L & T Company
-
అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది. -
L&T ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం
-
భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?
పని గంటల గురించి ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్(SN Subramanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కామెంట్లపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఘాటుగా స్పందించారు. ఉన్నత విద్యావంతులు కూడా మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చురకలు అంటించారు.కాగా.. ‘భార్యను భర్త.. భర్తను భార్య ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి.. ఆదివారాలు కూడా ఆఫీసుకు రావాలి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్లపై మెజారిటీ మంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పెట్టుబడిదారులు వేల కోట్లు ఆర్జిస్తూ.. తరతరాలకు సంపాదించిపెట్టడానికి సామాన్యుల శ్రమను దోచుకోవడం కోసం అభివృద్ధి అనే సాకును వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భార్యను.. భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు?ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల సైతం సుబ్రమణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. ‘‘అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏమిటంటే.. భర్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఎందుకు ఉండిపోకూడదు? అది కూడా ఆదివారం మాత్రమే ఇలాంటివి ఉంటాయా!!బాగా చదువుకున్న వాళ్లు.. ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ల నుంచి కూడా ఇలాంటి మాటలు వినాల్సి రావడం విచారకరం. ఇలాంటివి ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కావు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి గురించి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నమ్మలేకపోతున్నా.నిరాశ, భయంఅంతేకాదు స్త్రీల పట్ల వారికున్న చిన్నచూపును ఇంత బహిరంగంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. నిరాశగానూ.. భయంగానూ ఉంది’’ అని గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా.. ఆదివారాలు కూడా పనిచేయడం అందరికీ ఇష్టం ఉండదని.. మానసిక ప్రశాంతత ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని నొక్కివక్కాణించారు.ఏదేమైనా బహిరంగ వేదికపైన సుబ్రమణ్యన్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శించారు.డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్గాకాగా మహారాష్ట్రలో జన్మించిన గుత్తా జ్వాల హైదరాబాద్‌లో సెటిలయ్యారు. బాల్యం నుంచే బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. పద్నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. అశ్విని పొన్నప్పతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి జోడీగా జ్వాల- అశ్విని ద్వయం నిలిచింది.ఇక 2011లో లండన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌లో కాంస్యం గెలిచిన గుత్తా జ్వాల.. 2010 కామన్వెల్త్ గేమ్స్ వుమెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2014 గేమ్స్‌లో రజతం గెలిచారు. అదే విధంగా.. 2014లో ప్రతిష్టాత్మక ధామస్- ఉబెర్ కప్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో డిజు(లండన్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించి చరిత్ర సృష్టించారు.కాగా భారత బ్యాడ్మింటన్ రంగంలో డబుల్స్ విభాగానికి వన్నె తెచ్చిన ప్లేయర్‌గా గుత్తా జ్వాల పేరొందారు. తన సేవలకు గానూ అర్జున అవార్డు పొందారు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా.. విద్య, వైద్య, మహిళా సాధికారికత, లింగ సమానత్వంపై కూడా గుత్తా జ్వాల తన గొంతును బలంగా వినిపిస్తున్నారు.నటుడితో రెండో వివాహంసహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు గుత్తా జ్వాల. అయితే, ఆరేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తమిళనటుడు, డివోర్సీ విష్ణు విశాల్(Vishnu Vishal)తో ప్రేమలో పడ్డ జ్వాల.. 2021లో అతడితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్.. అవన్నీ నిజం కాకపోవచ్చు! -
భార్యలవైపు ఎంతసేపు చూస్తారు... ఆదివారాలు కూడా ఆఫీసుకు రండి!
‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ‘ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్. ఆ మధ్య వారానికి 70గంటలు పనిచేయాలని మాట్లాడి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యారు. ఇప్పుడు ఆ వంతు సుబ్రమణ్యన్ది. మూర్తి మీద జోకులు మీమ్‌లు ఆగకముందే ఎల్–టీ చైర్మన్ ఆయనకు తోడయ్యారు. ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం ఉండదా, ఉండకూడదా అంటూ నెటిజనులు దాడి మొదలెట్టారు. ఇతర కార్పొరేట్ సీఈఓలు కూడా సుబ్రమణ్యన్ మాటల్ని కొట్టిపారేశారు. ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి సమర్ధత సన్నగిల్లుతున్న ఈరోజుల్లో వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో దాడిని నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్–టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇది భారతదేశపు దశాబ్దమని చైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు..అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయని ఎల్–టీ ప్రకటన జారీ చేసింది. జాతి నిర్మాణమే ఎల్అండ్టీ ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలుగా దేశ మౌలికసదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను బలపరుస్తున్నాం. ఉద్ధేశాలు, లక్ష్యాలు సాధనకు కట్టుబడి ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు -
ఎల్&టీ కంపెనీకి ఐటీ శాఖ భారీ జరిమానా
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్‌లో తెలిపింది.2020-21 అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్‌లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాయి. -
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్‌ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్‌ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
మళ్ళీ లేఆఫ్స్.. ఆ కంపెనీ నుంచి 200 మంది - జనవరిలో మరోసారి..!!
L & T Technology Services Layoffs: ఎల్ అండ్ టీ సర్వీసెస్ ఇటీవల 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగులు మాత్రమే కాకుండా సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరిలో కూడా మరింతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 24000 మంది ఉద్యోగులను కలిగిన L&T టెక్నాలజీ సర్వీసెస్ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా 200 మందిని తొలగించినట్లు నివేదించింది. ప్రతి ఏటా ఉద్యోగుల శక్తీ సామర్థ్యాలను అంచనా వేయడమే కాకుండా.. వారు తమ స్కిల్స్ పెంచుకున్నారా, లేదా అనేది కూడా పరిశీలిస్తామని, ఇది ప్రతి ఉద్యోగిలోనూ కీలకమని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కంపెనీ ఆదాయం మునుపటి కంటే కూడా తగ్గడం వల్ల ఉద్యోగులను తీసేయాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ తొలగించిన ఉద్యోగుల శాతం 1 శాతం కంటే తక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రవాణా, టెలికాం, హైటెక్ పారిశ్రామిక ఉత్పత్తులు, ప్లాంట్ ఇంజనీరింగ్ మరియు వైద్య పరికరాల రంగాలలో ఇంజనీరింగ్ సేవలను అందిస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. L&T టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 5% పెరిగి రూ. 315.4 కోట్లకు చేరుకుంది, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ చద్దా తెలిపారు. -
గుడ్ న్యూస్: ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్ ట్రెయినీలను తీసుకున్నట్లు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్అండ్టీ తెలిపింది. మొత్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 23 శాతం బలపడి రూ. 680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 28 శాతంపైగా ఎగసి రూ. 4,837 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. క్లౌడ్, అనలిటిక్స్ విభాగంలో పటిష్ట వృద్ధి బాటన సాగుతున్నట్లు కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ సుధీర్ చతుర్వేది పేర్కొన్నారు. గ్రూప్‌లోని సాఫ్ట్వేర్ సేవల మరో కంపెనీ మైండ్‌ట్రీని విలీనం చేసుకునే ప్రాసెస్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు గత నెల 10న వాటాదారులు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించినట్లు ప్రస్తావించారు. పూర్తి షేర్ల జారీ ద్వారా ఈ లావాదేవీ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లస్థానే 73 ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లు జారీ కానున్నాయి. విలీన సంస్థ ఆదాయం 3.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్! -
ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్మాణ రంగ దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ ముందుకు వచ్చింది. ప్రతీ ఉద్యోగికి అదనంగా రూ.35 లక్షల కరోనా బీమా కవరేజీని ప్రకటించింది. అంటువ్యాధుల కవరేజీ ప్లాన్ కింద రూ.35 లక్షల బీమాను 12 నెలల కాలానికి అందించనున్నట్టు తెలిపింది. ఈ పాలసీ కింద కరోనా కారణంగా మరణించిన ఉద్యోగికి రూ.35 లక్షల పరిహారం లభించనుంది. ఇప్పటికే ప్రతీ ఉద్యోగికి అందిస్తున్న రూ.50-60 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఇది అదనం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.2-12 లక్షల మధ్య ఆప్షనల్ టాపప్ మెడికల్ హాస్పిటలైజేషన్ కవరేజీని 365 రోజులకు అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.6.25 లక్షల వరకూ మెడికల్ కవరేజీ కూడా ఉంటుందని ఎల్అండ్టీ తెలిపింది. మరణించిన ఉద్యోగి పిల్లల చదువులకు కూడా సాయాన్ని ప్రకటించింది. 3 నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల విద్యకు అయ్యే వ్యయాలను సంస్థే భరించనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి వృత్తి శిక్షణ, విద్య అందించి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపింది. ‘‘ఎన్నో సవాళ్లతో కూడుకున్న కాలం ఇది. కరోనా రెండో దశ గట్టిగానే తాకింది. కరోనా కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో వెనుకాడేది లేదు. మా ఉద్యోగులకు సాయంగా ఉండేందుకు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇవి’’ అని ఎల్అండ్టీ ఎండీ, సీఈవో ఎస్ఎన్ సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త! -
జీ గ్రూప్‌కు షాక్: ఐటీ సోదాలు
ముంబై: ప్రముఖ టీవీ చానెల్ గ్రూప్ ‘జీ’ కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 15కి పైగా చోట్ల తనిఖీలు చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడటంతోపాటు బోగస్ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను జీ గ్రూప్ దాఖలు చేసిందని ఐటీ అధికారులు చెప్పారు. దీంతో పాటు లార్సెన్ అండ్ టౌబ్రో (ఎల్ అండ్ టీ) కంపెనీలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. (చదవండి: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు) ‘జీ’ గ్రూప్ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సమాచారాన్ని ఆదాయ పన్నుశాఖ అధికారులతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ (డీజీసీఈఐ) షేర్ చేసుకుందని అధికార వర్గాల కథనం. పన్ను ఎగవేత కేసులో వివిధ గ్రూపులకు చెందిన కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిపామని ఓ ఐటీ అధికారి వెల్లడించారు. ఇక ఐటీ సోదాలపై జీ ఎంటర్టైన్మెంట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఐటీ అధికారుల విచారణకు సహకరిస్తామన్నారు. -
ఎల్అండ్టీ డౌన్- ఓరియంట్ ఎలక్ట్రిక్ అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. అయితే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. గత 8 రోజులుగా బలపడుతూ రావడంతో ఎల్అండ్టీ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని.. దీంతో ఈ షేరు బలహీనపడిందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్ లాభాలతో ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం.. ఎల్అండ్టీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్అండ్టీ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 1,410 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం నీరసించి రూ. 31,035 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం రూ. 28,039 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇవి వార్షిక ప్రాతిపదికన 42 శాతం తక్కువకాగా.. క్యూ1తో పోల్చితే 19 శాతం అధికమని వివరించింది. ఈ కాలంలో ఎలక్ట్రికల్ ఆటోమేషన్ బిజినెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.4 శాతం పతనమై రూ. 930 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 926కు నీరసించింది. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఓరియంట్ ఎలక్ట్రిక్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 32 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 434 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.6 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం జంప్‌చేసి రూ. 221 సమీపానికి చేరింది. -
‘ఎల్ అండ్ టీ’కి అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్హెచ్ఎల్) అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు’ను అందుకుంది. క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డారి్వన్ బాక్స్ హెచ్ఆర్ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను ఈ అవార్డును అందుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్ప్రైజ్ ఇన్నోవేషన్ సదస్సు–2019లో ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ తరఫున ఐటీ, ఎంటర్ప్రైజెస్ హెడ్ అనిర్బన్ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు తమ సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను అందించ డంతో పాటు, వినియోగంలోనూ తమ నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని కొనియాడారు. -
ఎల్ అండ్ టీ..ఏమిటిది?
కార్పొరేషన్ అప్పుల్లో ఉంది ఆదుకోవాలంటూ ప్రతినిత్యం ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేసే ప్రజాప్రతినిధులు సంస్థకు పేరుకుపోయిన బకాయిలపై మాత్రం దృష్టి సారించడం లేదు. నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నాయకులు కోట్లు బకాయిలు పడ్డ సంస్థలపై ఉదారంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పటమట(విజయవాడ ఈస్ట్) : నగరపాలక సంస్థ పరిధిలో నివాస గృహాలు సరైన సమయానికి పన్నులు చెల్లించకపోతే కుళాయి, యూజీడీ కనెక్షన్లను తొలించి నానాయాగి చేసే అధికార యంత్రాంగం కార్పొరేట్ సంస్థ కోట్లలో బాకీ ఉన్నా వసూలు చేయలేకపోతున్నారు. రోడ్డు పక్కన బడ్డీకొట్టు పెట్టుకుంటేనే పన్నులు వసూలు చేసే అధికారులు రెండేళ్లుగా తీసుకున్న లీజుకు అద్దె చెల్లింపులు చేయకపోవడంపై నోరు మెదపడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో వరదనీటి ముంపు నివారణ కోసం స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల పనులను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది. పనుల నిర్వహణ కోసం మిక్సింగ్ ప్లాంట్, మెటీరియల్ నిల్వ కోసం స్థలం అవసరమవుతుందని అప్పట్లో ప్రతిపాదన పెట్టడంతో వీఎంసీ పెద్దలు ఎలాంటి రాతకోతలు లేకుండా భూమిని కేటాయించారు. అజిత్‌సింగ్‌నగర్ శ్రీరాం ఎనర్జీప్లాంట్ ప్రాంగణంలో 4.5 ఎకరాల స్థలాన్ని మూడేళ్లపాటు లీజుకు ఇచ్చారు. నెలకు రూ. 22 లక్షల చొప్పున ఎల్ అండ్ టీ సంస్థ చెల్లించేలా కార్పొరేషన్ పెద్దలు ఒప్పదం చేసుకున్నారు. పనులు ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఒక్కనెల అద్దెను కూడా చెల్లించిన దాఖలాలు లేవు. రెండేళ్ల నుంచి వీఎంసీకీ ఎల్అండ్టీ సంస్థ రూ. 5.50 కోట్ల బకాయి పడింది. దీనిపై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో సంస్థ ప్రతినిధులను కార్పొరేటర్లు ప్రశ్నిస్తూ తమకు సంస్థ నుంచి బడ్జెట్ కేటాయించలేదని పేర్కోన్నారు. పనులకోసం ముందస్తుగా రూ. 90 కోట్ల అడ్వాన్ పొందిన సంస్థ స్ట్రామ్‌వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మొదటి విడత బిల్లులు రాగానే చెల్లిస్తామని లిఖితపూర్వకంగా కార్పొరేషన్‌కు అందించింది. కార్పోరేషన్ కూడా ఇప్పటి వరకు రూ. 100 కోట్లు బిల్లులు చెల్లించినప్పటికీ ఇంత వరకు లీజుకు తీసుకున్న భూమి వ్యవహారంలో స్పందించడం లేదని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఇటు కార్పొరేషన్ కూడా ఎల్అండ్టీ చెల్లించాల్సిన బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో ఉంది లీజు తగ్గించాలని ఎల్అండ్టీ సంస్థ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి ఉత్వర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కార్పొరేషన్ బకాయిలపై ఎల్అండ్టీ సంస్థపై ఒత్తిడి తీసుకుస్తాం. – కృష్ణమూర్తి, ఎస్టేట్ అధికారి -
ఖతార్ వరల్డ్ కప్ స్టేడియంఎల్ అండ్ టీకి కాంట్రాక్ట్
దోహ/న్యూఢిల్లీ: ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియమ్ నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ కంపెనీ దోహలో మెట్రో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. రూ.2,161 కోట్ల ఆర్డర్లు లార్సెన్ అండ్ టుబ్రో రూ.2,161 కోట్ల విలువైన ఆర్డర్లను సాధించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రూ.847 కోట్ల ఆర్డర్‌ను తమ రవాణా ఇన్ఫ్రా వ్యాపార ం సాధించిందని ఎల్ అండ్ టీ తెలిపింది. అలాగే గుజరాత్ వాటర్ ఇన్ఫ్రా, రాజస్థాన అర్బన్ డ్రింకింగ్ వాటర్ సీవరేజ్ అండ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ల నుంచి రూ.709 కోట్ల విలువైన ఆర్డర్లు తమ వాటర్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ బిజినెస్‌కు లభించాయని పేర్కొంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కర్నాటక సోలార్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల నుంచి రూ.403 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్లను తమ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సాధించిందని తెలిపింది. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యాపార విభాగానికి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని వివరించింది. -
పోలీసు హెడ్‌క్వార్టర్స్ నమూనా రెడీ
నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో గల 3.5 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించతల పెట్టిన నగర పోలీసు కమిషనర్ భవనం (హెడ్‌క్వార్టర్స్) నమూనా తయారైంది. ఈ నమూనాను ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్స్ ఆర్.చక్రపాణి అండ్ సన్స్ రూపొందించారు. ఈ నమూనాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. దాదాపు ఇదే నమూనాకు చిన్నపాటి మార్పులు చేర్పులతో గ్రీన్‌సిగ్నల్ వేసే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. నగర పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు విభాగానికి రూ.116 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా బహుళ అంతస్తులతో అత్యంత విశాలమైన పోలీసు ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే శంకుస్థాపన తేదీలు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ భవనంలో కమిషనర్ కార్యాలయంతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తారు. -
సోలార్ విద్యుత్
మద్దూరు: రైతులకు త్వరలో సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. మద్దూరు మండలం సలాక్‌పూర్‌లో ఇస్సెల్ మైనింగ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ.60 కోట్లతో ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ ఈనెల 15న ప్రారంభం కానున్నది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే 10 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) కొనుగోలు చేసి చేర్యాల మండలం ముస్త్యాలలోని 133కేవీ సబ్‌స్టేష న్కు అందజేస్తుంది. ఆ సబ్‌స్టేషన్ నుంచి చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. సలాక్‌పూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ 47 ఎకరాల్లో రూపుదిద్దుకుంది. శుక్రవారం సోలార్ ప్లాంట్‌ను సందర్శించిన ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాదరావు, ఈఈ నాగరాజు మాట్లాడుతూ పగటి పూట ఉత్పత్తి అయ్యే పది మెగావాట్ల సోలార్ విద్యుత్ నాలుగు మండలాలకు సరిపోతుందన్నారు. ఈ విద్యుత్‌ను ముస్త్యాల సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ అవసరం ఉన్న మండలాలకు సరఫరాచేస్తామని చెప్పారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ దీపక్ కత్యాల్ మాట్లాడుతూ ఈనెల 15న సోలార్ విద్యుత్‌ను ముస్త్యాల సబ్‌స్టేషన్‌కు సరఫరా చేసేందుకు ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్‌ను దశలవారీగా 50మెగావాట్ల విద్యుత్ కేంద్రంగా మారుస్తామని చెప్పారు.