టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్‌ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.
దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.
ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్‌లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment