటించాయి. గతంలో గుర్తించిన సొరంగాలు 2012లో సాంబా సెక్టార్లో ఒక సొరంగాన్ని అధికారులు గుర్తించారు. మొత్తం 540 మీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం పాకిస్తాన్‌లోని లుంబ్రియాల్ పోస్ట్ నుంచి మొదలైంది. 2014లో అఖ్నూర్ సెక్టార్లో పాకిస్తాన్ నిర్మించిన సొరంగాన్ని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. సుమారు 50 మీటర్ల పొడవున్న ఈ సొరంగం పాకిస్తాన్ నుంచి అఖ్నూర్ సెక్టార్‌లోని మున్వర్‌కు ఉంది. 2016లో ఆర్ఎస్ పురా సెక్టార్లో మరో సొరంగం బయటపడింది. ఇది సుమారు 30 మీటర్ల పొడవుతో.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి కొథే పోస్ట్ వరకూ ఉంది. 2017 ఫిబ్రవరిలో మరో సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. పాకిస్తాన్ సరిహద్దు నుంచి సాంబా సెక్టార్ వరకూ దీనిని నిర్మించారు. ఈ సొరంగం గుండానే మిలిటెంట్లు భారీగా దేశంలోకి చొరబడ్డారని భద్రతా బలగాలు గుర్తించాయి. -
చొరబాట్లు : బీఎస్ఎఫ్ చేతిలో ఇద్దరు హతం
న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాలు సరిహద్దులో అత్యంత శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ చొరబాటు దారులును భారత సైన్యం ఎక్కడిక్కడ ఏరిపారేస్తోంది. తాజాగా బుధవారం పంజాబ్ సరిహద్దులో ఉన్న ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ స్మగ్గర్లను బీఎస్ఎఫ్ దళాలు మట్టికరిపించాయి. మృతుల వద్ద నుంచి 4 ఏకే 47 తుపాకులు, ఏకే మ్యాగ్, 9 ఎంఎం పిస్టల్, పాకిస్తాన్ మొబైల్ సిమ్ కార్డ్, రూ. 20 వేల పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. -
నకిలీ 2000 నోట్ల కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారీగా నకిలీ 2000 నోట్లు పట్టుబడడం కలకలం రేపింది. మాల్ద జిల్లాలో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ 1,96,000 విలువగల నకిలీ నోట్లను బీఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) స్వాధీనం చేసుకుంది. బీఎస్ఎఫ్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో.. నిజిముల్ హక్ అనే వ్యక్తి వద్ద 98 ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించారు. అతడిని బైష్నబ్నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది వెల్లడించారు. ఇప్పటివరకు 2017లో సుమారు 30 లక్షల విలువగల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ విభాగం వెల్లడించింది.