crash
-
సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!
కారు డ్రైవిం చేసే సమయంలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్‌లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్‌బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్‌కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు. (చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! ) -
కుప్పకూలిన విమానం..
-
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్‌తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్‌మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
దలాల్ స్ట్రీట్.. ఢమాల్! మార్కెట్ల భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్ భారీ నష్టాలను చవి చూశాయి.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 22 మంది మృతి
మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం. -
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్‌క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్‌పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 2,222 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్న బెంచ్ మార్క్ సూచీలు ఏమాత్రం కోలుకోలేపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ నష్టాల ప్రభావంతో భారతీయ మార్కెట్లు భారీగా వెనక్కి తగ్గాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74% క్షీణించి 78,759.40 వద్దకు పడిపోయింది. నిఫ్టీ కూడా 667.75 పాయింట్లు లేదా 2.70% శాతం నష్టపోయి 24,049.95 వద్దకు క్షీణించింది.రంగాలవారీగా అన్ని సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టాటా మోటార్స్ టాప్ లూజర్‌గా ఉండగా, టాటా స్టీల్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఎస్బిఐ మరియు జెఎస్డబ్ల్యు స్టీల్ భారీగా క్షీణించాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
18 లక్షల కోట్ల సంపద ఆవిరి..
-
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
వైరల్ వీడియోల కోసం మరీ ఇలానా..! ఏకంగా రైలు పట్టాలనే..!
ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్‌లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్‌లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్‌లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్‌లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
'ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్‌లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి. ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు. పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్‌లో డెస్క్ జాబ్‌లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..) -
షారుక్ ఖాన్ చిన్న పొరపాటు.. కోట్ల రూపాయల నష్టం!
స్టార్ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహానటుడు అలీ ఖాన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్.. షారుక్ కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్‌కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్‌లో ఛేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్‌పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. -
Nasa: మార్స్‌పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో మార్స్‌పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్‌పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్‌జెన్యూటీ నాంది పలికింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని పహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్‌కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్‌ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఉచైన్ పోలీస్ స్టేషన్‌లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
‘ఉత్తర కాశీ’ ఆపరేషన్‌లో స్వల్ప ఆటంకం!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
దారుణం: పొగమంచుతో వందల కొలది వాహనాలు ఢీ.. ఏడుగురు మృతి
న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్ -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు
బెంగళూరు: కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్ ఎస్.ఎస్.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ సమయంలో కారును నాగభూషణ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సంతోషంగా పార్టీ.. కళ్ల ముందే ఘోర ప్రమాదం!
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక జంట ఘనంగా జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. పార్టీకి భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే వీరందరి కళ్ల ముందే విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అది ఒక స్టంట్ విమానం. పార్టీలో రంగులు వెదజల్లేందుకు దానిని వినియోగించారు. ఇదే ప్రమాదానికి కారణంగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో షేర్ అయ్యింది. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట ఎవరన్నదీ వెల్లడికాలేదు. అయితే ఈ వీడియోలో జండర్ రివీల్ పార్టీలో పాల్గొన్న జంట కావలించుకోవడం, పైన విమానం నుంచి రంగులు జాలువారడాన్ని గమనించవచ్చు. ఇంతలోనే విమానం అదుపుతప్పడాన్ని చూడవచ్చు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విమాన ప్రమాదంలో గాయపడిన పైలెట్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా తమకు పుట్టబోయే శిశువు.. పాప లేక బాబు అనేది సన్నిహితుల మధ్య వెల్లడించేందుకు జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇటువంటి జండర్ రివీల్ పార్టీలు అదుపు తప్పుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని’ కామెంట్ చేశారు. మరో యూజర్ ‘కొద్ది సేపు నిర్వహించే పార్టీకి ఇంత హడావుడి అనవసరం’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు! Pilot killed after his Piper PA-25 left wing failed at a gender reveal party in the town of San Pedro, Mexico. pic.twitter.com/6JILK7fsGm — Breaking Aviation News & Videos (@aviationbrk) September 3, 2023 -
తప్పతాగి కారు నడిపి.. నడిరోడ్డుపై మహిళా మంత్రి హల్చల్..
న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ తప్ప తాగి డ్రైవింగ్ చేసిన కేసులో తన పదవికి రాజీనామా చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి ఓ ప్రమాదానికి కారణం అయినందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తప్పని స్థితిలో అరెస్టుకు ముందే ఆమె తన మంత్రి పదవికి అలెన్ రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి తన కారుతో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అలెన్ అరెస్టుకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్రిస్ హిప్రిన్స్.. మంత్రి అలెన్ మానసికంగా కృంగిపోయి ఉన్నారని తెలిపారు. పదవి బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. పైగా క్రిమినల్ కేసు అయినందున రాజీనామాను అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే.. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగిన అలెన్.. వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నారు. జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన నాటి నుంచి ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లేబర్ పార్టీ నుంచి మంత్రి పదవి కోల్పోయినవారిలో అలెన్ నాలుగో మంత్రి కావడం గమనార్హం. ఇదీ చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య కుదిరిన ఒప్పందం -
కుప్పకూలిన బిజినెస్ జెట్: ఆరుగురు సజీవ దహనం
అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియా పొలాల్లో ఓ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారుల వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలియింది. లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ముర్రిటాలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. సెస్నా సీ550 బిజినెస్ జెట్ మంటల్లో చిక్కుకున్నట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో బిగైల్ టెల్లెజ్-వర్గాస్(33) రైస్ లెండర్స్(25) మాన్యువల్ వర్గాస్-రెగాలాడో(32) లిండ్సే గ్లీచే(31) అల్మా రజిక్ (51) , ఇబ్రహెం రజిక్(46) సజీవ దహనమైపోయారు. పైలట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ విధానాన్ని ప్రయత్నించిన తర్వాత విమానం రన్‌వేకు 500 అడుగుల దూరంలో కూలిపోయిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇదే ప్రాంతంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరగడం ఆందోళన రేపింది. -
వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..