యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ | Instagram Down: Several Android Users Worry Across The World | Sakshi
Sakshi News home page

యూజర్లకు షాక్‌ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

Published Sat, Dec 19 2020 7:55 AM | Last Updated on Sat, Dec 19 2020 12:56 PM

Instagram Down: Several Android Users Worry Across The World - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి పలు సమస్యల కారణంగా సోషల్ మీడియా క్రాష్ అయిందని ట్విట్టర్‌లో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. కాసేపటి వరకూ పనిచేయకుండా పోయిన ఇన్‌స్టాగ్రామ్‌ కాసేపటికి సెట్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన కాసేపటికే ఇంటర్నెట్‌లో యూజర్లు మీమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేశారు. యూజర్లు పెరిగిపోవడంతోనే ఇలా జరిగినట్లుగా నిపుణులు అభిప్రయపడుతున్నారు. సమస్య తీరిపోయిందని చెప్తున్నా.. ఇంకా చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఇదే వారం మొదట్లో గూగుల్ సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement