L & T Technology Services Layoffs: ఎల్ అండ్ టీ సర్వీసెస్ ఇటీవల 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగులు మాత్రమే కాకుండా సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరిలో కూడా మరింతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సుమారు 24000 మంది ఉద్యోగులను కలిగిన L&T టెక్నాలజీ సర్వీసెస్ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా 200 మందిని తొలగించినట్లు నివేదించింది. ప్రతి ఏటా ఉద్యోగుల శక్తీ సామర్థ్యాలను అంచనా వేయడమే కాకుండా.. వారు తమ స్కిల్స్ పెంచుకున్నారా, లేదా అనేది కూడా పరిశీలిస్తామని, ఇది ప్రతి ఉద్యోగిలోనూ కీలకమని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
కంపెనీ ఆదాయం మునుపటి కంటే కూడా తగ్గడం వల్ల ఉద్యోగులను తీసేయాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ తొలగించిన ఉద్యోగుల శాతం 1 శాతం కంటే తక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రవాణా, టెలికాం, హైటెక్ పారిశ్రామిక ఉత్పత్తులు, ప్లాంట్ ఇంజనీరింగ్ మరియు వైద్య పరికరాల రంగాలలో ఇంజనీరింగ్ సేవలను అందిస్తుంది.
ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
L&T టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 5% పెరిగి రూ. 315.4 కోట్లకు చేరుకుంది, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ చద్దా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment