lays off
-
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్‌ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
బెంగళూరు కంపెనీలో ఉద్యోగాల కోత.. ఇక మిగిలింది 50 మందే!
బెంగళూరు ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీ సంస్థ డంజో (Dunzo) భారీగా ఉద్యోగాల కోత విధించింది. రిలయన్స్ మద్దతు ఉన్న ఈ సంస్థ తమ వర్క్‌ఫోర్స్‌లో 75% మందిని తొలగించిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రధాన సరఫరా, మార్కెట్‌ప్లేస్ టీమ్‌లలో ఇక మిగిలింది కేవలం 50 మంది ఉద్యోగులేనని నివేదిక తెలిపింది.ఖర్చుల నియంత్రణ, పెరిగిపోతున్న అప్పులు, ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిలు, విక్రేత చెల్లింపుల సమస్యలతో పాటు నగదు లభ్యతను పెంచుకోవడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఉద్యోగాల కోతకు పూనుకున్నట్లు తెలుస్తోంది. డంజో ఆగస్టు 31న ఉద్యోగాల కోత విధించినట్లు తొలగింపులకు సంబంధించిన ఆన్లైన్ ట్రాకర్ లేఆఫ్స్.ఫై (Layoffs.fyi) పేర్కొంది.ఉద్యోగులకు ఈ-మెయిల్స్తొలగింపుల గురించి తెలియజేస్తూ తమ ఉద్యోగులకు డంజో ఈ-మెయిల్స్ పంపింది. నివేదిక ప్రకారం.. అవసరమైన నిధులను పొందిన వెంటనే బాధిత సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు, సీవెరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలు చెల్లిస్తామని లేఖలో డంజో హామీ ఇచ్చింది. ఒకప్పుడు 775 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీ, ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటూ కష్టపడుతోంది. కొత్త ఇన్వెస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ,రుణాల మిశ్రమం ద్వారా 22-25 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు దాదాపు దగ్గరికి వచ్చినట్లు ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. డీల్ ముగింపు దశలో ఉందని, 10-15 రోజులలోపు బకాయిలను చెల్లించేస్తామని గత జూలై మధ్యలో ఉద్యోగులకు తెలియజేసింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. -
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్‌సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. -
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో
ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. -
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 300 మందికి ఉద్వాసన!
కొత్త ఏడాదిలోనూ రోజూ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఏదో ఒక కంపెనీలో లేఆఫ్‌ల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ డేటా ప్రొటెక్షన్, రాన్సమ్వేర్ సంస్థ వీమ్ (Veeam) 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవలి మార్పులతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. కంపెనీలో తొలగింపుల గురించి కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్లాక్ అండ్ ఫైల్స్ ప్రకారం.. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా తనతోపాటు సుమారు 300 మంది సహోద్యోగులు జాబ్స్ కోల్పోయారని ఒక సీనియర్ క్యాంపెయిన్ అకౌంట్ మేనేజర్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. తొలగింపులను గురించి కంపెనీ ధ్రువీకరించినప్పటికీ ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న ఖచ్చితమైన సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. 2006లో స్థాపించిన ఈ ఐటీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా సేవలందిస్తూ పరిశ్రమలో ప్రధాన సంస్థగా మారింది. కంపెనీ కస్టమర్ లిస్ట్‌లో ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్లైన కోకా-కోలా, బీఎండబ్ల్యూతో పాటు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి. తమ వ్యాపార ప్రణాళికలను బహిర్గతం చేయమని వీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాథ్యూ బిషప్ తెలిపారు. అయితే తాము కొన్ని చోట్ల నియామకాలను పెంచుతున్నామని, కొన్ని మందిని బదిలీ, మరికొంత మందిని తప్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభావితమైన వీమ్ ఉద్యోగులు తదుపరి కెరీర్ అవకాశాన్ని కనుగొనడంలో వారికి సహాయం అందిస్తామన్నారు. వీమ్ సంస్థ రాన్సమ్వేర్, ఇతర సైబర్ ముప్పుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడంతో ప్రసిద్ది చెందింది. 2023లో నగదు, స్టాక్ డీల్‌లో 150 మిలియన్ డాలర్లకు కుబెర్నెట్స్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీలో అగ్రగామిగా ఉన్న కాస్టెన్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. భారతీయ సంతతికి చెందిన ఆనంద్ ఈశ్వరన్ 2022లో వీమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు. -
న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..
2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'షేర్‌చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం. షేర్‌చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్‌చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది. -
అమెజాన్ ప్రత్యర్థి కంపెనీలో సంక్షోభం! భారీగా ఉద్యోగాల తొలగింపు..
Zulily: ఒకప్పుడు 7 బిలియన్ డాలర్ల విలువతో అమెజాన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ఆన్లైన్ షాపింగ్ సంస్థ జులిలీ.. అమెరికాలో కార్యకలాపాలను మూసివేస్తూ వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. సీటెల్‌తోపాటు వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాలలో 292 మంది కార్మికులను జులిలీ తొలగించిందని, ఇది ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని అక్కడి రాష్ట్ర ఉపాధి భద్రతా విభాగం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు సీటెల్ టైమ్స్ వార్తా సంస్థ నివేదించింది. గీక్‌వైర్ అనే న్యూస్ సైట్ ప్రకారం.. 13 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జులిలీ తన పయనీర్ స్క్వేర్ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అనేక ఇతర కేంద్రాలను కూడా మూసివేస్తోంది. నెవాడా, ఒహియోలోని గిడ్డంగులను మూసివేయడం వల్ల మరో 547 మంది కార్మికుల తొలగింపులు జరుగుతాయని రెండు రాష్ట్రాల నోటీసుల ప్రకారం తెలుస్తోంది. తాజా ఉద్యోగాల కోతలకు ముందు కూడా జులిలీలో పలు రౌండ్ల తొలగింపులు జరిగాయి. అక్టోబర్‌లో కంపెనీ సీఈవో టెర్రీ బాయిల్ రాజీనామా చేశారు. 2010లో ప్రారంభం ఆన్లైన్ జ్యువెలరీ రిటైలర్ బ్లూ నైల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ వాడోన్, డారెల్ కావెన్స్ 2010లో జులీలీని ప్రారంభించారు. 2013 నాటికి జులీలీ 1.26 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉంది. 331 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2010 కంటే దాదాపు 700 శాతం అధికం. 2013లో ఐపీఓకి వచ్చినప్పుడు జులీలీ 2.6 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా మొదటి రోజు ముగిసే సమయానికి ఆ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది. 2014 నాటికి జులీలీ 1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 7 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. అమెజాన్, ఓల్డ్ నేవీ కంపెనీలు మాత్రమే తక్కువ సమయంలో బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును చేరుకున్నాయి. 2015లో జులిలీని లిబర్టీ ఇంటరాక్టివ్-క్యూవీసీ 2.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని క్యూరేట్‌గా పేరు మార్చింది. ఈ ఏడాది మేలో కంపెనీని లాస్ ఏంజిల్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రీజెంట్‌కు విక్రయించింది. -
మళ్ళీ లేఆఫ్స్.. ఆ కంపెనీ నుంచి 200 మంది - జనవరిలో మరోసారి..!!
L & T Technology Services Layoffs: ఎల్ అండ్ టీ సర్వీసెస్ ఇటీవల 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగులు మాత్రమే కాకుండా సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరిలో కూడా మరింతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 24000 మంది ఉద్యోగులను కలిగిన L&T టెక్నాలజీ సర్వీసెస్ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా 200 మందిని తొలగించినట్లు నివేదించింది. ప్రతి ఏటా ఉద్యోగుల శక్తీ సామర్థ్యాలను అంచనా వేయడమే కాకుండా.. వారు తమ స్కిల్స్ పెంచుకున్నారా, లేదా అనేది కూడా పరిశీలిస్తామని, ఇది ప్రతి ఉద్యోగిలోనూ కీలకమని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కంపెనీ ఆదాయం మునుపటి కంటే కూడా తగ్గడం వల్ల ఉద్యోగులను తీసేయాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ తొలగించిన ఉద్యోగుల శాతం 1 శాతం కంటే తక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రవాణా, టెలికాం, హైటెక్ పారిశ్రామిక ఉత్పత్తులు, ప్లాంట్ ఇంజనీరింగ్ మరియు వైద్య పరికరాల రంగాలలో ఇంజనీరింగ్ సేవలను అందిస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. L&T టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 5% పెరిగి రూ. 315.4 కోట్లకు చేరుకుంది, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ చద్దా తెలిపారు. -
‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’
బెంగళూరుకు చెందిన ఫామ్‌పే అనే స్టార్టప్ సంస్థ ఒకేసారి 18 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా ప్రకటించారు. హైపర్-గ్రోత్ నుంచి సస్టైనబిలిటీకి తమ ఫోకస్ మారడం వల్ల తొలగింపులు తప్పడం లేదని ఫామ్‌పే కో ఫౌండర్ సంభవ్ జైన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు. అయితే తాము తొలగించిన సిబ్బందికి ఎవరైనా జాబ్ ఇవ్వాలని రిక్రూటర్లను అభ్యర్థించాడు ఆ ఫిన్‌టెక్ యాప్ సహ వ్యవస్థాపకుడు. ఇక మరో కో ఫౌండర్ కుష్ తనేజా కూడా సంభవ్ జైన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త జాబ్ పొందేలా సహాయం చేయాలని కోరారు. ‘ఈరోజు చాలా కఠినమైన రోజు. ఎందుకంటే 18 మంది ఉద్యోగులను వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఫౌండర్‌గా ఇది నాకు చాలా కష్టమైన పని. ఉద్యోగులను వదులుకోవడం తమలాంటి ‘పీపుల్ ఫస్ట్’ సంస్థలకు అంత సులభం కాదు’ అని సంభవ్ జైన్ ట్వీట్ చేశారు. తాను, తనేజా సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న జట్టు గురించి చాలా గర్విస్తున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు తగిన జాబ్‌లను తాము అందించలేకపోయామన్నారు. వీరిని ఎవరైనా నియమించుకోవాలని కోవాలని కోరారు. తనేజా కూడా ట్వీట్ చేస్తూ 18 మంది ఉద్యోగులను విడిచిపెట్టవలసి వచ్చినందున ఈ రోజు తమకు చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఫామ్‌పే సంస్థను నిర్మించడంలో వారి సహకారానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని ఇందు కోసం తమను సంప్రదించాలని రిక్రూటర్లను అభ్యర్థించారు. అయితే వీరి పోస్ట్‌లపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వీరిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Today was an extremely sad day for us as 18 of our FamStars had to leave 😔 We are forever grateful to their contributions in building the Fam! Please DM if you are looking for super passionate and extraordinary folks for your team https://t.co/fmQTH90xP8 — Kush (@iamkushtaneja) August 2, 2023 -
49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం
శాన్ ఫ్రాన్సిస్కో: ట్రంప్ సంస్కరణల నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్శిటీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా కొంతమంది ఔట్సోర్సింగ్ ఐటీ ఉద్యోగులను తొలగించింది. ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలందిస్తున్న 49మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఈ పనిని ఇండియా ఆధారిత ఔట్సోర్సింగ్ కంపెనీకి అప్పగించడం విమర్శలకు దారి తీసింది. పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చుల కారణంగా ఈ తొలగింపు అనివార్యమైందని విశ్వ విద్యాలయం ప్రతినిది ఒకరు తెలిపారు. 49 మంది సిబ్బంది తొలగింపుతోపాటు, ఖాళీగా ఉన్న లేదా కాంట్రాక్టర్లద్వారా నియమితులైన మరో 48 మందినికూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. యూనివర్శిటీ నిర్ణయంతో సాఫీగా, సెక్యూర్డ్‌గా సాగిపోతున్న కంప్యూటర్ నెట్ వర్క్‌లకు అంతరాయం కలుగుతుందని తొలగించిన యూనివర్శిటీ సిస్టం అడ్మినిస్ట్రేటర్ కుర్ట్ హో(58) వ్యాఖ్యానించారు. బే ఏరియాలో పాతికేళ్లుగా తాను ఐటీ సేవల్లో ఉన్నట్టు తెలిపారు. ఐటి సేవల్లో పెరుగుతున్న అవుట్సోర్సింగ్ ధోరణి ఆందోళన కలిగిస్తుందన్నారు. అమెరికా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో గ్లోబలైజేషన్ అండ్ ఔట్సోర్సింగ్ హాట్ టాపిక్ మారాయి. దీంతో యజమానులు ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రపంచంలోని దూర ప్రాంతాల్లో ఉండే తక్కువ వేతనానికి పనిచేసే ఉద్యోగులకోసం ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, పరిశోధన పై దృష్టిపై పనిచేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయా వనరులను పెంచుకోవడానికి అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది జులైలో భారతదేశం ఆధారిత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఐదేళ్లకు గాను 50 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే రాబోయే ఐదేళ్లలో 30మిలియన్ డాలర్లను పొదుపు చేసే ఆలోచనలోఉన్నట్టు ప్రకటించింది. అలాగే దేశీయ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ కు పోకుండా బాధ్యత తీసుకున్నట్టు యూనివర్శిటీ సెనేటర్ డయానే గత ఏడాది ప్రకటించారు. ఈ మేరకు సంస్కరణలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. -
డెల్లో 70 మంది ఉద్యోగులు తొలగింపు
బెంగళూరు : బెంగుళూరు నగరంలోని తమ సంస్థ నుంచి 70 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు డెల్ సాఫ్ట్వేర్ గ్రూప్ (డీఎస్జీ) గురువారం ప్రకటించింది. సదరు ఉద్యోగులందరని గడిచిన తొమ్మిది నెలల కాలవ్యవధిలో తొలగించినట్లు తెలిపింది. వీరి తొలగింపు వ్యూహాత్మక నిర్ణయమేనని డీఎస్జీ వెల్లడించింది. అయితే హైదరాబాద్‌లో డెల్ సంస్థపై ఈ ప్రభావం ఉండదని పేర్కొంది.