కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం.. 10 మంది మృతి | BSF Plane Carrying 10 People Crashes Near Delhi Airport, One Dead | Sakshi
Sakshi News home page

కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం.. 10 మంది మృతి

Published Tue, Dec 22 2015 10:44 AM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM

కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం.. 10 మంది మృతి - Sakshi

కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం.. 10 మంది మృతి

న్యూఢిల్లీ: రాంచీకి చెందిన బీఎస్ఎఫ్ విమానం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్నపదిమంది ప్రాణాలుకోల్పోగా వారిలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులు విమాన సిబ్బంది, మిగితావారు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘటనా స్థలికి బయలు దేరారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ లోగల బాడ్పోలా గ్రామం వద్ద విమానాశ్రయ ప్రహరీ గోడకు ఈ విమానం ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. విమానంలో మొత్తం పదిమందే ఉన్నట్లు తెలిసింది.

మంగళవారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో తమకు దిగేందుకు అనుమతివ్వాలంటూ విమాన సిబ్బంది కోరారని, ఆ వెంటనే కొద్ది సేపటికే తమతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం దించేందుకు అనుమతి ఇవ్వగానే విమానాశ్రయంలో దించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఓ గోడకు ఢీకొట్టిందని, అనంతరం అది కూలిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇది కూలిన చోటే రైల్వే లైన్ కూడా ఉంది. గోడను ఢీకొట్టిన విమానం అనంతరం ఓ సెఫ్టిక్ ట్యాంకులోకి పడిపోయిందని, అనంతరం మంటలు భారీగా వ్యాపించగా దాదాపు 18 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఘటన స్థలి వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement